Friday, July 15, 2011

లగడపాటి మాటలు, తెలంగాణా ఏర్పాటు సంకేతాలు

లగడపాటి హఠాత్తుగా జగన్‌పై వ్యాఖ్యలు చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది. అదీ ఎప్పుడో అడుగున పడ్డ YSR హెలికాప్టర్ ప్రమాదం విషయాన్ని బయటకు తీసి, ఆ ప్రమాదం సూత్రధారి జగనే అనీ సూత్రీకరించాడు.

వర్షం వస్తున్నప్పుడు వెళ్ళొద్దని విజయమ్మ అంటే అనుండొచ్చు. ఏ భార్యైనా అలా ఆదుర్దా పడడం సహజం. అంత మాత్రాన ప్రమాదం శంకించిందని కాదు. వాతావరణం బాగా లేనప్పుడు కుటుంబ సభ్యులెవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి మామూలుగా జరిగే సంభాషణలే. అదే విషయాన్ని కొంత ఎమోషనల్‌గా విజయమ్మ వారి పార్టీ ప్లీనరీలొ చెప్పారు.

మరి ఇంత చిన్న విషయం మన మహాఙ్ఞాని అయిన లగడపాటి దీనివెనుక జగన్‌మోహన్ రెడ్డి ఉండొచ్చని ప్రకటించేలా, దానిపై CBI ఎంక్వైరీ కోరేలా ఎందుకు పురి కొల్పింది?

ఎలాగూ కోడిగుడ్డుపై ఈకలు పీకడం మన లగడపాటి గారికి అలవాటేగా అని దీన్ని తీసి పారేయలేం. ఈయన తనను తాను సింబల్‌గా అభివర్ణించుకున్న సమైక్యవాదాన్ని పక్కకు పెట్టి హటాత్తుగా జగన్ వెంట ఎందుకు పడాల్సి వచ్చింది?

ఆలోచించి చూస్తే ఈ విషయం సులభంగానే అర్థమౌతుంది. ఒకవైపు తెలంగాణా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. తెలంగాణాలో రాజీనామా చేసిన ప్రజా ప్రతినిధుల దీక్ష, తెలుగుదేశం ప్రతినిధుల బస్సుయాత్ర, JAC పిలుపునిచ్చిన బంద్‌లూ, రైల్‌రోకోలూ పూర్తిగా విజయవంతం అయ్యాయి.

దీక్ష విజయవంతం అయిన ఉత్సాహంలో కాంగ్రెస్ వారు ఆగస్టు ఒకటిన రెండు మిలియన్ జనంతో హైదరాబదు దిగ్బంధిస్తామని ప్రకటించారు. KCR దీక్షా శిబిరానికి వచ్చి వారికి సంఘీభావం తెలుపడం కూడా వారికి ఊపునిచ్చింది. ఒక్క TRS పార్టీ తలపెట్టీన మహాగర్జన కొరకే రెండున్నర మిలియన్ల ప్రజలు వచ్చిన నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు కలిస్తే రెండేం ఖర్మ, ఐదు మిలియన్ల మంది నైనా తీసుకు రాగలరు. ప్రజలు కూడా అదే ఊపు మీద ఉన్నారు. ఇక వీరితో తెలంగాణా తెలుగుదేశం నాయకులు కలిస్తే ఇక చెప్పనవసరం లేదు.

దీనికి తోడు తెలంగాణాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు సార్వత్రిక సమ్మెకు నోటీసు ఇచ్చాయి. అంటే ఆగస్టు ఒకటి తర్వాత తెలంగాణా పూర్తిగా స్థంభించి పోతుందని ఎవరికైనా అర్థం అవుతుంది. ఇప్పటికే తెలంగాణా ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి వున్నారు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, కేంద్రం తెలంగాణా ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం కాదనలేం. గతంలో కూడా రేపు హైదరాబాదు దిగ్బంధిస్తాం అన్నప్పుడు, ముందురోజు అర్ధరాత్రి కేంద్రం ప్రకటన చేయడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.

ఇక సమైక్య వాదుల ఉద్యమాలు చూద్దామా అంటే అవి ఉత్తుత్తివే అని తేలిపోయింది. ప్రజల సపోర్టు వాటికి ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాయకుల సపోర్టు కూడా కనిపించడం లేదు. జగన్ ప్రభంజనం భయంతో ఒక్క సీమాంధ్ర MP, MLA కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా లేడు.

ఈ నేపధ్యంలో ఇక విడిపోవడం తప్పదని తెలుసుకున్న లగడపాటి తన సమైక్య వాదాన్ని కాస్త పక్కకు పెట్టి, ఆంధ్రా ప్రాంతంలో ముఖ్యమంత్రి పదవికి ఏర్పాట్లు చేసుకునే ఆలోచనలో పడ్డాడని ఆయన తాజా స్టేట్‌మెంటు చూసిన వారికెవరికైనా అర్థమౌతుంది. ఇప్పుడు అధిష్టానం మెప్పు పొందాలంటే జగన్‌ని తిట్టడమే ఉన్న ఏకైక మార్గం అనేది బహిరంగ రహస్యమే కదా! అదే పని లగడపాటి చేయడంలో ఆశ్చర్య మేముంది?

ఎప్పుడూ జోస్యాలు చెప్పే మన సీమాంధ్ర Octopus లగడపాటి రాజగోpaul, ఇలా పరోక్షంగా తెలంగాణా ఏర్పాటుపై జోస్యం చెపుతున్నాడన్న మాట!

6 comments:

  1. super anna nuvvu !

    ReplyDelete
  2. ఏమి విస్లేషణ, మస్తు చెప్పినావ్

    ReplyDelete
  3. http://telugu.stalin-mao.in/61051264 సమైక్యవాదులు లేని ఉద్యమాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారు. ఈ లింక్ చదువు నాయనా. సమైక్య రాష్ట్రం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు.

    ReplyDelete
  4. Jagadapati is smarter than other "andha" leaders. During the last few months, he moved his business interests out of Telangana to the extent he could.

    ReplyDelete
  5. తెలంగాణ రెండు వారాల్లో వస్తోదంటగదా , కంగ్రాట్స్. పార్టీ కబ్ దేరా?

    ReplyDelete
  6. ప్రవీణ్ శర్మాగారు తెలంగాణ 10రోజుల్లో వస్తుందంట, కంగ్రాట్స్. మీ కృషిఫలించింది, మీ తదుపరి కార్యక్రమం? ముఖ్యమంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోముకు విజయశాంతి, చేసి మీ స్త్రీజనోద్ధరణ అజెండా అమలుచేస్తారా?

    ReplyDelete