రక్తం తాగే తోడేళ్ళు మేకలను కాపాడుతయట! దొమ్మీలు చేసుకునే ఫ్యాక్షన్ మూకలు రాజ్యాలు ఏలగా లేంది తోడేళ్ళు మేకలను కాపాడయా ? ఏమో, ఏది చెప్పినా నమ్మాల్ననే అనిపిస్తది.
వాళ్ళ మాటల గారడీ అటువంటిది. తిమ్మి బమ్మి లెక్క కనిపిస్తది. విజయమ్మ నేత కార్మికులను ఉద్ధరిస్తది. లక్ష కోట్లు మింగిన జగను దేశాన్ని ఉద్ధరిస్తడు. దీని అసలు రంగేందో చూద్దాం.
మొన్నటి ఎన్నికలల్ల శృంగభంగం చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పట్ల సమైక్యవాద శక్తులకు నమ్మకం సడలింది. వాళ్లకు జగన్, విజయమ్మ మాత్రమే తమ ప్రాంతీయ దోపిడీకి హామీ లెక్క కనిపించుడు మొదలు పెట్టిన్రు. గపుడు జగన్ నాయిన తెలంగాణను వాడుకొని గద్దెనెక్కిండు. గద్దెనెక్కినంక తెలంగాణని బూతు కాలితోటి తొక్కిండు. గిప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అర్జెంటుగ తెలంగాణా చేనేత కార్మికుల మీద ప్రేమ కలిగింది.
జబర్దస్తిగ తెలంగాణల అడుగు పెట్టబొయ్యి మాన్ కోటల మడిమె తిప్పింతర్వాత, కొండా దంపతుల పలుకుబడి ఉపయోగించి పాగా వేయాల్నని చూసిండు. కానీ కుదర లేదు. తెలంగాణ ప్రజలు ఛీకోట్టిన్రు. ఇప్పుడు తెలంగాణల తన బలం ఉందని చూపెట్టుకోవాలె నంటే ఏదో ఒకటి చెయ్యాలే. అందుకే చేనేత కార్మికుల మీద మొసలి కన్నీళ్ళ వరద!
సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మా హత్యల నేపథ్యంలో వారిని ఆడుకోవడానికి కేటాయించిన 3 కోట్ల నిధుల్లో రెండుకోట్ల డెబ్భై లక్షలను ఆనాటి రాజశేఖర్ రెడ్డి కడపకు దోచుక పోయిన వైనం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చి పోలేదు. ఆయన జెండా మోసే జగన్, విజయమ్మలు అంతకన్నా పెద్ద చేస్తరన్న నమ్మకం వాళ్లకు అసలు లేదు.
ఈ తల్లీ కొడుకులకు నిజంగా తెలంగాణా మీద ప్రేమే వుంటే ముందు చెయ్య వలసిన పనులు చాలనే వుండే. మొన్నటికి మొన్న 750 మెడికల్ సీట్లను ఆంధ్రాకు తరలిస్తే ఒక్క మాట గూడ మాట్లాడ లేదు వీళ్ళు. తిరిగి తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తేనే వంద సీట్లన్నా వచ్చినయ్.
అంతెందుకు, ముఖ్యమంత్రి దొంగ జీవోలు తెచ్చి రాత్రికి రాత్రి శ్రీశైలం నీళ్ళను సీమకు, సాగర్ నీళ్ళను డెల్టాకు తరలిస్తుంటే వీళ్ళ నోళ్లకు తాళాలు పడ్డయి. ఒక్కడు కూడ మాట్లాడ లేదు. మల్లే TRS, తెలంగాణ వాదుల పోరాటాల ఫలితంగనే కోర్టు తీర్పు వచ్చి 210 అడుగుల దగ్గెర దోపిడీ ఆగిపోయింది.
ఇవన్ని ఒక ఎత్తయితే 2009ల ఓటేసే వరకు ఊరుకొని, సాయంత్రం ఆరు కొట్టంగానే తెలంగాణ ఇస్తే వీసా తీసుకోవాలనాన్న తండ్రి మాటలు, ఆంధ్ర తెలుగుదేశం వాళ్ళ దగ్గెర జెండా గుంజుకొని జగన్ పార్లమెంటుల చేసిన సమైక్యవాద ప్రదర్శన, ఇవి ఇంకా ప్రజల గుండెలల్ల భగ్గ భగ్గ మండుతనే వున్నయి.
లక్ష కోళ్ళను కబళించిన రాబందు తమను కాపాడుతదని ఆంధ్రల నమ్ముతరేమో తెలువదు కనీ తెలంగాణల మాత్రం కలల కూడనమ్మరు. తమకున్న డబ్బు, పశు బలం చూపించి లొంగ దీసుకున్దామని చూస్తున్నరేమొ! కాని చీమలు ఒక్కటై పామును నిర్జించినట్టు వీళ్ళ మోసాలను చూసి చూసి మండి పోతున్న తెలంగాణ ప్రజల కోపాగ్నికి ఇలాంటి వెయ్యి మంది విజయమ్మలు, లక్షమంది జగన్లు వచ్చినా కూడా, పరాభవంతోని వెనుదిరిగి పోవలసిందే.
పొరపాటు. విజయమ్మ కొసం విద్యార్ధులు , దళిత సంఘాలు ఎంతగా ఎదురు చూస్తున్నారో చూదలేదా ? ఇది దొరల రాజ్యం , గుర్తుంచుకోండి.
ReplyDeleteదావూద్ ఇబ్రహీం వచ్చినా ఎదురుచూసేవాల్లు తప్పక వుంటరు. అంత మాత్రాన దుర్మార్గుడు మంచోడు కాడు.
ReplyDeleteతండ్రి అధికారం అడ్డం పెట్టుకొని వేలాది కోట్లు దిగమింగి, ఊచల్లెక్క పెడుతున్న పెద్దమనిషిని గద్దె మీద కూసబెట్టాలెనని చూస్తున్న ఎడుగూరి సందింటి విజయలక్ష్మిది చేనేత కార్మికుల మీద ప్రేమో, సమైక్య రాష్ట్రం గద్దెకు కొడుకు వారసుడు కావాలెననే కోరికో అందరికీ తెలుసు.
Yes. Except Ka.Cha.Ra. all others looted Te"langa"ngaana
ReplyDelete