Thursday, July 7, 2011

తెలుగుదేశం డ్రామా మళ్ళీ మొదలైంది

ఇక్కడ మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉధ్రుతం ఐంది. అందరూ రాజీనామా చేసి ఒక సంక్షోభం స్రుష్టించడం తో ఎక్కడ తెలంగాణా ఇచ్చేస్తారో అని భయపడ్డ చంద్రబాబు సీమాంధ్ర తెలుగుదేశం నాయకులను ఎగదోసి మళ్ళా అక్కడ క్రుత్రిమ ఉద్యమాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

తెలంగాణా పై తీర్మానం పెట్టితే సీమాంధ్ర నాయకులతోటి కూడ అనుకూలంగా ఓటు వేపిస్తామన్న తెలంగాణా తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఏమీ మాట్లడటం లేదు.

చంద్రబాబు ఏమీ చెప్పకుండ ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీకి సమస్యను నాంచే అవకాశం ఉంటుంది. ఇంత చిన్న విషయం కూడ అర్థం కావడం లేదు తెలంగాణ నాయకులకు. ఎంతసేపూ కాంగ్రెస్ తో పోల్చుకుంటారుగానీ ఒక ముఖ్యమైన తేడా వీళ్ళకు కనపడటం లేదు. కాంగ్రెస్ వాళ్ళు తమ అధిస్టానం తో పోరాడుతున్నారు. వీళ్ళు మాత్రం గుడ్డిగా చంద్రబాబును సపోర్ట్ చేస్తూ రాజకీయంగా తమ గొయ్యి తామే త్రవ్వుకుంటున్నారు. చంద్రబాబు పేరు చెపితేనే తెలంగాణా ప్రజలకు వంటికి కారం పూసుకున్నట్టు ఉంటుందని వీళ్ళకు ఇంకా అర్థం కాకపొడం విచిత్రమే.

8 comments:

  1. chandrababu ok anagane congress telanga ichestunda.. istamani prakatinchara?? ee desanni chandrababu palistunnada leka soniyamma?

    ReplyDelete
  2. Grow up man! TDP is not in power. It is Congress which need to make a call on Telangana and implement its decision. Congress will take a decision if it benefits them politically.

    ReplyDelete
  3. Yes, TDP is not in power. But it needs to clarify its stand. One way the T-TDP leaders say it is pro-telangana and the seemandhra people say otherwise. We are opposing this very strategy of confusing people by CBN.

    ReplyDelete
  4. సారీ. నా పోస్ట్ లో ఒక సవరణ అవసరమని ఇప్పుడు అనిపిస్తూంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు అనుకూలమని నా ఉద్దేశ్యం కాదు. తెలంగాణాపై ఒక నిర్ణయం ప్రకటించడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. దాని పొలిటికల్ కంపల్షన్స్ అటువంటివి. ఇప్పుదు తెలంగాణా నాయకులు, ప్రజలు చేయవలసింది కాంగ్రెస్ అధిష్టానం పై వత్తిడి మరింత పెంచడమే. ప్రజలు ఉద్యమిస్తూ అదేపని చేస్తున్నారు. తెలంగాణా కాంగ్రెస్ వాళ్ళూ తమ అధిష్టానం పై రాజీనామాల ద్వారా వత్తిడి తెస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణా నాయకులు కూడా తమ నాయకుడిపై వత్తిడి తేవడం ద్వారా ఒక నిర్ణయం ప్రకటింప చేస్తే, అది కాంగ్రెస్ పై మరింత వత్తిడి కలుగ చేస్తుంది. ఇక్కడ తెలుగుదేశం నాయకులు విభిన్నమైన పాత్ర పోషించాల్సిన అవసరముంది.

    ReplyDelete
  5. The propaganda which the "yellow fever" guys are trying to spread is totally farcical.

    The party passed a resolution in favor of Telangana and included it in their manifesto. If they stuck to their stand on December 10, the proposed assembly resolution would have passed. Instead, the cunning fox made his SA guys to join the artificia "udyamam" just to derail Telangana.

    Sonia may not be totally supporting Telangana but atleast she is not behind Lagadapati & co.

    ReplyDelete
  6. Simple logic. Chandrababu is a Seemandhra guy. How can he be different from Payyavula Keshav and Kodela sivaprasad?
    How absurd it is that he leads the party leaders in both the movements which are totally against each other? Seems Telangana issue is just like a chess game to him.
    It's shameful on the part of Telangana telugudesham leaders to back him up and seek his permission to take part in the movement.

    ReplyDelete
  7. There is no way cong gives telangana as long as they think KCR will dominate them in elections...the less noise he makes...more the chances...very very basic politics..

    ReplyDelete
  8. No. The moment TRS becomes silent, Both congress and TDP will close telangaana for ever. Its just a political compulsion that both these parties are now talking about telangaana.
    If congress is really serious about telangaane and if it is only concerned about political advantage to TRS, why didn't it give telangaana before 2001 when there had been demand several times for telangaana between 1969 and 2001. And why didn't it give telangaana between 2004 and 2009 when the situation was cool all over?

    ReplyDelete