Thursday, June 30, 2011

ఇంక తన్నులు తినుడు బంద్

అన్ని డేడ్ లైన్లూ ముగిసి పోయినై. కేంద్రం తెలంగాణాకి మొండి చెయ్యి చూపుతుందని  అర్థమైతుంది. రాజకీయ నాయకులు జోరుగ మంతనాలు జరుపుతున్రు. కాని రాజీనామా చేయ్యాలె నంటే ఒక్కడు కూడా ముందుకు రాడు. ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చెయ్యమంటే 'సీమాంధ్ర వాళ్ళు గూడ చేస్తరు, అప్పుడు మా రాజీనామాలకు విలువ ఉండదని' మాట్లాడుతరు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు చెయ్యక పొతే పోయిన్రు, కనీసం రాష్ట్ర మంత్రులన్న చేయ్యున్రి. ఈ ప్రభుత్వంల తెలంగాణా భాగస్వామ్యం లేదు అని చెప్పుతందుకైనా చెయ్యున్రి. ఇప్పుడు గూడ మీరు చెయ్యలేక పొతే 2014 ల మీరు భూస్థాపితం కాక తప్పదు.

రాజీనామాలు చేయ్యున్రా అని ఒకవైపు నుంచి చెప్పుతుంటే ఒకడు పొయ్యి ఉప ముఖ్యమంత్రికి పైరవీలు చేసుకుంటడు. ఇంకోడు మండలి ఇస్తమంటే తల ఊపి వస్తడు. ఇట్లాంటి చెడబుట్టిన చీడ పురుగుల్ని ఇకనైనా ఏరి వెయ్యకపోతే తెలంగాణా మొత్తాన్ని నాశనం బట్టిస్తరు వీళ్ళు.

ఇంకో ఇద్దరు మంత్రులున్నరు. మాట మాట్లాడితే హైదరాబాదు మేం హైదరాబాదు బిడ్డలమంటరు. హైదరాబాదు ప్రజలకు రావలసిన పోలీసు ఉద్యోగాలు ఫ్రీజోన్ పేరు మీద ఎగిరి పోతుంటే వీళ్ళకు పట్టదు. హైదరాబాదుకు మంచినీల్లోచ్చే ప్రాజెక్టుల గురించి వీళ్ళకు పట్టదు. మెట్రో రైలు పేరు జెప్పి హైదరాబాదు మొత్తం రూపం మార్చేస్తుంటే వీళ్ళకు చీమ కుట్టదు. మిమ్మల్ని ప్రజలు గమనిస్తనే ఉన్నార్రా నాయనా! ఎగిరి పడకున్రి. తొందర లోనే మీరు కిందబడే రోజొస్తది.

ఇంక పొతే రకరకాల జాకులారా, మీరు బందులు పెట్టించి ధర్నాలు జేసి తెలంగాణా ప్రజలకు నష్టాలు కలిగిచ్చుడు, మీరు తన్నులు తినుడు తప్ప అసలు వలసవాది కులాసగానే ఉంటున్నడు. ఇంక మీరు తన్నులు తినుడు, మీ జనాన్ని ఇబ్బంది పెట్టుడు బందు జేయ్యున్రి. మీరు ఇబ్బందులు పెట్టగలిగితే వలస శత్రువును ఇబ్బంది పెట్టున్రి. 

లాంకోహిల్స్ మీద జెండా పాతిన విమలక్కని ఆదర్శం చేసుకొని పోరాటాలు చేయ్యున్రి. అక్రమాలు చేసే కబ్జాకోర్లు ఇకపై ఆటలు సాగవనే గుణపాఠం నేర్వాలే. అంతే గని మీరు దెబ్బలు తిని దవాఖానల మూలుగుతుంటే చూసి నవ్వుడు గాదు.         


2 comments:

  1. తెలంగాణా ప్రాంతాన్నీ , ప్రజలనీ సీమాంధ్రులు అన్యాయం చేశారని అంటారు గానీ .. తెలంగాణాకి ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు చేసిన ద్రోహంతో పోలిస్తే .. సీమాంధ్రులు దేవుళ్ళు . డిసెంబర్ తొమ్మిది ప్రకటనని సొమ్ము చేసుకుందామని పోటీ పడే అవకాశవాదులు తెలంగాణా కాంగ్రెస్ , తెలుగు దేశం నాయకులు . తెలంగాణా ప్రజలు శాపగ్రస్తులా ? అందుకే ఈ ప్రాంతానికి పరమ స్వార్ధ , నీతిబాహ్య నాయకులు ప్రాతినిద్యం వహిస్తున్నారా ! 2014 లోపు ఈ దౌర్భాగ్యులకి బుద్ధి చెప్పే మార్గం లేదా ?

    ReplyDelete
  2. రమణ గారు

    ఒకప్పుడు నిజాం పంచన చేరి ప్రజలను పీల్చి పిప్పి చేసిన వారి వారసులే ఈ నాయకులు. అదే వారసత్వం పుణికి పుచ్చుకొని ఈనాటికీ అదే దోపిడీకి, అవకాశ వాదానికి అలవాటు పడ్డరు. అయితే వీరి ఆటలకు ముగింపు పలికే రోజొచ్చింది.

    ఇంకో విషయం. ఇలాంటి నాయకులే ఆంధ్రాలో కూడ ఉన్నరు. వారి ముగింపు ఆంధ్ర రాష్టం ఏర్పడ్డంక వస్తది. పెద్ద గీత కింద చిన్న గీత కనపడనట్టు, కొంతమంది సీమాంధ్రులు తమ నాయకులు గొప్పవారని భ్రమ పడుతున్నారు.

    ReplyDelete