అవును మేం తెలబాన్లమే
ఆంధ్రులం మాత్రం కాము
బాగా గుర్తు చేసినవ్ అన్నా!
భారతంల సహదేవుడు
తెలవాన్ల గురించి చెప్పిండు!
ఆ తెలవాన్లం మేమేనని
ఇప్పుడిప్పుడే అర్థమైతుంది!
నిజాంల పాలనలో
మా జాతినే మరిచి పొయ్యినం
మీతోని దోస్తీ చేసినంక
పురాగ మరచి పోయినం
ఇప్పడు నువ్వే గుర్తుకు తెచ్చినవ్
మా జాతి ఏందో
మా చరిత్ర ఏందో
బెంగాలీ యాసల
చాల అందంగ చెప్పినవ్
మేం తెలబాన్లమని
అవును మేం తెలవాన్లమే
మేం ఆంధ్రులం ఎప్పటికీ కాలేం
ఎందుకంటే మాకు తెలవదు
ఒకని పొట్ట గొట్టుడు
ఒకని కొంప ముంచుడు
ఒకని వెక్కిరించుడు!
మేం ఆంధ్రుల మెట్లైయితం?
మేము ఆంధ్రులం కాలేం
మీకు ముఖ్యంగా ధన్యవాదాలు
మా జాతిని గుర్తు చేసినందుకు
వేలఏళ్ళ జాతి మాది
తెలవాన్లం మేం
శాతవాహనుల నుండి
కాకతీయుల వరకు
గొప్ప చరిత్ర మాది
మేం తెలవాన్లమే
ఆంధ్రులం మాత్రం కాం
ఆంధ్రుల మెట్లైతం?
మాకు ఫాక్షనిజం రాదు
మాకు ఫాసిజం తెల్వదు
మాకు కులోన్మాదం లేదు
మాకు కులోన్మాదం లేదు
మాకు రౌడీయిజం ఎరుకలే!
ఇవి తెలిస్తే అయ్యే వాళ్ళమేమో?
అధ్రులల్ల కలిసేవాళ్ళ మేమో?
ఇప్పుడు తెలుసుకోవాలని గూడ లేదు
మీతోని కలవాలనీ లేదు
మేం ఆంధ్రులం ఎప్పటికీ కాలేం
ఇంకో అరవై ఏళ్లయినా
వందేళ్లయినా...
మేం ఆంధ్రులం కాలేం
మేం తెలవాన్లుగనే ఉంటం
మమ్మల్ని తెలవాన్లుగనే ఉండనీయున్రి!
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ReplyDeleteఇట్లు నిర్వాహకులు
"ముస్లిముల దాడులతోని మా జాతినే మరిచి పొయ్యినం" అని మతం పేరు ఎత్తటం ఎందుకు?తెలంగాణాలో ముస్లిములు అనేకమంది తెలంగాణా కోరుతున్నారుగదా?జమాతే ఇస్లామీ హింద్ నిజాంకళాశాలలో పెట్టిన భారీ బహిరంగసభ మీకు గుర్తులేదా?
ReplyDelete"నిజాం రాజును వ్యతిరేకించడం అంటే ముస్లింలను వ్యతిరేకించినట్టు కాదు. నిజాంను వ్యతిరేకించిన వారిలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు"
తుర్రేబాజ్ ఖాన్ , బందగి , షోయబుల్లాఖాన్ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు.1946-48 సంవత్సరాల్లో బందగి హత్య నేపధ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని సుంకర , వాసిరెడ్డి లు మాభూమి నాటకాన్ని వ్రాసి ఊరూరా ప్రదర్శనలిచ్చారు.మా భూమి నాటకం షేక్ బందగీ సమాధి దగ్గర నిలబడి నివాళులర్పించటంతో ప్రారంభమయింది.1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు హత్యచేశారు.దేవులపల్లి వెంకటేశ్వరరావు 1845లోనే 'జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు' పుస్తకం లో బందగీ గురించి వివరంగా రాశారు.తిరునగరి రామాంజనేయులు వీరబందగి పేర బుర్రకథ వ్రాసి ప్రదర్శనలిచ్చారు.
"భారతీయులంతా హిందువులే.హిందువులు కానివారు భారతీయులేకాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు,అది జీవన విధానం" అన్నారు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్(సాక్షి 1.3.2010).
ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మనదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?
రహమతుల్లా గారు,
ReplyDeleteముస్లింల దాడులు అంటే ముస్లిం రాజుల దాడులు అని. ఇప్పుడు సరి చేసిన. వ్యాఖ్యకు, మీ అభిప్రాయానికి కృతఙ్ఞతలు.
రహమతుల్లా గారు,
ReplyDeleteమీరిచ్చిన విలువైన సమాచారానికి నెనర్లు.
బాష వేరు , గోస వేరు.
ReplyDeleteఇప్పుడు ఏప్పుడు ఆంద్రజాతి,తెలంగాణ జాతి వేర్వేరే.
ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదన:
ReplyDelete"మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ఏర్పడితే ముస్లిముల జనాభా గణనీయ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు".
ఒక భావోద్వేగంలో ఒక్కోమాట జారవచ్చు గానీ చెప్పిన మోజారీటి విషయాలను సోదరుడు మంచిగ చెప్పిండు. ఇప్పుడు ముస్లీం సోదరులే తెలంగాణను బతికించిన్రు. పచ్చి హిందుత్వవాదైన బీజేపీ అభ్యర్థి లక్ష్మినారయణను గెలిపించకుంటే కాంగ్రేసోల్లు.. వీళ్లతోటి ఆంధ్రోల్లు తెలంగాణను పక్కనున్న గోదాట్ల కలిపెటోళ్లు.. ఏదీ ఏమైన నిజాం విషయంలో కొన్ని అపొహలు ఉన్నయి. వాటిని చరిత్రకారులు ప్రజలముందు పెట్టే ప్రయత్నం జరిగిన ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని మత రాజకీయాలకు వాడుకొని ప్రజల మధ్యన చిచ్చుపెడతరని వారు భయపడుతున్నరు. ఏదైనా గానీ తప్పు ఎవరు చేసిన తప్పే. మొత్తానికి మంచిగా రాసావ్ సోదారా నెక్ట్స్ టైం ఎవరీని భాధపెట్టకుండా.. బాగా పరిశోధించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పోస్టు చేయమని నీకువిజ్ఙప్తి చేస్తున్న... థ్యాంక్స్ సోదరా.శ్రీపాద రమణ.sripada.ramanachary@gmail.com
ReplyDelete