ఎంపీ రాజయ్య హటాత్తుగా లగడపాటి మీదికి తిట్లు లంకించు కున్నడు. లగడపాటి ఖబర్దార్ అట! మన కాంగ్రెస్ నాయకులు అధిష్టానం దగ్గర చిత్తై, తమ డొల్లతనం బయట పడుతుందనుకున్న ప్రతి సారీ చేసే పనే ఇది. లగడపాటినో, రాయపాటినో, కావూరినో తిట్టుడు. ఏదో గొప్ప విజయం సాధించి నట్టు జబ్బలు చరుచుకొనుడు!
రాజాన్నా! ఇది చాల పాత ఆట. ఇప్పటికే మీరు చాలా సార్లు ఈ ఆటల రానించిన్రు. ఇంక ముందు గూడ నువ్వు, నీ తోటి బఫూన్లు ఇట్లాంటి ఆటలాడి ప్రజల్ని మెప్పిస్తమనుకుంటే తప్పులో కాలేసినట్టే. ప్రజలు అన్ని గమనిస్తనే ఉన్రు. సమయం కోసం ఎదురు చూస్తున్రు. చూసి చూసి మీకు దిమ్మ దిరిగే జవాబు ఇస్తరు.
రాజీనామాలు చెయ్యమంటే ఒక్కనికి చాతగాదు. పైనించి మాకంటే పెద్ద తెలంగాణా వాడి లేదని పోజులు. మీకు చాత గాకపోతే మాటని గాదని చెప్పున్రి. ప్రజలు వాళ్ళ తొవ్వ వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని నిచ్చెనెక్కలేనోల్లు ఎవరెస్టు ఎక్కుత మన్నట్టు బిల్డప్పు ఇవ్వకున్రి. మీకు తెలంగాణా వచ్చుడు ఇష్టం లేదంటరా, ఆ ముక్క సాఫ్ సాఫ్ జెప్పున్రి. అంతేగని ఈ నల్లికుట్ల ఎవ్వారాలు పనికి రావు.
మీ మీటింగుల నాటకాలు ఇప్పుడు ఎవ్వడుగూడ చూసి నమ్ముతలేడు. మీరు చెయ్యగలిగితే కేంద్రం దిమ్మ దిరిగే విధంగా రాజీనామాలు చేసి ప్రజల దగ్గరికి రాన్రి. అప్పుడు ఆంధ్రా ఎంపీలు గూడ రాజీనామాలు చేస్తరా, చెయ్యరా అన్నది మీకనవసరం. అందరు చేస్తే బలాబలాలు తేల్చనీకి ప్రజాకోర్టు ఉండనే ఉన్నది. ముందు మీ నిజాయితీ ఎంత ఉన్నది అనే విషయం బయటికి రావాలె.
చెయ్యమంటరా, నోర్మూసుకొని గమ్మున ఉండున్రి. ప్రజలు తేల్చుకుంటారు మిమ్ముల ఏం జేయ్యాల్నో, తెలంగాణా ఎట్లా తెచ్చుకోవాలనో. అంతేగాని దొంగనాటకాలు ఆడుకుంట ఇట్లనే కాలం గడుపుతమని, ప్రజలని ఇంకా మభ్యపెట్ట గలుగుతమని మీరు అనుకుంటే అది కేవలం మీ భ్రమ!
అమ్మయ్య ! ఇన్నాళ్ళకి తెలంగాణావాదులకి తమ అసలు శత్రువెవరో తెలిసొచ్చింది . మంచి పోస్ట్ . అభినందనలు .
ReplyDeleteతెలంగాన వాలకి అన్ని తెలుసు.... తెల్వనత్లు నటించెది అంధ్రా వాలె...
ReplyDeleteFinally ..
ReplyDelete