Wednesday, July 27, 2011

ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసమైతే ప్రత్యేక దేశం ఎందుకు?


ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసమైతే ప్రత్యేక దేశం కోరండి, ప్రత్యేక రాష్ట్రం ఎందుకూ? అని కొంతమంది సీమాంధ్ర బ్లాగర్లు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ముందుగా అలాంటి వారిని కోరేది ఏమంటే, ఏది కోరాలో మమ్మల్ని నిర్ణయించు కానివ్వండి, అది కూడా మీరే నిర్నయిస్తానంటే ఎలా?

ఆత్మగౌరవం, ప్రాంతీయ స్వపరిపాలనకు ఇంకా ఈ దేశంలో అవకాశం వుందని భావించినప్పుడు ఇంకో దేశం కోరడంలో ఔచిత్యం ఏముంది? ఒక జాతి యొక్క స్వాతంత్ర్యం స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డప్పుడు మాత్రం తప్పకుండా అలాంటి ఉద్యమాలు రావడం సాధ్యం. అంటే ఒక ప్రాంతం యొక్క ప్రజాస్వామిక హక్కులకు మిగతా జాతి మొత్తం ఏకమై భంగం కలిగిస్తున్నపుడు ఒక రోజు కాకపొతే మరో రోజు అలాంటి డిమాండు తప్పక వస్తుంది.  

కాని తెలంగాణా విషయంలో అలాంటి పరిస్థితి లేదు. మిగతా రాష్ట్రాలు తెలంగాణా పై ఎలాంటి కుట్రలకు గాని అన్యాయాలకు గాని పూనుకోవడం లేదు. పైగా చాలా ప్రాంతాలు, లేదా ప్రాంతాల నాయకులు తెలంగాణా న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించక పోవడానికి తెలంగాణకి ఎటువంటి కారణం లేదు.

ఇక పొతే ప్రాంతీయ స్వపరిపాలన విషయానికి వస్తే తెలంగాణాకి పూర్తీ అన్యాయం జరుగుతుందన్నది ఇప్పటికే సర్వత్రా రుజువైన సత్యం. ఈ విషయాన్ని పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధికారికంగా గుర్తించినట్టు ప్రకటించడమే కాక పలుసందర్భాల్లో తెలంగాణా ఏర్పాటుకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం కూడా 2008 లో తెలంగాణా ఏర్పాటు యొక్క అవసరాన్ని గురించినట్టు ప్రకటించింది. ఆ మేరకు ప్రణభ్ ముఖర్జీ కమిటీకి లేఖ కూడా పంపింది.

పార్టీలే కాదు, తెలంగాణాకి జరిగిన అన్యాయాలను ప్రభుత్వాలు కూడా గుర్తించాయి కాబట్టే GO610 వంటి ఉత్తర్వులు జారీ చేసాయి. అంతెందుకు? శ్రీకృష్ణ కమిటీ కూడా గుర్తించింది కాబట్టే ఆరో సూచనలో భాగంగా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలంటే ప్రాంతీయ అభివృద్ధి బోర్డు నెలకొల్పాలని చెప్పింది. కాకపొతే అలాంటి బోర్డు పెట్టడం అది విఫలం కావడం ఇదివరకే జరిగిందనుకోండి! అందుకనే తెలంగాణలో అలాంటి బోర్డులను ఇప్పుడెవ్వరూ నమ్మడం లేదు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాకు మెజారిటీ లేదు. కాబట్టి తెలంగాణా ప్రజా ప్రతినిధులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మెజారిటీ వున్నా సీమాంధ్ర వ్యక్తీ మాత్రమే ముఖ్యమంత్రి గా వుండడం పరిపాటి అయిపొయింది. ఒక వేళ తెలంగాణాకి చెందినా వ్యక్తి ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా వచ్చినా సంవత్సరం తిరిగే లోపే వారిని దించేయడం కూడా పరిపాటిగా మారింది. అదీ ఒకప్పుడు. ఇప్పుడైతే ఆ మాత్రం సౌభాగ్యం కూడా కరువైంది. ఇంతటి ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా జూనియర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు కాని తెలంగాణలో ఎంతమంది సీనియర్ నాయకులు వున్నా ముఖ్యమంత్రి కాలేక పోవడం గమనిస్తే, సీమాంధ్ర లాబీలు ఎలా పనిచేస్తాయో ఇట్టే అర్థమౌతుంది.

దీనంతటిని చూసినప్పుడు రాజకీయంగా తెలంగాణా ఎప్పటికి రాష్ట్రంలో పైచేయి సాధించలేదని అర్థమౌతుంది. పైచేయి సాధించే సీమాంధ్ర పాలకులు తెలంగాణా ప్రయోజనాలకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటారన్న విషయం కూడా ఇప్పటికే రుజువైంది.

కాబట్టి తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడం ఒక అనివార్యతగా మారింది. ప్రజలలో వున్నా బలమైన కోరిక గ్రహించిన చంద్రశేఖర్ రావు తెలంగాణా రాష్ర సమితి స్థాపిస్తే, మిగతా పార్టీలు కూడా నిట్టనిలువుగా చీలిపోయి తెలంగాణా ప్రాంతపు కార్యకర్తలంతా పార్టీలకు అతీతంగా తెలంగాణానే సమర్థిస్తున్నారు. ఎంత ఇష్టం లేక పోయినా చంద్రబాబునాయుడు కూడా తన తెలంగాణా ఎమ్మెల్యేలతో ఉద్యమాన్ని నటింప జేస్తున్నాడంటే అది ప్రజల్లో వున్న బలమైన ఆకాంక్ష కారణంగానే. 

మరి ప్రజల్లో వున్న బలమైన బలమైన ఆకాంక్షలను రాక్షసబలంతో అణచి వేయ జూస్తే ఏమౌతుంది? చరిత్రలో లోకకంటకులైన రాక్షసులకు ప్రతి సారీ ఓటమి మాత్రమె మిగిలింది. అంతిమ విజయం ప్రజలకే దక్కింది. ఇప్పుడుకూడా తెలంగాణా ప్రజలని తమ రాక్షసబలంతో అడ్డుకోవాలని ప్రయత్నించే వారికి మొదట్లో విజయం లభిస్తున్నట్టు కనిపించ వచ్చు. కాని అంతిమంగా ప్రజలదే విజయం.


4 comments:

  1. మనమేం కోరాలో అది కూడా ఆ బుడుంకాయలే నిర్ణయిస్తారా? వీళ్ళ ఆధిపత్యం,అహంకారం పాడు గాను.ఇది నచ్చకే గదా వీళ్ళని మనం ఛీ..థూ.. అంటున్నది. అయినా వీళ్ళ బుద్ధి మారదు. సిగ్గు లేని జన్మలు!

    ReplyDelete
  2. వీల్లు మద్రాసునుండి విడిపోయేప్పుడు వీరి నినాదం కూడా ఆత్మగౌరవం, స్వయంపాలన. ఇంతకూ ఆ డిమాండ్‌కు అసలు కారణం ప్రకాశం పంతులుకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడం. అప్పుడు వీరు చేస్తే అది రైటు, ఉప్పుడు మనం జేస్తే తప్పు.

    ReplyDelete
  3. @Anonymous July 27, 2011 5:33 AM

    వాదన లేనిచోట ఇలాంటి అతితెలివి వాదనలే మొదలైతయి.

    @విశ్వరూప్

    వీళ్ళు రాజ్యాంగానికి అతీతులమని అనుకుంటారేమో! వీళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్, ఇతరులు చేస్తే మాత్రం తప్పు. వీళ్ళూ చేస్తే అది ఆత్మ గౌరవం, ఇతరులు చేస్తే వేర్పాటువాదం.

    ఫలానా బ్లాగులో మీరు చేసిన వాదన అద్భుతం. అభినందనలు. నేను ఈ పోస్టు లింకు అక్కడ పెడితే గురుడు delete చేశాడు.

    ReplyDelete
  4. సమాధానం చెప్పడం చేతకాక డిలీట్ చేసి ఉంటాడు.

    ReplyDelete