తెలంగాణా వాళ్ళు మాట్లాడరు, కొట్లాడుతరు అన్నడు ఒక పెద్దమనిషి. ఇదే కాదు ఇలాంటి అసత్య ప్రచారాలు పుంఖాను పుంఖంగా ఎన్నో చేస్తనే ఉన్నరు తెలంగాణా ప్రజలకు వ్యతిరేకంగా ప్రతి రోజూ.
నిజానిజాలు పరిశీలిద్దాం.
హైదరాబాదు సంగతి పక్కకు పెట్టితే, తెలంగాణా లో ఉన్న దాదాపు అన్ని పెద్ద ఊర్లల్ల కనీసం ఊరికి ఒక్క కుతుమ్బమన్నా ఆంధ్రా వాళ్ళది ఉంటది. వాళ్ళు వ్యవసాయమో, దుకానమో, ఉద్యోగమో చేసుకుంట బతుకుతరు. వాళ్ళల్ల ఒక్కరికి కూడా నామనీసమంత హాని కలిగినట్టు ఎక్కడా బయటికి రాలేదు. అట్లా కలిగితే వాళ్ళు ఎందుకుంటరు? తెల్లారే తట్ట బుట్ట సదురుకుంటరు. అదీ తెలంగాణా ప్రజల కలుపుగోలు తనమంటే. ఇక్కడికి మరాఠీలు, పంజాబీలు, సింధీలు, పార్సీలు, జైనులు ఒక్కలేమిటి? అన్ని రకాల ప్రజలు వచ్చిన్రు. ఇక్కడి జనంల కలిసి బతుకుతున్నరు. ఇక్కడి ప్రజలు స్నేహశీలురు కాబట్టే వాళ్ళంత ఇక్కడ సంతోషంగ ఉండగలుగు తున్నరు.
మరి తెలంగాణా ప్రజలను తిట్టే మహానుభావులు ఒక్క సారి తమ ఊళ్ళకెళ్ళి చూసుకుంటే వాళ్ళకే విషయం తెలుస్తది. ఊరికి గాడు, కనీసం మండలానికి ఒక్కడన్న తెలంగాణా మనిషి అక్కడ కనపడితే ఒట్టు! ఎందుకో వేరే చెప్పాల్నా? అది బహిరంగ రహస్యం. అప్రకటిత సామాజిక బహిష్కరణ. సమాజం కలుపుకోక పొతే మనిషి ఒక్క రోజు గూడ ఉండలేడు. ఎందుకంటే మనిషి సంఘజీవి. కాబట్టే ఎవరన్న అక్కడికి బతుకు తెరువు కోసం వెళ్దమని ప్రయత్నం జేసినా గోడగ్గోట్టిన బంతి లెక్క తిరిగి రాక తప్పదు.
మరి ఈ విషయం హైదరాబాదుల 23 ఏండ్లనించి నివసిస్తున్న మనిషికి తెల్వదా? తెలుసు. కాకపొతే అసత్య ప్రచారాలకు ఒడిగట్టినోనికి నిజాన్ని దాచిపెట్టే కోరిక తప్ప ఒప్పుకొనే తీరిక ఎక్కడుంటది?
సీమాంధ్రలో తెలంగాణ కుటుంబాలు వుండవు(లేదా తక్కువ). మీతో ఏకీభవిస్తున్నాను. అందుకు కారణం అక్కడి ప్రజలు సహృదయులు కాకపోవడం కాదు. అక్కడ, ఆ ప్రదేశం లో ఇక్కడి ప్రజలకు బ్రతుకు తెరువు కనపడక పోవటమే. ముఖ్యంగా, సీమాంధ్రలో జనసాంద్రత ఎక్కువ. అందువలన తెలంగాణ నుంచే కాక మిగతా ఈప్రాంతం నుంచి కూడా వలసలు రారు. తెలంగాణ లో, సీమాంధ్ర ప్రజ వుండతానికి ముఖ్య కారణం ఉద్యోగరీత్యా అయి ఉండవచ్చు. అసలు తెలంగాణా ఉద్యమమే ఈ పాయింటు మీద అనుకుంతా. అందులో తప్పు లేదు. కాని మీ పోస్టు చదివితే, సీమాంధ్ర ప్రజలు సహృదయులు కాదు అని ధ్వనిస్తోంది. అది సమంజసం కాదేమో.
ReplyDeleteరెండు మూడు జిల్లాలు తప్ప మిగతా జిల్లాలల్ల తెలంగాణాల, ఆంధ్రల ఒకే రకమైన జనసాంద్రత ఉన్నది. అయినా పరిస్థితి మాత్రం ఒకే రకంగ ఉన్నది. అలాగనే నిజామాబాద్, రంగారెడ్డి వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న తెలంగాణా జిల్లాలల్ల కూడా ఆంధ్ర migration ఉన్నది. కాబట్టి కేవలం జనసాంద్రత దీనికి కారణం అని చెప్పలేము.
ReplyDeleteఆ విషయం పోనియ్యండి. ఇక్కడఏ ఉండి అన్ని సుఖాలు అనుభవించుకుంట, ఇక్కది ప్రజల మీద ఆరోపణలు చేసే వాళ్ళను ఏమని పిలువాలె?
ఎవరో ఒక మనిషి తన రాజకీయ లబ్ది కోసం అన్న మాటలను తీసుకొని మొత్తం సీమాంధ్ర ప్రజలను ఆరోపించటం సబబు కాదేమో. ఈ బ్లాగును చూసి మరో సీమాంధ్ర సమైక్యవాది తెలంగాణ ప్రజల్నందరిని ఆరోపించటం - ఇలా పరస్పర దూషణలతో అసలు సమస్య మౌలిక స్వరూపం మారిపోతున్నది.
ReplyDeleteఅవి రాజకీయ నాయకుడు అన్న మాటలు కావు. ఒక ప్రముఖ బ్లాగరు అన్నవి. పాత టపాలు చూస్తే మీకే తెలుస్తది.
ReplyDelete2 Anonymous gaaru,
ReplyDeletemirannattu oka సంకర జీవి (snkr)oka raajakiyya nayakuni maatalu pattukoni mottham telangana prajala nu dhushistune blog సంచారం chesthu vuntaadu.Lekapothe ataniki poddu gadavadu.
"ఇలా పరస్పర దూషణలతో అసలు సమస్య మౌలిక స్వరూపం మారిపోతున్నది."
miraandhi maatram nijam