Friday, August 3, 2012

సీమాంధ్ర మెడికిల్స్




- వైద్య విద్యలో మరో దగా
- నియోనాటాలజీలో పోరుగల్లు బిడ్డకు తీరని అన్యాయం
- మొదటి ర్యాంకర్‌ను కాదని ఐదో ర్యాంకర్‌కు సీటు
- ఉన్నది ఒకటే సీటు.. అదీ ఫస్ట్ ర్యాంకర్‌కే ఇవ్వాలి.. కానీ, నిబంధనలకు నీళ్లొదిలారు.. మంత్రి మాటకు సలాం కొట్టారు
- రాష్ట్ర కోటాను లోకల్‌గా మార్చారు
- కాకినాడ అభ్యర్థికి సీటిచ్చేశారు..!
- తెలంగాణపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వివక్ష
- మండిపడుతున్న తెలంగాణవాదులు
- ర్యాంక్ నం.1..తెలంగాణ బిడ్డకు సీటు రాలేదు
 

ఓ వైపు ఎంబీబీఎస్ సీట్ల వివాదం కొనసాగుతుండగానే.. మరో దగా..! వైద్య విద్యలోనే తెలంగాణ విద్యార్థికి తీరని అన్యాయం. మొదటి ర్యాంకు తెచ్చుకున్నా సీటు ఇవ్వని సీమాంధ్ర పెత్తనం. ఉన్నది ఒకటే సీటు..! అదీ రాష్ట్ర కోటా కింద మొదటి ర్యాంకర్‌కే ఇవ్వాలి. ఇదే విషయాన్ని ప్రకటనల్లో గుప్పించారు. కానీ, తీరా కౌన్సెలింగ్ నాటికి మొదటి ర్యాంకర్‌కు మొండి చేయి చూపారు..! లోకల్ కోటా కింద ఐదో ర్యాంకర్‌కు సీటిచ్చి తమ సీమాంధ్ర పైత్యాన్ని ప్రదర్శించారు. మొదటి ర్యాంకర్ తెలంగాణ బిడ్డ కావడమే వారికి గిట్టలేదు..! అందుకే, మొదటి ర్యాంకర్‌ను కాదని.. ఐదో ర్యాంకర్(కాకినాడ వాసి)కు సీటు కట్టబెట్టి మరోసారి తెలంగాణపై విషాన్ని కుమ్మరించారు. వైద్య విద్యలోని నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సుల్లో చోటుచేసుకున్న ఈ తాజా తతంగం సీమాంధ్రకు చెందిన మంత్రి సమక్షంలోనే నడిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాండూరు, ఆగస్టు 2 (టీ మీడియా): సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా విద్యలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి తాజా ఉదాహరణ.. వైద్యవిద్యలోని నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఉదంతం..! కొత్తగా ఈ ఏడాది ప్రారంభించిన ఈ వైద్యవిద్య కోర్సులో ఏడాదికి ఒక అభ్యర్థినే ఎంపిక చేసి కోర్సు కాలంలో రూ. 3 కోట్ల వరకు నిధులను ఆ అభ్యర్థి చదువుకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొత్త రాకేష్ మొదటి ర్యాంక్‌ను తెచ్చుకున్నారు. ఈయన రంగాడ్డి జిల్లా తాండూరు జిల్లా ఆస్పత్రిలో పీడియాట్రిషన్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సూపర్‌స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి 2012-13 అకడమిక్ ఇయర్ సెషన్‌కుగాను జూలై 18న విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో నిర్వహించిన నియోనాటాలజీ (డీఎం) పరీక్షకు రాష్ట్రం నుంచి దాదాపు 50 మంది పోటీ పడ్డారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (విజయవాడ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ కొత్త రాకేష్‌కు 67 మార్కులతో మొదటి ర్యాంకు వచ్చింది. 2వ, 4వ ర్యాంకులు కూడా ఉస్మానియా వర్సిటీ విద్యార్థులే దక్కించుకున్నారు. 3వ ర్యాంకు మాత్రం ఇతర రాష్ట్రానికి చెందిన అభ్యర్థికి దక్కింది. నియోనాటాలజీ సీటు రాష్ట్ర కోటా కిందికి వస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థి అయినా సరే మొదటి ర్యాంకు సాధిస్తే... ఆ విద్యార్థికే ఆ ఒక్క సీటూ ఇవ్వాలి. కానీ, సీమాంధ్ర పెత్తనం పైత్యంగా మారింది. తెలంగాణపై వివక్ష కట్టలు తెంచుకుంది. అంతే, నిబంధనలకు నీళ్లొదిలారు. వైద్య విద్యలో మరోసారి సీమాంధ్ర జులుం ప్రదర్శించారు. మొదటి ర్యాంకు తెచ్చుకున్న కొత్త రాకేష్‌ను కాదని, 5వ ర్యాంకు పొందిన ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఓ అభ్యర్థికి సీటు కేటాయిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్ణయం తీసుకుంది. మొదటి ర్యాంకర్ అభ్యర్థిని విస్మరించి కేవలం లోకల్ అభ్యర్థి అన్న కారణంతోనే ఆంధ్రా ప్రాంతానికి చెందిన 5వ ర్యాంకర్‌కు నియోనాటాలజీ (సూపర్‌స్పెషాలిటీ కోర్సు) లో ప్రవేశం కల్పించారు.

రాష్ట్ర కోటా కింద ఉన్న సీటును... లోకల్ కోటా కిందికి మార్చడం.. అదీ ఐదో ర్యాంకర్‌కు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లు తనకు జరిగిన అన్యాయంపై రాకేష్ మండిపడుతున్నారు. మొదటి ర్యాంక్ సాధించిన తనను కాదని, ఐదో ర్యాంకర్‌కు సీటు ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని గురువారం ‘టీ మీడియా’తో రాకేష్ పంచుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరీక్షలు రాసినవారిలో కేవలం మొదటి మూడు ర్యాంకులను సాధించినవారినే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌కు అధికారులు నామమాత్రం గానే పిలిచి పంపారని తెలిపారు. 5వ ర్యాంకర్‌కు సీటు కేటాయించామని, లోకల్ అభ్యర్థి కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తమకు తెలిపారని రాకేష్ చెప్పారు. డీఎం కోర్సులను వైద్య విద్యా పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర కోటాగా తప్ప లోకల్‌గా నిర్ణయించడం వివక్షేనని వైద్య వర్గాలు అంటున్నాయి.

సీమాంధ్రకు సీటు వెనుక మంత్రి..!
రాష్ట్రంలో కొత్తగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచే నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏటా ఒకే ఒక అభ్యర్థికి నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సును నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ ఒక్క అభ్యర్థిపై దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. ఈ కోర్సుకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మంత్రి ప్రమేయం వల్లే వరంగల్ జిల్లాకు చెందిన మొదటి ర్యాంకర్ కొత్త రాకేష్‌ను కాకుండా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు చెందిన 61 మార్కులతో 5వ ర్యాంకు పొందిన ఆంధ్రాయూని వర్సిటీ అభ్యర్థిని వివక్ష పూరితంగానే ఎంపిక చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Curtesy: Namaste Telangana 

16 comments:

  1. తెలంగాణాలోని విశ్వ విద్యాలయాల్లో చేరటానికి వచ్చిన వందలాది సీమంద్రులని అడ్డుకుని పంపేసిన వాళ్ళు ఒక సీట్ ఇవ్వకపోతే ఏడ్చి చావటం మీకే చెల్లింది.

    ReplyDelete
    Replies
    1. you are correct.
      Mr Srikanthachari, what is your answer about this.
      I read so many times, that T-people are asking Andhra student not to join in Hyderabad Colleges, Especially, I read a news recently, one of the students came to join in OU, your so-called T-Gods sent her out even after she requested a lot.

      Delete
    2. @AnonymousAugust 3, 2012 6:13 PM

      తమకోటా సీట్లే కాక అక్రమంగా పక్క రీజియన్ సీట్లు కూడా దండుకుందామనుకునే యావ కలిగిన వారికి అంతకన్నా అర్థం కాదులే. అది రాష్ట్రం మొత్తానికీ ఒకటే సీటు. ఖచ్చితంగా మొదటి రాంకరుకే ఆ సీటివ్వాలి.

      తమరి ప్రకారంఏ ఆలోచిస్తే ఒక్క ఆంధ్ర వాడు కూడా తెలంగాణాలో చదవడానికి వీళ్ళేదు. ఆలెక్కన మేం అందరినీ పంపేయాల్సిందేనన్న మాట. సరేనా?

      @AnonymousAugust 3, 2012 7:24 PM

      No wonder if your chicken brain can't think beyond that. Can you name where the incident occured? Any government administrator driven any of you people? If a stray group of people frustrated with your biased officers resort to some demonstrations, then how can you compare that with this coldblooded scam by officials who are meant to justice?

      Come and see, how many of your fellow andhraites studying in OU, JNTU or you name any other college. Even your own people would not believe in such stories.

      Delete
    3. Telangana MuddhubiddaAugust 4, 2012 at 12:05 AM

      etlaa vachharu.. vandhaladdi mandhi.. seats padhulalo unte.. vandhalamandhi emi dochukundhamani vachharu raa.. ajkaru gadidha kodukullaraa,,,.. maa quota maaku kavalante thappu.... meeku extra ivvakunnaa maa thappe.... emi matalau nercharu ra.. andhuke kadhaa. mimmulani tamilulu tharimi tharimi kotaaru... appudu chennai kavalani endhuku adugaledhu.. endhukante vallithe bokkalu chura churaa chesthranani laagulu tadisinayi...

      Delete
    4. మీ చదువులు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూసాను. దాదాపుగా పరీక్షలలో చూసి చూడనట్టుగా తెలంగాణా ఉద్యమంలో పాల్గొని చదవలేదు ఈ సరికి ఇలా కానీ అంటూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు.

      Delete
    5. స్వందన గారు

      మా చదువులు బాగున్నాయి కాబట్టే మొదటి ర్యాంకు మాకు వచ్చింది. స్టేట్ మొత్తనికి గల సీటును మొదటి ర్యాంకు వాడికి ఇవ్వకుండా ఐదో ర్యాంకు వాడికి ఇవ్వడం గురించిన ఔచిత్యాన్ని గురించి స్పందించగలిగితే మాట్లాడండి.

      Delete
  2. ఇక్కడ కోర్సులలో చేరడానికి వచ్చిన సీమాంధ్రులను పంపించివేస్తున్న గాడిదలు అక్కడి సీట్లకి ఎందుకు వెళ్ళడం ?

    ReplyDelete
    Replies
    1. AnonymousAugust 3, 2012 8:55 PM

      నువ్వు గాడిద ఐనంత మాత్రాన అందరూ అదే జాతి అని ఎందుకనుకుంటున్నావు?

      ఇక్కడా అక్కడా అని లేకుండా అంతటా మీరు తిష్ట వేస్తున్నందుకేగా ఇదంతా?

      స్టేట్ మొత్తానికి వుండే ఒక్క సీట్లో ఒకటినుండి నాలుగు రాంకులూ రాకపోయినా ఐదో రాంకు వాణ్ణి కూచోబెడితే చూస్తూ కూడా సిగ్గు లేకుండా మాట్లాడ్డం నీలాంటి గాడిదలకే చెల్లుద్ది మరి.

      Delete
    2. Telangana MuddhubiddaAugust 4, 2012 at 12:02 AM

      This comment has been removed by a blog administrator.

      Delete
    3. @Telangana Muddhubidda

      You can express your views freely, but please do not resort to unparliamentary language.

      Delete
    4. ఏమైనా చేయటానికి చెల్లింది మీకు గాక మరెవరికి

      Delete
  3. Telangana MuddhubiddaAugust 3, 2012 at 11:13 PM

    ade annaa.. memu maa okka seat ni vadilesthaammu.,. anna rakesh neevu badha padaku....

    anna... manmu taggaddhhu anna.. e e nnaa kodukulaki okka seat kuda manamu ivvadhhu... evvadu ikkada join avvadaaniki veelu ledhu..

    enni rojulanna.... inka ila enni rojulu.. mana jeevethamantha ila bloglalo raasukodaanikena.. neevu kuda edo shanti vachnaalu palukuthunnavu.. ila silence gaa unnamu kanukane ee ajakar naa kodukulu recchipothunnaru....

    prathidi anyame.. vallu chesthe oppu.. manamu edi chesina thappe.. maatalu nerchina guntanakkau ee ajakar naa kodukulu..

    manamu pratheykamante thappu.. vallu pratheykamnte oppu...

    aa eenaddu.. lanjakoduku ( sorry anna boothulu ne eblog lo vaaduthunnadhuku. kaani thappadhu.) mana okka comment publish cheyyadu.. migithavanni ok.. enni rojulu... ila...

    chi virakthi vesthundi... kaani nenu prana thgyamu athma hathaya chese rakamu kaadhu.. hathyalu chese rakamau............. naatho paatu ee 10mandhi ajakarulani teesukelthaa..

    neevu kuda naaku peddhanana ve anukuntunnnaa.. ila silent ga aunte saripodhu.. maname emina cheyyallannaa..

    manakosamu kaadhu.. atleast mana poragallakosaminaa...

    ReplyDelete
  4. Hi Brother,

    Please be patient. If you lose patience, you loose everything. I don't say your anger is invalid, but I would like you to control and channelise properly.

    Let alone this state, democracy is still prevailing in this country. We will try to make more and more people to aware about the things happening to us, then, one day the people would ultimately cast their votes appropriately and teach thease thugs a lesson.

    ReplyDelete
    Replies
    1. Telangana MuddhubiddaAugust 3, 2012 at 11:59 PM

      ide maataaa naaki 10 yrs krithamu cheppithe bagundedhi anna... manaku rajyadikaramu vasthene telangananaaaaa... mari inni sanvatsaralanundi telangana kosamu endhuku poradadamu... direct gaa mukhyamantri padavi peru cheppukoni poradithe ayipoyedhi kadhaaa

      Delete
  5. నేను రాయలసీమ వాడిని. అన్యాయం ఎక్కడ జరిగిన అన్యాయమే. ఇది నిజమయితే నేను కూడా ఖండిస్తున్నాను (నిజమయితే అని ఎందుకన్నానంటే నాకు వివరాలు తెలీదు). అలాగే ఎవరైనా హైదరాబాద్ లో న్యాయంగా సీట్ వచ్చి జాయిన్ అవటానికి వచ్చినప్పుడు ఎవరయినా అడ్డుకున్నా అందరం ఖండించాలి.
    ఎవరయినా సరే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకపోతే బాగుంటుంది. ఎవరికయినా స్వేచ్చగా తన భావాల్ని వ్యక్తీకరించే హక్కు ఉంది. అది ఎదుటి వాళ్ళని కించపరచనంతవరకు. అలాగే ఇప్పటిలా కాకుండా ఏదయినా ఇష్యూ మీద (కేవలం ఇష్యూ మీద) గొంతెత్తితే చాల మంది సపోర్ట్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ జరిగింది అన్యాయం. మొదటి రాంక్ వచ్చిన వాడికి రావాల్సింది 5 వ ranker కి వెళ్ళింది. దానిని సీమంద్రుల కుట్రగా చిత్రీకరించటం ఏమి బాగా లేదు.
    ఉదాహరణకి హీరో కృష్ణుడు స్థలాన్ని ఎవరో కబ్జా చేసారు. అతను ఆంధ్రా వాడు, కబ్జా చేసింది తెలంగాణా వాడు అనుకో, దానిని తెలంగాణా వాడు ఆంధ్రా వాడిని మోసం చేసాడు అని చిత్రీకరిస్తే ఎలా? ఆ కబ్జా చేసే వాడికి అవతలి వాడు ఆంధ్రా నా లేక తెలంగాణా నా అవసరం లేదు. కాబట్టి ఇలాంటి చిత్రీకరణలు మంచివి కావు ఎవరికయినా.

    ReplyDelete
    Replies
    1. అయిదో రాంకు వచ్చినా సీటు దక్కించుకున్న డాక్టరు గారు కుట్ర చేసారని ఎవరూ అనలేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆంద్ర ప్రాంత అధికారులు అన్యాయంగా ఆయనకు సీటు ఇవ్వడం ఆంద్ర అధికారుల కుట్ర అనేదే అభియోగం.

      రూల్సును వక్రీకరించి (పక్కనబెట్టి) తమ ప్రాంతీయుడికి ఆ సీటు కట్టబెట్టిన అధికారులకు ఆయనపై వ్యక్తిగత ఆసక్తి లేదు. కేవలం తమ ప్రాంతం వాడనే కారణం వల్ల వారలా చేసారు. The discrimination in this case is regional in nature.

      Delete