Thursday, June 2, 2011

తెలంగాణా నాయకుల్లో ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదేం?

అమాయక ప్రజలు తప్ప తెలంగాణా మంత్రులో, ఎంపీలో, ఏమ్మేల్యేలో, ఇతర నాయకులో ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? 

సమైక్యవాదులుగా చెప్పుకునే కొందరు సీమాంధ్రులు తరచుగా అడిగే ప్రశ్నలల్ల ఇదొకటి. ఏమాత్రం ఆలోచన ఉన్నోనికైనా ఇది ఎంతటి అసంబద్ధమైన ప్రశ్నో ఉత్తగనే తెలుస్తది, ఒక్క సమైక్యాంధ్ర మత్తులో జోగేటోల్లకు తప్ప.

అసలు ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటరు? తీవ్రమైన నిస్పృహకు గురైన మానసిక బలహీనులు. నాయకులు ఏ ప్రాంతం వారైనా మానసిక బలహీనులుగా మాత్రం ఉండరు. అట్ల ఉంటె వాళ్ళు నాయకులే కారు. అదీకాక నాయకులు తమ ఉద్వేగాన్ని రకరకాల వేదికల పైన వ్యక్తంచేసే అవకాశం ఉంటది. దాన్ని తమ మనసుల అణచి వేసుకునే అవసరం ఉండదు.   

ఆత్మహత్యలు చేసుకునుడు మంచి పని అని ఎవ్వరు చెప్పడం లేదు. పైగా చేసుకోవద్దని తెలంగాణలో అన్ని పార్టీల నాయకులు, ఉద్యమకారులు పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తనే ఉన్నరు. అయినా ఆత్మహత్యలు ఎందుకు ఆగుత లేవవో విశ్లేషించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాని ప్రభుత్వం కనీసం ఆత్మహత్యలను గుర్తిస్తందుకు కూడా నిరాకరిస్తుంది. 

ఇదివరలో అనంతపురంలో రైతుల ఆత్మహత్యలు, సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మ హత్యలు జరిగినయి. వీటి మీద నాయకులు రకరకాల వేదికలమీద, అసెంబ్లీల, పార్లమెంటుల చర్చించిన్రు. 2004 ఎన్నికలల్ల రాజశేఖర్ రెడ్డి అయితే కేవలం రైతుల ఆత్మహత్యల అంశం మీదనే అధికారంలకి వచ్చిండు. మరి సమైక్యవాదుల లెక్క ప్రకారం వీళ్ళల్ల కూడా ఎంతో కొంత మంది ఆత్మహత్య చేసుకోవాలెగద? ఒక మూర్ఖపు వాదాన్ని నిలబెట్టుకోవడానికి పదే పదే మూర్ఖపు వాదనలే చెయ్యవలసి వస్తది. సమైక్యాంధ్రులు చేసే ఈ ఆత్మహత్యల వాదన కూడా అటువంటిదే.

ఓ పాతిక మంది రైతులో, చేనేత కార్మికులో ఆత్మహత్య చేసుకుంటేనే విషయం పార్లమెంటు దాంక వెల్తది. అటువంటిది తెలంగాణా అంశం మీద ఆరొందల మంది ఆత్మ హత్యలు చేసుకుంటే అసలే చర్చ జరుగకుండా ఎట్ల ఉంటది? ఆత్మహత్యలు ఎవ్వరూ చేసుకో గూడదు, సరే. కాని జరిగిన, జరుగుతున్న ఆత్మహత్యల గురించి చర్చే జరగ కూడదంటే, చర్చించే వాడు కూడ ఆత్మహత్యే చేసుకోవాలె అని వాదించడంల ఈ సమైక్య వాదుల ఉద్ద్యేశం ఏంది?

రైతుల ఆత్మహత్యల గురించి చర్చించడం ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. అందుకనే అజీర్తితో చచ్చినరని, మరొకటని రైతుల  ఆత్మహత్యలను అధికారంలో ఉన్న వాళ్ళు పలుచన చెయ్యడం మనం చూసినం. ఎందుకు వాళ్ళు అట్ల అనవలసి వచ్చింది? ఎందుకంటే వాళ్లకు వీటిపై చర్చించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ప్రభుత్వ లోపాలను చూపెడుతది. 

అలాగే సమైక్యవాదులకు తెలంగాణా ఆత్మహత్యల మీద చర్చించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి ప్రజల్లో ఉన్న బలమైన తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను బయట పెడుతయి. మరి వీరికి అటువంటి ఆకాంక్షలు బయట పడుడు ఎట్ల ఇష్టం ఉంటది? అందుకనే ఆ విషయం పైన చర్చ జరగకుండ అణగదొక్కాలె. అంటే చర్చించే వాణ్ణి నువ్వే ఆత్మహత్య చేసుకొమ్మని అనాలె. అప్పుడు వాడుగూడ నోర్మూసుకొని ఊరుకుంటడు. కబ్జాకోరు, ఫాక్షనిస్టు, ఫాసిస్టు సమైక్యవాదపు వ్యూహాల్లో ఇదొకటి, ఎదుటివాడు వాదించకుండ గొంతు నొక్కుడు.   

ఏమాత్రం అభిలషనీయం కాకపోయినా, ప్రపంచంలో మొదటిసారిగా తెలంగాణాలో ఆత్మహత్య అనేది ఒక ఉద్యమ రూపం సంతరించుకుందన్నది ఒక కఠోర వాస్తవం. త్వరితంగా ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటే వీటి ముగింపుకు కల ఏకైక పరిష్కారం.

   

6 comments:

  1. very well said srikanth. but these stupid guys would never like o see the truth.

    ReplyDelete
  2. MY Dear Blogger,
    I am having Small doubts.Could you please clear my doubts.

    KCR Garu kani, Harish Rao garu kani Memu AATMAHATYALu chesukovataniki kuda ready ga unnam ani yeppudu prakatinchaledha.

    TankBund meedha Status ni Pagalakottesaru, Dhani valla meeku vochina labham emiti.

    Andhra valla statues ani pagalakottam ani ante, Mee telangana lo BR ambedkar statues chala unnayi, ayana mee teLANGAna kadu, ayana statue kuda pagalakotandi.not only ambedkar many more people statues are ther who does not belong to telangana.

    ee madya jarigina oka survye prakaram many software projects from other countries went to pune, chennai and banglore.
    avanni mama hyd ki ravalsina projects.
    because of this telangana issue only they went to other places.mee place ni mee godavalatho devolop kanivatam ledhu.

    nijam cheppandi telangana matrame venukabadi undha andhra pradesh lo.
    Prakasam,srikakulam etc district matemiti.
    Telangana separate cheyatam vallana ee KCR Kondanda ram lanti vallu bagaa dabbulu tinatam thappa samanya manavulaku oorigedhemi ledhu...


    So stop fighting for separate state.. fight for u r devolopment.

    ReplyDelete
  3. Mr Pradeep,

    In political rhetoric, all politicians say these words. There were many samaikyaandhra leadere who said they would give their lives to protect samaikyandhra. Is it correct to ask for their lives?

    Apart from Tank Bund still there are 1000s of statues belong to Andhra people. No one touches them. The incident on Tankbund can only be attributed as an act of public anger in retalliation to the government attempt to suppress the millian march in brutal fashion.

    If we really want to demolish all statues those belong to Andhra people it will take only minutes to do so.

    Also, if you are so concerned about statues, can you name a few statues of Telanganites in Andhra area? At least one statue of PV Narsimha Rao, ex Prime Minister?

    If you are concerned about IT companies, stop putting obstacles to separate Telangana. After separation you make take lion share of companies to your cities like Vijag, Vijayawada etc. We do not bother.

    We have come to an opinion that the backwardness of Telangana is only because of the unified state. And for us separation is the only solution we see. If some of your districts are backward, who stopped you to develop them after separation?

    Don't bother about our development. We know how to develop ourselves. But it is not possible until you being majority and rule us.

    ReplyDelete
  4. Hi Blogger,

    Ante mee udhesyam lo Telangana kosam aatmahatya chesukuntam ani cheppi prajalanu rechagotti samanya manavulu aatmahatyalu chesukovadani vusigolputhunna nayakulu chesedhi thappu kadhu.. ayina oka vishayam, Suicide chesukovatam dwara telangana vosthunda? Andaru suicide chesukuntu pothe meeru kalalu kanna pratyeka rastrani chusedhi evaru..

    Memu andhra nayakula vigrahalu , Telangana nayakula vigrahalu ani yeppudu separate cheyaledhu.. goppavalla vigrahalu chala chotla unnayi..

    Prathi okka urilo Gandhi, Nehru, Indira Gandhi , Rajeev Gandhi vigrahalu unnayi.. vallantha Andhra pradesh vallu kadhu kada.. mari endhuku pettukunam..


    Meeru samaikya rastram vallane Telangana backward ayindhi anukunte yenduku Hyderabad ala develope ayindhi.. vijayawada and vishakapatanam enduku antha ga devolope kaledhu.

    Nenu ee mata anaduku meeku kopam ravochu.. but andhra vallu rastram motham kosam krushi chesaru.. so valla vigrahalu anni places lo unnayi...

    Warangal lo ne enduku NIT vochindi, Vijayawada or other places lo pettukovochu kada.FAB city enduku telangana lo pettaru..

    Okavella Telangana prantha prajalu andaru telangana korukunte , TRS party ki Telangana lo anni seats vochundali kada.. enduku raledhu.


    If some of your districts are backward, who stopped you to develop.

    ReplyDelete
  5. Hi Pradeep,

    I totally agree with you in saying if any one provoked the public to commit suicides, it is highly condemnable. I also do not encourage or support if anyone commits suicide for Telangaana or for any other reason.

    Saying that if people committed suicides massively as they did for the cause of Telangaanaa, it can not be ignored. It clearly gives a strong message to the Government and fellow citizens as well. If one ignores that messages, he is less likely be a human.

    We are not against the construction of statues of great people, but against the hegemony of few poeple who try to depict people of their region as great people and thus the statues.

    If NIT comes to Warangal, what is the benefit reaped by common man from it? After all it is not meant for Telangaana alone. Go and see the state of Fab city what is being done there, real estate!

    Hyderabad has been a cosmopolitan city from the beginning and it has its own ways of development. You seemandhra people has nothing to boast for its development. Hyderabad was ranked 5th in 1956 when we merged, now also it is ranked 5th along with Bangalore. A degrade actually!

    Please remember that TRS was with aliance in both the elections in 2004 and 2009. On both occasions alliance got more seats. Also all parties claimed they are for Telangana. If you see, every time pro-telangaanaa parties fetched lion share of seats in Telangana.

    Now all parties have clearly exposed their anti-telangaanaa stance. Please be aware that from the next time on, there is not a single seat for any anti-telangaanaa party. That is already demontrated in by-elections.

    >>> who stopped you to develop.

    Your andhra regime. That is why we want separation.

    ReplyDelete