వేములవాడ భీమకవిని అణగదొక్కిన నన్నయ
రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడు, చివరికి వారి గ్రంథాలు చించి వేయడం, తగుల పెట్టటం చేశాడు.
ఆధునిక , సమకాలీన తెలంగాణ సాహిత్య చరిత్ర మొత్తం అణిచివేతల లేదంటే అవహేళనల మయం. ఇందుకు ప్రాచీన సాహిత్య చరిత్ర మినహాయింపేమి కాదన్నది వెలుగులోకి వస్తోన్న వాస్తవం. ఇందుకు బీజాలు ఆదికవిగా ప్రచారం చేయబడిన నన్నయ చేతనే నాటబడడం గమనార్హం. క్రీ. శ 11 వ శతాబ్దిలో రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడని, చివరికి వారి గ్రంథాలు చించివేయడం, తగుల పెట్టటం చేశాడని ఆధునిక యుగ సంస్కర్తగా పేరొందిన కందుకూరి వీరేశలింగం తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’ లో విస్పష్టంగా రాశాడు.
తెలంగాణలోని వేములవాడకు చెందిన భీమకవి, నన్నయ కన్నా ముందుగానే 'రాఘవ పాండవీయము' అనే గ్రంథం రాసి, దానిని రాజైన రాజరాజనరేంద్రునికి చూపించి రాజ సన్మానం పొందడం కోసం రాజమహేంద్రవరం చేరాడు. విష్ణు వర్ధనుడిగా పేరొందిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ. రాజసన్మానం పొందకోరిన ఏ కవి అయినా నన్నయ ద్వారా రాజుకు పరిచయం కావలసిందే. దానితో వేములవాడ భీమకవి తన రచన అయిన 'రాఘవ పాండవీయము' ను నన్నయకు అప్పగించారు. ఆది చదివిన నన్నయ భీమకవి కవిత్వం అమోఘంగా ఉండటం, అది వెలుగులోకి వస్తే తన ప్రాభవం తగ్గుతుందని భావించి ఆ గ్రంథాన్ని తగుల బెట్టించాడని వీరేశలింగం వివరించాడు.కందుకూరి వీరేశలింగం రాసిన 'ఆంధ్ర కవుల చరిత్ర' నుండి ఈ ఉటంకింపును చూడండి.
తన కాలం నాటికి బహుళ ప్రచారంలో ఉన్న విషయాన్ని కందుకూరి వీరేశలింగం తన 'ఆంధ్ర కవుల చరిత్ర' లో ఉటంకించారు. ఈ కథనం మీద చారిత్రక చర్చ జరగవలసి ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ప్రసిద్ధి పొందకుండా, తొలి గ్రంథంగా భావించబడిన తన రచన మహాభారత ఆంధ్రీకరణ కన్నా మరో రచన ముందు వెలుగు చూడకుండా చేసిన కుట్ర ఇందులో దాగి ఉంది. ఆంధ్రుల ఆధిపత్య అభిజాత్యం ఆది కవిగా పిలవబడిన నన్నయ నుంచే ఆరంభమైందని ఈ ఘటన రుజువు చేస్తోంది.
- వి.ఆర్.తూములూరి
Curtesy: Namaste Telangana
రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడు, చివరికి వారి గ్రంథాలు చించి వేయడం, తగుల పెట్టటం చేశాడు.
ఆధునిక , సమకాలీన తెలంగాణ సాహిత్య చరిత్ర మొత్తం అణిచివేతల లేదంటే అవహేళనల మయం. ఇందుకు ప్రాచీన సాహిత్య చరిత్ర మినహాయింపేమి కాదన్నది వెలుగులోకి వస్తోన్న వాస్తవం. ఇందుకు బీజాలు ఆదికవిగా ప్రచారం చేయబడిన నన్నయ చేతనే నాటబడడం గమనార్హం. క్రీ. శ 11 వ శతాబ్దిలో రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడని, చివరికి వారి గ్రంథాలు చించివేయడం, తగుల పెట్టటం చేశాడని ఆధునిక యుగ సంస్కర్తగా పేరొందిన కందుకూరి వీరేశలింగం తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’ లో విస్పష్టంగా రాశాడు.
తెలంగాణలోని వేములవాడకు చెందిన భీమకవి, నన్నయ కన్నా ముందుగానే 'రాఘవ పాండవీయము' అనే గ్రంథం రాసి, దానిని రాజైన రాజరాజనరేంద్రునికి చూపించి రాజ సన్మానం పొందడం కోసం రాజమహేంద్రవరం చేరాడు. విష్ణు వర్ధనుడిగా పేరొందిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ. రాజసన్మానం పొందకోరిన ఏ కవి అయినా నన్నయ ద్వారా రాజుకు పరిచయం కావలసిందే. దానితో వేములవాడ భీమకవి తన రచన అయిన 'రాఘవ పాండవీయము' ను నన్నయకు అప్పగించారు. ఆది చదివిన నన్నయ భీమకవి కవిత్వం అమోఘంగా ఉండటం, అది వెలుగులోకి వస్తే తన ప్రాభవం తగ్గుతుందని భావించి ఆ గ్రంథాన్ని తగుల బెట్టించాడని వీరేశలింగం వివరించాడు.కందుకూరి వీరేశలింగం రాసిన 'ఆంధ్ర కవుల చరిత్ర' నుండి ఈ ఉటంకింపును చూడండి.
"నన్నయ భట్టారకుడు తాను రచియింప నారంభించిన శ్రీ మహాభారతమును సంపూర్ణముగా నాంధ్రీకరింపలేక పోవుటకు కారణములు పలువురు పలు విధముగా చెప్పుదురు. కొందరు వేములవాడ భీమకవి శాపము చేత గలిగిన మరణము కారణమందురు. మరి కొందరు యధర్వాణాచార్యులు తెలిగించుచుండిన భారతమును తగుల బెట్టించుట చేత గలిగిన చిత్త చాంచల్యము కారణమందురు. ఈ రెండు కారణములో నేది నిజమైనను ఈ కవి పరోత్కర్షమును సహింపజాలని దుస్స్వభావము కలవాడయినట్టూ హింపదగియున్నది.
"ఈయన తోడి సమకాలినుడైన వేములవాడ భీమకవి రాఘవపాండవీయమును కవిజనాక్షిశయములో జేర్చి యొక్క వ్యాకరణ మును చేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంద్రపురమునకు దెచ్చి విష్ణువర్ధనుని యాస్థాన పండితుండయి యున్న నన్నయ భట్టునకు జూపగా నతడా కవిత్వ ము మిక్కిలి శ్లాఘ పాత్రముగా నుండుట చూచి యోర్వలేక యా పుస్తకములు లోకములో వ్యాపించిన యెడల దన పుస్తకములకు బ్రసిద్ధి రానేరదని యెంచి వానిని తగులబెట్టించినట్లును, అటు మీదట నతడింట లేనప్పుడు భీమకవి వచ్చి అతని భార్యను నీ భర్త ఏమి చేయుచున్నాడని యడిగి యామె తన భర్త రహస్య స్థలమున ఉండి యరణ్య పర్వం రచించుచున్నాడని చెప్పిన మీదట యతనింకను నరణ్యములోనే ఉన్నాడా యట్లే యుండునుగాక అని శపించి తన పుస్తకముల నణగదొక్కేనన్న కోపము చేత నన్నయభట్టు రచించిన ఛందస్సును వ్యాకరణమును భార్య నడిగి పుచ్చుకొని దానిని చించి గోదావరి లో గలిపివేసి తాను చిరకాలము కష్టపడి చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖము చేత బెంగపెట్టుకొని కాలధర్మము నొందినట్లును, అతని శాపము తగిలి నన్నయ భట్టు వనములో మృతి నొందినట్లును, అట్లు నశించిన వ్యాకరణము సిద్ధులలో గలిసిన సారంగధరుడు తన చిన్నతనములో నేర్చుకొని యుండుట చేత మల బాల సరస్వతి యను బ్రాహ్మణునకు జెప్పి నట్లును లోక ప్రవాదము కలిగి యున్నది."
"ఈయన తోడి సమకాలినుడైన వేములవాడ భీమకవి రాఘవపాండవీయమును కవిజనాక్షిశయములో జేర్చి యొక్క వ్యాకరణ మును చేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంద్రపురమునకు దెచ్చి విష్ణువర్ధనుని యాస్థాన పండితుండయి యున్న నన్నయ భట్టునకు జూపగా నతడా కవిత్వ ము మిక్కిలి శ్లాఘ పాత్రముగా నుండుట చూచి యోర్వలేక యా పుస్తకములు లోకములో వ్యాపించిన యెడల దన పుస్తకములకు బ్రసిద్ధి రానేరదని యెంచి వానిని తగులబెట్టించినట్లును, అటు మీదట నతడింట లేనప్పుడు భీమకవి వచ్చి అతని భార్యను నీ భర్త ఏమి చేయుచున్నాడని యడిగి యామె తన భర్త రహస్య స్థలమున ఉండి యరణ్య పర్వం రచించుచున్నాడని చెప్పిన మీదట యతనింకను నరణ్యములోనే ఉన్నాడా యట్లే యుండునుగాక అని శపించి తన పుస్తకముల నణగదొక్కేనన్న కోపము చేత నన్నయభట్టు రచించిన ఛందస్సును వ్యాకరణమును భార్య నడిగి పుచ్చుకొని దానిని చించి గోదావరి లో గలిపివేసి తాను చిరకాలము కష్టపడి చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖము చేత బెంగపెట్టుకొని కాలధర్మము నొందినట్లును, అతని శాపము తగిలి నన్నయ భట్టు వనములో మృతి నొందినట్లును, అట్లు నశించిన వ్యాకరణము సిద్ధులలో గలిసిన సారంగధరుడు తన చిన్నతనములో నేర్చుకొని యుండుట చేత మల బాల సరస్వతి యను బ్రాహ్మణునకు జెప్పి నట్లును లోక ప్రవాదము కలిగి యున్నది."
తన కాలం నాటికి బహుళ ప్రచారంలో ఉన్న విషయాన్ని కందుకూరి వీరేశలింగం తన 'ఆంధ్ర కవుల చరిత్ర' లో ఉటంకించారు. ఈ కథనం మీద చారిత్రక చర్చ జరగవలసి ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ప్రసిద్ధి పొందకుండా, తొలి గ్రంథంగా భావించబడిన తన రచన మహాభారత ఆంధ్రీకరణ కన్నా మరో రచన ముందు వెలుగు చూడకుండా చేసిన కుట్ర ఇందులో దాగి ఉంది. ఆంధ్రుల ఆధిపత్య అభిజాత్యం ఆది కవిగా పిలవబడిన నన్నయ నుంచే ఆరంభమైందని ఈ ఘటన రుజువు చేస్తోంది.
- వి.ఆర్.తూములూరి
Curtesy: Namaste Telangana
Thanks sir
ReplyDeletei did not know that this separate moment is that old ?
Woh!!!
ఇలాంటి పుక్కిటి పురాణాల్ని నమస్తే తెలంగాణ తన ఉద్యమస్వార్థాల కోసం ప్రచారం చేయడమూ, అవి మీరు నమ్మడమూ విచారకరం. నన్నయ్యగారూ, వేములవాడ భీమకవీ సమకాలికులు కారు. అదీగాక వేములవాడ అనేది ఇంటిపేరే తప్ప ఆయనది తెలంగాణ అనడానికి ఆధారం లేదు. ఆయన నన్నయ్యని కలిసినట్లు థర్డ్ పార్టీ చారిత్రిక ఆధారాలేవీ లేవు. ఆయన వ్రాసిన పుస్తకాలేవీ మిగల్లేదు. అయినా, ఈ ఆంధ్ర-తెలంగాణ భేదాలు పూర్తిగా ఇటీవలివే తప్ప వెయ్యేళ్ళనాడు ఇవి లేవు కదా ?
ReplyDeleteరెండోది - మన తెలుగుజాతికి గర్వకారణమైన పూర్వపురుషుల మీద బురద జల్లితే జాతికి వారసత్వం ఏం మిగుల్తుంది ? రేపు భవిష్యత్తులో ఎవరి పేరు చెప్పుకుని మనం ప్రపంచంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడాలి ? బురద జల్లాలని నిశ్చయించుకుంటే ఏదో ఒక కథ కట్టి ప్రతివారి మీదా ఇలాగే బురద జల్లొచ్చు. సంతోషించవచ్చు. మనం మన పూర్వీకుల మీద బురద జల్లితే మన మీద మన తరువాతివారు బురద జల్లుతారని మరువరాదు. వాస్తవానికి వీరేశలింగం మీద కూడా బురద జల్లారు జనం, ఆయన వితంతువుల్ని ఉద్ధరించబోతే, వాళ్ళతో ఆయనకు అక్రమ సంబంధాలున్నాయని ప్రచారం చేశారు. కానీ ఆయన నన్నయ మీద జల్లిన బురదని దృష్టిలో పెట్టుకుంటే ఆ లోకనింద ఆయన కర్మఫలమే అనిపిస్తుంది.
మూడోది - వీరేశలింగం పంతులు గారు ఇలాంటి పుక్కిటి పురాణాలు తన పుస్తకంలో చాలా వ్రాశాడు. వాటిల్లో పోతనకీ, శ్రీనాథుడికీ బావా-బావామరుదుల సంబంధాన్ని ఆపాదిస్తూ వ్రాసిన కథలలాంటివి కూడా ఉన్నాయి. వాస్తవమేంటంటే పోతనా, శ్రీనాథుడూ ఒకే కాలంవారు కారు. ఇద్దరికీ మధ్య కనీసం 50 సంవత్సరాల తేడా ఉందని చారిత్రికుల అభిప్రాయం.
మీరు వయసులో చిన్నవారు కావడం వల్ల ఉద్యమ ఆవేశంలో ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు కావచ్చు. కానీ ఒక పదిహేనూ-ఇరవయ్యేళ్ళ తరువాత మీరే బాధపడతారు, ఇలా వ్రాసినందుకు ! దొరికిన ప్రతి సమాచారాన్నీ కళ్ళకద్దుకొని విలువివ్వడం పరిణతి కాదు.
ఆలోచించండి.
11 va satabham lo jarigina charitraka vishyalaki(tappidaalaki) kuda telangaana vadam rangu pulamatam enthavaraku sababu. Nannaya eersha padindhi vemulavada kavi rachanai choosa prantanni choosa? saamandhra telangaana perlu appatiki puttanaina putti undauv.
ReplyDeleteనేను ప్రత్యేక తెలంగాణాకి అనుకూలమే కానీ అప్పట్లో సీమాంధ్ర, తెలంగాణా లాంటి పేర్లు ఉండేవంటే నమ్మలేను. ఒకప్పుడు కోస్తా ఆంధ్రకి వేంగినాడు అని పేరు ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఈ ప్రాంతం వేంగి చాళుక్యుల పాలనలో ఉండేది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని వైదిక బ్రాహ్మణులు ఇప్పటికీ తాము వేంగినాటి వైదిక బ్రాహ్మణులమని చెప్పుకుంటారు. రాయలసీమకి రాయలసీమ అని పేరు ఎలా వచ్చిందంటే ఒకప్పుడు కృష్ణా నదికి దక్షిణాన ఉన్న ప్రాంతాలు శ్రీ కృష్ణ దేవరాయుల పాలనలో ఉండేవి కాబట్టి. బ్రిటిష్‌వాళ్ళు అవిభక్త కడప జిల్లాని రాయలసీమ జిల్లా అని అనేవాళ్ళు. ఆ జిల్లా నుంచి కర్నూల్, బళ్ళారి, అనంతపురం జిల్లాలని విభజించినా విభజిత జిల్లాలని కూడా అదే పేరుతో పిలుస్తున్నారు.
ReplyDelete@Anonymous July 26, 2011 9:12 PM
ReplyDeleteThis is not about separate movement, but about Nannaya, and how he suppressed other poets
@Anonymous July 26, 2011 9:12 PM
మనకు నచ్చనివి ఎప్పుడూ పుక్కిటి పురాణాల్లానే అనిపిస్తాయండీ. సమకాలీనులు కాకపోతే ఆయన ఏ కాలం వాడో సెలవిస్తారా?
>>> మన తెలుగుజాతికి గర్వకారణమైన పూర్వపురుషుల మీద బురద జల్లితే జాతికి వారసత్వం ఏం మిగుల్తుంది?
అంటే వారేం చేసినా భజన చేయాలంటారు!
>>> రేపు భవిష్యత్తులో ఎవరి పేరు చెప్పుకుని మనం ప్రపంచంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడాలి?
అలాంటివారికేం కొదవ వుండదు లెండి. ఏదో పేరు చెప్పుకునేందుకు లోపాలు కప్పిపుచ్చుకోనవసరం లేదు.
>>> బురద జల్లాలని నిశ్చయించుకుంటే ఏదో ఒక కథ కట్టి ప్రతివారి మీదా ఇలాగే బురద జల్లొచ్చు. సంతోషించవచ్చు.
ఇది నేనో, సదరు వ్యాసరచయితో రాస్తే అలాగే అనుకో వచ్చు. వీరేశలింగం లాంటి ఒక మహాను భావుడు వ్రాశాడు మరి! అది కూడా చెప్పొద్దంటే ఎలా?
>>> వాస్తవానికి వీరేశలింగం మీద కూడా బురద జల్లారు జనం
ఖచ్చితంగా చల్లుతారు. ఆయన చల్లడానికి అవకాశం ఇస్తే. వీరేశలింఘం గారి మీద ఉన్న ఆరోపణలు నిజం కాదని మీ నమ్మకమా? లేక మీదగ్గర ఆధారాలున్నాయా?
@Anonymous July 26, 2011 9:36 PM
It is about the similarity that is shown. It is only to tell that things are not much changed from Nannaya's age and (pseudo)democracy of today.
Some of the comments from Anonymous bloggers are deleted as the are too obscene to publish.
ReplyDeleteఫ్రవీణ్ శర్మ గారు
ReplyDeleteమీరన్నట్టు అప్పట్లో అన్నీ వేరు వేరు దేశాలే. ఇది కేవలం నన్నయ ఒక కవిని అణచి వేసిన విధానాన్నే చూపెట్టడం జరిగింది. అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని చెప్పడమే ఉద్దేశ్యం.
guntur lo vunavaadu vijayawada vaadi ni mosam cheyadani ledu............warangal lo vunna vaadu Nijamabadh vaadi ni mosam cheyadanee ledu........individuals behaviour ni batti praanthaalaki aapdisthunbte...emi cheppaali.....
ReplyDeleteInthaki kandukoori gaaru ee vishyaanni chepaaru kaaabatti........vaaru telangana vaari ki anukoolam ani koodaa oka maata anukonte baagundiddemo........
Srikanth: well said. Unfortunately the pro-Nannaya gang is willing to sacrifice their other idol, Kandukuri.
ReplyDeletenannaya mavade vemulavada bheema kavi ma vade.. kandukuri ma vade vallantha telugu kavulu.. telangana kavulo seemandhra kavulo kadu.
ReplyDeleteహ హ హ దీనికీ తెలంగాణా రంగు పులిమారా?
ReplyDeleteవేములవాడ అనేది ఒక వంశం పేరండీ. ప్రాంతం పేరు కాదు. తెలుగువారిలో ఊరిపేర్లు ఇంటి పేర్లు గా ఉండటం మనకు తెలిసిందే. పోనీ వారి పూర్వీకులు వేములవాడ గ్రామానికి చెందిన వారు అనుకున్నా తూర్పుగోదావరి జిల్లాలో కూడా వేములవాడ పేరుతో ఒక గ్రామం ఉందన్న విషయం తెలుసుకోవాలి. ఇది ద్రాక్షారామం పక్కన ఉంది. అంతెందుకు స్వయంగా వేములవాడ భీమకవి తన గురించి పరిచయం చేసుకున్నట్టుగా చెప్పబడే ఈ పద్యం గురించి తెలుసుకోకుండా ఆయనేదో తెలంగాణా వాడని, ఆంధ్రోల్లు తోక్కేసారని విషం చిమ్మడం భావ్యం కాదు మిత్రమా. ఇదిగో వేములవాడ భీమ కవి పద్యం.
ఘనుడన్ వేముల వాడ వంశజుడ దాక్షారామ భీమేశ నం
దనుడన్ దివ్య విషామృత ప్రకట నానా కావ్యధుర్యుండ ,భీ
మన నా పేరు వినంగ జెప్పితి తెలుంగాధీశ ! కస్తూరికా
ఘనసారాది సుగంధ వస్తువులు వేగంబిచ్చి లాలింపురా !
ఇప్పుడు చెప్పండి ఆయనది ఏ వేములవాడో? ఆయన ఏ ప్రాంతం వాడో? ఇది మీకు వివరణ ఇవ్వడం కోసం చెప్పాను తప్ప మహాకవులకు కూడా ప్రాంతీయత అంటగట్టడం భావ్యం కాదు.
@SHANKAR.S
ReplyDeleteభీమకవి కరీంనగర్ వేములవాడకు చేందిన వాడనే ఇప్పటివరకు ప్రాచుర్యంలో వుంది.
పుట్టిన వూరి పేరు వంశం పేరు కావడం ఆకాలంలో మామూలు. బమ్మెర పోతన, తెనాలి రామలింగడు, పాల్కురికి సోమనాధుడు కొన్ని ఉదాహరణలు.
మీరు చెప్పిన చాటువులో కూడా ఆయన "దాక్షారామ భీమేశ నందనుడ" అని మాత్రమే చెప్పుకున్నాడు. "తిరుపతి వేంకటేశ నందనుడ" అన్నంత మాత్రాన ఉన్న ఊరు తిరుపతి ఐపోదు.
ఆ మధ్య బమ్మెర పోతన కూడా కడప వాడని ఎవరో అన్నారు. ఇలా చెప్పడం, తెలంగాణా ప్రాంతానికి చెందిన గొప్పవారు కూడా తమవారే అని చెప్పుకోవడమూ మామూలే.
శ్రీకాంతా చారి గారూ స్పందించినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం తెలంగాణా ప్రాంతం లో ఉన్న వేములవాడ కూడా సుప్రసిద్ధ శైవ క్షేత్రమే కదండీ. మీరు అన్నట్టు భీమ కవి ఆ ప్రాంతం వాడే అయితే తాను స్వయంగా అంతటి సుప్రసిద్ధ శైవ క్షేత్రంలో పుట్టి వేములవాడ రాజేశ్వర నందనుండ అని కాకుండా ఎక్కడో సుదూరంలో ఉన్న దాక్షారామం భీమేశ్వరుని ప్రస్తావన ఎందుకు తెచ్చాడంటారు? అంతెందుకు భీమన్న అన్న ఆయన పేరు తీసుకుందాం సాధారణం గా ఒక ప్రాంతంలో పుట్టిన వారికి ఆ ప్రాంతంలో సుప్రసిద్ధులైన దేవుళ్ళ పేర్లు కలిపి పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఉదాహరణకు "యాదగిరి" అన్న పేరు ఎక్కువగా తెలంగాణాలోనే వినిపిస్తుంది. అలాగే సింహాచలం, అప్పన్న అన్న పేరు ఉత్తరాంద్రలోనే వినిపిస్తుంది. అఫ్కోర్స్ కలియుగదైవం వేంకటేశ్వరుని పేరు ప్రాంతాలతో నిమిత్తం లేకుండా (కానీ నాకు తెలిసి తెలంగాణాలో ఆ పేరు కాస్త తక్కువనే చెప్పాలి) ఉన్నప్పటికీ అప్పట్లో పైన చెప్పిన పద్ధతులు పాటించేవారు అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది.
ReplyDelete"తెలంగాణా ప్రాంతానికి చెందిన గొప్పవారు కూడా తమవారే అని చెప్పుకోవడమూ మామూలే"
మీరే అన్నారుగా గొప్పవారు తమవారు అని చెప్పుకోవడం మామూలే అని. బహుశా వేములవాడ అన్న పేరు ఉన్నందున ఆయన్ని తమవాడని ఒక ప్రాంతం వారు చెప్పుకోవడం మామూలయిపోయిందేమో. తూర్పుగోదావరి జిల్లాలో వేములవాడ పేరు ఎక్కువమందికి తెలియకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు.
భీమకవి తెలంగాణోడు కాదు.మీరన్నట్లు అవుననుకుందాం.నన్నయ్య చించాడో లేదో కానీ,మోస్ట్ డెవలప్డ్ తెలంగాణా నుంచి భీమకవిగారు రాజమహేంద్రవరం రావడమెందుకో.
ReplyDeleteమీరు మొదటి అజ్ఞాతకి ఇచ్చిన సమాధానాలు చూశాను. ఈ కథ అంతా ఒక పెద్ద గాసిప్‌లా ఉంది. వీరేశలింగం వ్రాశాడన్నంతమాత్రాన దీనికి ఏ విధమైన అదనపు విశ్వసనీయతా ఉండకపోవచ్చు. ఎందుకంటే వీరేశలింగం గానీ, మనం గానీ వెయ్యేళ్ళ క్రితం లేము గనుక ! కళ్ళతో చూడలేదు గనుక ! ఈ కథ అంతకు ముందున్న ఏ పుస్తకంలోనూ ఏ కవీ పేర్కోలేదు గనుక ! వీరేశలింగం గారిక్కూడా దంతకథగా అందినదే.
ReplyDeleteMost probably, ఆనాటి వీరశైవులు నన్నయగారిని అపఖ్యాతిపాలు చేయడం కోసం అల్లిన గాథ అయ్యుంటుంది. ఎందుకంటే నన్నయగారి కాలంలో దేశమంతా వీరశైవ-వీరవైష్ణవ గొడవలు చాలా పెద్దస్థాయిలో ఉండేవి. నన్నయగారు వీరశైవుడూ కాడు. వీరవైష్ణవుడూ కాడు. ఆయన శివ-కేశవ అభేదవాది. ఇద్దరినీ పూజించేవాడు. అందుచేత ఆయన్ని దూషించడం అప్పటి మతోన్మాదులకు అవసరం కావచ్చు. శంకర్ గారన్నట్లు - వేములవాడ భీమకవి తెలంగాణవాడు కాదు. ఎందుకంటే ఆ పేరుతో ఒక ఊరు తూర్పుగోదావరిజిల్లాలో ఇప్పటికీ ఉన్నమాట వాస్తవమే. అయినా ఇంటిపేరుని బట్టి ఊరి పేరూ, ప్రాంతమూ నిర్ణయించలేం.
ఇంకో ముఖ్యమైన హాస్యాస్పద విషయమేంటంటే ఆదికవి కావడం కోసం నన్నయగారు భీమకవికి అన్యాయం చేశాడని ! అసలు తాను ఆదికవిని అని నన్నయగారు ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన కంటే ముందే తెలుగుకవిత్వం ఉంది. ఆ సంగతి ఆయనకూ తెలుసు. ఆయన నేర్చుకున్న తెలుగుకవిత్వం కూడా అలా తనకు పూర్వమున్న కవుల కృతుల్ని అధ్యయనం చేయడం ద్వారా అబ్బినదే అయ్యుంటుంది. అయితే అది వైదిక హిందూ కవిత్వం కాకపోవచ్చు. జైన-బౌద్ధ నాస్తిక కవిత్వం అయ్యుండవచ్చు. అందువల్లనే ఆయన దాని గురించి ప్రస్తావించి ఉండకపోవచ్చు. ఆయన కంటే ముందున్న పుస్తకాలు దొఱక్కపోవడం చేత మనమే ఆయనకు ఆదికవి అని బిరుదిచ్చాం. అందుచేత ఆ కీర్తిప్రలోభం ఆయనకుందని ఆరోపించడం తగదు,
మీ వాదన అంతా ఈ గాసిప్ యథార్థమనే అభిప్రాయం మీద బేస్ అయింది. వట్టి గాసిప్స్ ని నమ్మి జాతివైతాళికుల్ని అవమానించడం తగదు.
భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి
ReplyDeleteనట్టి రాఘవ పాండవీయంబు నడఁచె
ఛందమునడంప నీ ఫక్కి సంగ్రహించె
ననుచు భీమన మ్రుచ్చిలి నడఁచె దాని
ఆదిని భీమకవీంద్రుడు
గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున, నా
మీఁదట రాజనరేంద్ర
క్ష్మాదయితుని పట్టి దాని మహి వెలయించెన్
ఇది వీరేశలింగం గారు వ్రాసిన దానికి ఆధారం. దీన్ని వ్రాసింది అప్పకవి. భీమకవి రాఘవ పాండవీయం వ్రాసినట్టు పింగళి సూరన కూడా పేర్కొన్నాడు. ఒక గాసిప్ ఇంతమంది ప్రచారం చేయరు గదా!
ఇక పోతే నేను ఇది ఇప్పుడు జరుగుతున్న దానికి ఒక similarity గానే పేర్కొన్నాను.
మీరు ఉటంకించిన పద్యాల్లో నన్నయ ప్రస్తావన లేదు. భీమనే వాటిని గోదావరిలో కలిపినట్లుంది.
ReplyDeleteraasukondi sir...mee istam charitre kada evaru chuda vachhaaru...varthamaanam lo jarugutunna daanne kandinche saahasam evaru cheyatla..ika eppudo jariginadanini emi kandistaaru ?? oka kutumbam nundi chedda vaadu vaste ika tara taraalaku aa kutumbam valle chedda vaalle avutaara ? entha haasyaaspadam gaa undandi mee vaadana ? vetikithe ilaanti pidi vaadaalu ennina dorakochhu..meeru cheppindi nijam telangana kaavalisinde..intha gaa manasulu,manushulu veru ipoyaaka bowtikamgaa kalisunna upayogam emundi..idi maa charitra garvam gaa cheppukovalasina telugode aa charitra ki vakra bhaashyaalu cheptunte evarina emi cheyagalaru..potti sriramulu kooda tinnadi arakka ajeerthi chesi chanipoyaadu ani cheppe rojulu kooda vastaayo...so ivi anni manasulo pettukone aa naadu tank band meeda dhvamsa rachana jarigindani anukovalasi vastundi emo ??? meeru chesedi siddantaala kosam poraatamaa ?? leka leni poni raadaantaalu srustinchatanikaa ??
ReplyDelete@Anonymous July 27, 2011 5:57 AM
ReplyDeleteమీకు అలా అనిపించిందా? మరొక్క సారి చదవండి. కాకపోతే నన్నయ అనే పదం మాత్రం లేదు, దాని ముందు పద్యంలో వుంటుందది.
మామూలు గా ఏ బలమైన పాయింటు లేకుండానే వితండ వాదం (సమైక్య వాదం) చేసే వాళ్ళు ఏదో ఒక్క గొప్ప పాయింట్ దొరికిందని తెగ ఎటాక్ చేస్తున్నారు భలే భలే , ఊహించిందే !!
ReplyDeleteశ్రీకాంత్ గారు ఇవన్నీ మాములే , ఇంకా ఇలాంటి వివాదాత్మక వ్యాసాలు కూడా వ్రాయండి. కనీసం కాస్త తెలివైన బ్లాగర్ల వివరణలు కూడా చూడొచ్చు .
Hi srikanth chari,
ReplyDeleteBelow is copy paste from a review of ANDHRA MAHABHARATAMU about nannaya and bhimakavi. From this the author says that even vireshalingam panthulu felt wrong about nannaya at a later stage. Since, we do not anything about the details, its better to stop insulting nannaya who is great poet and developed telugu vocabulary.
There has been much speculation why Nannaya laid down his stylus abruptly. At this point
he was writing a highly poetic description of the autumnal season, during the peregrinations of the Pandavas in the forest. There is more than one conjecture. The modern critics attribute it to the untimely death of Nannaya. Some think that it might be attributed to the dislocation caused in the Eastern Chalukya
Kingdom of Rajahmundry by one of the many political misfortunes of King Rajarajanarendra, the patron of Nannaya.
However, the earlier generations of Andhras were not satisfied with such prosaic causes. They invented a good story for themselves and faithfully believed it. The story goes -that
Nannaya had a rival to him in poet Vemulavada Bhimakavi. This Bhima Kavi is a terrible person who could make and unmake the fortunes of persons including kings by his power to bless or curse. A book on prosody 'Kavi Janasraya' is attributed to him. He is also credited with the authorship of 'Raghava Pandaviya' a Kavya with double meaning, yielding the story of Ramayana
and Mahabharata alternatively. Though Kavi Janasraya survives to this day the authorship being disputed Raghava Pandaviya was irrevocably lost. Even in the 16th Century it was not to be traced, for poet Pingali Surana states categorically that no one knew it. The extent Raghava Pandaviya of Telugu is from the pen of Pingali Surana.
Vemulavada Bhima Kavi suspected that Nannaya stood in the way of his (Bhimana's) obtaining the patronage of King Rajarajanarendra, Nannaya is credited with writing a grammar for
Telugu in the Sanskrit language - the Andhra Sabda Cintaraani. Bhimakavi accused Nannaya of composing a grammar in order to suppress his book on prosody. He thought that in order to under mine his Raghava Pandaviya, Nannaya launched upon the scheme of writing Mahabharata. So he became highly irritated. At
this time Nannaya was composing Aranya Parva. Bhimakavi, knowing of this, cursed Nannaya that he may be in the wilderness for ever. The great Nannaya died of this curse, people believed.
This story led to strange cbhciiisicms. Rao Bahadur K. Veeresalingam Pantulu, author of Andhra Kavula Charitra at first gave credit to this story and wrote that 'Nannaya appears
to be a jealous poet'. Later on, after further evidence was available, Veeresalingam Pantulu revised his estimate of the character of Nannaya. The poet ef Rajarajanarendra was a truly pious and generous soul. He did not receive any gifts of villages from his King which he could easily have done, if he desired to benefit himself. On the other hand he induced his king to reward Narayana Bhattu his (Nannaya's) friend, classmate and bulwark in the difficult task of shaping the Andhra Mahabharata. Rajaraja presented the village of Nandampudi to Narayana Bhattu in token
of his great erudition. The text of this inscription Avas composed by Nannaya himself. In this way the ' charge of Nannaya
jealousy towards contemporary poets falls to the ground. &Tot ; only this. It was proved by otjaer evidence that Vemulayada Bhima Kayi was not , contemporary of Nannaya. Veeresalingam
puts Jiipi in the early 14th century. Others may bring him a little nearer to Nannaya. At any rate he belongs to a period sufficiently far from Naiinaya to be able to curse him or
Jsless hipi. Thus the character of the first great poet of Telugu is well vindicated. Apart from his genius in poetry, high and
piellow scholarship, Nannaya Bhattu is according to his own testimony a 'Sujana' a virtuous and decent man.
శ్రీకాంత చారి గారూ మీరు చెప్పిన పద్యం లో అజ్ఞాత అనుకున్న అర్ధమే వస్తోందండీ. ముఖ్యంగా
ReplyDelete"ఆదిని భీమకవీంద్రుడు
గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున"
ఈ లైన్ లో భీమ కవి మీద నెగెటివ్ ఫీల్ స్పష్టంగా వస్తోంది.మీరే ఒక సారి ఈ పద్యాన్ని ఆసాంతం చదవండి. అలా అనిపించడానికి ఆస్కారం ఉందా లేదా అని ఆలోచించండి. వీలయితే ముందు పద్యం కూడా ఇస్తే అర్ధం చేస్కొడానికి అనువుగా ఉంటుంది.
ఆ పద్యం అప్పకవి రాయడంలో కూడా అసలు వుద్దేశ్యం నన్నయను పొగడ్డమే.
ReplyDeleteపూర్తి వివరాలకు ఇక్కడ చూడొచ్చు.
తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామమునకు 12 కిలోమీటర్ల దూరాన వేములవాడ అనే గ్రామము ఉంది. ఆ గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడుండెను. ఎంతకాలానికీ ఇతనికి సంతానము కలుగలేదు. సంతానము కోసం ఇతను ఐదుగురిని పెళ్ళాడాడు. శివభక్తిపరాయణుడై యజ్ఞయాగాలను చేస్తూ, ఎన్నో విధాలుగా పరమేశ్వరున్ని ఆరాధించాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. అయినా పుత్రలేమి బాధ మాత్రం తప్పలేదు ఇతనికి. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాటిరాత్రి పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ మరణం తర్వాత నీకు పుత్రుడు కలుగుతాడు. అతని వల్ల నీకు పుణ్యలోకసిద్ధి కలుగుతుంది” అని చెప్పాడు. ఆనాటి నుంచి దిగులు మానేసి, సంతోషంగా కాలం గడిపి మరణించాడు. ఇతని ఐదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. అమాయకురాలు. నిష్కల్మషమైన మనసు కలది, భర్తలాగా పరమేశ్వరుని మీద అపారమైన భక్తి కలది.
ReplyDeletefor more story: http://shribheemalingeswaraswamy.blogspot.in/