ఇంకో మోసానికి తేరలేస్తుంది.తెలంగాణాకు గూడ గూర్ఖాలాండ్ మాదిరి పరిష్కారం జూపిస్తరని వార్తలోస్తున్నై. రేపు జరిగే మీటింగుల ఇదే విషయాన్ని చెప్పి తెలంగాణా కాంగ్రేసు నాయకులను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నయట.
ఇది ఎంతవరకు నిజమో తెలువదు. అయితే మరి తెలంగాణాల చిన్న పోరగాడు కూడ దీన్ని ఒప్పుకోడు. మరి కాంగ్రెస్ నాయకులు ఎప్పటిలేక్కనే తలకాయలు వంచుకొని, అధిష్టానం చెప్పింది విని, ఇటలీ అమ్మ దగ్గర తెలంగాణా తాకట్టు పెట్టి వస్తారా, ఈసారైనా గట్టిగ తెలంగాణా వాదం వినిపిస్తారా అనేది కొన్ని గంటలు అయిన తర్వాత తెలుస్తది.
కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటిదాకా మీరు వేసిన వేషాలు తెలంగాణా ప్రజలు సహించిన్రు. తెలంగాణా ఉద్యమానికి ఏదో కొంత మీ వంతు కూడ సాయపడుతరేమో అని చిన్న ఆశ ఉండేది, అధికారంల ఉన్నరు గాబట్టి. రేపటి దినం మాగ్గాదు, మీకు పరీక్ష. ఈ పరీక్షల పాసైతరా, మరికొన్ని రోజులైనా రాజకీయాలల్ల ఉంటరు. లేకపోతే మీ రాజకీయ సమాధి మీరే కట్టుకుంటరు.
మీకు డబ్బు సంచులు దొరుకొచ్చు. వాటికి ఆశపడి మీరు తలకాయలు ఊపి రావచ్చు. కాని మీరు తిరిగి తెలంగాణా ప్రజలమధ్యకు మాత్రం రాలేరు. యాదివెట్టుకోండి. మీరు ప్రజలను మోసం జేసుకుంట మహా అయితే 2014 దాంక అదికారంల ఉండొచ్చు. ఆ తర్వాత మీరు ఎన్నికల్ల గెలువాలనంటే ఆంధ్రాకో, ఇంకెక్కడికో పోవాలె. ఇక్కడ మాత్రం గెలువ లేరు.
మిమ్ముల మీరు తాకట్టు పెట్టుకోగాలరేమోకని తెలంగాణాను మీరు తాకట్టు పెట్టలేరు. కణకణ మండే అగ్నిగోళం ఇప్పటి తెలంగాణా. రాష్ట్రాన్ని ఎట్లా సాధించు కోవాల్నో మాకు తెల్సు. దానికి మీరు ఊతమిస్తే మంచిదే. లేక పొతే చరిత్రల తెలంగాణా ద్రోహులుగా మిగిలిపోతరు.
Yendukanna ee gosa. Aallu inukunetollu kaadu.
ReplyDelete>>>>>> మిమ్ముల మీరు తాకట్టు పెట్టుకోగాలరేమోకని తెలంగాణాను మీరు తాకట్టు పెట్టలేరు. <<<<<<
ReplyDeleteWell Said.
It is True