Friday, June 10, 2011

ఇంటర్ మీడియట్ కొరకు విజయవాడకి పంపిస్తున్నరా? ఆలోచించండి

తెలంగాణా వాదులారా, మీ పిల్లవాడిని ఇంటర్ మీడియట్ కొరకు విజయవాడ గాని మరో సీమాంధ్ర ప్రదేశానికి గాని పంపిస్తున్నరా? అయితే మీరు మరోసారి ఆలోచించండి. 

నా మిత్రుడి కొడుకు పదోతరగతిలో హైదరాబాద్ లోని ఒక కార్పోరేట్ పాఠశాలలో మొదటి ర్యాంకుతో ఉత్తీర్నుడైండు. విజయవాడలోని ఒక ప్రముఖ ఇంటర్మీడియట్ కళాశాల వాళ్ళు వీడి పర్సెంటేజీ చూసి సీట్ ఆఫర్ చేసిన్రు. ఆ కాలేజీకి మంచి పేరుండడంతో మనవాడు వాళ్ళబ్బాయిని అక్కడే చేరిపించిండు. తీరా మొన్న రిజల్ట్సు వచ్చే సరికి వాడు IIT AIEEE వగైరా అన్ని పరీక్షల్లో సఫలీకృతం కాలేక పోయిండు. ఏదో ఒకలాగా EAMCET లో మాత్రం ర్యాంకు తెచ్చుకున్నడు. ఆ అబ్బాయి తెలివితేటలకి IIT వస్తదని అనుకున్నాం అంతా. కాని జరిగింది మరొకటి.

ఆరా తీస్తే తెలిసింది, వాడు పడ్డ మానసిక క్షోభ. ఇంకా చదువేం చదువుతాడు? ఆంధ్రాకు  చెందిన విద్యార్థులు వీడిని ప్రత్యేకంగా చూసేవారట! గుంపులుగా చేరి మాట్లాడుతూ కేసీయార్ ని, కోదండరాం ని బండబూతులు తిట్టే వారట. తెలంగాణా వాదం బలంగా మాట్లాడే ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి ఇది భరించ గలిగే వాడు కాదు. అలా అని స్థానబలం, సంఖ్యాబలం ఉన్నవారితో గొడవ పడ్డానికి కూడా సాహసించే వాడు కాదు. దాంతో మనసులోనే బాధ పడే వాడు. ఈ మానసిక వ్యధతోటి చదువులో కూడా ఏకాగ్రత చూపలేక పోయాడు.

దీనికి తోడు ఫ్యాకల్టీలు పెట్టే రంపపుకోత మరోటి. లెక్చర్లు చెప్పుతూ మధ్య మధ్యలో తెలంగాణా ప్రజల మీద, నాయకుల మీద అసభ్యకరంగా జోకులు వెసేవారట! వీరి కుళ్ళు జోకులు విని నవ్వుతూ అందరూ మనోడికేసి తిరిగి అదోలా చూసే వారట. వింటూ  ఉంటేనే నాకు తేళ్ళూ జేర్రులూ పాకినట్టనిపించింది. ఇక వాడికి ఎలా ఉండేదో ఊహించడానికి కూడా మనసొప్పలేదు. 

ఇది ఎవరూ కావాలని చేయిస్తున్నది కాక పోవచ్చు. కాకతాలీయంగానే కొందరు విద్యార్థులో, లెక్చరర్లో ఆ విధంగా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ మనపిల్లలకు జరిగే హాని జరక్క మానదు కదా!   

కాబట్టి తెలంగాణా బిడ్డల తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను ఆ ప్రాంతానికి పంపే ముందు మరోసారి ఆలోచించండి. మీ వాడు వీటన్నిటికీ తట్టుకుంటాడని అనుకుంటే మాత్రమే పంపండి. లేకపోతే మాత్రం మీ వాడి చదువు సంగతి అటుంచి, మానసిక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.

40 comments:

  1. andhra vallku kula prantha feelings ekkuva chanduvukunna vallalo edi inka ekkuva vundi vijayawada ki telangana pillalanu pampakandi adi mamulu manusulaku manchi place kadhu

    ReplyDelete
  2. మా తమ్ముని కూతురు హైదరాబాద్‍లో ఇంటర్మీడియట్ చదివింది.అమ్మాయి 10th తరగతిలో రాష్ట్రంలో 7వర్యాంకు.చాలా తెలివైన అమ్మాయి.ఎమ్సెట్‍లో పరీక్ష హాలులో ప్రశ్నాపత్రం 10ని.ఆలస్యంగా ఇచ్చారు,10ని.ముందుగానే లాక్కున్నారంట,ఎందుకిలా చేస్తున్నారని ఇన్విజిలేటర్లను(తెలంగాణా వాళ్ళు) అడిగితే మీ ఆంధ్రావాళ్ళను సక్రమంగా పరీక్ష రాయనిస్తే మా తెలంగాణా వాళ్ళకు సీట్లెలా వస్తాయి అన్నారంట,పై అధికారికి పిర్యాదు చేస్తే ఆమె నవ్వి ఊరుకుందట.
    మీరు చెప్పేదెలా ఉందంటే కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లుంది.ఇలాంటి పనులు చేసేది మీరు,విమర్శించేది ఎదుటివారిని.
    మీరు ఈ నా కామెంటు ప్రచురిస్తారని నమ్మకంకూడా లేదు.

    ReplyDelete
  3. @చిలమకూరు విజయమోహన్

    EAMCET లో మీ అమ్మాయిని ఆంధ్రా అని గుర్తించారా? గుర్తించి పది నిమిషాలు ముందుగనే పేపర్ లాక్కున్నారా? ఏ టైము? మీ అమ్మాయి వాచా, ఇన్విజిలేటర్ వాచా? Great! అయితే తెలంగాణా వారికి తెలివితేటలు బాగనే పెరిగిపోతున్నయే!

    ReplyDelete
  4. @చిలమకూరు విజయమోహన్

    >>>మీరు చెప్పేదెలా ఉందంటే కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే ...

    నిజమే కదా! ఎదుటివాడైతే ఇన్విజిలేటరు సరిగ్గా డ్యూటీ చేసినా తప్పుగానే కనిపిస్తుంది. మనవాళ్ళు సామూహిక వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా అది మంచిగనే కనిపిస్తుంది.

    ReplyDelete
  5. please don't misguide people... vijayawada is very famous for eamcet coaching ..and don't drag regional feelings into studies...sorry if i am saying something wrong..

    ReplyDelete
  6. శ్రీకాంతాచారి గారు: విజయమోహన్ గారిది ఆంధ్రా కాదు, సీమ. అన్యాయం జరిగింది ఆయన తమ్ముని కూతురు విషయంలో. పనిగట్టుకుని, తప్పుడు మాటలు చెప్పి మీ విజయవాడ ఉదంతాన్ని తప్పు బట్టడానికి ఆయన పూనుకోలేదని మీరు గ్రహిస్తే బావుంటది.

    ReplyDelete
  7. Some of my friends from Hyderabad are joining their children in SRM, VIT etc in Chennai. This is just to avoid disturbed education, campus selection opportunities in AP.

    Whole state is loosing.

    ReplyDelete
  8. మీ తెలంగాణా పిల్లల భవిష్యత్ గురించి అంత బాధ పడేతట్లయితే మరి గొడవలు, బందులు, ఉద్యమాల పేరుతో వీరంగాలు చేయకుండా వాళ్ళని చదువుకోనివ్వచ్చుగా? ఏ రోజు క్లాసులు జరుగుతాయో, ఏ రోజు జరగవో తెలియని అనిశ్చితి కల్పించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎందుకన్నా? మీ కేం పోయింది ఉద్యమం పేరుతో ఒక పది రోజులు పని చేయకున్నా నడిచి పోతది. పిల్లలకు అట్లా కుదురుతుందా? తెలంగాణా లో ఉద్యమం ఉందని ఐ ఐ టి పరీక్షలో జాలిపడి మార్కులేస్తారా?
    విజయవాడలో చదివిన్చద్దు అని నువ్వు చెప్పేది ఎలా ఉందంటే "అమ్మ పెట్టా పెట్టదు...అడుక్కు తినానివ్వదు" అన్నట్లుంది.

    ReplyDelete
  9. మానసిక క్షోభకన్నా వానాకాలం చదువు మిన్న కాదా తమ్ముడూ? అయినా తెలంగాణాలో చదువులు సాగుతలేవు అనేది ఆంధ్రా మీడియా విష ప్రచారాలలో ఒకటి. ర్యాంకుల డిస్ట్రిబ్యూషన్ చూస్తే తెలువ్డం లేదూ తెలంగాణాలో కాలేజీలు నడుస్తున్నయో నదుస్తలెవ్వో?

    ReplyDelete
  10. @Satish

    I do not contradict Vijayawada being famous, but I am only cautioning the parent telling a truth. Didn't you observe the propaganda by seema-andhra media that people are rushing to Vijayawada for seats?

    ReplyDelete
  11. రవి,

    ఆంధ్ర అయినా, సీమ అయినా శ్రీకాంతాచారి ఇచ్చిన సమాధానం సరిగానే వర్తిస్తుంది. ఒక గదిలో ఒక ఇన్విజలేటరు ఒక్క విద్యార్థిని మాత్రం సీమాంధ్ర ప్రాంతాలకు చెందినవారని గుర్తించి ఆఒక్కరిదగ్గర ముందుగానే పరీక్షపత్రం లాక్కుంటారా, అసలు అది సాధ్యమేనా?

    ReplyDelete
  12. Who knows,the examinations at Vijayavaada might have been conducted honestly.

    ReplyDelete
  13. wtf.. are u humans at all?

    ReplyDelete
  14. hello boss naku telisina chala mandi telangana students guntur, vijayawada lo chadivaru.. vallepudu ilantivi edurkoledu. abhipraya bhedalu untay.. oka vela meeru cheppedi nijame aithe andhra lo chadivina telangana students evvariki iit, aieee raleda?

    ReplyDelete
  15. @ప్రేమిక

    >>>abhipraya bhedalu untay...

    వేరొక ప్రాంతం వాడిని ఒంటరి చేసి, 'ఒరే KCR' అని పిలవడం, విద్యార్థులే కాక ఉపాధ్యాయులు కూడా వంత పాడడం, ఇలా ఒకణ్ణి పట్టుకుని సంవత్సరం పొడుగునా వేధించడం మీకు అభిప్రాయభేదాల్లా కనపడుతున్నాయా?

    ReplyDelete
  16. మీకు తెలిసిన నిదర్శనం మీరు చెబితే అది వాస్తవం. జనాలు నమ్మాలి. అదే వేరొక ప్రాంత మిత్రుడు (చిలమకూరి విజయ మోహన్ గారు) తనకు తెలిసిన నిదర్శనం చెబితే అది కట్టు కధా? అది నమ్మ కూడదా? ఇదెక్కడి న్యాయం? అసలు పదవ తరగతి లో స్టేట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళలో ఇంటర్ తర్వాత కూడా అలాంటి ర్యాంకులు వచ్చిన వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అందుకు వేర్వేరు కారణాలు ఉండవచ్చు.

    మీ పిడి వాదంతో మీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని మీరు నమ్మితే నమ్మండి. జనాలని నమ్మించాలని చూడద్దు. మీ మీద గౌరవం పోతుంది.

    ReplyDelete
  17. అసలు ఆన్ లైను లో బ్లాగులకు నచితే మంచి కామెంట్లు రాయండి..లేకుంటే వూరుకుంటే ఉత్తమం ..ఎందుకు మనం ఆన్ లైను యుద్ధాలు

    ReplyDelete
  18. ఒక వేళ మీరు చెప్పింది నిజమే అయితే రెండు మూడేళ్ళ వరకూ లేని ఈ పరిస్థితి ఎవరు క్రియేట్ చేసుకున్నది అంటారు? సీమాంధ్రులు దొంగలు, దోపిడీ దారులు, భాగో...జాగో ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల మనసులు విరిచేసింది ఎవరంటారు?

    ReplyDelete
  19. వేధింపులకి.. గురి చేయాలంటే.. తెలంగాణా ఆంద్ర బేధాలు..చూపకుండా.. కూడా.. వేధించవచ్చు.. అండీ! ఇంకా.. విజయవాడ కార్పోరేట్.. కాలేజేస్ పై.. తెలంగాణా వాదుల చూపు..పడలేదేమిటి అనుకున్నాం. అది ఇప్పుడు మొదలయింది. మాకు దీటుగా ఫ్యాకల్టీ ఇప్పించుకుని.. తెలంగాణా విద్యార్ధులని IIT లో.. పాగా వేయించండీ.. ఎందుకండీ.. పిల్లల మనసులో..విషబీజాలు..నాటుతారు. ఏటా.. ఎన్నో..విద్యా కుసుమాలని వికశించ నీయకుండా.. ప్రాంతీయ బేధాలు.. చూపుతున్నారు..? మా ఆంధ్రా.సీమ ప్రాంతాలవారు మజ్జీగ తాగి.. వెన్న నెయ్యి పెట్టుబడులని..తెలంగాణా.. మనదే అనుకుని..పెట్టుబడిపెడితే .. అన్యాయంగా.. లాగేసుకోవాలన్కునే విషపు బుద్ధి..పెంపొందించుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.. దయచేసి మీ.. ఆరోపణలు ఇక చాలించండీ!! అర్ధం ఉండాలి.. దేనికైనా..

    ReplyDelete
  20. Anonymous June 10, 2011 6:56 AM

    వాస్తవంలా కనిపించాలి కాద నమ్మాలంటె. పోనీ EAMCET పరీక్షా హాల్లో మీరు గుర్తించగలరా ఆంధ్రా ఎవరో, తెలంగాణా ఎవరో?

    Anonymous June 10, 2011 7:10 AM

    ఒహో ఎవరో అలా అంటే పిల్లలని ఇలా చేస్తరన్న మాట. ఊరికే అన్నారా, తెలంగాణా వారు ముంబాయి, సూరత్, వ్ళ్ళైనా బతుకుతారు కాని ఆంధ్రా మాత్రం చచ్చినా వెళ్ళరని! ఎందుకో వేరే చెప్పనవసరం లేదు!

    Anonymous June 10, 2011 7:17 AM

    అయ్యా, అంత గొప్పలు పోవద్దు. అత్యధిక దామాషాలో IIT సాధిస్తున్న సంస్థలు తెలంగాణాలోనే ఎక్కువ. అందులో రామయ్య గారిది ప్రధమస్థానంలో ఉంది.

    విడిపోయినా మీ ఆస్థులు ఎవ్వరూ లాక్కోవడానికి భారత రాజ్యాగం ఒప్పుకోదు. కాకపోతే ఇప్పటిదాకా తెలంగాణా ఆస్తులను తేరగా భోంచేయాలన్న విషపు బుద్ధి కలిగిన కొంతమంది సీమాంధ్ర పాలకులు, వారి తొత్తుల ఆటలు సాగవు.

    ReplyDelete
  21. అయ్యా తెలంగాణా గారు...స్థాన బలం చేత విజయవాడ లో మేము చేసామని చేప్తున్నారు..నేను అమెరికా లో ఉన్నా ...నా తొటి కొలీగ్ నిన్న నా గురించి తన ఫ్రెండ్ తో ఫొన్ లో చెప్తు నా కొలీగ్ రా ..మన వాడు కాదు లే తెలుగొడు అన్నాడు...ఒక్క క్షనం నాకు అర్దం కాలా..నెను తెలుగొడినటా...మరి వాల్లు ఎవరు సార్ ? దెసాలు దాటినా మరి అవే సూటి పొటి మాటలా ? చదువుకున్న వాల్లె ఇలా ఉంటే ఏతు పొతున్నం మనం...దొంగలంతారు...దొపిడిదారులు అంతారు విన్న పిల్లల్లు ఎలా ఎదుగుతారు వల్ల ఆలొచనలు ఎలా ఉంతాయి ?

    ReplyDelete
  22. రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం తీసుకున్నారా కారణం తెలుసుకోడానికి అది రిజల్ట్స్ అన్ని వచ్చాక. రెండు సంవత్సరాలలో ఎప్పుడు ఆ విద్యార్ధి వాళ్ళ తల్లితండ్రుల ముందు వాపోలేదా తనకు జరుగుతున్న మానసిక హింస గురించి. ఇంత కంటే హాస్యాస్పదం ఇంకేమిన ఉన్నదా
    పిల్లవాడు చిన్న బాధ కలిగితేనే ముందు వెళ్లి మన parents తో చెప్పుకుంటామే అలాంటిది ఈ ఎగ్జామ్స్ అన్ని అయ్యే వరకు వెయిట్ చేసాడ. నిజంగా ఆ విద్యార్ధి సహనశీలి అయి ఉండాలి లేక ఆడ లేక మద్దేలనన్నట్టు ఇదిన నిజం అవ్వాలి. 10 క్లాసు లో గొప్ప పెర్సెంట్ వచ్చినంత మాత్రాన IIT ,AIEEE గ్యారంటీ అనుకుంటే మన కంటే మూర్ఖులు ఉండరు. ఇది ఆ విద్యార్ధి ప్రతిభ శంకించడం కాదు. fact . అర్ధం చేసుకోలేని వాళ్ళు ఎలాగు అర్ధం చేసుకోరు.

    ReplyDelete
  23. అయ్యా శ్రీకాంత్‍గారూ!జరిగిన వాస్తవం చెప్పాను మీరు నమ్మినా,నమ్మకపోయినా ఇది నిజం.

    ReplyDelete
  24. @Anonymous

    చెప్పుకోలేదని ఎవరన్నరు? మనం ప్రతి రోజూ ఆరా తియ్యంగా! మంచి పిల్లవాడు ఇలా అయ్యాడని మనం ఆరా తీసినప్పుడు తెలిసిన విషయం ఇది.

    ఇక్కడ IITనో AIEEEనో రావడం విషయం కాదు. ఏం జరిగింది అనేది ముఖ్యం. అది వదిలేసి 10th లో % వస్తే IIT వస్తదా అని వాదించుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే.

    అయినా వాడికి అలా జరిగిందంటే అంత విచిత్రమైన విషయమేమీ కాదు. ప్రతిరోజూ ప్రతి చోటా ఇదే తంతు. ఎక్కడ్నో ఎందుకు? హైదరాబాదులోనే నేను ఎంతో మందిని చూసిన. సందు దొరికితే KCRనో, కోదండరాంనో తిట్టడానికి ప్రయత్నిస్తరు, మాలాంటి వాళ్ళ ముందే. ఇంక పిల్లల ముందు ప్రతాపం చూపడంలొ ఆశ్చర్య పడేది ఏముంది?

    తెలంగాణా వాదాన్ని, ప్రజలను, యాసను, నాయకులను గేలి చేయడం సీమాంధ్రులకు సర్వ సాధారణమైన విషయం. ఆ సంగతి ఇక్కడ కామెంటు పెట్టిన వారందరి మనసులకు తెలుసు. బయటికి ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా.

    ReplyDelete
  25. చిలమకూరు విజయమోహన్ గారు,

    మీ నిజాయితీని శంకిస్తలేను. అయితే ఆమెను ఇన్విజిలేటరు ఆంధ్రా అని ఎట్ల గుర్తించిన్రో చెప్తరని ఆశిస్తున్న. గడియారాల లోపంతోనో నిర్వహణాలోపం వళ్ళనో పదినిముషాలు ఎక్కువ, తక్కువ కావడం మన దేశంలోని పరీక్షల నిర్వహణలో సర్వ సాధారణం. ఏదేమైనా, మీ తమ్ముని కూతురుకి జరిగిన దానికి చింతిస్తున్నా. మీకూతురుపై జరిగింది వివక్ష అయితే తప్పకుండా ఖండించ వలసిందే.

    మరొక విషయం. తెలంగాణా ఉద్యమం నడుస్తున్నదే వివక్షకు వ్యతిరేకంగా. అటువంటిది ఉద్యమం వివక్ష ఏరూపంల ఉన్నా సమర్థించదు. వివక్షను అమలుజరుపుతూ, దాన్ని కొనసాగించాలని కోరే వారితోనే మా పోరాటం.

    ReplyDelete
  26. Hello Boss,

    polictics and studies both are diffrent don't mix both.so many students from teleangana are studying in andhra and they are getting seats in IITS.

    ReplyDelete
  27. "పోనీ EAMCET పరీక్షా హాల్లో మీరు గుర్తించగలరా ఆంధ్రా ఎవరో, తెలంగాణా ఎవరో?"
    యాసని బట్టి ప్రాంతం కనిపెట్టడం పెద్ద బ్రహ్మవిద్యా?

    ఇకపోతే మీరు చెప్పిన ఉదాహరణని నేను ఇలా ఎందుకు అనుమానించకూడదు?:
    ఆ అబ్బాయో చెడు సావాసాల వలన చదువుకు దూరమై తీరా ర్యాంక్ రాకపోయే సరికి ఇంట్లో తిడతారని భావించి ఆ నెపాన్ని సీమాన్ద్రులపై నెట్టేసి తప్పించుకోవచ్చని అనుకుని ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితులలో అదేమీ తప్పు కాదని తేలిగ్గా ఇంట్లో తప్పించుకోవచ్చు, పైగా సానుభూతి కూడా లబిస్తుందని అనుకుని ఉంటాడు.

    అందువలన ఊరికే పిడివాదం చేసి అవతల వాళ్లకి చికాకు తెప్పించక కాస్త అప్పుడప్పుడు నిజాలు ఒప్పుకోవడం నేర్చుకోండి.

    ఈ కామెంట్ ఇంతకు ముందు ఒకసారి పోస్ట్ చేశాను. కానీ బహుశా మీకు నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేక పబ్లిష్ చేయలేదు. ఇప్పుడైనా ఉంటే పబ్లిష్ చేయండి.

    ReplyDelete
  28. @Anonymous June 10, 2011 9:07 PM

    మీకు అంతటి బ్రహ్మవిద్యలు తెలుస్తయేమో. మాకు తెల్వదు. చదువుకున్న విద్యార్థులు అంతా ఒకే శిష్ట వ్యావహారికం మాట్లాడడం మాత్రమే మేం జూసినం.

    ఇకపోతే మీరు చెప్పిన ఉదాహరణని నేను ఇలా ఎందుకు అనుమానించకూడదు?:

    ఎలా అయినా అనుమానించగలిగిన ఘనులు మీరు. కాకపోతే మీకు విషయం అర్థం చెయ్యడానికి మరొక సారి ప్రయత్నిస్త.

    1. ఆ అబ్బాయికి IIT, AIEEE రాకపోయినా EAMCET ల మంచి మార్కులే వచ్చినై. అల్లరి చిల్లరగ తిరిగితే అట్ల జరగదు.

    2. మార్కులు, ఎంత వివక్ష జరిగిందనే దానికి కొలబద్ద కాదు. ఒక విద్యాథి అన్నీ తట్టుకొని నిలబడ గలడు. ఇంకో విద్యార్థి పారిపోయి రావచ్చు. ఈ విద్యార్థిని 'ఒరే కేసీయాఋ అని కాలేజీలో పిలిచే వాళ్ళంటే వివక్ష ఏవిధంగా ఉందో ఊహించ వచ్చు. ఒకవైపు KCRని బూతులు తిడుతూనే, ఇంకో పక్క KCR అని పిలవడం ఎంత దారుణం? అయినా ఆ అబ్బాయి అన్నీ తట్టుకుని నిలబడ్డాడు.

    3. ఆ విషయాలు ఫలితాల మీద ప్రభావం మాత్రం తప్పకుందా చూపే వుంటాయన్నది తెలుసుకోవడానికి బ్రహ్మఙ్ఞానం అవుసరం లేదు.

    4. జరిగిన వివక్ష గురించి కాక ఫలితాల గురించి మాట్లాదుతున్న, అబ్బాయి నడవడిని అనుమానిస్తున్న మీకన్నా పిడివాదులు ఎవరు?

    5. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, అంత నిజం ఉన్న మీ కామెంటు పోస్టు చెయ్యడానికి ధైర్యం ఎందుకు? మీలాంటి పిడివాదుకు వివరించడానికి కొంత ఓపిక, సహనం మాత్రం కావలసిందే.

    ReplyDelete
  29. Anonymous June 10, 2011 9:01 PM

    >>>polictics and studies both are diffrent don't mix both

    True. That is what I was saying all the time. But since they are mixed by the people at other part of the State, I just can't keep quite.

    ReplyDelete
  30. Mr.Srikanthachari did made a definite point.He is right in calling Studies and Politics are different issues.Inevitable comment made by him.

    The leaders too should stop targeting Universities,Schools and Hospitals.As like a person did comment,Is it really necessary to involve students into the situation ? Whatever is the situation you call the one as.University students has a higher goal to achieve.(Which ever the University is)
    Recently I had to go through a news that the Doctors did form a JAC (and attacked other party's meeting Forget the reason any way)We Indians are in a society where Doctor is treated as a God and the God choosing a worst choice to attack others is not appreciable,irrespective of area.

    ReplyDelete
  31. Hi Anonymous,

    You are trying to derive too many things from what I said. I said in the context that, if there is no relation between two things, they should not be mixed up.

    But here in Telangaaanaa the students, Doctors, Lawyers and every other people voluntarily forming JACs and chose to fight for separate Telangaanaa. I don't see any thing wrong with that since they have every right to do so in a democratic setup.

    >>>Doctor is treated as a God and the God choosing a worst choice to attack

    In our epics God many a times attacked wrong-doers in order to restore natural justice.

    ReplyDelete
  32. ఈ దినములలో ప్రజలంతా చదువులకు, ఉద్యోగాలకు ,వ్యాపారాలకు ,విహారాలకు ప్రపంచ నలుమూలలకు వెళ్తున్నారు. భాష గురించో,యాస గురించో,ఆచారవ్యవహారాల గురించో ఎవరో ఒకరు ఏదో అనకుండా పోరు. వాటిని మొండిగా ఎదుర్కొని దులిపేసుకొని పెద్దలైనా పిన్నలైనా జీవితము సాఫీగా నడపడము నేర్చుకోవాలి. అల్ప సంఖ్యాక వర్గస్థులకు ఎక్కడైనా ఈ అనుభవాలు తప్పవు. అల్పసంఖ్యాక వర్గస్థులను,ఇతరులను, మర్యాదగా ,గౌరవించడము మనమంతా నేర్చుకోవాలి. దేశము నాలుగు మూలలకు వెళ్ళే అవకాశము విద్యార్ధు లందఱికీ ప్రభుత్వాలు కలుగ జేస్తే సంకుచితత్వము పోయి మనది ఒక జాతి,మనమందఱమూ భారతీయులమనే ఒక భావన స్పందిస్తుంది.

    తెలంగాణా అన్నది ఒక రాజకీయార్ధిక అంశము. రాజకీయ,అభిప్రాయ బేధాలున్నా,ఒక రాష్ట్రమైనా,రెండు రాస్ట్రాలైనా, ప్రజలను విడగొడదామనే ప్రయత్నాలు అనవసరము. మిగిలిన తెలుగువారు తెలంగాణాకు వచ్చినట్లే తెలంగాణా ప్రాంతము వారు, వారి పిల్లలు చదువులకైనా ఉద్యోగాలకైనా ,వ్యాపారాలకైనా, విజయవాడ, విశాఖ, గుంటూరులకు రావలసిందే, వారి భాష, సంస్కృతి,ఆచార వ్యవహారాలతో.

    సర్వే జనా సుఖినో భవంతు.

    ReplyDelete
  33. మీ కోసమే కాబోలు చైతన్య వాళ్ళు తెలంగాణా -e -techno schools స్టార్ట్ చేసారు .ఈరోజే ఆడ్ వచ్చింది.టీవీల్లో

    ReplyDelete
  34. విజయవాడ గురించి మీరు రాసింది నిజమే మా పిల్లలు చదివేది హైదరాబాద్ లోనే పిల్లల ఫ్రండ్స్ లో తెలంగాణా, ఆంద్ర అంతా ఉన్నారు. ఫ్రెండ్స్ తో తెలంగాణా, సమైక్యంద్ర ఉద్యమ గురించి, కులాల గురించి చర్చ వచ్చినా మీరు మాట్లాడ వద్దు ఆ విషయాలు నాకు తెలియదు అని చెప్పాలి అని సలహా ఇచ్చాను. అనవసరంగా స్నేహితుల మధ్య గొడవలు అని అలా చెప్పాను . ఎప్పుడూ అలానే చెబుతుంటే ఓ సారి పిల్లలు కోపంగా చూశారు. నువ్వు చెప్పినట్టే విని అలాంటి చర్చ వచ్చినప్పుడు నాకు తెలియదు అని తప్పించుకున్నాను , ఆ మాట అనగానే అందుకే చెబుతున్న మీ తెలంగాణా వారికి ఎమీ తెలియదు కాబట్టే ఆంధ్ర వాళ్ళు చెప్పింది విని తెలుసు కోవాలి అని ఆంద్ర ఫ్రెండ్ చెప్పారట. హైదరాబాద్ లోనే యిల ఉంటే విజయవాడలో పెద్ద వింతేమి కాదు. విజయ వాడలోని ఒక ప్రముక ఇంజనీరింగ్ కాలేజి లో భుధవారం రోజు ఒక కులం వారు తెల్ల డ్రెస్ వేసుకు రావాలత. ఆ ప్రాంతానికే చెందినా ఫ్రెండ్ చెప్పింది .

    ReplyDelete
  35. ౧౦ నిమిషాల ముందే ఎంసెట్ పేపర్ తోసుకోవడం- సంగటన నిజ నిజాలు ఏమో కాని హైదరాబాద్ ఎంసెట్ సెంటర్లో పరీక్ష రాసేప్పుడు ఒకే ఒక ఆంధ్ర విద్యార్తి ఉండడం నమ్మ సక్యంగా లేదు. మారు మూల తెలంగాణా జిల్లాలో పరీక్ష కేంద్రం లో అలా ఒక్కరే ఉన్నారంటే ఓకే . కాని హైదరాబద్ లో కనీసం సగం మంది ఉంటారు. ఓల్డ్ సిటీ లో లేదా ప్రభుత్వ పాటశాలలో ఐతే ఒక్కరు, ఇద్దరే ఉండ వచ్చు కాని ఎంసెట్ సెంటర్ లో ఒక్కరే అంటే నమ్మ భుద్ది కావడం లేదు. మరీ చాలా మంది ఉంటే వారిని వదిలేసి ఒక్కరి నుంచే పది నిమి శాల ముందు పేపర్ తీసుకోవడం ఏమిటో

    ReplyDelete
  36. I had to hear that MrKTR had COMPLETED his graduation at Guntur.Now,After going through your blog I stood in Doubt,Has Mr.KTR completed his graduation? If so Why in Guntur.Why not in Hyderabad.Is this the respect being paid by the leader of Telangaanaa leader towards educational system in Telangaanaa?

    ReplyDelete
  37. No wonder the KTR's commitment to achieve Telangana state doubled after completing Grad in Guntur, contrary to the people who complete in Hyderabad coming from andhra wants stick here for ever.

    Try to visualize the difference, man!

    ReplyDelete
  38. Srikantachari garu

    EE vishayamlo meeru porabadutunnaru. IIT,AIEEE and EAMCET are different patterns. Those who secured good ranks in IIT,AIEEE may not get good ranks in Eamcet. This may also happen Vice Versa. If you have any doubts in this regard you may clarify your doubt with IIT Ramayya garu.

    And the incedent happened in the Vijayawada collage: For this, that student not only from telangana region, thousands of students are stuyding from telangana. This is not with in two years. After starting of coprorate coachings, this trend is there(studying at VJA,GNT). Up to now no body is complained in this regard. If any such incedents are there, you may put with credentials. Otherwise nobody believe this.

    with regards

    ReplyDelete
  39. aditya garu,

    I know the patterns are different. The boy went there for IIT coaching. But could not get success neither in IIT,not in AIEEE. After returning back to Hyd, after IIT exam, he studied hard on his own and secured 7000 rank in EAMCET though his coaching pattern was different.

    No wonder you people reject to accept the facts. The people who does not recognise the genuine demand of Telangana people, never be expected to accept any other fact.

    If you want credentials, test mail me at telangaanaa@gmail.com, I will try to arrange a meeting with the boy if you want.

    There is another such case happened in Geetham Vijag, I am trying to write on that issue soon.

    ReplyDelete