Tuesday, June 14, 2011

జయప్రకాష్, ఏమైంది నీ గొంతు?

జయప్రకాష్ నారాయణ్ సార్! ఇన్ని దినాలు నువ్వే అవినీతిని ఎండగట్టే టందుకు ఉన్న ఒకే ఒక హీరోవి అనుకున్నం. ప్రతిచిన్న విషయం మీద కూడా దేశంల ఉన్న అవినీతి గురించి మొదలు పెట్టి పెద్ద పెద్ద లెక్చర్లు దంచుతుంటవు. నీతి నిజాయితీలకి, ప్రజాస్వామ్యానికి పర్యాయపదం నీవే నన్నంత హంగామా జేస్తవు.

అసెంబ్లీల చిన్న గలభా కాంగనే అసువులు బాసినంత పని జేసినవు. భారత ప్రాజాస్వామ్యాన్ని రక్షించేటందుకే పుట్టిన పరమాత్ముని లెక్క పోజు పెట్టినవు. ఇప్పుడు దేశమంత అవినీతి, అక్రమ సంపాదనలకు వ్యతిరేకంగా అట్టుడికి పోతుంటె, అనర్ఘళంగా మాట్లాడే నీ గొంతు మాత్రం ఎక్కడ వినొస్తలేదు. ఏంది ఈ మాయ సామీ?

నేనయితే హజారే దీక్ష మొదలు కాంగనే నువ్వు డిల్లీలనే  కూసుంట వనుకున్న. లోక్ పాల్ పెట్టేదాంక నిద్రపోవను కుంటినే! మరి నీజాడ భూతద్దం పెట్టినా ఎక్కడ కనపడక పాయె. మన జయప్రకాష్ సారు కాకుండా ఇంతమంది వేరేవాళ్ళు అవినీతి మీద పోరాటం జేస్తున్నరా అని ఒక్కటే పరేశానైతి!

ఒకవైపు హజారే, కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ అరిచి గోలగోల చేస్తున్రు. ప్రభుత్వం నోట్లె మాట ఎల్లకుండా గోస పెడుతున్నరు. ఇంకో వైపు దేశభక్తి కోసమో, సొంత లాభం కోసమో తెలవదు గని మన యోగాసనాల బాబా రాందేవ్ కూడా దీక్షలు చేసుకుంట ప్రభుత్వానికి నిద్రబట్టకుంట చేయబట్టే. 

ఇంత మంది ఇన్ని చేస్తుంటే అవినీతి పేటెంటు మీద అసలు హక్కు దారునివి నువ్వేందన్న, గిట్ల మాట ముచ్చెట లేకుండ గమ్మునున్నవు? నువ్వు డిల్లీకి  పోవాలె, దీక్షకు కూసోవాలే, ధూంధాం జెయ్యాలె. అదను మీద ఉన్నప్పుడు పంట ఎయ్యాలె, గప్పుడే లాభాలోస్తాయి. గిది అవినీతి పై పోరాటాలు జేసే సీజన్. మరి నువ్వు ఇంట్ల కూసుంటే ఎట్ల?

పోరాటం చేస్తే సోనియమ్మా ఏమనుకుంటదో, మన్మోహన్ ఏమనుకుంటదో  అని పరేషాన్ అయితున్నవా? ఎవ్వరిని పరేషాన్ పెట్టకుంటే పార్టీ ఎట్ల పెద్దయితదన్నా? ఎప్పుడు జూడు తెలంగానోల్లని పరేషాన్ జేసుడు దప్ప ఇంకెవ్వల్ని పరేషాన్ జేసుడు ఇష్టం లేదా ఏంది?

చూడు మరి, నీ ఉన్న ఒక్క పేటెంటు హజారేగుంపు కొట్కపొతే వచ్చే ఎలక్షన్ల నీకు ఒక్క సీటు గూడ రాదు. అందుకే చెప్పుతున్న, 'సందుల మందాయే సన్నాసి పెండ్లాయే' అన్నట్టు నువ్వుగూడ డిల్లీకి పొయ్యి ఒక టెంటు ఏసుకొని దీక్ష చెయ్యరాదే! ఇక్కడ కొంపలు మునిగే రాజకీయాలేమున్నయి గనుక!

15 comments:

  1. thanks anonymous. I am thinking of doing the same thing.

    ReplyDelete
  2. mari mee kcr ni kooda todampu

    ReplyDelete
  3. Dear Srikanthachari,

    Do you mind apologizing JP for scandelously writing this nonsense as you have evidence now that Loksatta did present its views rather categorically.

    ReplyDelete
  4. yavadi pichi vaadiki aandam ani jpni vadileyandi

    ReplyDelete
  5. అరె అన్న మస్తుగా రాసినావే
    ఈ JP సారూ ఏమి జేస్తాడో ఏమో
    నాకైతే సమజవుతల్లె
    ఈ పెద్దాయన రాగానే మస్తు ఖుషీ అయినా
    ఓటు కూడా వేసినా
    ఇప్పుడేమో సప్పుడు జేస్తల్లె
    ఉద్యమానికి రాజకీయ రాగు పూసినార్ అన్నా
    మత పిచ్చి అద్ది మనలని మోసం జేస్తున్నారు సెత్త నాయాళ్ళు

    ReplyDelete
  6. Anonymous at the top,

    Thanks for painstakingly giving the links.

    You don't get my point. I am not talking about his paper work. And I have no doubts that he is number 1 at paper work. It is the time for concrete actions and not just paper work since time has come and people demanding that. Man, symbolic gestures like a bureaucrat would not do any good in a democracy like ours. Leader need to be in the front line and fight for the cause he believes in. And it is right time to do so. If he does not believe, it is a different matter.

    If just gestures are enough, even KCR, Jagan, CBN have also supported Hajare.

    @Anonymous June 14, 2011 12:22 PM

    KCR has a different duty to perform. And so far he is doing well. Your comment is enough evidence for that.

    @Anonymous June 14, 2011 7:14 PM

    I am just reminding JP of his duty of the hour (not picchi ofcourse).

    @Apparao Sastri

    Thanks Anna

    ReplyDelete
  7. Dear Srikanthachari, I have completely understood your point, and infact before you posted I could anticipate your reply.

    Do you think just because 5 members from civil society sit before govt we get a beautiful lokpal bill?. Just watch the video I have posted, people were discussing day long on what should be there and what not in the bill. Given that Anna has already brought govt to agree to draft a bill, just as you said KCR has different duty to perform, JP has different duty to perform. In my opinion he stuck to it.

    As per limitations LSP has had in terms of cadre and ideology(like TRS, they can not just go and attack someone), it had done enough on its part in corruption movement. And its not just paper work, lot of negotiations and brining everyone to one table, which many movemets for example telangana movement is lacking. You can see the results in farmers movement,in which lsp is directly involved, already some of the demands accepted.

    I differ with your statement that these are just symbolic gestures. And very often even agitations on streets also do not give any results. What has telangana movement achieved so far, what has 1969 movement, 1972 movement achieved? event without comparing to the losses we got.

    ReplyDelete
  8. Anonymous,

    I think you are still not getting my point.

    I never questioned his commitment on his ideals. I only questioned his way of fighting things. The bureaucratic style he adopts never yield any results.

    I don't agree if you say just back end preparation work would resolve the matters. Politicos are habituated to eat public money for ages. It is not that easy to make them saints. Don't you see how the union government resisting to accept the bill without the changes they want in spite of wider public opinion.

    Also, the man who made a hue and cry and came on air in minute after someone tears papers and pulls a microphone in assembly, never bothers to give a hand of his own when there was an uproar in Delhi on his very favourite movement.

    Also I do not understand what was the other duty he is performing. If some demands of farmers solved why do you think it is because of him, why not Jagan or CBN?

    If T-movement could be solved over round table, it would not have come to this far. Don't you see how the Nikrushta Committee sold itself to the bigwigs who have interests in Hyderabad?

    ReplyDelete
  9. >>>We want ideal mixture of two.

    I 100% agree with you.

    ReplyDelete
  10. కేవలం తెలంగాణా మీద ,మీ అభిప్రాయం తో ఎకీవభించని కారణాన జే పి గారిని తప్పు పట్టడమో ,ఎగతాళి చేయడమో చేస్తున్నారు.
    జే పి గారు, అవినీతి విషయం కానియ్యండి ,విదేశాల్లో దాచిన నల్ల ధనం కానియ్యండి,ఎన్నికల పద్ధతుల మీద కాని,నాగరిక జీవితానికి కావలసిన అన్ని సమస్యలకి జే పి గారు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చెప్ప గలరు.
    కాక పోతే మనమే వెనుకబడి ఉన్నాము.
    మనకు మాజిక్కులు చేసే బాబాలు ,మాటి మాటికి రాజీనామా లిచ్చి మళ్ళి మళ్లీ ఎలక్షన్స్ పెట్టించి ,ప్రజా ప్రతినిధుల ఆటపాటలు ,స్టంట్లు ,వంటా వార్పులు ,సెగలు ,తోపులాటలు ,కావాలని తెచ్చిపెట్టుకున్న ,మరచిపోయిన యాస అతికించుకుని కేవలం'' టైం పాస్ '' కోసం అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము.
    ఈ నిరాహార దీక్షలు ,కిరసనాయిలు పోసుకుని అంటించు కోవడాలూ,సెల్ టవర్ ఎక్కి బెదిరించ డాలు ,ఇరువై ఒకటవ శతాబ్ది లో చేయవలసిన పనులేనా ?
    ఎండాకాలంలో భుజాన గొంగళి వేసుకుని గెంతడాలూ? ఇదేనా మనము సాధించిన ప్రగతి?
    మీరు సహజంగా రాయండి.రంగుటద్దాలు తీసెయ్యండి .లోక్ సత్తా వెబ్ సైట్ లో విషయాలు మళ్లీ మళ్లీ చదవండి.
    మీకు నిజం తెలుస్తుంది.

    ReplyDelete
  11. >>>జే పి గారు, అవినీతి విషయం కానియ్యండి ,విదేశాల్లో దాచిన నల్ల ధనం కానియ్యండి,ఎన్నికల పద్ధతుల మీద కాని,నాగరిక జీవితానికి కావలసిన అన్ని సమస్యలకి జే పి గారు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చెప్ప గలరు

    Let him say. Who stopped him?

    >>>మరచిపోయిన యాస అతికించుకుని...

    You people tried hard and almost succeeded. But no, not yet.

    >>>ఈ నిరాహార దీక్షలు ,కిరసనాయిలు పోసుకుని అంటించు కోవడాలూ,సెల్ టవర్ ఎక్కి బెదిరించ డాలు ,ఇరువై ఒకటవ శతాబ్ది లో చేయవలసిన పనులేనా

    Keep quite if thugs unleashed and started robbing you? Or just wait for next 5 years for general elections?

    >>>ఎండాకాలంలో భుజాన గొంగళి వేసుకుని గెంతడాలూ

    Sorry, how could you humiliate others when you feel so sad about criticizing JP?

    ReplyDelete
  12. మిత్రమా నేను ఎవరినీ అవమానపరచడం కాదు,
    మన సమస్యలకి నిరాహార దీక్షలా పరిష్కారాలు?
    నడి వీధిలో వంటా వార్పూ ? లేక పోతే ''దోచుకున్నారు," అంటూ ,కొట్టుం డ్రి రా వాణ్ని " అంటూ ఒక ఎం ఎల్ ఎ ..అసెంబ్లీ ఆవరణలో కెమెరా ల ముందు మరొక ఎం ఎల్ ఎ మీదకి దూకడమా ?
    నాగరికత ఏమైంది ?
    తెలంగాణా వారైనా ,చదువుకున్న వారు -- చక్కగా నేటి సి . నారాయణ రెడ్డి ,దివంగత నేత పి వి నరసింహ రావు ,వరవర రావు ,చుక్కారామయ్య ,దాశరధి , మన కోదండ రామ్ కూడా చక్కని తెలుగు మాట్లాడు తారు ,,మీరూ చదువుకున్న వారే కాని తెచ్చి పెట్టుకున్న, వెతికి పట్టుకున్న యాస కనిపిస్తుంది మీ రాతల్లో ..అది వద్దు.
    నిజంగా చెప్పండి ..నేడు ఏ పల్లె లో అయినా ,,గొంగళి వేసుకుని కనిపిస్తున్నారా ?
    పల్లెల్లో కూడా టి వి లు చూసి కట్టు, మాటా ,అలవాట్లూ మారాయి.
    ఒకప్పుడు పల్లెల్లో -బన్ + చాయ్- తప్ప ఏమి దొరికేది కాదు.
    నేడు ఇడ్లి ,పూరి దోస అన్ని రెడీ ..
    అవును ,తెలంగాణా ఏర్పడితే ,మరొక రాష్ట్రం ,మరొక సేక్రే టేరి యట్,అసెంబ్లీ .ఒక ముఖ్య మంత్రి కొందరు మంత్రులూ ...ఇట్లా కొందరికి లాభం .
    కాని నేడు మనం ఎదుర్కుంటున్న సమస్యలకి ,రోజు రోజుకి పెరిగి పోతున్న కాలుష్యం ,తరిగిపోతున్న వనరులు ,నిరుద్యోగం ,విద్య లయాల్లో పడిపోయిన చదువుల స్థాయి ,రైతు సమస్యలు ,,దేనికీ పరిష్కారం దొరకదు.
    కాకపోతే జల వివాదాలకి మరొక రాష్ట్రం ..తమిళ్ నాడు ,మహారాష్ట్ర ,కర్నాటక కి తోడు.
    జే పి గారు చెప్పేది మనం వినము .ఆయనకీ వోట్ వేయము ..నిందిస్తాము .
    నష్ట పోయేది ..ఆయన కాదు ..
    రాజకీయాలని సినిమా లాగా చూస్తున్నది మనము.కే సి ఆర్ గెలుస్తాడా ,జగన్ గెలుస్తాడా .బాబు గెలుస్తాడా ..మనకి బుద్ధి లేదు ..మన జీవితాలతో ఆడుకుంటున్నారు ..
    కళ్ళు తెరిచి ,ఇతరుల కి జ్ఞానం కలిగించి ..అవకాశం రాబట్టుకుని ..సరైన నిర్ణయం తీసుకోవాలి
    జే పి లోక్ సత్తా ..సైట్ ..తీరికగా ఫాలో అవండి.మీకు మంచి జరుగుతుంది .ప్రజలందరికి మంచిది

    ReplyDelete
  13. నిజానిజాలు గారూ,

    సమైక్యాంధ్ర వాదులు చేయలేదా చిదంబరం ప్రకటన రాంగనే దీక్షలూ వగైరా. మీ రంగుటద్దాలకు తెలంగాణావారు చేసినవే తప్పనిపించడంల పెద్దగా ఆశ్చర్య పడేదేం లేదు.

    మీరు పదే పదే నా శ్లంగ్ ఎందుకు అవమాన పరుస్తున్నరో అథం అయితలేదు. ఇది నేను పుట్టి పెరిగినప్పటి నుంచి మాట్లాడుతున్న భాష. మీకు నచ్చకపోతే కృతకం అంటే ఎలా? తెలంగాణా యాస అంటే తనికెళ్ళ భరణి లాంటి సినిమా రచయితలు రాసే బూతుల భాష అనుకుంటున్నరా?

    మీరు చెప్పేది మరీ విచిత్రంగ ఉంది. బన్, చాయ్ మాని ఇడ్లీ సాంబార్ తింటె డెవలప్ అయినట్టా?

    ఝ్ఫ్కి వొట్లేసి గెలిపించింది తెలంగాణా ప్రజలే అని మీరైనా గుర్తుంచుకోండి. ఆయన అది గుర్తుంచుకోక పోయినా. మాకు తెలంగానా మీద ఝ్ఫ్ అవలంబిస్తున్న వైఖరి పైనే అభ్యంతరం. మిగతా విషయాలల్ల మాకు ఝ్ఫ్తోటి ఎటువంటి దిస్పుతె లేదు.

    ReplyDelete
  14. I have never insulted your slang.I have only mentioned that ,educated and the literate people speak in a way most of the population speak,and write the way an educated person writes.
    I have only said that you are not writing the natural way.You are putting on the garb of an illiterate person while writing telugu.
    And I did not say that Idly,etc., are the diet of a developed man..nor Burger and Pizza are for the more developed.
    We have to admit that there is progress in general in our villages and the trends have changed,people are more conscious of their diet,their language,behavior etc.,
    And coming to the point of J P's opinion,he is not averse to forming a separate state ,but he only said that, that it is not the solution to present crises.
    And do not come to conclusions with out knowing the facts.
    The present Political Leaders are a misleading CHEATS.See how Digvijay speaks,he is a cunning politician to the core.
    See how the govt is reacting to Anna Hazaare,Ramdev efforts.See how the DMK leaders amassed wealth.See how our own Prince Jagan amassed thousands of crores in a short span of 5 years ,
    I once again appeal to you to try to understand what J P means.

    ReplyDelete
  15. I don't find anything wrong if I try to represent the language the way I speak which I think is natural of me. If you find any unparliamentary words, you are at liberty to inform and correct me. Anyhow thanks for your feedback.

    Regarding JP, I have my own views. More posts on his way soon.

    Thanks.

    ReplyDelete