Thursday, July 7, 2011

విఙ్ఞతతో ఒక నిర్ణయం తీసుకోవల్సిన సమయం వచ్చింది.

గత 55 ఏళ్ళనుంచీ జరిగేది తెలంగాణా అభివ్రుద్ధి కోసం పోరాటమే. తెలంగాణా ప్రత్యెక రాస్త్ర డిమాండ్ లో ఇమిడిఉంది కూడ అదే. తెలంగాణా అభివ్రుద్ధి, స్వయంపాలన, ఆత్మగౌరవం తోనే జరుగుతుందని తెలంగాణా ప్రజలు నమ్ముతున్నారు. 1956 లో అంధ్రప్రదెష్ రాస్త్ర ఏర్పాటు రూపంలో రాజకీయ ఐక్యతే వచ్చిందిగానీ మానసికంగా తెలుగువాళ్ళంతా ఒక జాతి అనేటటువంటి ఐక్యత రాలెదు. భాషాసంస్క్రుతులపైన జరిగిన దాడి, మితిమీరిన వలసలు, ఉద్యగ, వనరుల విషయంలో జరిగిన అన్యాయాలు దీనికి కారణం. ఇది సీమాంధ్రులు అర్థం చేసుకుని, సహ్రుదయంతో విభజనకు అంగీకరిస్తే అందరికీ మంచిది. లేనట్లైతే అసహజ పరిణామాలు ఏర్పడె అవకాశం ఉంతుంది. తెలుగువాళ్ళకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమీ లేదు. మరింత అభివ్రుద్ధ్రికి అవకాశం ఉంటుంది. సమస్యను శాశ్వతంగా కప్పేయాలనుకోడం సరైంది కాదు. విడిపొయినతర్వాత కూడా రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సుహ్రుధ్భవం అవసరమే.

హైదరాబాదు ను అడ్డంకిగా చూపడం కూడా సరికాదు. అదే సమస్య అయినట్లైతే ఇరుప్రాంతాల నాయకులు కూర్చుని చర్చల ద్వారా ఒక అంగీకారానికి రావచ్చు. ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్రులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని తెలంగాణావాళ్ళు మొదటినుంచీ చెప్పుతూనే ఉన్నారు. ఈవిధంగా ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగటం ఇరు ప్రాంతాలవారికీ శ్రేయస్కరం కాదు. విఙ్ఞతతో ఒక నిర్ణయం తీసుకోవల్సిన సమయం వచ్చింది.

9 comments:

  1. ఇంకా విజ్ఞత, అర్ధం, సహృదయం అని మాట్లాడ్డంలో అర్హ్డం లేదని నా అభిప్రాయం. తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయంలో ఆ మాటలు ఉద్యమస్పూర్తిని చల్లర్చుతాయాని కూడా నా అభిప్రాయం.

    ReplyDelete
  2. విజ్ఞత లేదు వంకాయ లేదు.ఇన్నేళ్ళు మమ్మల్ని ఇష్టమొచ్చినట్లు తిట్టి,హేళన చేసి,బెదిరించి,అవమానించి,ఇప్పుడు విజ్ఞత అని నీతి సూత్రాలు వల్లిస్తే వినడానికి ఎవడూ సిద్ధంగా లేడు.సోదరభావంతో విడిపోవాలన్న ఆలోచన మీ నేతలకే ఉండి ఉంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చెసేవాళ్ళు కాదు.తెలంగాణా వాదుల పై ఇంత విద్వేషం వచ్చేది కాదు.ఇంతదాకా వచ్చాక సంధి ప్రేలాపనలు దేనికి.సమరమే .

    ReplyDelete
  3. మీరు చెప్తున్న అసహజ పరిస్థితులు ఓవైసీ సోదరులకు కూడా వర్తింపచేస్తారా? అసలు వాళ్ళని రాజీనామా చేయమని డిమాండ్ చెయ్యడంలేదే?

    ReplyDelete
  4. @rangaraju

    సంతోషం. కౌరవులతో కూడా మొదట సంధికి కబురు పెట్టడం పాండవుల పధ్ధతి. సమరం మొదలు పెడితే నష్టపోయేది ఎవరో మీకు బాగా తెలుసనుకుంటాను.

    ReplyDelete
  5. ఈ తెలంగాణావాదుల వ్యవహారం అందితే జుట్టు అందాకా పొతే కాళ్ళు అనే విధంగా ఉంది. తిట్టవలసిన తిట్లు, చేయవలసిన అకృత్యాలు చేసిన తరువాత, కేంద్ర కేంద్ర ప్రభుత్వం లొంగక పోయేసరికి, మనం మనం కొట్టుకోవడం దేనికీ శాంతి యుతం గా విడిపోదాం లాంటి మాటలు చిలకల్లా బాగానే పలుకుతున్నారు. ఈ బుద్ధి ముందే ఉంటే ఏమి జరిగి ఉండేదో. కానీ ఇంత రచ్చ చేసాక రాష్ట్రాన్ని విడగొట్టడం చేస్తే ఇంతకుముందు తెలంగాణా వాదులు చెప్పినట్లు రక్తపాతమే జరుగుతుంది. వీళ్లు ఉత్త వాగాడంబరం చూపించారు. కోస్తా, రాయలసీమ వారు చేతలలో చూపించడం జరుగుతుంది.

    ReplyDelete
  6. సీమాంధ్ర ప్రజలందరూ రంగరాజు లాంటి మూర్ఖులని నేను అనుకోవడంలేదు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు తెలంగాణా నాయకులెవ్వరూ ఎన్నడూ చెయ్యలేదనే నేను భావిస్తున్నాను. అదేవిధంగా సమైక్యాంధ్ర గురించి మాట్లాదే వారెవ్వరూ గతం లో ఎప్పుదూ ప్రత్యేక తెలంగాణా గురించి పాజిటివ్ గా మాట్లాడిన సంధర్భాలు కూద లేవు. కాబట్టి రెచ్చగొట్టే ప్రసంగాలనే మాట అప్రస్తుతం.
    నేను చెప్పదల్చుకున్నదేంటంటే, తెలంగాణా ప్రజలకు నిజంగా తెలంగాణా కావాలని లేదనీ, భావోద్వేగాలు కేవలం తాత్కాలికం అని సీమాంధ్రలో జరిగే ప్రచారం తప్పనీ, దశాబ్ద కాలంగా స్థిరంగా ఉద్యమం చేస్తూ నాయకులను రాజీనామాల వరకు తీసుకొచ్చిన ప్రజలను చూసైనా ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని.
    సీమాంధ్రలో కూడా సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం ఉందని అనొచ్చు గాని విడిపోవాలనుకుంటున్నవాళ్ళను బలవంతంగా కలిపి ఉంచాలనుకోడం అసాధ్యం.

    ReplyDelete
  7. రవీంద్రనాథ్,

    >>>చేయవలసిన అకృత్యాలు చేసిన తరువాత
    >>>వీళ్లు ఉత్త వాగాడంబరం చూపించారు

    తమరికి బుర్ర అనేది ఉంటే ఈ రెండు లైన్లకు ఎట్ల సాపత్యం కుదుర్తదో ఆలోచించున్రి.

    నిజమే మేము ఇప్పటిదాక వాగాడంబరమే చేసినం.

    మీ రాయలసీమ కత్తులు, నాటు బాంబులు చూసుకుని మురిసిపోతున్నరేమో, అరవై సంవత్సరాల క్రితమే సాయుధ పోరాటం చేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్న గడ్డ మాది. ఆ విషయం మరిచి పోవద్దు.

    ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టి పెట్టు. అద్దాల మేడలో కూర్చుని బయటోడికి రాళ్ళేద్దామని చూస్తె మొదట నీ అద్దాలు పగులుతై అన్నది గుర్తు పెట్టుకో. నీ ఆంధ్రా వాళ్ళు తెలంగాణా ఊరూరా వాడ వాడలా ఉన్న విషయం మరిచిపోకు. రక్తపాతం అని మాట్లాడుతున్నవు, అట్లాంటిది జరిగితే నష్టం మాకంటే మీకే ఎక్కువ.

    ReplyDelete
  8. మీకు నేను ఒక్క సారి అంటేనే రోషం పొడుచుకొచ్చింది. పైగా కేసీఆర్ గారి వీర భక్తులు అయినందుకు మీరు ఆ విధంగా బెదిరింపులకి దిగడం కొత్తేమీ కాదు. మీ వేర్పాటు వాదులందరికి ఇది అలవాటయిన విద్యే కదా. ఇంకొక విషయం మీ ప్రాంతం వారికి ఆ సాయధ పోరాటానికి సహాయ సహకారాలు అందించినది కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారని మరువవద్దు. అలా మరిచిపోతే, విశ్వసఘాతుకం చేసినవారవుతారు. ఆల్రెడీ చేస్తున్నారు. చేసిన మేలుని మరచినవాడు చచ్చిన శవంతో సమానం.

    రాళ్లభండి రవీంద్రనాథ్

    ReplyDelete
  9. ఒక్కసారేమిటి, నీ బ్లాగు నిండా సమైక్య పేరు చెప్పి ఎలాంటి చెత్త రాతలు రాస్తావో ఎవరూ చూడటం లేదనుకోకు.

    విశ్వాసం ఏంటి, ఘాతుకం ఏంటి? కొంచెం మెదడు ఉపయోగించు బ్రదర్. అప్పుడు మాకు సంఘీభావం తెలిపిన వర్గాలు ఇప్పుడూ సంఘీభావం తెలుపుతూనే ఉన్నాయి. కొందరు విశాలాంధ్ర అనుకుంటూ పెత్తందార్ల చెప్పులు మోసేవాళ్ళు తప్ప.

    ఇక విశ్వాసం, సహకరం విషయాలకు వస్తే అవి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటై. ఉప్పెన వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు, మొన్న కర్నూలు వర్దలు వచ్చినప్పుడు తెలంగాణా వారు చేసిన సహకారం నీలాంటి వితండవాదులకు కనపడకపోవడం వింతేం కాదు.

    ReplyDelete