Friday, July 8, 2011

బాబు డైరెక్షన్, తెదెపా తమ్ముళ్ళ యాక్షన్

బాబు దర్శకత్వంల తెలంగాణా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహా రంజుగా యాక్షన్ చేస్తున్నరు. మరి వీరి యాక్షన్ తెలంగాణా ప్రజలు ఏవిధంగ స్వీకరిస్తరో చూడవలసి ఉంది.

మొన్నటిదాకా ప్రజలకు మొఖం చూపలేక మన్నుదిన్న పాముల్లెక్క, ఒడ్డున బడ్డ చేపల్లెక్క ఉన్న వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు చేయంగనె ఎక్కడ వెనుక బడి పోతమో అన్నట్టు ఉరుక్కుంట రాజీనామాలు చేసిన్రు. అదీ బాబు పర్మిషన్ తోటి.

ఒకవైపు వీళ్ళతోటి రాజీనామాలు చేయించిన చంద్రబాబు, ఇంకో పక్క పయ్యావుల కేశవ్ ను "జై సమైక్యాంధ్ర" అనమని ఉసిగొల్పుతడు.

ఇన్నాళ్ళు జనానికి మొహం చాటేసిన వీళ్ళు, రాజీనామాలు చేయంగనె ఎప్పుడెప్పుడు ప్రజల దగ్గరికి పోదామా అని ఈన్నావుల్లెక్క ఉరుకులాడుడు మొదలు పెట్టిన్రు. అందుకని బస్సుయాత్ర మొదలు పెట్టిన్రు.

మొదలైతె పెట్టిన్రు గని మనసుల ఏదో అనుమానం, వీళ్ళ యాక్టింగు జనం పసిగట్టి తరిమికొడుతరేమోనని! ఎందుకైనా మంచిదని JAC కాడికి పొయిన్రు. 

శనివారం మీటింగు పెట్టినం,అప్పటిదాక ఆగున్రి అని JAC వాళ్ళు చెప్పిన్రట. వెంటనే వీళ్ళు బాబు దగ్గరికి పొయ్యి మంతనాలు జేసిన్రు. బాబు ఏం పురెక్కిచ్చిండో ఏమో, బయటికొచ్చి JAC మీద సయ్యి మనుకుంట లేచిన్రు.

"మేం రాజీనామాలు చేసినా మమ్మల్ని అడుగకుంట 48 గంటల బందు పెట్టిన్రు. అందుకని మేం JACల కలువం" అని వీరి వాదన.

మరి ఎవర్ని అడిగి వీరు బస్సుయాత్ర పెట్టుకున్నరో అది మాత్రం చెప్పరు. వీళ్ళ కోపానికి అసలు విషయం ఇంకోటి ఉన్నది, JACల కలువాలంటె సమైక్యవాది చంద్ర బాబు పేరు ఎక్కడా ఎత్తవద్దని JAC వాళ్ళు కోరిన్రు.

మరి సహజంగనే రోజూ చంద్రబాబు బూట్లు నాకితె గాని తెల్లారని వీరికి ఆ మాట అంటె కోపం వచ్చుడుల ఆశ్చర్య మేముంది?

కాని వీరికి అర్థం గాని విషయం ఒకటుంది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన వీళ్ళు నెత్తిన రూపాయి పెడితే పావలాకు కూడా అమ్ముడు పోని రకం. రాజీనామాలు చేసినంత మాత్రాన వీల్లు చేసిన లెక్క మొత్తం మరిచిపోయేటంత అవివేకులు కారు ఇప్పటి తెలంగాణా ప్రజలు. అన్ని చూస్తనే ఉన్నరు.

8 comments:

  1. మరేమనుకున్రు సెంద్రయ్యంటే.. తెరెనుక డ్రామోజీ దరువేస్తుంటే..మనకు సెంద్రయ్య సిందులు సూపిస్తాడు... ఇంగా ముందుదు శానా సూడాలా.. మనసు నిమ్మళంగా ఉంచుకోవాలి. మనకీ తెలంగాణా ముఖ్యం.. గీ గుంటనక్కల దరువుల సిందులని సూసీ సూడనట్లు పోనించి అదును జూసి నొక్కాలి. అట్లని నమ్మిన్రో అంతే..గంతే..జెర బద్రం తెలంగాణ సోదరా!

    #మరిచిపోయేటంత అవివేకులు కారు ఇప్పటి తెలంగాణా ప్రజలు. అన్ని చూస్తనే ఉన్నరు.

    నేనూ జూస్తనే ఉన్నా మరి..

    ReplyDelete
  2. అవును రాజేషన్నా,

    డైరెక్షన్ డ్రామోజీ, యాక్షన్ బాబు & తమ్ముళ్ళు!!

    ReplyDelete
  3. అవును మరి MIM వాళ్ళు రాజీనామాలు చెయ్యాలని ఎందుకు చించుకోవట్లేదు? ఓహో అడిగే దమ్ము లేకా?

    ReplyDelete
  4. @Anonymous

    కొంచెం బుర్రుపయోగించు తమ్ముడూ. అసలు TDP వాళ్ళని ఎవరడిగారు రాజీనామాలు చేయమని? తెలంగాణాలో తిరిగే చాన్సు కోసం ఇష్టం లేకపోయినా వారంత వారే చేశారు (బాబు డైరెక్షన్‌లో). ఇంక MIM ని అడగడం, దానికి దమ్మూ, అవన్నీ అవసరమా?

    ReplyDelete
  5. మరి MIM ప్రజా ప్రతినిధులు కూడా తెలంగాణాలోనే తిరుగుతున్నారు కదా? వాళ్ళని తిరగనివ్వము అని ఎందుకు అనట్లేదు? ఇంత ఉద్యమం జరుగుతున్నాMIM వాళ్ళూ దూరంగా ఉన్న వాళ్ళని ఎవ్వరు ఎందుకు ప్రశ్నించరు?

    ReplyDelete
  6. మీ విశ్లేషణ బాగుంది...తెదెపా వారి మోటో పెట్టుబడిదారుల అనుకూలంగా వుంటుంది...వాళ్ళ మేర ఉపయోగపడడానికి ఉద్యమాన్ని వాడుకోజూస్తున్నారు..జాగ్రత్త వహించాల్సిందిక్కడే...జై తెలంగాణా...

    ReplyDelete
  7. పై Anonymous

    ఒక్క MIMనే కాదు, CPMని కానీ, రాజీనామా చేయని కాంగ్రెస్ ప్రతినిధులను కానీ ఎవరూ దేబిరించడం లేదు. ఇప్పుడిక్కడ తమ పాతివ్రత్యం నిరూపించుకోవడానికి తామే పూనుకోవాల్సిన పరిస్థితి. లేదంటే వచ్చే ఎన్నికల రణరంగంలో వారి చావు వారే చస్తారు.

    కెక్యూబ్ వర్మ గారు,

    వరద గోదావరి ఉధృతంగా పొంగేటప్పుడు చెత్తా చెదారం కూడా వెంట వస్తాయి. అయితే ఆ చెత్త ప్రవాహాన్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తుందే తప్ప వేగం పెంచడానికి కాదు. వీళ్ళ ఉద్యమాలు కూడా అలాంటివే.

    ReplyDelete
  8. సూటిగా చిక్కుప్రబిలియన్ డాలర్ల ప్రశ్న వేశావు, అజ్ఞాత. :)
    ఆ ఖలేజా వున్నోళ్ళు దేశంలో పుట్టలేదు. నోరుజారి పొరపాటున అడిగితే వీళ్ళెవరూ తెలంగాణాలోనే కాదు దేశంలోనే తిరగలేరు కాబట్టి. :)

    ReplyDelete