Monday, June 20, 2011

వాళ్ళకు కావలసింది ఇక్కడి మనుషులు కాదు

కోవెల సంతోష్ కుమార్ గారు వారి బ్లాగులో తెలంగాణ హుళక్కే...హ్యాట్సాఫ్‌ టు ఎస్‌ఏ అనే టపా పెట్టినరు. దానికి వ్యాఖ్య రాస్తూ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం అనే ఒక లబ్ద ప్రతిష్ట బ్లాగరు గారు ఈ క్రింది విధంగా వ్రాసినరు.

తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు. వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం. ప్రైవేట్ ఇనీషియెటివ్ పెంపొందడం. తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం. తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి. ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు. ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే. ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు.

తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది.



పై వ్యాఖ్యలు రెండో తరగతి చదువుకున్న వాడికి కూడా ఎంత నిందార్థకంగా ఉన్నయో తెలుస్తయి. సహజంగా తెలంగాణా ప్రజలను అభిమానించే బ్లాగుల్లో దీనికి సమాధానాలు వచ్చినై.

కోవెల సంతోష్ కుమార్ గారు కూడా మేధావులకు వందనం అనే పోస్టులో దానికి సమాధానం వ్రాసిన్రు. దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారు వ్రాసిన ప్రతి వాక్యానికి సమాధానం వ్రాసిన్రు. వారి సమాధానానికి సమాధానం వ్రాసే ప్రయత్నంల అచంగ అనే ఇంకో బ్లాగరు (పూర్తిపేరు తెలియదు) ఆనందిని బ్లాగు టపాపై స్పందన అని ఇంకో పోస్టు రాసిన్రు. ఎవరి భావాలు వాళ్ళు ప్రకటించు కోవటానికి బ్లాగు పోస్టులు వ్రాసుకునుడు మంచిదే. అయితే ఒకరి సమాధానాన్ని విమర్శించేటప్పుడు ఆ సమాధానం ఎవరికి ఏ సందర్భంలో ఇచ్చిందో విస్మరించి కేవలం ఆ సమాదానంలోని కొన్ని వాక్యాలను పట్టుకొని తనకు తోచిన విధంగా సదరు అచంగ గారు తన బ్లాగులో వ్రాసుకొన్నరు. మచ్చుకు కొన్ని వాక్యాలు చూద్దాం.

అచంగ గారు వ్రాసింది.

/గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు/
గొడ్డు చాకిరీ ఎవరు ఎవరికి చేశారు? తెలంగాణలోనే పుట్టిన దేశ్ముఖ్లకు, వెలమ దొరలకు.


దీని చరిత్ర చూద్దాం.

మొదట బాలసుబ్రహ్మణ్యంగారు వ్రాసింది.

వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం.

అంటే తెలంగాణా మొత్తంగా అసలు పని సంస్కృతీ లేదన్నట్టు, ఆంధ్రాలో మాత్రం ఉన్నట్టు అన్యాపదేశంగా వ్రాసిన వ్యాఖ్యానం అది. నిజాయితీగల మనుషులేవ్వరైనా దీంట్లోని నిందార్థం విడమరిచి చెప్పుతరు. కాకపొతే కొంతమంది కరడు గట్టిన సమైక్యాంధ్ర వాదులకు మాత్రం ఇది వీనులకు ఇంపుగా కనిపిస్తుందేమో నాకు తెలవదు.

సరే, దీనికి సమాధానంగా సంతోష్ కుమార్ గారు వ్రాసింది...

ఇక్కడ పని చేస్తేనే గుక్కెడు నీళ్లు.. పిడికెడు కూడు దొరుకుతుంది. (కూడు అన్నది అచ్చమైన తెలుగు పదం.. అన్నం అన్నది సంస్కృతం..) పని చేయటం మాత్రమే ఇక్కడి వాళ్లకు తెలిసిన ఒకే ఒక విద్య.. గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు.. శాతవాహనుల కాలం నుంచి వాళ్లు చేస్తున్నది పనే.. వాళ్లు పని చేయటం వల్లనే ఇక్కడి నుంచి అద్భుతమైన నిర్మాణాలు వెలుగుచూశాయి. దాదాపు 280 కోటలు.. బురుజులు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత నిజాం కాలంలోనూ వాళ్లే పని చేశారు.. ఇప్పుడు దురదృష్టవశాత్తూ తోటి తెలుగువాళ్లమని చెప్పుకునే వారి కాలంలోనూ వాళ్లే పని చేస్తున్నారు..

తెలంగాణా జనులకు మొత్తంగా పని సంస్కృతీ లేదని ప్రవచించిన ఒక పెద్దమనిషికి పైన ఇచ్చిన సమాధానం నాకైతే ఏ లోపం కనపడలేదు. చివరి వాక్యం కొంత అభ్యంతర కరమని ఎవరైనా చెప్పా  వచ్చేమో? ఇప్పుడు హైదరాబాదులో బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, ప్రాంతాలలో ఉన్న అన్ని బంగళాలకు పాచిపని, బట్టలుతకడం, ఇస్త్రీ చేయడం, కార్లు నడపడం వగైరా ఎవరు చేస్తున్నరో తెలిసిన వారికి దాంట్లో అభ్యంతరం కనిపించదు.

మరి దీనికి అచంగ గారు ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.

గొడ్డు చాకిరీ ఎవరు ఎవరికి చేశారు? తెలంగాణలోనే పుట్టిన దేశ్ముఖ్లకు, వెలమ దొరలకు. ఆనాటి గడీల్లో అరాచకాలు ఎవరికి తెలియనివి? చాకలి అయిలమ్మని అడగండి గొడ్దు చాకిరీ ఎవరు చేయించుకున్నారో తెలుస్తుంది. ఇప్పటి సీమాంధ్ర ప్రాంతీయులు మాత్రం కాదు. దాష్టీకం చేసింది తెలంగాణవారే,చేయించుకున్నదీ తెలంగాణవారే.


మరి కోవెల గారు ఇచ్చిన సమాధానానికి సమాధానంగా ఉందా, ఇంకే రకంగా నైనా ఉందా పై వ్యాఖ్య అన్న విషయం చదువరులు తెలుసుకోగలరు.

తెలంగాణాలో పని సంస్కృతి లేదు అన్న అన్యాయమైన ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఒకటైతే, తెలంగాణా చరిత్రను, ఆ చరిత్రలో తెలంగాణా ప్రజలు పడిన బాధలను అపహాస్యం చేసుకుంట మాట్లాడే మాటలు ఇంకోటి. ఇక్కడ నిజాంకు ఊడిగం చేసిన దొరలుంటే, అక్కడ బ్రిటీష్ వాడికి దాసోహం అన్న రాజాలు, జమీందార్లు లేక పోలేదు. వాళ్లకు అక్కడి దళిత బహుజనులు ఊడిగం చేసిన మాట వాస్తవం కాకుండా ఉంటదా? మరి ఎందుకు ఈ పనికిరాని మాటలు?

ఈ మాటలు ఎట్లా ఉంటయంటే... వెనకటికొకాయన యాపిల్ తియ్యగా ఉంటది అని చెప్పిండట. దానికి ఇంకొకాయన కాదు కాదు ఆరెంజే పుల్లగా ఉంటది అని బదులు చెప్పిండట. పైన రాసిన ఉదంతం సమైక్యాంధ్ర వాదులు పొంతన లేని మాటలు ఎట్ల మాట్లడుతరో కేవలం ఉదాహరణ మాత్రమే. మొత్తం వివరించే ఓపిక, తీరిక నాకు లేదు. మిగతా విషయాలు కావాలంటే మీరు ఆ బ్లాగునే చూడండి.

తెలంగాణా మీద ఇంత చులకన భావం, తెలంగాణా వాళ్ళ మీద అసహ్యం మాట మాటకూ బయట పెట్టుకొనే వాళ్ళు సమైక్యాంధ్ర ఉండాలే అని ఎందుకు అంటరో అంత  ఊహించ లేనిదేమీ కాదు. వాళ్ళకు ఇక్కడి మట్టి మనుషులు కాదు కావలసింది, ఇక్కడి మట్టి, ఇక్కడి మట్టిపైన ఉండే సంపద, ఇక్కడి మట్టిలోన ఉండే సంపద, ఇక్కడి నీళ్ళు, ఒక్కప్పుడు నిజాం మోచేతినీళ్ళు తాగుతూ జనాన్ని వంచించి ఇప్పుడు సీమాంధ్రుల మోచేతి నీళ్ళు తాగుతూ అదే జనాన్ని వంచిస్తున్న దగుల్బాజీ రాజకీయ దొరలు, వీళ్ళు మాత్రమే కావాలి వాళ్లకు.

3 comments:

  1. శ్రీకాంతాచారిగారూ,
    సంతోషం. పాఠకులు చదివి నిర్ణయించుకుంటారు.

    ReplyDelete
  2. మొబిలిటీ గురించి మరీ అన్యాయం, తెలంగాణ ప్రజలకు మొబిలిటీ లేదని దురహంకారి చెప్పినదానికి సమాధానంగా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడికి పొట్టకూటికోసం వెలతారో చెబితే ఈయన దానికి సమాధానంగా భుజాలు తడుముకున్నట్లు మారెండున్నర జిల్లాల మొబిలిటీ ఇదిగో అని అరుస్తున్నాడు. అసలు వారి మొబిలిటీని గురించి మరొకరు ప్రశ్నించలేదే?

    అదే సమయంలో పొట్టకూటికోసం ఎక్కడెక్కడో వెల్లేవారు అక్కడికి మాత్రం ఎందుకు వెల్లరో, వెలితే వారెందుకు సహించరో మాత్రం చెప్పడు. వితండ వాదం, పిడి వాదం, ఒక దానికి మరొక దానిపై సమాధానం, ఇదే వాదన అనే భ్రమలో ఉన్నాడు. అసలు ఈయనకు తెలంగాణ, ఆంధ్ర గురించి కాదు, తర్కం నేర్పించాలి లాగుంది.

    ReplyDelete
  3. http://lightbehindshadow.blogspot.com/2011/06/blog-post_7413.html

    ReplyDelete