తెలంగాణా ప్రజలారా రండి
మీకోసం మేం ఉద్యమాలు జేస్తం. ఆ ముతకబారిన గులాబి బట్టలు, ఎర్రబట్టలు, కాషాయ బట్టలోల్ల దగ్గరికి బోకున్రి. మేం వేసుకున్న ధగధగలాడే పచ్చబట్టలు చూడున్రి. మా ఆంధ్రబాబు మొన్ననే కొనిచ్చిండు మాకందరికీ. ఎంత ప్రేమలేక పొతే మాకు అయిన కొత్తబట్టలు కొని, ఇస్త్రీ చేయించి మరీ ఇస్తడు? మాదగ్గరికొస్తే మీకందరికీ పచ్చ రంగు పట్టుకండువాలు ఫ్రీగ పంచిపెడ్తం.
కండువలే కాదు మా మీటింగులకొస్తే మీకు తలా ఒక బిర్యాని పొట్లం, దినసరి బత్తా ఫ్రీగ ఇస్తాం. రాను పోను మేమే దారి కర్చులు చూసుకుంటం. లేకపోతే డీలక్సు బస్సులు, టాటా సూమోలు పెడ్తం. ఇంకా కావాల్నంటే మా బాబునదిగి క్వార్టరు కూడ ఇప్పిస్తం. ఇయ్యన్ని పెట్టినా కూడ మాదగ్గరికి రాకుండ వేరే వాళ్ళ దగ్గరికి పోతమంటరు! ఏమున్నయి వాళ్ళ దగ్గర? వాళ్ళ మీటింగులకి పొతే మీకు ఇమ్మడి కర్చు, ఆదాయం లేదు.
వాళ్ళ ధర్నాలకు పొతే మీరు ఎండల ఎండాలే, వానల తడువాలే. అంత జేసినా మీకు లాఠిచార్జుల తోని వీపు విమానం మోతమోస్తది. మా ధర్నాలకొస్తే మీమీద ఈగ వాలకుండ మా కిరణ్ సారుకు చెప్పి మూన్నాలుగు వేలమంది పోలీసులతోని కాపలా పెట్టిస్తం. మీకు మా ఆంధ్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతం వివరంగా విన్నవిస్తం.
మా పార్టీవాళ్లు అక్కడ జైసమైక్యాంధ్ర అంటున్నరని సొంచాయించ కున్రి. గదే మా బాబు రెండు కళ్ళ సిద్ధాంతం. అక్కడ వాళ్ళు సమైక్యాంధ్ర అంటారు. ఇక్కడ మేం తెలంగాణా అనాలే. కేంద్రం ఇప్పుడున్నడానికి భిన్నంగా ఏ నిర్ణయం దీసుకున్నా మోకాలు అడ్డంబెట్టాలే. గోలగోల చేపియ్యాలే. గియ్యన్ని మీకు అర్థంకావు గని, మా మీటింగుల వచ్చి మాత్రం కూర్చోండ్రి. ఎందుకంటే ఇంత సపోర్టు ఇచ్చి, ఇన్ని కోట్లు కార్చి పెట్టి మీటింగు పెట్టినాకూడ ఒక్కడు కూడ వస్తలేడని మా ఆంధ్రబాబు చిన్నబోతుండు. ఆ పైసలన్ని మేమేదో తింటున్నమని అనుమానిస్తుండు.
మీకు మీటింగు మొత్తం వినుడు ఇష్టం లేకపోయినా ఫర్వాలేదు. కుర్చీల్ల జేరసేపు కూచోని ఫోటోలు దిగి వెల్లిపొండ్రి. గా ఫొటోలన్న మేం ఆంధ్రబాబుకు చూపెట్టుకొని మొకం నిలబెట్టు కుంటం.
మీది TRS పార్టీనా ?
ReplyDeleteకాంగ్రెస్ ఆంధ్రా ఏరియాలో ఒక ఆట, తెలంగాణలో ఇంకో ఆట ఆడుతుంది. అది తప్పు కాదు మీ దృష్టిలో ! అదే సమయంలో తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ, సచ్చేదీ మా కాంగ్రెస్సే అని కూడా చెప్పుకుంటుంది. అసలేమీ ఇవ్వకుండానే అలా అలా చెప్పుకుంటూ రోజులూ, నెలలూ, సంవత్సరాలూ గడిపేస్తుంది - అది కూడా తప్పు కాదు మీ దృష్టిలో ! తెలుగుదేశం ఒక్కటి అలా ఉంటే మీకు తప్పు. Right ?
నిజంగా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనుకుంటే తెలుగుదేశం చెయ్యగలిగినదేముంది ? ఇటు శాసనసభలో గానీ, అటు పార్లమెంట్‌లో గానీ తెలంగాణని అడ్డుకోగల సంఖ్యాబలం లేదు కదా ఆ పార్టీకి ? మరెందుకు మీ TRS వాళ్ళు ఊరికే తెలుగుదేశం మీదా, చంద్రబాబు మీదా ఒంటికాలు మీద లేస్తారు ప్రతిసారీ ? ఇది నా ప్రశ్నకాదు. ఆలోచించే శక్తి గల ప్రతి తెలుగువాడూ అడుగుతున్న ప్రశ్న. TRS కి కాంగ్రెస్ పంపుతున్న ముడుపులు తృప్తిగా ఉన్నాయనా ?
నాది TRS మాత్రమే కాదు, ప్రత్యేక తెలంగాణాని బలపరుస్తున్న అన్ని పార్టీలు నాపార్టీలే. కాంగ్రేస్, TDP, రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నయ్. రెండిటినీ ఉద్యమకారులు ఎండగడుతూనే ఉన్నరు.
ReplyDeleteకాంగ్రేస్ పార్టీ వాళ్ళు డిసెంబర్ 9, 2001నాడు తెలంగాణా ప్రక్రియ ప్రారంభిస్తున్నమని ప్రకటించిన్రు. చిదంబరం ప్రకటన రాంగనే సమైక్యవాద కాంగ్రేస్ నాయకులతోటి కలిసి చంద్రబాబే దొంగ సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిండని నాగం బయటికొచ్చినంక ఋజువైంది. కాబట్టి తెలంగాణా మొదటి శత్రువు చంద్రబాబే. కాంగ్రేస్‌కి ఇంకా తెలంగాణా ఇచ్చే అవకాశం ఉంది 2014 వరకూ. ఇయ్యకపోతె దానంతట అదే భూస్థాపితమైతది తెలంగాణల. దానికి మొన్న జరిగిన 12 సీట్ల అసెంబ్లీ ఉప ఎన్నికలే నాంది పలికినై.
>>>నిజంగా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనుకుంటే తెలుగుదేశం చెయ్యగలిగినదేముంది?
మొన్నటికి మొన్న జూన్ 2 నాడు చంద్రబాబు స్పష్టంగ చెప్పిండు. కాంగ్రేస్ నిర్ణయం తీసుకుంటే చూస్తూ ఊర్కోమని. రాష్త్రంలో ఉన్న రెండో పెద్ద పార్టీగా తన stand ఏమిటో చెప్పవలసిన బాధ్యత లేదా? ప్రపంచంలో ఎక్కడైనా రెండుకళ్ళ సిద్ధాంతాన్ని చూసిన్రా ఒబుల్ రెడ్డి గారూ.
ఏమీ చెయ్యలేనప్పుడు గోడమీది పిల్లి లెక్క రెండు వైపులా నాయకులను ఉసిగొల్పడమెందుకు? కోట్లు కర్చు బెట్టి రణభేరీలు ఎవరి మీద మోగిస్తున్నరు, ఒక పాలసీయే లేనప్పుడు? వాల్లు జై తెలంగాణా అన నవసరంలేదు, తమ స్టాండు ఏమిటో చెప్పమనండి.
>>>ఇటు శాసనసభలో గానీ, అటు పార్లమెంట్‌లో గానీ తెలంగాణని అడ్డుకోగల సంఖ్యాబలం లేదు కదా ఆ పార్టీకి?
అది నిజమే. అది కాంగ్రేసు ఆడుతున్న దొంగాటే. మరి TDP తెలంగాణా వాది అయితే ఆ విషయం స్పష్టంగ ప్రకటించి కాంగ్రేస్ పై వత్తిడి తేవాలి గద? తెలంగాణాపై నాయకుడి అభిప్రాయం చెప్పకుండ, అదే నాయకుని ఫోటోలు పెట్టి దొంగ సభలు నిర్వహిస్తమంటె ప్రజలు ఎట్ల ఒప్పుకుంటరు?
తెలంగాణా ప్రజలు తమ శత్రువులు ఎవరన్న విషయమ్మీద స్పష్టంగనే ఉన్నరు. అందరి లెక్కలు ప్రజలు సరిగ్గనే రాస్తున్నరు. రాబొయే ఎన్నికలల్ల జూడున్రి తెలంగాణా దెబ్బ ఏందో!
>>>TRS కి కాంగ్రెస్ పంపుతున్న ముడుపులు తృప్తిగా ఉన్నాయనా?
అవునా? ఎందుకు పంపుతున్నరు ముడుపులు? తమను తాము ఓడించుకోనీకా? తెలంగాణా సమస్య పెద్దదైతే నష్టపొయ్యే పార్టీలల్ల కాంగ్రేస్ కూడా ఒకటి. మరెందుకు TRSకు ముడుపులు పంపుతరు?
ఎందుకంటే TRS కాంగ్రెస్ లో కలిసి పొతుంది కాబట్టి....does not matter who wins...
ReplyDelete