Friday, July 15, 2011

వీరీ వీరీ గుమ్మడిపండూ వీరిపేరేమి?

సమైక్యవాదులు ఎంతసేపూ కలిసి వుండాం అంటారే కానీ రాష్ట్రం విడిపోతే ఏం సమస్యలున్నాయో చెప్పండి. కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అంటే చెప్పరు. బహుషా అవి పైకి చెప్పుకోలేని సమస్యలయ్యుంటాయి.

మిగతా సమస్యల మాట ఎలా వున్నా, వారికి ఒక సమస్య మాత్రం వుంటుంది. అదే పేరు సమస్య. విడిపోతే తెలంగాణా రాష్ట్రానికి పేరు 'తెలంగాణా' అని ఇప్పటికే నిశ్చయం. కాని ఆంధ్రా పరిస్థితి అలా వుండక పోవచ్చు.

ఒకప్పుడు ఆంధ్రరాష్ట్రంగా మూడేళ్ళు వున్న రాష్ట్రానికి అదే పేరు గాక మరేముంటుంది అనే ప్రశ్న రావచ్చు. కాని అక్కడే వుంది కీలకం. అప్పుడు రాజధాని కర్నూలులో వుంది. ఇప్పుడు కోస్తా వారు రాయలసీమలో రాజధాని పెట్టడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు TG ఎంత మొత్తుకున్నా.

కాబట్టి రాయలసీమ వారు రాష్ట్రం పేరులో తమ ముద్ర వుండాలని కోరుకోవచ్చు. అప్పుడు ఏం పేరు పెట్టాలి?

సీమాంధ్ర
ఆంధ్ర రాయలసీమ
రాయలసీమాంధ్ర
సీమకోస్తా

ఇలాంటి పేర్లు మరికొన్ని కూడా ఊహించొచ్చు. అయితె సమస్య ఇక్కడితో ఆగిపోలేదండోయ్! ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్రులు కూడా చైతన్యవంతం అవుతున్నారు. వారికీ identity crisis వుంది. రాష్ట్రం పేరులో తమ ముద్ర వుండాలని వారు కూడా కోరుకోవాలని అనుకోవడంలో తప్పు లేదుకదా? అప్పుడు మరికొన్ని పేర్లు వస్తాయి.

కళింగాంధ్రసీమ
రాయలసీమ కళింగ కోస్తా
కోస్తాసీమకళింగ
సీమాంధ్ర కళింగ
కళింగసీమకోస్తా

ఇలాగన్న మాట! ఈ విధంగా దాదాపు రెండు డజన్లవరకూ పేర్లు చెప్పుకునే అవకాశం వుంది. వాటిల్లో ఏదో ఒకటి నిర్ణయించు కోవచ్చు.

కానీ ఇంతా చేసి ఏదో ఒక పేరు పెట్టినా, 'ఫలానా' వారు దాన్ని ఎంతవరకు ఒప్పుకుంటారన్నదే అసలు సమస్య! మరి వారికి రాష్ట్రం అంటే మేం, మేమంటేనే రాష్ట్రం అని విపరీతమైన నమ్మకమాయె! అందుకని పై పేర్లన్నీ పోయి ఈ క్రింది పేరు పెట్టినా ఆశ్చర్యం లేదు.

గోదావరికృష్ణాగుంటూ

గుంటూ యేమిటి అనకండి. అది అప్పుతచ్చు కాదు అరజిల్లాయే! దానికి అంతకన్నా సీను లేదు మరి!
 

8 comments:

  1. వదిలేసెళ్ళండి, మా తిప్పలు మేం పడతాం, మా తెలంగాణా, మా సొంతం అనేటోల్లకి, వేరే వాళ్ళు భవిష్యత్తులో ఏం పేరు పెట్టుకుంటే ఏమొచ్చింది తంటా?

    ReplyDelete
  2. వదిలేద్దామనే మా ఆరాటం కూడానూ. ఐతే ఏంటండీ? మంచీ చెడూ మాట్లాడుకోవద్దా?

    మీవాళ్ళు ఆదుర్దా పడటం లేదూ? నక్సలైట్లొస్తారు, మతశక్తులొస్తారు అనీ?

    ReplyDelete
  3. ohoo.. alaagaa..

    - vamsi

    ReplyDelete
  4. hahaa baga cheppinav anna

    ReplyDelete
  5. మీరేం భయపడకండి. రాష్ట్రం విడిపోదు. సమైక్యంగానే ఉంటుంది. మీలో మీరు కొట్టుకున్నంత వరకూ సమైక్య రాష్ట్రానికి వచ్చిన ముప్పేమీ లేదు. మీరు ఉద్యమం మీద ఆధిపత్యం కోసం కొట్టుకోవడం ఈ జన్మకి ఆపరు. ఇంక సమస్యేముంది?

    ReplyDelete
  6. తెలంగానా లేసింది.. లేసింది అంటే నిజమే అనుకుంటి.. ఏడ లేసింది. మీరు ఇంక పడుకోని ఇంత మంచి మంచి కలలు కంటా ఉంటే.. కనండి.. కనండి. ఇసుంటివే 1969 లో కన్నారు.. ఏ లోకాన ఉన్నారో పాపం. మీరు మాత్రం ఇట్టాంటి కలల్ని గెంట కి ఒకిటి రాయాలని మరీ మరీ మా యిన్నపాలు సామీ..

    ReplyDelete
  7. LOL ;)))


    అయినా మీరేంటండీ? మా పేరు మేం పెట్టుకుంటాం.పాకిస్తాన్లో ఒకటో కళాసు జదివా..నాకా మాత్రం తెలీదా?. అరబిక్ చైనీస్ భాషల్ని తిరగమాతేసి మరీ యాసలతో సహా ఆపోసన పట్టినోడ్ని.ఏ యాసలో పేరు పెట్టాలో మీరు నాకు చెప్పాలా?బిరుదరాజు రామరాజు గారితో కలిసి పనిచేసా..ఆయ్..నాకు మీరు చెప్త్రారా ఏ పేరుపెట్టాలో? మొన్నే "పేరు" మీన పచ్చడి చేసి గూనివర్సిటీ ఆఫ్ రగడపాటి కి అంకితమిచ్చా..సో నాకిందులో శూన్యానుభవం ఉంది. ఇంకా పెపంచ౦లో మీరేది చెప్పినా అందులో నేను బుర్ర తప్ప చేయి కాలు తలతో సహా పెట్టానని బూరఊది మరీ జెప్తా ;)

    ReplyDelete