Saturday, July 28, 2012

అయ్యా కేసీయారూ!


నువ్వు తెలంగాణా వాదానికి పర్యాయ పదంగా మారిపోయినవు. తెలంగాణా ప్రజలు నీ మీదనే కొండంత ఆశలు పెట్టుకున్నరు. నువ్వేమో ఆర్నెల్ల కొక్కసారి డిల్లీ నుంచి ఎవ్వో సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట కాలం ఎల్లదీస్తున్నవు. ఎప్పుడు గూడ సిగ్నల్సు వచ్చుడే గని తెలంగాణా మటుకు వస్తలేదు.

పదకొండేండ్ల నుంచి ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టే పైకెక్కించినవు. ఇప్పుడు తెలంగాణా వచ్చుడు మీద తెలంగాణా వాదులకే  కాదు, కరడుగట్టిన సమైక్యవాదులకు కూడా అనుమానం లేకుండ చేసినవు. తెలంగాణా గ్రామ గ్రామాన ఉన్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం చూపెడుతున్న అలసత్వాన్నికి అగ్గిమీద గుగ్గిలం లెక్క ఉడికి పోతున్నరు. అవకాశం వచ్చినప్పుడు తడాక సూపిస్తందుకు సిద్ధంగనే ఉన్నరు.

పదకొండేండ్ల కింద మనసుల ఎంత కోరిక వున్నా తెలంగాణా వచ్చుడు మీద ఎవరికీ ఆశ లేకుండే. కాని ఇప్పుడు అట్లా గాదు. తెలంగాణాల వున్నా పసిబిడ్డ కూడ తెలంగాణా రాష్ట్రం రాదంటే ఒప్పుకొని పరిస్థితి. పైపైన మండే మంటలు సల్లబడుతయెమో కాని ప్రజలకు తెలంగాణ పైనవున్న ఆకాంక్షలు పైపై మంటలు కావు. అవి తెలంగాణ వచ్చుడు దాంక సల్లబడవు.

ఇప్పుడు తెలంగాణా పోరాటం మీద నీకున్న నిబద్ధతను కొత్తగ చాటుకునే అవుసరం లేదు. నువ్వుగాని, నువ్వు నాయకత్వం వహిస్తున్న పార్టీగాని తెలంగాణ కోసం తప్ప ఇంకోదానికి పని చేస్తున్నయంటే ఆంధ్రల కూడ ఎవ్వడు నమ్మడు. అందుకే కొంత మందికి నీమీద అంత కోపం. బయటికి తెలంగాణ వాదం మాట్లాడుతూ చెంద్రబాబు ముందు తెలంగాణ పదం ఎత్తేతందుకు లాగు తడుపుకునే తెలుగుదేశం వాళ్ళు కాని, తామే పెద్ద తెలంగాణా వాదులమని చెప్పుకుంట, సోనియా గాంధీ దగ్గెర బిక్క మొకం పెట్టే  కాంగ్రేసు వాళ్ళు కాని, వీళ్ళ అసలు రంగులు జనానికి పూర్తిగా తెలిసి పోయినై.

TRS తప్ప ఒక్క రాజకీయ పార్టీ గాని , ఆ పార్టీలకు చెందిన ఒక్క రాజకీయ నాయకుడు గాని, ఇంతవరకు తెలంగాణా వాదాన్ని తమ సొంత అవసరాలకు వాడుకోవడం తప్ప తెలంగాణా ప్రజల కోరికల మేరకు నిలబడ్డ పాపాన పోలేదు.

తుపాకి గొట్టాన్ని అడ్డం పెట్టుకొని అట్టహాసంగా సాగిన విజయలక్ష్మి దీక్ష యాత్ర కేవలం తెలంగాణ మీదికి దండయాత్ర మాత్రమే. ప్రజలు అది గమనించ లేనంత తెలివి తక్కువ వాళ్ళు కారు. ప్రజలు ఈరకంగా తెలివి మీరుడుకు కూడా కారణం వేరొకటి కాదు, నువ్వే! ఇప్పుడు ప్రజలు తెలివిన పడ్డరు. నీ పుణ్యమా అని తెలంగాణ కోసం పోరాడేది ఎవడో, వంచన చేసుకుంట బతికేది ఎవడో, ప్రజలకు తెలుస్తనే వుంటది.

ఇప్పుడు నువ్వు కొత్తగ సిగ్నల్సు ఉన్నయి. తెలంగాణ ఇగ వస్తుంది, ఆగ వస్తుంది అని చెప్పుడు అవసరమా? సిగ్నల్సు వచ్చినా రాకపోయినా ప్రజలు పోరాటం ఆపరు, నిన్ను ఆపనియ్యరు.

నిజంగనే సిగ్నల్సు వచ్చినయా, వస్తే రానియ్యి. నీ మనసులనే పెట్టుకో. ఒకవైపు సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట ఇంకొక వైపు పోరాటం ఎట్ల చెయ్యమంటవు? గట్లనే సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట, అవి ఇచ్చే కాంగ్రేసు పార్టీని ఎట్ల తూర్పార బడుతవు? దానికి వ్యతిరేకంగ పోరాటాలు ఎట్లా చేస్తవు? ఎందుకో ఈ విషయంల నీ వ్యూహాలు సరిగ్గ వున్నట్టు అనిపిస్త లేదు. జర ఆలోచించు.

అసలు సిగ్నల్సే వస్తలేవా? అది ఇంకా ఘోరమైన పరిస్థితి! లేని సిగ్నల్సు వస్తున్నయని చెప్పవడితే, కొంత కాలానికి అది 'నాయనా పులివచ్చే' అన్న సామెత అయి కూసుంటది. అబద్ధమని తెలిసినంక ప్రజలు ఎంతకాలం నమ్ముతరు? ప్రజలకు నీ మాటల మీదనే నమ్మకం పోతది. అట్ల నమ్మకం పోయేటందుకు ఆంధ్ర మీడియా శాయశక్తుల ప్రయత్నం జేస్తది. గది మరిచి పోకు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఏర్పడుతదనే సిగ్నల్ పదేండ్ల కిందనే వచ్చింది. అందుకనే ప్రజలు నీకు మద్దతు పలుకుతున్నరు. ఆ సిగ్నల్ మరేదో కాదు, నువ్వే. నీ నాయకత్వం మీద జనానికి నమ్మకం వుంది. తెలంగాణ వచ్చేదాంక ఆ నాయకత్వం కింద పోరాటం చేస్తమని, తెలంగాణ సాధించుకుంట మన్న నమ్మకం వాల్లకుంది. వాల్లకు వేరే సిగ్నల్సు అవసరం లేదు. సజ్జాలని కాంగ్రెస్ పార్టీయో , కేంద్ర ప్రభుత్వమో ఇచ్చే సిగ్నల్సు అసలు అవసరం లేదు. 

పెట్టుబడిదార్లకు, దోపిడీ దార్లకు కొమ్ముకాసే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడకుండా సర్వశక్తులు ఒడ్డుతది . తెలంగాణ ఇచ్చేదే అయితే మొన్నటి రాష్ట్రపతి ఎన్నికలల్ల మీ సహాయం తీసుకొనేది. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు జగన్ కు మనకంటే ఎక్కువున్నయా? మరి జైల్ల మూలుగుతున్న జగన్ తోటి ఎందుకు కుమ్మక్కయినట్టు? గిది నువ్వు చెప్పక పోయినా జనం అర్థం చేసుకుంటనే వున్నరు.

ఇప్పుడు తెలంగాణా వాదానికి TRS కేంద్రకం అయింది. TRS పార్టీకి నువ్వు కేంద్రకానివి. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలతోని చాల ప్రభావం వుంటది. మాట్లాడే ముందు నీపైన చాన బాధ్యత వుంటది. కాబట్టి జర చూసి మాట్లాడు. జనానికి వాస్తవాలు మాత్రమే వివరించు. అది మంచైనా చెడైనా సరే. నీ మాటమీద జనానికి గురి తప్పకుండ చూసుకో.

20 comments:

  1. Telangana MuddhubiddaJuly 28, 2012 at 5:08 PM

    Nijame anna. asalu manmau endhuku ithadi meedha depend kaavali. Manku gauravamu techhi poradela chesindhi ithade. malli manalni avmanapadelaa chesindhi ithade. Ithadi dialogues ki poraade shakti kuda pothundhi.

    ippudu inkokka sari aina nammakaamina leader dhorukatledhu. Sari aina nyakathavamu lekundaa ela poraadaali. chaala mandhi telangana peru cheppi sanpadisthunnaru.. poradudhaamu poraadudhamu ane antundlu. inka enni rojulu e poraatalalu.

    nenu chacchelopala aina telanagana ni chusthana... naa biddalaki telangana rastramu ani raase avakashamu isthana.

    ippudu jarige panulu chushunte ajakarulu G tho navvuthundlu. avunu manaki manme thakkuva chesukuntunnamu. ikkada udhayamamu unna.. enadharo telanaga vasthadi ani cheppina ajakarulu mathramu silence gaa untulndlu. ante vallaki kuda signal vachhinatte. " edo telanagana vallani atla nammisthamu. meeremi kangaaru padakandi. antha uttigane" ani. kadha emantaavu.

    emina cheyyali anna.

    anna .. nenu neekante mundhu nundi kcr ni vyatirekinchadamu start chesina.. but neevu appudu kuda support chesaavu. chudu e roju neevu kuda ila antunnavu. so.. inka emina cheyyali.

    osmanialo kuda udhyamamu thappu daari paduthundhi. theevratha thagguthundhi. manishi inka enni rojulu poraaduthadu.

    monna vijayalaxmi gelichindhi. sirisilla unnolu telanagana vallani koduthunte cinemaa chusukuntu kurchuldlu.. ekkadi nundo vachhi mana meedha padi koduthunna mana valalo chalanamu ledhu.

    indhuku kaadhaa androdu inka manalni dochukutune unnadu.
    manalone untiy thaggipothundhi.. enni sabhalaki povaali.. inka enni bandhulu pettali..

    ika ivanni naduvavu bhai.
    oke saari thaado pedo telchukundhaamu.

    vijayamo veeramaranamo.. chathakakpothe mana pillakina vadilese " memu kuda chatha kaani vedhavalu ayipoaymani cheppudhaamu"

    emantavu bhai.

    ReplyDelete
    Replies
    1. Hi Friend,
      Let us not forget the point that if T movement has come to this far, it is only because of him. And if it has to come to a good end, he is the one capable of doing that. But, like any other human being he is also having some lapses. My intention has been only alert him. But few people like our next commenter would happy enough to take advantage of these lapses to weaken the movement. Let us not fall into that pit fall. Even for today, KCR is the major driving force in T movement. That is the reason why these pseudo samaikya vadis hate him the most.

      Delete
  2. better late than ever! at least u realized the truw face of KCR

    ReplyDelete
    Replies
    1. Jai Andhra,
      Please look my answer to Telangana Muddubidda.

      Delete
  3. CORRECTION: true

    ReplyDelete
  4. "My intention has been only alert him. But few people like our next commenter would happy enough to take advantage of these lapses to weaken the movement"

    thanks!!!and if u think that my comments will weaken ur movement then god save you!!! my intention was not to insult ur democratic right

    "Let us not forget the point that if T movement has come to this far, it is only because of him. And if it has to come to a good end, he is the one capable of doing that."

    it is not because of him it is because of student force his efforts are minimal remember his tactics to give up his fast on the second day but student force forced him subside his fast.

    "KCR is the major driving force in T movement. That is the reason why these pseudo samaikya vadis hate him the most."

    yes!!i hate KCR and i hate his twin lagadapati!!! whose main agenda is hatred and reap benifits from it. i respect konda laxman bapuji who is pressing for amicable division anyway u dont appreciate him because all the hate ideology preached by kcr and his 'remote control' kodandaram is a bible and geeta to you!!1

    ReplyDelete
    Replies
    1. Hey Jai Andhra,

      Can we agree on one point that formation of Telangana state is necessary keeping aside the discussion about who is contributing that?

      Delete
    2. i agree and do you agree that ur leaders aren't saints and masters in confusing people

      Delete
    3. I never claimed that our leaders are saints. In fact no one can be a saint in current state of politics. You can refer my previous posts for details. But still I try to explain once again.

      Let us assume that the T CM would not be a saint but a corrupt leader like any other leader in India. For earning money through corruption, he has to first take up projects like Dams, Bridges, Universities, Roads etc. He just can't take away money from treasury. If YSR could not do that, no one ever do that.

      And he can only plan these projects in Telangana, but in no way he can divert the funds to Andhra like what is being now a days. Being a Telangana CM, he can't plan his projects in Andamans, hope you got it!

      He can not build dams, colleges, hospitals, bridges, whatever outside of the borders of Telangana. That is what exactly we want. We don't want our resources to be looted by the so called samaikya leaders on the name of unified state.

      We don't want to die out of thirst and flourosis, while the waters are ruthlessly taken away from us for the purposes of third crop.

      We don't want our universities allocated with paltry 1Cr or 2Cr while on the other side the funds for the same purpose flown in the tune of 300Cr.

      Delete
    4. why not its the duty of cm to look after the welfare of the state and in the same its not correct on putting the entire blame on the other region

      Delete
    5. CM? --> Andhra CM
      Chances of getting a T CM elected? --> bleak
      Reason? --> 175MLAs hail from Andhra and they would not budge for a T CM
      CM's bias? --> proven in the last 30 odd years.

      Solution? --> Separate Telangana State
      Do I need to say anything more?

      Delete
    6. i think u didnt understand i was referring to telangana cm not ap cm

      Delete
    7. I really did not understand an inch of what you were trying to say in your previous comment.

      Did you mean to say that there existed a Telangana CM now?

      Delete
    8. i was referring that its the duty of the cm to take care of welfare of the state whether it is telangana state or andhra state and by the way what i observed u people are passing the buck on the other region without holding ur leaders responsible and i dont patronize andhra leaders because they are murderers in the crime and ur leaders intentionally helped them to carry out their crime.

      what is ur opinion on 'quit telangana' call by TPF and do you really see it turn towards 'andhra people'

      Delete
    9. I have already answered the question of why a T CM is not possible in the present conditions in the state with overwhelming majority of Andhraite MLAs.

      When there is no CM hailed from Telangana for the last 30 years, then, there is no question of passing bucks anywhere.

      I am not blaming any CM personally nor I blame any Andhra person as well. But I blame current setup itself which gives scope for such a bias by combining unequal entities. It is like a forced marriage. In the current setup, even if a T CM hails, he should be obeying to the strong Andhra lobby, without which he can not survive as a CM for single day. Best example is PV, who could survive as a PM with minority govt for 5 years, could not even survive for one year as a state CM.

      You might also be observing the fact that even after this much of struggle put forth by Telangana people, there are still politically strong Andhra forces opposing Telangana formation. These lobbies could stop the process of state formation even after the announcement by Chidambaram. I know most of the Andhra people are innocent, but they are silent and at times supporting these lobbies. If that attitude continues, and when the patience of Telangana poeple dries out, then... 'Quit Telangana' may be an inevitable. But I don't thing all roads are closed yet.

      Delete
  5. నీ శత్రువు నిన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నాడంటే నువ్వు బగా పని చేస్తున్నట్టే లెక్క. ఐనా అందరితో మంచివాడు అనిపించుకునే వాడు మాకు అక్కర లేదు. మంచైనా చెడైనా కదనరంగంలో శత్రువును కత్తికొక కండగా నరుకుతూ గమ్యం దిశగా పొయెవాడే మాకు ఇప్పుదు కావాలి.

    ReplyDelete
    Replies
    1. Well said,

      But at the same time the process should not be self destructive.

      Delete
    2. Telangana MuddhubiddaJuly 29, 2012 at 5:13 PM

      Super cheppavanna.. excellent.
      మంచైనా చెడైనా కదనరంగంలో శత్రువును కత్తికొక కండగా నరుకుతూ గమ్యం దిశగా పొయెవాడే మాకు ఇప్పుదు కావాలి.

      Delete
  6. ఏది ఎప్పుడు చెప్పాల్నో అప్పుడే చెప్పాలే. సంకేతాలు వచ్చినయ్యే అనుకో, బైటికి చెబితే ఎదుటోడు కూడా రెడీ అయితడు. వాళ్లకు ఆ చాన్స్ ఎందుకు ఇయ్యాలె?

    वक्त आने दे बता देंगे तुझे ऐ आसमाँ,
    हम अभी से क्या बतायें क्या हमारे दिल में है ।

    From Ram Prasad Bismil's Sarfaroshi ki Tamannah

    ReplyDelete
    Replies
    1. మంచిగ చెప్పినవన్నా,

      అందుకనే, మన జెర చూసి మాట్లాడమని మన KCRకు చెప్తున్న.

      Delete