Friday, June 3, 2011

గడ్డం రాజా, లాటిన్ రాణి

పెద్దపార్టీ బీజేపీ
మద్దతిస్తా బిల్లు పెట్టని 
మొత్తుకున్నా చెవుల పడదట
మాటలాడని లాటినమ్మకు
బాబు మాటే వేదవాక్కట!
బాబు ఉత్తరమిస్తే చాలు
ఉరుక్కుంటూ బిల్లు పెట్టి 
తెలంగాణా ఇస్తదంట!

ప్రతి పక్షం ఛీ ఆన్నా
సొంత కుంపటి బద్దలైనా 
అణుశక్తి బిల్లు మాత్రం 
ఆవురావురు మంట చేస్తివి
ఇప్పుడెందుకు దొంగ ఆటలు 
చెప్పవమ్మ ఇటలి మాతా?

నక్కజిత్తుల చంద్రబాబు
ఊసరెల్లి కన్న మిన్నగ  
రంగులన్నీ మార్చి మార్చి 
కొత్త రాగం అందుకున్నడు
తాను మాత్రం ఏమి జెప్పక 
గోడ మీది పిల్లి లెక్క 
అటూ గాక ఇటూ గాక
చోద్యమంతా చూస్తడంట!

సోనియమ్మ నిర్ణయిస్తే 
దాని మంచి చెడ్డలన్నీ
అప్పుడే మాట్లాడుతాడట!
సిగ్గులేని ఈన మాటలు
బ్లాకుమెయిలుకు ఏమి తక్కువ?
ఆత్మ వంచన కేమి ఎక్కువ?
  

2 comments:

  1. నేను కొస్తాంధ్ర ప్రాంతం వాడిని . తెలంగాణా ప్రాంతం హైదరాబాద్ రాజధానిగా వెంటనే విడిపోవాలని మనసారా కోరుకుంటున్నవాడిని . ఇక్కడ మనం ఎంత నెత్తీ నోరు బాదుకున్నా .. చంద్రబాబు , సోనియాల లెక్కలు తేలే దాకా తెలంగాణా ఏర్పాటయ్యే అవకాశాలు తక్కువ . ఈ దేశంలో ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయ నిర్ణయాలు జరగట్లేదు . రాజకీయ పార్టీలు , బడా బాబుల లాభ నష్టాల తక్కెడ ఎటు మొగ్గుతుందో అటు వైపే నిర్ణయాలు జరిగిపోతుంటాయి . అందువల్లనే .. ఈ నిర్ణయాలు చాలాసార్లు న్యాయానికీ , ధర్మానికీ , ప్రజలకీ వ్యతిరేకంగా ఉంటాయి . చక్కగా రాస్తున్నారు . అభినందనలు .

    ReplyDelete
  2. రమణ గారు,

    మీలాంటి వారి సహకారం, నైతిక బలం మా ఉద్యమానికి ఎంతో అవసరం. ధన్యవాదాలు.

    లెక్కలు 2014లో ఎలాగూ తేలుతాయి. కాకపోతే ఈలోపు కాంగ్రేస్, TDP ఎన్నికలప్పుడు, తర్వాత ఆడే దొంగాటలను ప్రజలముందు ఎండగట్టే అవసరం ఉంది.

    ReplyDelete