Thursday, June 30, 2011

మన సమైక్యవాది పోస్టు ఉపసంహరించిన విధంబెట్టిదనిన

ఎనకటికి ఇద్దరన్నదమ్ములు ఉండే వాళ్ళట. ఇద్దరూ కలిసి ఒక దగ్గరే ఉండే వాళ్ళట. అన్న ఒంటెద్దు పోకడ నచ్చక అప్పుడప్పుడు తమ్ముడు విడిపోతనని చెప్పే వాడట. అంతే, ఇంక అన్న బూతులు లంకించు కునే వాడట! అన్నకు భయపడి తమ్ముడు నోరు మూసుకునే వాడట.

ఇలా కొంత కాలం జరిగినంక తమ్ముడు అన్న పెత్తనం సహించలేని పరిస్థితికి వచ్చిండు. అప్పుడు విడిపోతనంటే అన్న తిట్టే బూతులకు భయపడే దశ వెళ్లి పోయింది. అన్న రెండు తిడితే, తమ్ముడు నాలుగు తిట్టిండు. అప్పుడు బుద్దొచ్చింది అన్నకు, కలిపి ఉంచాలంటే తిట్టి చిన్న పిల్లలను కలిపి ఉంచొచ్చేమో కానీ, పెద్దవాళ్ళను కలిపి ఉంచలేమని.

కాని ఈ సంగతి తెలువక మన సోదరుడొకడు 'విశాలాంధ్ర మహాసభ' అని ఒక బ్లాగు పెట్టుకొని తెలంగాణా వారి మీద తిట్ల పురాణం లంకించు కున్నడు. ఈయన తిట్లు చూసిన వాళ్ళు కలల కూడా మళ్ళీ కలిసి ఉంటామని అనుకోరు. ఈయన ఒక విధంగా విడిపోదామనే వాళ్ళకు మేలే చేస్తుండు. మల్ల కలిసే ఆలోచన కూడ రాకుండ చేస్తుండు. అట్లనే ఎవరన్న సమైక్యత,  చట్టుబండలు అనుకుంట ఊగిసలాడుతుంటే వాల్లగ్గూడ సరైన నిర్ణయం తీసుకొనేటందుకు చాతనైనంత సహాయపడుతుండు. 

ఈ మధ్య్యన పైత్యం ఎక్కువై చనిపోయినోల్ల మీద కూడ తిట్లు లంకించు కునుడు మొదలు పెట్టిండు. అందులో ఒకరు జయశంకర్. ఇంకొకరు బుర్ర రాములు. వీళ్ళు చీమకు కూడా అపకారం తలపెట్టే వాళ్ళు కాదు. కాకపొతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద నిలబడ్డ వారు. అదే సదరు పెద్దమనిషికి పెద్ద నేరం లెక్క కనిపిచ్చింది. వాళ్ళు ప్రలలను తప్పు దోవ పట్టించి పబ్బం గడుపుకున్నరట! ఎవరు పబ్బాలు గడుపుకుంటున్నరో, ఎవరు పస్తులుంటున్నరో ఇక్కడ తెలువనోడు ఎవడు. తెలిసి తెలువనట్టు నటించే వోడు ఉంటె ఉండొచ్చు.

ఇంకా ఆవాకులు చవాకులు చాలనే పేలిండు. అవ్వన్నీ ఇక్కడ వివరించడానికి చనిపోయిన వారికి, మనకు కూడ గౌరవం కాదు.

ఈయన రాతలు చూసి సాటి సీమాంధ్ర సోదరులే రోత రాతలను అసహ్యించు కున్నరు. ఇటువంటి పోస్తులేసి సాధించేది ఏమిటని ఈయనకు ఫుల్లుగా గడ్డి పెట్టిన్రు. దెబ్బకి మనోడు పోస్టు ఉపసంహరించు కున్నడు. చివరగా చెప్పేదేమంటే, ఇటువంటివారా, సమైక్యత కోసం పాటు పడేది? వీళ్ళు పాటుపడేది రాష్ట్ర సమైక్యత కోసం కాదు, తప్పుడు ప్రచారాలతో కొంతమంది దోపిడీదారుల కొమ్ముకాసి తమ పబ్బం గడుపుకోవడం కోసం.

13 comments:

  1. correct cheppinav anna

    ReplyDelete
  2. సమైక్యవాదిJuly 1, 2011 at 1:20 PM

    ఆహా... అప్పటికేదో తెలంగాణా వాదులంతా శుద్ధ సంస్కృతంలో మాట్లాడుతున్నట్లు పెద్ద చెప్పొచ్చావు.

    ReplyDelete
  3. @సమైక్యవాది

    అర్థం కాకపోతె మరొకసారి చదువన్నా, కామెంటు పెట్టేముందు. తెలంగాణా వాళ్ళు ఏ భాషల తిడుతున్నరనేది ఇక్కడ విషయం కాదు. విడిపోవాలనుకునే వాడు, తిట్టడానికి, కలిసుందామనుకునే వాడు తిట్టడానికి తేడా లేదా? ఇకవైపు నీచాతి నీచంగ తిట్టుకుంట సమైక్యంగ ఉందమనుడు మాత్రం కేవలం మన నయా సమైక్యవాదులకే చెల్లు.

    ReplyDelete
  4. "ఈయన రాతలు చూసి సాటి సీమాంధ్ర సోదరులే రోత రాతలను అసహ్యించు కున్నరు. ఇటువంటి పోస్తులేసి సాధించేది ఏమిటని ఈయనకు ఫుల్లుగా గడ్డి పెట్టిన్రు. దెబ్బకి మనోడు పోస్టు ఉపసంహరించు కున్నడు."

    కథ బానే సెప్పినవు గాని అందులో తిట్లు ఎక్కడ ఉన్నాయి నాయనా? ఉద్యమాలు పేరుతో ప్రతీ వాడు సన్నాసి కబుర్లు చెప్తూ నోరుపారేసుకోవడమే. తిట్లదండకంలో వేర్పాటువాదులతో పోటీపడేది ఎవరు? రవీంద్రనాథ్ అనే బ్లాగర్ సహనం కోల్పోయి ఇద్దరు సచ్చినోళ్ళ కథ అంటూ రాసుకొచ్చాడు. ఆ పదం నచ్చక మాకుగా మేమే తీసివేశాము.ఆయనకు నేను వ్యక్తిగతంగా ఫోను చేసి సమైక్యవాదులు పదేళ్ళుగా ఎన్నో భరించారు, తెలంగాణా ప్రాంతంలో అయితే వారు బయటకు వచ్చి నోరు విప్పే పరిస్థితి కూడా లేదు. అంత గొప్పగా సాగుతున్న ఉద్యమం బాటపై కాళ్ళు పెట్టనే వద్దు అని చెప్పాను.ఆయన కూడా ఇక మీదట విశాలంధ్ర మహాసభ బ్లాగుపై అటువంటి పోస్ట్ లు చెయ్యనన్నారు

    ReplyDelete
  5. @చైతన్య,

    మీ బ్లాగుల రాతలు ఎట్ల ఉంటయో ఒక్క ఐదు సెచండ్లు చూసినోని కెవనికైనా తెలిసి పోతది. ఈప్పుడు నువ్వే అన్నవౌ కద, "వేర్పాటువాదులు" అని. నీకు అది తిట్టు అని అనిపించక పోవచ్చు, ఎందుకంటె తిట్టేది నువ్వు కాబట్టి.

    దేశ విభజన కోరే కాశ్మీరీ తీవ్ర వాదులను వేర్పాటు వాదులుగా పరిగణిస్తున్నప్పుడు వాళ్ళతో జతకలిపి రాజ్యాంగ బద్ధంగా రాష్ట్ర విభజన కోరుతున్న తెలంగానా ప్రజలను "వేర్పాటు వాదులు" అని పిలవడంల ఔచిత్యం ఏమిటి? రాష్ట్ర విభజన కోరే వారు వేర్పాటు వాదులైతే మద్రాసు నుంచి విడిపోయిన మీరేవరు?

    అర్ధంతరంగా ఇద్దరూ పుట్ట కురుపు వచ్చి చచ్చారు

    ద్రోహులతో చేయి కలిపి...

    వారు ఇంటర్మీడియట్ చదివే రోజులలోనే 1952 లో దేశద్రోహం చేసిన ఘనత కలిగినవారు

    ఈ రక్త పిశాచుల పీడా రాష్ట్రానికి వదిలింది

    చచ్చి ఏ నరకంలో ఉన్నారో కానీ అక్కడయినా మిగిలిన పాపుల్ని చెడగొట్టకుండా ఉంటే అంతే చాలు


    ఇంత నీచంగా రాయడం మీ కుహనా సమైక్య వాదులకు తప్ప ఎవరికి సాధ్య పదుతది తండ్రీ. ఎవడైనా వేరొక ప్రాంతం తో సయోధ్య వహించాలనుకునే వాడు ఇంత నీచంగా ఒక ప్రాంతం వారు గౌరవించే వ్యక్తి పై అదీ చనిపోయిన తర్వాత ఇలాంటి భాష వాడుతడా? చూడబోతే మీగ్యాంగే "రక్త చరిత్ర" పేరుతో కామెంట్లు రాస్తున్నరేమోనని అనుమానం వస్తుంది.

    ReplyDelete
  6. వీల్లది విశాలాంధ్ర మహాసభ కాదు, కబ్జాకోర్ల మహాసభ. అందుకే లగడపాటి లాంటి వాల్లను తెగ వెనుకేసుకొస్తారు. బుర్ర రాములు, జయశంకర్ లాంటి హక్కుల కార్యకర్తలను, నిస్వార్ధ సేవకులను తిట్టిపోసే జోకర్ రాల్లబండి ఇంతకుముందు రాసిన ప్రపంచంలోనే అతిపెద్ద జోకు "మీవిమలక్క వచ్చి మాలగడపాటి లాంకోహిల్స్‌ను కబ్జా చెయ్యలేదా" అని. అంటే ఈవర్గం ఎవరికి కొమ్ముగాస్తుందో తెలుస్తోంది.

    నేను సమైక్యవాదినని ఎన్నడూ చెప్పుకోలేదు, శ్రీబాగ్ ఒప్పందం, పెద్దమనుషుల ఒప్పందం వల్ల మామధ్యకోస్తా నష్టపోయింది, వీల్లు వెనుకబాటుతనం పేరు చెప్పి మనమీద దోపిడీ చేస్తున్నారు అని రాసే అచంగనూ తమ గ్రూపులో చేర్చుకున్నారు. అంటే విశాలాంధ్ర అని పేరుపెట్టుకున్న ఈవర్గం రాష్ట్రంలోని ధనిక మధ్యకోస్తా జీవుల గ్రూపు తప్ప సమైక్యవాదన వీరి ఉద్దేషం కాదులాగుంది. సమిక్య రాష్ట్రంలో ఎక్కువ లబ్ది పొందుతుంది స్వతహాగా ఈవర్గమే కదా?

    మంచీ, చెడు, నీతి, అవినీతిల తేడా తెలియని ఈవర్గానికి కబ్జాకోర్లను తిట్టడానికీ, హక్కుల కార్యకర్తలను తిట్టడానికీ తేడా కూడా తెలిసినట్టు లేదు.

    ReplyDelete
  7. రక్త చరిత్ర is snkr ..

    ReplyDelete
  8. విశ్వరూప్ గారు,

    సామ్రాజ్యవాదానికి కొత్తరూపమే సమైక్యవాదం. రేపు ఏ అమెరికా వాడో, చైనా వాడో వచ్చి "సమైక్యంగా ఉందాం" అన్నా అంటాడు వీళ్ళ దగ్గర నేర్చుకుని. ఇక్కడ సమైక్యవాదమంటే అంటే బలహీనున్ని రోజూ "నువ్వు తెలివి తక్కువ వాడివి" అంటూ వాణ్ణి మానసికంగా బలహీనం చేసి ఆ తర్వాత తేరగా దోచుకోవడం.

    ReplyDelete
  9. శ్రీకాంతాచారి గారూ,
    /ఒక ప్రాంతం వారు గౌరవించే వ్యక్తి పై/ ఈ మాట తెలంగాణవాదులంటే నాకు నవ్వొచ్చింది. శ్రీశ్రీ సమైక్యవాదాన్ని సమర్థించినందుకు ఆయనపై జరిగిన అవమానాలు మా విశాఖ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. ఒక అల్లూరిని, ఒక అన్నమాచార్యని మా ప్రాంతములో నెత్తిమీద పెట్టుకుంటాం. మరి మీరు చేసిన సత్కారం ఏమిటి ట్యాంకుబండుపై?
    ఈ కామెంట్ ఎలాగూ ప్రచురిస్తారన్న నమ్మకం నాకు లేదు లెండి.

    ReplyDelete
  10. ఒక ఉద్యమం జరిగేటప్పుడు ఆవేశ కావేషాలు సహజం. మీరు మొదటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి విగ్రహం ధ్వంసం చేసి గోదాట్లో గిరాటెయ్యడం మరిచి పొయ్యిండ్రా? ప్రత్యేకాంధ్ర ఉద్యమంల భాగంగ విజయవాడ రేడియో స్టేషన్‌తో సహా పలు ప్రభుత్వ ఆస్తులు బుగ్గిపాలు చెయ్యలేదా?

    జై ఆంధ్రా అనుకుంట ఈ పనులు చేస్తె అర్థం చేసుకోవచ్చు. మరి సమైక్యత పేరు చెప్పి ఇవ్వే పనులు చేసే వాళ్ళను ఏమనాలె?

    ReplyDelete
  11. వేరుపడాలనుకునే వాళ్ళను వేర్పాటువాదులనే అంటారు నాయన. నీకు తెలుగు భాష అంతగా వచ్చినట్టు లేదు. తెలుగులో ఇంకొక సరియైన పదమేమైనా ఉంటే చెప్పు నాయన

    మీ వింత వాదనలు ఎలా వున్నాయంటే అప్పుడెప్పుడో ఆజాద్ అనే నక్సల్ నాయకుడు "united militant mass struggle against fascist regime to achieve separate Telangana" అన్న మాటను పట్టుకొని మోసపూరిత వాదనల మాయలో పడి తెలంగాణా రాష్ట్ర మొస్తే బ్రతుకు బాధలు తీరిపోతాయి అని నమ్మే అమాయక పల్లెవాడు కూడా నక్సల్ అయిపోతాడు. ఆ కామెంట్ ఒక్కటి చాలు "sedition" ఛార్జ్ మోపడానికి.ఎవడో ఒకడు ఏదో వ్యాఖ్య చేసాడని సమైక్యవాదులందరినీ ఒక్క గాటిన కట్టివేస్తే మీరు నిజంగానే దేశ ద్రోహులవుతారు

    ReplyDelete
  12. @చైతన్య

    >>>వేరుపడాలనుకునే వాళ్ళను వేర్పాటువాదులనే అంటారు నాయన. నీకు తెలుగు భాష అంతగా వచ్చినట్టు లేదు.

    నా తెలుగు గురించి మీరు బాధ పడనవసరం లేదు. మీకు అంతగా తెలుగు వచ్చుంటే "ప్రముఖ వేర్పాటువాది పొట్టి శ్రీరాములు" అని ఒక టపా వెయ్యున్రి, అప్పుడు మీ నిజాయితీ నమ్ముత. అంతే గని తెలంగానా వారిని వేర్పాటు వాదులంటూ, పొట్టిని మాత్రం అమరజీవి అనుకుంట మీరు ఆడే దొంగ నాటకాలు భాష ముసుగులో కప్పి పెట్టలేరు.

    >>>అప్పుడెప్పుడో ఆజాద్ అనే నక్సల్ నాయకుడు...

    ఎవరో నక్సలైటు ఏదో అన్నడని ఇక్కడ ఎవ్వరు తెలంగాణా కోరడం లేదు. అసలు ఆ ఆజాద్ ఎవరో కూడ మీకు తెలిసినంత ఇక్కడి ప్రజలకు తెలువదు. అవన్నీ మీ దుష్ప్రచారంల భాగమే. తెలంగాణా రాష్ట్రం కోరడానికి మాకు వంద కారణాలున్నయి. అందులో ఏ ఒక్క కారణమైనా చాలు మీ నుండి విడిపోవడానికి. మీరు ఒక్క నీటి సమస్య వల్లే మద్రాసు నుండి వేరుపడిన విషయం మరిచిపోకండి.

    >>>ఒకడు ఏదో వ్యాఖ్య చేసాడని సమైక్యవాదులందరినీ ఒక్క గాటిన కట్టివేస్తే మీరు నిజంగానే దేశ ద్రోహులవుతారు

    ఎవడో ఒకడు ఏమిటి? తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును సమ్ర్థించే సీమాంధ్ర సోదరులను వదిలేస్తే, సమైక్యత పేరు చెప్పే ప్రతి ఒక్కడూ రోజూ చేసే పని అదేగా. తెలంగాణా వాళ్ళని, తెలంగాణా ప్రజల నాయకులని వీలయినంత తిట్టడం. ఎప్పుడొ కేసీయార్ ఏదో అన్నడని భారథ రాజ్యాంగం పరిధిలో మొదలైన processని వ్యతిరేకించి ఇప్పటికే మీరు దేషద్రొహులయ్యారన్న విషయం గుర్తుంచు కోండి.

    రాష్ట్ర విభజన కోరడం దేశ ద్రోహమైతే, మీరు 1952లోనే దేశద్రోహులు. ఎవరో ఏదో వ్యాఖ్య చేసిండని అందరు తెలంగాణా వారినీ ఒకే గాటన కట్టేస్తున్నరు కదా, మీరు దేశద్రోహులేనా?

    ReplyDelete
  13. Just chanced on this post by accident. The so called "అప్పుడెప్పుడో ఆజాద్ అనే నక్సల్ నాయకుడు" was born Cherukuri Rajkumar in Vijayawada. Not sure if the commenter is aware of this?

    ReplyDelete