ఇప్పుడు రాష్ట్రంలో రెండు పెద్ద ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. ఒకటి చేవెల్ల-ప్రాణహిత, రెండోది పోలవరం. ఈ రెండు ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. అయితే రెండు ప్రాజెక్టులు ఇవ్వడం కుదరదు, రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టే వీలవుతుంది అని కేంద్రం చెపుతుంది.
పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే దీనికి అనుమతులు లేవు. పైగా కోర్టు కేసులు నడుస్తున్నాయి. అవి ఇప్పట్లో తేలేలా లేవు. అనుమతులు లేకుండా జాతీయ హోదా ఇవ్వడం కుదరదు. పైగా ఈ ప్రాంతంలో ఇప్పటికే రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాంతం కరువు కాటకాలలో ఉందని ఏ సర్వే లోనూ ఇంతవరకు చెప్ప బడలేదు.
ఇక ప్రాణహిత విషయానికి వస్తే, దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి. దీనివల్ల కరువుతో అల్లల్లాడుతున్న అనేక తెలంగాణా జిల్లాలకు నీల్లందుతాయి. భూగర్భ జలాలు విషపూరితమై తాగే నీరు లేక అలమటిస్తున్న నల్లగొండ జిల్లాకు ఎంతో మేలు చేకూరుతుంది. హైదరాబాదు నగరానికి తాగునీరు సమస్య తీరుతుంది.
ఈ పరిస్థితిలో నిజమైన సమైక్యవాదాన్ని బలపరచే వారైతే నీటి అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును బలపరుస్తారు. అంతే గాని అది గ్రావిటీ అని, ఇది లిఫ్టు అని, దీనికి కర్చెక్కువ అని (కర్చు పెట్టేది కేంద్రమైనప్పుడు కూడా), కేంద్ర ప్రభుత్వానికి కూడా రాణి సందేహాలు వీరు లేవదీయరు. కాని విచిత్రంగా కొంతమంది సమైక్య జపం చేసేవారు మాత్రం సరిగ్గా ఇదే విధంగా ప్రవర్తిస్తుంటారు.
ఇలాంటి 'గుడ్డు పెడితే నాకు, రెట్ట వేస్తే నీకు' అనే పద్ధతిలో మాట్లాడే వారు సమైక్యవాదులమని చెప్పుకోవడానికి ఎంతమాత్రం అర్హులు కారు. అంతగా ప్రాంతీయ భావాలు కలిగి ప్రాంతీయాభివ్రుద్ధిని మాత్రమె కోరుకునే వారు తమ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉండడాన్ని ఎందుకు ఊహించ లేక పోతున్నారో అర్థం కాదు. విడిపోతే అభివృద్ధి తమ ప్రాంతాన్ని స్వశక్తితో చేసుకోలేమన్న భయమా? ఇతర ప్రాంతాలకొచ్చి 'అభివృద్ధి' చేసే వారు అదేదో తమ ప్రాంతంలోనే చేసుకోవచ్చుగా?
చక్కగా విడిపోతే రెండు రాష్ట్రాలవుతాయి. రెండు రాష్ట్రాలకు రెండు ప్రాజెక్టులు కేంద్రం ఎలాగూ ఇస్తుంది. అలా కాక కలిసే ఉందాం, మీ ప్రాజెక్టు మాత్రం పక్కన బెడదాం, మా ప్రాజెక్టుకు ఇంకా ఏ క్లియరెన్సు రాకపోయినా వేల కోట్లు తగలేద్దాం అనేది ఏ రకమైన వాదనో విజ్ఞులు గ్రహించాలి.
ఒక్కొక్క ఎకరానికి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు. మీరు మరి కొంచెం వివరాలు ఇస్తే బావుంటుంది.
ReplyDelete(గమనిక: నేను సమైక్య వాదినీ కాను. తెలంగాణా వాదిని కాను. సామాన్య హైదరాబాదీని. కాకపోటే కోస్టా లో పుట్టి పెరిగినవాడిని.)
లెక్కల గొడవ తర్వాత. మీరు హైదరాబాదు వాసినని చెప్తున్నారు. ఊర్లొ చెద వేస్తే నీళ్ళొస్తాయి. హైదరాబాదులో మునిసిపల్ పంపు మీ ప్రాంతంలో లేదనుకోండి. 20 లీటర్లకి రు. 50 ఖర్చు పెట్టాలి. ఫ్రీగా వచ్చే నీటికి యాభై ఎందుకని నీరు తాగడం మానేద్దామంటారా?
ReplyDeleteఅయినా లాభనష్టాలు, సాధ్యాసాధ్యాలు చూడకుండా కేంద్రం అనుమతి నివ్వదుకదా? మధ్యలో వీరికెందుకు ఆ తలనొప్పి? ప్రాజెక్టు రాకూడదనేగా?
20 లీటర్లకి ఒక్కొక్క సారి 50 రూపాయల కంటే ఎక్కువే ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
ReplyDeleteమీ బ్లాగులను ఎందుకు చదువుతున్నారంటే, ఎంతోకొంత విషయం వుంది కాబట్టే.
ఎంత ఖర్చు, దానిని ఏఏ విధంగా సమర్ధించవచ్చు, ఆ ఖర్చు ఏ విధంగా సహేతుకమైనది మీరు వివరిస్తే బావుంటుంది.
ఈ లింక్ చదవండి: https://profiles.google.com/praveenmandangi/posts/9KkPwD5Fnp6
ReplyDelete@Anonymous Tue, Jun 28, 2011 at 8:42 PM
ReplyDelete>>>... ... ప్రతిదానికి, అడ్డంగా తెలంగాణకు లింకు పెట్టడం. యాట్నించి వస్తర్రా మీరు. రాయలసీమ లో కూడా చూడండి. నీళ్ళు లేవు, ఫ్లోరైడ్ భాద అంత కన్నా ఎక్కువ ...
అఙ్ఞాత బూతుశ్రీ గారు, మీ కామెంటు మరీ ముదురుగా ఉండడంతో ఎడిట్ చేసి ప్రచురించడం జరిగింది. రాయలసీమలో నీళ్ళు లేక పోతే ప్రాణహిత ఆపితే నీళ్ళు పడతయా? లేదా రాయలసీమలో నీళ్ళు లేవుకాబట్టి తెలంగాణా వాళ్ళు కూడా నోర్మూసుకోవాలా? మీ భావమేమిటొ అర్థం కాలేదు. జవాబియ్యాలనుకుంటే జర మంచి భాషల రాయున్రి సార్!
Praveen garu,
ReplyDeleteTHanks for your link and support.
@Anonymous June 28, 2011 5:17 AM
ReplyDeleteఅవసరాలతో ఖర్చును సమీకరణాలు రాయడం కరెక్టు కాదనే ఈ వ్యాసం భావం. అయినా ఆ లెక్కలన్ని చాలా బ్లాగుల్లో ఇస్తూనే ఉన్నరు కదా! ప్రభుత్వం ఇచ్చే అంకెలే సరిగ్గా ఉండనప్పుడు లెక్కలు చెప్పుకొని ఏం ప్రయోజనం? అయినా నా పరంగా కొంత విష్లేషణ చేయడానికి మరో టపాలో ప్రయత్నిస్తాను. కృతఙ్ఞతలు.