Saturday, July 30, 2011

కిరాయి దారుగ వచ్చి ఇల్లే నాదంటున్నవు

నిరంకుశ నవాబును 
ఎదిరించి నిలిచినం
రాక్షస రజాకార్లను 
రణం జేసి గెలిచినం

సాయుధ పోరాటం జేసి
స్వాతంత్ర్యం సాధించినం
 స్వంత రాజధాని తోటి
దర్జాగా బతికినం

అప్పుడొచ్చినావు నువ్వు
అరవులతో పోరుజేసి
చెన్నపురిని కోలుపోయి
సొంత రాజధాని లేక 
టెంటులల్ల నీల్గలేక

సాటి తెలుగు వాడివని
తీయటి మాటలు నమ్మి
దరికి చేర దీసినం
భాగ్యనగర సీమలోన 
చోటు ఇచ్చి పిలిచినం

చుట్టం సూపుగా వచ్చి
భాగస్వామిగా మారి
కళ్ళు తెరిచే లోపుగా 
ఇల్లును నువ్వు కాజేసి 
నాయింట్లో నన్నే ఒక 
కాందిశీకునిగ మార్చి 
బయటికి గెంటేసినావు

మంచిది భాయీ నువ్వు 
నా కళ్ళను తెరిపించినావు 
నీకు నాకు కుదరదింక 
వేరు బతుకు బతుకుదాం 

అన్నానో లేదో మరి 
గగ్గోలుగా అరిచినావు
హైదరాబాదే నాదని 
మొండి కూత కూసినావు

కిరాయి దారుగ  వచ్చి
ఊరు నాది అన్నట్టు 
నా ఊరును వాడుకొని 
ఆస్తులు సంపాదించి 
విడిపోయే రోజోస్తే 
ఇల్లే నాదంటున్నవు

ఇప్పటికైనా భాయీ 
యదార్థాన్ని గుర్తెరుగు 
విచక్షణను మరిచిపోయి
వివాదాలు పెంచబోకు

1 comment:

  1. HI
    అంత బావుంది బాసు మనం ప్రతి 5 సంవస్తరలకు Elections పెత్తి బొలెదు Kotlu కర్చు పెత్తి MLA లను MP లను ఎన్నుకుంతం కద.
    మరి తెలంగన విషయం లొ కూద వొతింగ్ పెత్తమని అదగొచుగ మీరు (మెము కూద) అది మానెసి బందు లంతం రస్త రొకొలు అంతం సకలజన సమ్మెలంతం రైల్ రొకొలు అంతం బస్సు రొకొలు అంతం మన ఆస్తులను మనమె తగలబెత్తు కుంతం .ఆత్మ హత్యలు చెసుకుంతం
    దరిద్రపు ఎదవలు అందరుకలిసి సమైక్యంద్ర AND టెలంగన ఉద్యమల్లొ ఉన్నతున్నరు ఒక్కదు logical గ ఆలొచించదు.
    ఎమొ వాల్లకు ఎమైన స్వప్రయొజనలు ఉన్నయెమొ తెలియదు బాసు తెలంగన ఇవ్వలొ వద్దొ Election పెత్తమను.
    టెలంగన ఒక్కదంత్లొనె Election పెదితె 80% మంది తెలంగన కావలంతె ఇచెయ్యమని అందరు పొరదదం
    మొత్తం అంద్రప్రదెష్ లొ అయితె 60% ఒప్పుకుంతె తెలంగన ఇవ్వమని పొరదదం అంతెకాని మన ఆస్తులను మనమె పాదు చెసుకొవదమొ లెక మన సొదరులను (సీమంద్ర OR టెలంగన) మనమె కొత్తుకొవదమొ మూర్కత్వం ల లెదు
    ఇంక 80% మీద నీకు doubt రవొచు కాని అది correct ఎందుకంతె మల్లి మర్చుకొలెని నిర్నయం కాబత్తి.అందరు
    బాసు ఇకనైన లొగిచల్ గ aalochiddam.

    ReplyDelete