మాట మాట్లాడితే హైదరాబాదుని మేమే అభివృద్ధి జేసినం అంటరు సమైక్యాంధ్ర వాదులు. ఇప్పటిదాకా డెవలప్ జేసినం కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా మీకే ఇచ్చేసి పోవాల్నంటే ఎట్లా పోతం అనేది వీళ్ళ వాదనలల్ల ఒకటి. ఇంతకీ విల్లు హైదరాబాదుని ఏమన్న అభివృద్ధి చేసిండ్రా అంటే వాస్తవాలు మాత్రం దానికి విరుద్ధంగ ఉన్నయి.
గడిచిన ఆరు సంవత్సరాల నుండి లెక్క జూస్తే హైదరాబాదు భూమి 635 ఎకరాలు తెగనమ్మిన్రు. ఇది అమ్మి సంపాదించిన మొత్తం 4090 కోట్ల రూపాయలు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ భూములు అమ్మే హక్కు ఉండదు. కేవలం అసిన్ మాత్రమే చేయ గలుగుతది. కాని మన రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మే హక్కు ఎక్కడినుంచి వచ్చింది?
హైదరాబాదు నిజాం కింద ఉన్నప్పుడు లక్ష ఎకరాలు ఎందుకైనా మంచిదని హైదరాబాదు చుట్టుపక్కల లక్ష ఎకరాల భూమి తన పేర రిజిస్టరు చేసుకున్నడు. ఆ భూములన్నీ హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డంక హైదరాబాదు రాష్ట్రానికి దఖలు పడ్డయి. ఆ భూములు తర్వాత సమైక్య రాష్ట్రం పెత్తనం కిందికి వచ్చినై. దేశంల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేని విధంగ తెలంగాణాలో ప్రభుత్వానికి విలువైన భూములు రిజిస్టరై ఉన్నయి.
హైదరాబాదు నిజాం కింద ఉన్నప్పుడు లక్ష ఎకరాలు ఎందుకైనా మంచిదని హైదరాబాదు చుట్టుపక్కల లక్ష ఎకరాల భూమి తన పేర రిజిస్టరు చేసుకున్నడు. ఆ భూములన్నీ హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డంక హైదరాబాదు రాష్ట్రానికి దఖలు పడ్డయి. ఆ భూములు తర్వాత సమైక్య రాష్ట్రం పెత్తనం కిందికి వచ్చినై. దేశంల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేని విధంగ తెలంగాణాలో ప్రభుత్వానికి విలువైన భూములు రిజిస్టరై ఉన్నయి.
గడిచిన ఆరేల్లల్ల అమ్మిన ప్రభుత్వం అమ్మిన భూముల వివరాలకు క్రింది పట్టిక చూడున్రి.
Place | Year | Acres | Amount (in Cr) |
Yapral | 2006 | 1.14 | 3.24 |
Uppal | 2006 | 1.27 | 2.34 |
Rajendra Nagar | 2006 | 0.36 | 1.8 |
Tellapur | 2006 | 224 | 925 |
Kokapet | 2006 | 67 | 703 |
Nadargul | 2006 | 1.23 | 64 |
Neknampur | 2006 | 1.05 | 4.1 |
Sheikpet | 2006 | 5.77 | 334 |
Kokapet | 2007 | 25 | 300.25 |
Kokapet | 2007 | 75 | 751.5 |
Jawahar Nagar | 2007 | 50 | 250 |
Lakshmiguda | 2008 | 11.31 | 8.5 |
Budwel | 2009 | 165 | 663 |
Khanamet | 2010 | 5 | 50 |
Khanamet | 2010 | 2 | 20 |
Khanamet | 2010 | 88 (sq yrd) | 10 |
సమైక్యాంధ్ర పేరు జెప్పి తెలంగాణాను ఆక్రమించుకున్న సీమాంధ్ర పాలకులు వచ్చినప్పటినుండి మొదలు వాళ్ళ కన్లు హైదరాబాదులోని విలువైన భూముల మీదనే ఉన్నయి. సమైక్య రాష్ట్రం ఏర్పద్దప్పటి నుంచి వీళ్ళు పాలకులుగా మారి హైదరాబాదులోని విలువైన భూములు వాళ్ళ తొత్తులకు హడ్డీకి పావుసేరు లెక్కన రిజిస్టరు చేసుడు, వాళ్ళ తైనాతీలు కబ్జా చేస్తుంటే కండ్లు మూసుకొని ఊకునుడు మాత్రమే చేసిన్రు. ఇంకా మిగిలిన భూములు ఉంటె వాటిని తెగనమ్మి ఆ నిధులు అంధ్రాల కర్చు పెట్టిన్రు. గత ఆరు సంవత్సరాల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాల, ఇడుపులపాయల వేల కోట్లు అదనంగా కర్చు పెట్టింది. అవన్నీ హైదరాబాదు భూములు తెగనమ్మితే వచ్చిన పైసలే.
ఒకవైపునుండి హైదరాబాదు నిధులను లెక్క లేకుండా సీమాంధ్రకు తరలించుకుంట ఇంకొక వైపు హైదరాబాదు అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసిన్రు. హైదరాబాదుల నాలుగు ఫ్లై ఓవర్లు, హైటెక్ సిటీల నాలుగు రోడ్లు వేసుడు తప్ప వీళ్ళు హైదరాబాదుకు చేసిందేమీ లేదు. హైదరాబాదు సంపాదన హైదరాబాదు మునిసిపాలిటీకే వదిలితే ఇంతకు వంద రెట్లు అభివృద్ధి చెంది ఉండేదంటే అతిశయోక్తి కాదు.
నిజాం కట్టించిన డ్రైనేజీ వ్యవస్థ ఆ తర్వాత కొంచం కూడా అభివృద్ధి చెందలేదు. ఉన్న నాళాలు కబ్జా జేసుడు తప్ప. రోడ్లు చూస్తె అడుగడుగునా గుంటలు, ప్రత్యక్ష నరకం చూపించే ట్రాఫిక్ వ్యవస్థ, పొంగిపొర్లే మాన్ హోల్లు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఏమాత్రం అభివృద్ధి కాలేదు.
సరైన ప్రణాళిక లేక, మూసీ నదిని, హుస్సేన్ సాగర్ ని మురికి కూపాలుగా మార్చిన్రు. పటాన్ చెరువుల మందుల ఫాక్టరీలు పెట్టి హైదరాబాదు భూగర్భ జలాలను విషంగా మార్చిన్రు. హైదరాబాదు సిరిసంపదలను దోచుకొనే యావ తప్ప, హైదరాబాదును తమ సొంతనగరంగా భావించని వాళ్ళు చేసే పనులు ఇట్లనే ఉంటయి.
సీమాన్ద్రులారా, మీరు హైదరాబాదు నగరాన్ని పెద్దచేసిందేమీ లేదు. ఇది మీతో కలవక ముందు దేశంల ఐదో పెద్ద నగరంగా వుంది. ఇన్నేళ్ళ మీ పాలన తర్వాత ఆ స్థానాన్ని బెంగుళూరుకు సమర్పించుకొనే దశ ప్రాప్తించింది. కాకపొతే ఇక్కడికొచ్చి మీరు మాత్రం బాగనే అభివృద్ధి చెందిన్రు. ఇక్కడి ప్రభుత్వ భూములను రూపాయికి ఎకరం చొప్పున కొనుక్కొని ఇప్పుడు వేల కోట్ల ఆస్తులకు వారసులైన్రు. కాబట్టి మీరు హైదరాబాదు అభివృద్ధి రాగాన్ని మానెయ్యండి. ఇప్పటిదాంక హైదరాబాదు మీద మీరు పొందిన లబ్దికి సంతోషించండి. ఇంకా అత్యాశకు పొతే మాత్రం పాత చరిత్రంతా బయటకు గుంజవలసి వస్తది.
This comment has been removed by a blog administrator.
ReplyDelete"గడిచిన ఆరు సంవత్సరాల నుండి లెక్క జూస్తే హైదరాబాదు భూమి 650 ఎకరాలు తెగనమ్మిన్రు. ఇది అమ్మి సంపాదించిన మొత్తం 3818 కోట్లు. హైదరాబాదు నిజాం కింద ఉన్నప్పుడు లక్ష ఎకరాలు నిజాం పేరు మీద రిజిస్టరై ఉండేది."
ReplyDeleteఅంటే నిజాం 2006 వరకు పరిపాలించి తెలంగాణాను తెగ అభివృద్ధి చేశాడన్న మాట. ఈ విషయం నాకు తెలియదండీ.
Anonymous
ReplyDeleteమీరు తెలిసి మాట్లాడుతున్నరో, తెలియక మాట్లాడుతున్నరో అర్థం అయిత లేదు. నేను చెప్పింది నిజాము నుండి హైదరాబాదు రాష్ట్రానికి వచ్చిన రిజిస్టరు భూములు, ఇప్పుడు ఆధ్రపదేశ్ చేతిలో ఉన్నయి. ఆ భూములని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం అమ్మి డబ్బు చేసుకుంటుంది. ఆ డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నరో అందరికీ తెల్సు. ఇంక అప్పనంగా కంపెనీలు పెదుతమని అగ్వకు కొనుక్కొని రియల్ దందాలు సాగిస్తున్నోల్ల సంగతి సరేసరి.
1. "ఇక్కడి ప్రభుత్వ భూములను రూపాయికి ఎకరం చొప్పున కొనుక్కొని ఇప్పుడు వేల కోట్ల ఆస్తులకు వారసులైన్రు."
ReplyDelete2. "హైదరాబాదు భూమి 635 ఎకరాలు తెగనమ్మిన్రు. ఇది అమ్మి సంపాదించిన మొత్తం 4090 కోట్ల రూపాయలు. "
ఎకరం రూపాయిఉన్న భూములు కోట్ల రూపాయలు ఎలా అయ్యయో ?!
హైదరాబాదు అభివృద్ది కానట్లయితే 650 ఎకరాలు అమ్మితే, 650 లక్షలు కూడా వచ్చేయి కాదు.పైగా ఇలా వచ్చిన డబ్బుకంటే ఇంకా ఎక్కువే హైదరాబాదుకు రింగురోడ్లని, ఫ్లై ఓవర్లని ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలోని అందరికీ తెలంగాణాని దోచుకోవడం కంటే వేరే పనేమిలేదనుకోవడం మీ అవివేకం. అవతలి వాళ్లను కిందకి ఎలా లాగాలనేదానికంటే మీరు పైకెలా రావాలో ఆలోచించినట్లయితే, మీరు ఇలాంటి పనిలేని టపాలు రాసుకుంటూ ఉండేవాళ్లు కాదు.
ReplyDeleteహైదరాబాదులో భూములు ఆక్రమించినవాళ్ళంతా తెలంగాణవాళ్లే. లోకల్ రౌడీయిజమ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ దగ్గర చట్టబద్ధంగా డబ్బులిచ్చి కష్టార్జితం పోసి కొనుక్కున్నవాళ్ళు ఆంధ్రావాళ్ళు. ఆ రియల్ ఎస్టేట్ కి ఆంధ్రావాళ్ళు చెల్లించిన డబ్బుతోనే లక్షలాదిమంది తెలంగాణవాళ్ళు స్థానికంగా లక్షాధికారులూ, కోటీశ్వరులూ అయ్యారు. మీరేమో మరో రకంగా ప్రచారం చేస్తున్నారు.
ReplyDeleteతన భూముల్ని అమ్ముకునే హక్కు ప్రతి ప్రభుత్వానికీ ఉంది. సమైక్యరాష్ట్రంలో ఆదాయాన్ని సిటీల వారీగా, జిల్లాలవారీగా చూడరు. అదంతా ఒక సెంట్రల్ పూల్. రేపు మీకు తెలంగాణ ఇస్తే ఇలాగే ఆదాయాన్ని సిటీలవారీగా జిల్లాలవారీగా పంచుతారా ?
ఆంధ్రావాళ్ళ దగ్గర డబ్బులేనట్లూ, తెలంగాణ నిధుల మీద ఆధారపడుతున్నారన్నట్లు వ్రాస్తారేంటి ? అక్కడ మంచి పొలాలున్నాయి. ఎక్స్‌పోర్టు వ్యాపారాలున్నాయి. డాలర్స్ లో ఆదాయాలున్నాయి.
అయినా హైదరాబాద్ తెలంగాణకి చెందదు. కాస్తో కూస్తో అది హైదరాబాద్ ముస్లిములకే చెందుతుంది. తెలంగాణ సంస్కృతీ, హైదరాబాదీ తెహజీబ్ రెండూ వేరువేరు.
@John
ReplyDeleteఆలోచించండి తెలుస్తది.
@Anonymous
హైదరాబాదు డబ్బు హైదరాబాదు మీదే ఖర్చు పెట్టితె ఇప్పటికి అది న్యూయార్కును మించి అభివృద్ధి చెందేది కాదంటరా?
సోంపేట, ఇతర సీమాంధ్ర ప్రాంతాలల్ల జరిగే ఉద్యమాలు ఎలా 'పైకి రావాలో' ఆలోచించలేకే అంటరా? జగన్, రాజా, మొదలైనా వాల్ల అవినీతిని విమర్షించే వారంతా వాల్లు 'పైకి రాలేకనే' విమర్షిస్తున్నరనుకుంట మీ దృష్టిలో!
@Anonymous
ReplyDeleteఆక్రమించే వాల్లల్లో కొంతమంది తెలంగాణా వాల్లు కూద ఉన్నరు. పాలకుల తొత్తులు మాత్రమే ఆక్రమించ గలరు. పాలకులెవరొ అందరికీ తెలుసు.
బహుశా మీ దృష్టిలో మద్దెల చెరువు సూరి, పరిటాల రవి, పండు etc... లు తెలంగాణా వాల్లా లేక కశ్టపడి సంపాదించిన వారా?
ఆదాయం సంగతి వేరు. ఆ లెక్కలు తీస్తే చాల ఉంటయి. వదిలేద్దాం. కనీసం భూములమ్మిన డబ్బు ఆ ప్రాంతానికే ఖర్చు పెట్టేది ప్రభుత్వం కనీస బాధ్యత. అది జరుగలేదనే చెప్తున్నది. పైనించి అభివృద్ధి చేశామని చెప్పడం ఎంత దుర్మార్గమో చూడండి.
ఆంధ్రా వాళ్ళకు డబ్బుల్లేవని ఎవరన్నారు? ఉన్నవి చాలక పక్కోడి మీద పడుతున్నారనేగదా బాధ.
హైదరాబాదు ముస్లిములకి చెందుతుందా? అది వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు బాధ. నాలుకను ఎటు పడితే అటు తిప్పడంలో సిద్ధహస్తులండీ మీరు.
రాష్ట్ర విభజనకు అనుకూలమైన సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారిలో నేనొకడిని. నా విధానాలు దోపిడీలో తోటకూరకట్టలో కాదు. నా విధానం చిన్న రాష్ట్రాలు. మూడున్నర కోట్లతో తెలంగాణ ఏర్పడినప్పుడు కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాదు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే వచ్చిన నష్టం ఏముంది? ఎవరిలెక్కలు వారికి ఉంటాయి కదా. రేపు హైదరాబాదు ఆదాయాన్ని తెలంగాణలో మరెక్కడైనా వినియోగిస్తే మీ సూత్రం ప్రకారం హైదరాబాదు వాసులు దోపిడీ అనవచ్చు కదా!
ReplyDeleteఅభివృద్ధిలేనిదే భూముల విలువ పెరగదనేది శాస్త్రీయం. మరి హైదరాబాదు భూముల విలువ ఎలా ఎవరివల్ల పెరిగాయో చెప్పగలరా? ఈ వ్యాఖ్య మీకు రుచించదని నాకు తెలుసు. ఏదో పిచ్చి ప్రయత్నం.
మీకు తెలియక మాట్లాడుతున్నారో, తెలిసి కూడా కావాలని మాట్లాడుతున్నారో గాని, గత 20 సంవత్సరాలలో హైదరాబాదు మీద పెట్టిన ఖర్చును, వచ్చిన ఆదాయాన్ని ఓసారి పరిశీలించి చూడండి. సీమాంద్ర, మిగతా తెలంగాణా ప్రాంతాలనుండి వచ్చిన ఆదాయాన్ని కూడా హైదరాబాదు మీదే ఖర్చు చేశారు. న్యూయార్కులాగా అభివృద్ది దీనికి చాలా రెట్లు ఖర్చు, సమయం కావాలు. మీరు ఇలాంటి పనికిరాని టపాలు మానేసి, ఎలా అభివృద్ది చేయాలో ఆలోచిస్తే కొంచం త్వరగానే అవుతుంది.
ReplyDeleteAnonymous June 10, 2011 12:36 AM
ReplyDeleteమీ వాదన బాగనే ఉంది. కాని అలాంటి రాష్ట్రం కావాలంటె ఆ ప్రాంతం వాళ్ళు అడుగాలె. సీమాంధ్ర వాళ్ళు కాదు. సీమాంధ్ర వాళ్ళు ఉత్తరాంధ్రో, ప్రత్యేక రాయలసీమో అడుగొచ్చు. తెలంగాణాలో ప్రస్థుతానికి ఆలాంటి ఉద్యమం లేదు. వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు.
Anonymous June 10, 2011 12:43 AM
మీ దగ్గర లెక్కలుంటే హైదారాబదు మీద వచ్చిన ఆదాయం, కర్చు ఎంతో లెక్కలు తియ్యండి పనికిరాని వ్యాఖ్యలు మానేసి. అప్పుడు మాట్లాడుకుందాం.
Anonymous June 10, 2011 12:41 AM
ReplyDeleteఇక్కడ సమస్య హైదరాబాదు డబ్బుల వినియోగం గురించి కాదు. ఒకవైపు హైదరాబాదు డబ్బులు వినియోగించుకొని, పైనించి హైదరాబాదునే మేం అభివృద్ధి చేసినం కాబట్టి వదలం అనే వాదన గురించి.
అభివృద్ధి లేనిదే భూముల విలువ పెరగదు. కాని వనరులు వినియోగించినప్పుడు అభివృద్ధి దానంత అదే జరుగుతది. ఒకప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా. దానికి మేమే కారకులం అనే వాళ్ళతోనే ఇబ్బంది.
1. హైదరాబాదుల నాలుగు ఫ్లై ఓవర్లు, హైటెక్ సిటీల నాలుగు రోడ్లు వేసుడు తప్ప వీళ్ళు హైదరాబాదుకు చేసిందేమీ లేదు.
ReplyDelete2. సీమాన్ద్రులారా, మీరు హైదరాబాదు నగరాన్ని పెద్దచేసిందేమీ లేదు. ఇది మీతో కలవక ముందు దేశంల ఐదో పెద్ద నగరంగా వుంది. ఇన్నేళ్ళ మీ పాలన తర్వాత ఆ స్థానాన్ని బెంగుళూరుకు సమర్పించుకొనే దశ ప్రాప్తించింది.
3. "అభివృద్ధి లేనిదే భూముల విలువ పెరగదు."
@John
ReplyDelete"1. హైదరాబాదుల నాలుగు ఫ్లై ఓవర్లు, హైటెక్ సిటీల నాలుగు రోడ్లు వేసుడు తప్ప వీళ్ళు హైదరాబాదుకు చేసిందేమీ లేదు.
2. సీమాన్ద్రులారా, మీరు హైదరాబాదు నగరాన్ని పెద్దచేసిందేమీ లేదు. ఇది మీతో కలవక ముందు దేశంల ఐదో పెద్ద నగరంగా వుంది. ఇన్నేళ్ళ మీ పాలన తర్వాత ఆ స్థానాన్ని బెంగుళూరుకు సమర్పించుకొనే దశ ప్రాప్తించింది.
3. అభివృద్ధి లేనిదే భూముల విలువ పెరగదు."
మీరు ఏం చెప్పాలనుకుంటున్నరో స్పష్టం చెయ్యలేదు. OK. మీరు పై మూడు వాక్యాలు పరస్పర విరుద్ధంగ ఉన్నయని చెప్పలె ననుకుంతున్నరు. అవునా?
ఏ పెద్ద నగరమైనా ఒక స్థాయికి వచ్చిన తర్వాత దానంతట అదే అభివృద్ధి చెందుతది. ఒకరు అభివృద్ధి చెయ్య వలసిన పని లే. దాన్ని పీక్క తినకుంటే చాలు. మన హైదరాబాదు విషయంల రెండొదే జరిందని చెప్తున్న. హైదరాబాదుల అభివృద్ధి ఏమైన జరిందంటె అది హైదరాబాదు నిధులతోనే జరిగంది, ఏ లగడపాటొ, చంద్రబాబో, జగనో ఇంట్లనుండి తెచ్చి అభివృద్ధి చేయ్యలే. ఒక వేళ ఇంట్లనుంచి తెస్తె అది వాళ్ళు అభివృద్ధి చెందనీకి తప్ప హైదరాబాదును అభివృద్ధి చెయ్యడానికి కాదు.
కాలానుగునంగ అభివృద్ధి అన్ని నగరాలల్ల జరుగుతనే ఉంది. అలాగే హైదరాబాదుల జరిగింది. దానికి తోడు హైదరాబాదులోని సమషీతొష్ణ పరిస్థితులు దోహద పడ్డయి. దీంట్ల సీమాంధ్ర్లు జబ్బలు చరచుకొనే అవసరం ఏమీ లేదు.
కేవలం పది లక్షల జనాభా ఉన్న విశాఖపట్నం లోనే, ఉడా ప్రభుత్వ భూములమ్మి వెయ్యికోట్లు ఖజానాకి జమ చేసింది. ఈ తెలంగానోల్లది మిడిమిడి జ్ఞానం.చుట్టుపక్కలేమవుతుందో పట్టదు.
ReplyDeleteవిశాఖపట్నం జనాభా పది లక్షలే కానీ దాని twin town గాజువాక జనాభా మూడు లక్షలు. విశాఖపట్నం అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కావడం వల్ల కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
ReplyDeleteఅయ్యా శ్రీకాంతాచారి గారూ,
ReplyDeleteపైన హైదరాబాదువాదం వినిపించిన అఙ్ఞాతను. నేను పుట్టుకతో హైదరాబాదీని (మీ/ తెలంగాణవాదుల లెక్కలో సీమాంధ్ర వాడినీను) మీరు తెలంగాణ అంశం దగ్గరకొచ్చేటప్పటికి ఎంత రాద్ధాంతం చేస్తారో హైదరాబాదు దగ్గరకొచ్చేటప్పటికి అంతగానూ మా పీక నొక్కుతారు. మా అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఇస్తారనుకోవటం అత్యాశే. సగటు హైదరాబాదీగా చెబుతున్నా కేవలం హైదరాబాదు మీద పెత్తనం, ఇక్కడ సృష్టించబడుతున్న సంపదమీద ఆశ తప్ప అటు సీమాంధ్రకు గానీ ఇటు తెలంగాణకు గానీ హైదరాబాదుమీద పెద్ద ప్రేమలేమీ లేవు. హైదరాబాదు సంగతి తేలకుండా (ప్రత్యేక రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం/ తెలంగాణ రాజధాని/ ఉమ్మడి రాజధాని) రాష్ట్ర విభజన జరగటం అసాధ్యం. అది మీకూ తెలుసని దేశ ప్రజలందరికీ తెలుసు.
హైదరాబాద్ డబ్బులు సీమోల్లు నొక్కేసి, సీమకు తరలిస్తే, సీమ అంత దరిద్రంగా ఎందుకున్నది? తెలంగాణాకన్నా సీమ వెనకబడున్నదని కృష్ణ కమిటీ చెప్తుంది కదా?
ReplyDeleteమీ సీమంధ్రుల బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నరు. హైదరాబాదు, తెలంగాణ లో అంతర్భాగం. హైదరాబాదు ను నిర్మించుకుంది తెలంగాణ వాళ్ళు. ఆది పుట్టినప్పటినుంచి తెలంగాణ కు రాజధానే. హైదరాబాదు, తెలంగాణ వేరు వేరుగా ఎప్పుదూ లేవు. హైదరాబాదు ను తెలంగాణ నుంచి వేరు చెసి మాట్లాడటం అత్యంత నీచం, లేకితనం. ఫుట్టినంత మాత్రాన ఏ ప్రాంతమైనా ఎవ్వరికీ సొంతం కాదు. మూలాలు ముఖ్యం. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు తో సంబంధం లేకుండానే హైదరాబాదు తెలంగాణది. కిరాయిదార్లు సొంతదార్లు ఎప్పటికీ కాలెరు. అద్దె ఇంట్లో పిల్లల్ను కంటే, ఇల్లు సొంతం కాదు.
ReplyDeleteSrikanthachari garu.....Am just curious....what do you do..
ReplyDeleteJune 10, 2011 7:15 AM కి వ్యాఖ్యానించిన తెలంగాణ ముద్దుబిడ్డ గారూ,
ReplyDeleteమహాబాగా చెప్పారు. హైదరాబాదులో పుట్టి పెరిగిన హైదరాబాదు నాది కాదు. ఎక్కడో ఆదిలాబాదులో పుట్టి, హైదరాబాదు మొహం ఎరుగని వారికి మాత్రం సొంత సొత్తు. ఇవి కాదు ధర్మ సూత్రాలంటే! మీ దగ్గరే మేము నేర్చుకోవాలి. మాటలు కట్టిపెట్టి ఏదైనా పనికొచ్చే పని చూడండి
@Anonymous @June 10, 2011 11:16 AM
ReplyDeleteసోదరా,
మీరు హైదరాబాదులో పుట్టితే సంతోషం. When in Rome , Act Like a Roman అన్నరు. మీరు ఈ గడ్డకు చెందిన వాళ్ళని భావిస్తుంటే ఇక్కడి ప్రజల కష్ట నష్టాల్లో భాగం పంచుకోగలుగుతరు. అంతేగాని మనసు ఇక్కడ, శరీరం ఎక్కడో అన్నట్టు ప్రవర్తించరు.
ఇక్కడి వాళ్ళం అంటరు. ఇక్కడి ప్రజల ఆక్రోషాలు మీకు పట్టవు. మీరు నిజంగా హైదరాబాదు రాష్ట్రం కోరితే దాని కోసమే ఉద్యమం చేస్తరు. చెయ్యండి. అంతే గని తెలంగాణా వాళ్ళు విడిపోతమంటేనే ప్రత్యేక హీదరాబాదు అని, లేక పోతే సమైక్యాంధ్ర అని రెండు నాలుకల ధోరణి అవలంబించరు. ఈ ధొరణి ఎవరి కొమ్ము కాసేటందుకో అందరికీ తెలుసు. హైదరాబాదు ప్రజలెవరూ ప్రత్యేక రాష్ట్రం కాని, కేంద్ర పాలిత ప్రాంతం కాని కోరుకుంట లేరు, మజ్లిస్ తొ సహా. ఇక మీలాగ ఒకరిద్దరు శరీరం ఇక్కడ, ఆత్మ ఎక్కడో టైపు మనుషుల సంగతి చెప్పలేను. దురదృష్ట వశాత్తు అలాంటి మనుషులు కొంత మంది ఉన్నరు హైదరాబాదుల. వాళ్ళు ఇండియా ఓడి పాకిస్థాన్ గెలిస్తె పండగ చేసుకుంటరు. మీకూ వాళ్ళకూ ఒకటే బుద్ధి, శరీరాలు ఇక్కడ, ఆత్మలు ఇంకోదగ్గర. ఇకనైనా మీరు మారి, ఇక్కడి ప్రజల మంచీ చెడుల గురించి ఆలోచించండి, అప్పుడు మీరు నిఖార్సైన తెలంగాణా ప్రజలు అనిపించు కుంటరు.
sir,
ReplyDeleteboth Hindus and Muslims were living together from the time of expedition of hyderabad by Muslims but there was no war among them inany matter,even we lived happily we felt as brothers,
but now even on small matters, there will be a situation of curfew,all these is just becouse of ANDHRA peoplewho brought the differnce in language,religion.....
I request u all not to separate Muslims and Hindus in telangana
Sir,
ReplyDeleteplease ask yourself,is there any family from coastal area who dont have any cousins or relatives in telangana....
I think even tribals will have their relatives here....
once upon a time Khammam was ours but now I dont think it is......60% of the people in Khammam are from other regions
sorry if I hurt your feelings...
dont U all have any shy to demand what U have begged from us and what U got by cheating all of us
dont u have any guilty
ఇవన్నీచూస్తుంటే సీమంధ్ర వారిని ఇక్కడనుంచి తరమడం మినహా ఇంకొక మార్గం కనపడటం లేదు .రాజాకర్లనే మేడలు వంచి తరిమిన వీర చరిత్ర మాది . మిమ్మల్ని తరమడం పెద్ద కష్టం కాదు .
ReplyDelete