- అక్కడ విద్యార్థుల స్పందన నామమాత్రం
- విభజనతో తేడా ఉండదనే అభిప్రాయం
- ఉద్యమాల తీరుపై ‘తెహెల్కా’ ప్రత్యేక కథనం
తెలంగాణ ఉద్యమం కోసం ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు తెగించి కొట్లాడుతున్నారు. దశాబ్దాల దోపిడీ, ఆధిపత్యం నుంచి విముక్తి కావాలని ఆరాటపడుతున్నారు. ఈ ఉద్యమంలో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిక్కచ్చిగా విప్లవిస్తున్నది విద్యార్థి లోకం. మిలిటెంట్ పోరాటస్ఫూర్తితో ముందుకురుకుతున్నది. పోరాడితే పోయేదేమీలేదు పీడన, వివక్ష తప్ప అని లోకానికి ఎలుగెత్తి చాటుతోంది. ఔను.. విద్యార్థులకిది జీవన్మరణ పోరాటం. తెలంగాణలోని విద్యార్థులంతా మన రాష్ట్రం - మన పాలన కోసం విరామం లేకుండా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పుడొక్కటే లక్ష్యం.. జై తెలంగాణ! ఇది ఇక్కడి.. తెలంగాణ విద్యార్థి పరిస్థితి. మరి.. అటుపక్క.. సమైక్య వుద్యమంలో ఏం జరుగుతోంది?.. అక్కడి విద్యార్థులు కూడా ఇక్కడి విద్యార్థులలాగే ఉద్యమిస్తున్నారా?.. సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగాలని కోరుకుంటున్నారా?.. తెలంగాణ వేరైతే ఏవో ఉపద్రవాలు జరిగిపోతాయని ఆందోళన చెందుతున్నారా, దానివల్ల నష్టమేమీ ఉండదు, ఉద్యమాలు అనవసరమని అనాసక్తి ప్రదర్శిస్తున్నారా?.. ప్రముఖ ఆంగ్ల వారపపత్రిక ‘తెహెల్కా’ ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించి విశ్లేషించింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆకాంక్ష బలంగా ప్రస్ఫుటమవుతుంటే సమైక్యాంధ్ర ఆందోళనలో అలాంటిదేమీలేదని తెహెల్కా ప్రతినిధి సాయి మనిష్ తాజా సంచికలో (జూలై 23, 2011) అభివూపాయపడ్డారు. తెహెల్కా సౌజన్యంతో ఆ కథనాన్ని ప్రచురిస్తున్నాం.
తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన జానా బాయ్ అనే ఓ గిరిజన బాలిక తనను తాను కాల్చుకుంది. 80 శాతం కాలిన గాయాలయ్యాయి. అదే విధంగా, మెహిదీపట్నానికి చెందిన 19ఏళ్ల అరిగె సరిత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ముఖ్యమంత్రి రోశయ్య, చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని తన ఆత్మహత్య నోట్‌లో నిందించింది. తెలంగాణ ఉద్యమ నిజమైన సారథులు విద్యార్థులేననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇంతటి విద్యార్థి శక్తి కనిపించదు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో తెలంగాణ ఆందోళనకు వ్యతిరేకత నామమాత్రమే. కిందటివారం సమైక్యాంధ్ర సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాజకీయ కారణంతో కాకుండా క్యాంపస్‌కు సంబంధించిన సమస్యలపై నిరసన అది. ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన 250 ఎకరాల భూమిని ప్రైవేటు డెవలపర్లకు అమ్మడాన్ని వారు వ్యతిరేకించారు.
పదవీకాలం ముగిసిపోయిన మాజీ వైస్ చాన్స్‌లర్ బంగళాను ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడే.. తమ ఫీజుల మొత్తాన్ని తమకు తిరిగి చెల్లించాలంటూ 15 మంది ఓబీసీ విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ ముందు నినాదాలు చేశారు. ‘‘సమైక్యాంధ్ర ఆందోళనలో మేము తర్వాత చేరతాం. ఇప్పుడైతే నా ఫీజు నాకు తిరిగి ఇవ్వాలి’’ అని నర్సీపట్నానికి చెందిన జగదీష్ అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో, తెలంగాణవ్యాప్తంగా నిరసనలు ఊహించని స్థాయిలో ఊపందుకుంటుంటే,సమైక్య వాదులు దానికి వ్యతిరేకంగా గొంతు వినిపించేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా సఫలం కావడంలేదు. తెలంగాణ ఉద్యమాన్ని తిప్పికొట్టడంలో, అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ఆంధ్రా విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నారనడానికి మరో దృష్టాంతం రిటైర్డ్ ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ జాకబ్ శాస్త్రి నిర్వహించిన కార్యక్షికమం.

సమైక్యాంధ్ర కోసం కొందరు విద్యార్థులు తప్ప వేరే గళాలే వినిపించడం లేదనే అభివూపాయంతో భావసారూప్యమున్న అధ్యాపకులతో కలిసి ఆయన సమైక్యాంధ్ర ఫోరమ్ ఏర్పాటు చేశారు. ఒకరోజు ఆయన నిర్వహించిన కార్యక్షికమానికి బస్సు నిండా అధ్యాపకులొచ్చారుగానీ, ఒకరిద్దరు విద్యార్థులు కూడా అందులో పాలుపంచుకోలేదు. సమైక్యాంధ్ర కోసం పకడ్బందీగా బంద్‌లు నిర్వహించాలనుకున్నా ఆ ప్రయత్నాలకూ సీమాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి పేలవమైన ప్రతిస్పందనే వచ్చింది. జూలై 8న గుంటూరుకు సమీపంలోని ఒంగోలులో గుప్పెడు మంది విద్యార్థులే ప్రదర్శన నిర్వహించారు. అదే రోజున గుంటూరులో సమైక్య ఆంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన బంద్ పిలుపును ఎవరూ పట్టించుకోలేదు. విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు తెరిచే ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌కు ఆంధ్రలో ప్రత్యామ్నాయ రాజధాని నగరంగా పేర్కొనే గుంటూరు నగరంలో పరిస్థితి ఇది.
సమైక్యాంధ్ర ఉద్యమం అనేది స్వార్థపర రాజకీయ శక్తులకు ఆటస్థలంగా మారినట్టు కనిపిస్తోంది. అట్టడుగున మారుమూలల నుంచి బలంగా పెంపొందిన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలవడం అయ్యేపనికాదు. ‘‘లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, జేసీ దివాకర్‌డ్డి లాంటి రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించడానికి ఇక్కడ ఆందోళనలను రేకెత్తిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రానికి మేము వ్యతిరేకమైనప్పటికీ, ఇలాంటి ఆందోళనలు పెద్దగా ఫలితమిచ్చి ఉపయోగపడేవి కావు. అందుకోసం మా అవకాశాలను పోగొట్టుకోవడంలో ఔచిత్యం లేదు’’ అని ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి భాస్కర్ ముద్దా అభిప్రాయపడ్డాడు.ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఉద్యోగావకాశాలను పొందడంలో ముందుంటారు.
వివిధ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఎక్కువ సంఖ్యలో చేరుతుంటారు. సముచిత విద్యా, ఉద్యోగ అవకాశాల దృష్ట్యా వారికి ఆందోళనల్లో పాల్గొనాల్సిన అవసరం కనిపించడం లేదు. సామాజిక శాస్త్రవేత్త సి.లక్ష్మణన్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘సుఖ సంతోషాలతో విలసిల్లే అవకాశాలున్నప్పుడు ఉద్రిక్తతలను రేకెత్తించడంగానీ, ఒక రాజకీయ కారణం కోసం యువతను సమీకరించడంగానీ కష్టతరం- అదెంతటి గొప్పదైనా సరే. విభజన అనేది వారికి పెద్ద తేడాగా ఏమీ అనిపించదు’’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. భవిష్యత్తు ఆందోళనకరమై, వర్తమానంలో వివక్షకు గురయ్యే యువతరం ప్రవర్తనా వేరే విధంగా ఉంటుంది.
వరంగల్‌లో ఓ విద్యార్థి కసితో రాయి విసురుతాడు. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోనూ అలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. ఈ ఆందోళనల్లో చాలామంది ఆర్ట్స్ విద్యార్థులే ఉంటారనుకుంటారు. కానీ, 28 ఏళ్ల వెంకట్ రాథోడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి. లెక్చరర్ ఉద్యోగం కోసం చైతన్య కళాశాలకు వెళితే, వరంగల్‌కు చెందిన వాడినని తెలియగానే జీతం, పని విషయంలో తేడా చూపారని తెలిపాడు. తరగతి గదుల శుభ్రతను కూడా పర్యవేక్షించాలని చెప్పారు. రూ.6వేల జీతానికి రోజుకు 12 గంటలు పనిచేయాల్సి వచ్చింది. ఒకరోజు దానికి వీడ్కోలు పలికి తెలంగాణ ఉద్యమంలో చేరిపోయాడు. మీడియా రంగంలోనూ ఇలాంటి వివక్షే ఉందని జయప్రకాశ్ చెప్పాడు. తెలంగాణ విద్యార్థులు ప్రాంతం ప్రాతిపదికన కొనసాగుతున్న వ్యవస్థాపరమైన వివక్షకు వ్యతిరేకంగా మండిపడుతున్నారు. ఈ పోరాటం తీరే వేరు. మరోవైపు కరంటు షాకులిస్తే శవం మళ్ళీ ఊపిరి పోసుకుంటుందేమో అన్నట్టుగా ఉంది సమైక్యాంధ్ర ఉద్యమం పరిస్థితి. తెలంగాణ విద్యార్థులు ఉద్యమాగ్నికి ఇంధనమవుతున్నారు. దశాబ్దాలుగా కాగడాలుగా వెలుగుతున్నారు.
Curtesy: Namsthe Telangana

Hi,
ReplyDeleteWhy noone is talking about Khammam dist?
" ప్రముఖ ఆంగ్ల వారపవూతిక ‘తెహెల్కా’ ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించి విశ్లేషించింది. "
ReplyDeleteఇదే పత్రిక పొరపాటున తెలంగాణా ఉద్యమం గురించి ఇలాగే రాస్తే మాత్రం అప్పుడు అనామక పత్రిక కారుకూతలు అని కొట్టి పారేస్తారు కదూ. పత్రికలూ పొరపాట్లు చేస్తాయి బ్రదర్. ఉన్మాదాన్ని ఉద్యమంగా పొరపాటు పడే అవకాశం ఉంది. తెలుసుకోండి.
@Anonymous
ReplyDeleteపత్రికల సంగతేమో కానీ తమలాంటి వారికి మాత్రం ప్రజా ఉద్యమాలకి, పెత్తందారీ భాషోన్మాద మిథ్యమాలకు తేడా తెలియడం లేదు.
"thehalka" paper emina neethi., nijaayitheeki prathiruupama...
ReplyDelete*** this is favour of U, so U prise that paper..if that paper wrote unite andhara favour ..what do u say...
Expected answer from you Andheras...
ReplyDelete"Andheras" Lolzzzz
ReplyDeleteభారతీయ జనత పార్టీ కాంగ్రెస్ ను అధికారంనుండి దించి తను అదికారం పొందడమే ధేయ్యంగా పెట్టుకొన్నది గాని ప్రజల గురించి ఆలోచించడం లేదు. తను అధికారంలో లేము కదా ఏమిచేసిన జరుగుతుంది అనుకుంటే పొరపాటే. తెలంగాణా విషయంలో తమ ఆలోచన మార్చుకోవాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుండే గాదు దేశం నుండి కూడా దూరం కావలిసిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
ReplyDelete