కోవెల సంతోష్ కుమార్ గారి బ్లాగు చూస్తుంటే తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు వ్రాసిన ఈ క్రింది వ్యాఖ్య కనపడ్డది.
"తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు. వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం. ప్రైవేట్ ఇనీషియెటివ్ పెంపొందడం. తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం. తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి. ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు. ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే. ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు.
తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది."
ఎంత దారుణమైన ఆరోపణలో చూడున్రి. ఈ వ్యాఖ్యలు సదరు వ్యాఖ్యాత అభిప్రాయాలే కాదు దాదాపు అందరు సమైక్యవాదుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నయి. వాల్లేందో చాలా గొప్ప వాళ్ళని, తెలంగాణా పౌరులు రెండో జాతికి చెందిన వాళ్ళని, విడిపోతే వీళ్ళకి పరిపాలించుకోవడం రాదనీ, ప్రజాస్వామిక భావాలు లేవని, మొబిలిటీ లేదని, వగైరా వగైరా...
ఇవన్నీ ఎంతవరకు నిజాలో పరిశీలించి చూద్దం.
విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదట! ఏంది మారేది? కులతత్వం నేర్చుకోవల్నా, ఫాక్షనిజం నేర్చుకోవల్నా? ఏం నేర్చుకోవాలె మీలెక్క మారుతందుకు?
ఇక్కడ పని సంస్కృతి లేదట! ఒక వైపు వీళ్ళే చెప్పుతారు, తెలంగాణాల వ్యసాయం పెరిగింది, జీడీపీ పెరిగింది అని. మరి ఆయకట్టు ప్రాంతాలు లేక, బోర్లకిండా అష్ట కష్టాలు పడుకుంట కూడా వ్యవసాయం ఎట్ల పెరిగింది సారూ పని సంస్కృతి లేక పొతే? డబ్బులున్నోడు AC రూముల కూచొని వ్యాపారం చేసుడేనా పని సంస్కృతి అంటే? పాలమూరు కార్మికులు చూపెట్టేది పని సంస్కృతి కాదా? ఫ్లోరీన్ విషాన్ని తాగుతూ నరనరాన నిస్సత్తువని నింపుకొని కూడా జీవన్మరణ యుద్ధం చేస్తున్న నల్లగొండ జిల్లా ప్రజలల్ల పని సంస్కృతి కనిపించ లేదా? రాష్ట్రానికే రైస్ బౌల్ గా మారిన కరీంనగర్ బిడ్డలది పని సంస్కృతి అనిపించా లేదా? వివక్ష గురించి మాట్లాడితే మీరే అభివృద్ధి చెందిన్రంటరు. మా ఉద్యోగాలు కబలిస్తున్నారంటే మీకు పని సంస్కృతి లేదంటరు.
ప్రైవేట్ ఇనీషియేటివ్ ఎక్కడికెళ్ళి పెరుగుతది? ప్రైవేట్ వ్యాపారాలకి డబ్బులు కావాలె. తేరగా వస్తున్న నీల్లతోటి మూడు పంటలు పండుతలేవు మాకు డబ్బులు ఇండ్లల్ల మూలిగేటందుకు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటే బతుకుదెరువు, వచ్చే కారుకు పంట. ఉన్న ప్రాజెక్టులు పూర్తిగాక పాయె, రావలసిన ప్రాజెక్టులు రాకపాయె, ఇంకా వ్యాపారాలు ఎక్కడ పెట్టక పోతిమి సామీ?
అక్షరాస్యత గురించి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. తిండికి లేకపోయినా, సదువులు బాగనే సదివించు కుంటున్నరు వావాళ్ళు. కాకపొతే మీలెక్క కార్పోరేట్ స్కూళ్ళల్ల చదివే స్తోమత లేకపోవచ్చు.
తెలంగాణాల ప్రజాస్వామిక భావాలు లేవా? TRS గెలిస్తే ప్రజాస్వామిక భావాలు లేనట్టు, తెలుగుదేశం, కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామిక భావాలు ఉన్నట్టా? వారసత్వం పేరు జెప్పి కడపల అవినీతి సామ్రాట్టును గెలిపిచ్చుడు ప్రజాస్వామ్య భావాలా? కులానికో పార్టీ పెట్టుకొని రాష్ట్రాన్ని రెండు మూడు కులాల కుమ్ములాట కింద మార్చుడు ప్రజాస్వామ్యమా? గదేందో సరింగ చెప్పితే అర్థం చేసుకుంటం సారూ. ప్రజాస్వామ్యం కోసం ఆనాడే నిజాం సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన గడ్డ ఇది, మరువకండి.
అయితే కొందరు నాయకులు ప్రజా ప్రయోజనాలను అటక ఎక్కించి ఆంధ్రా పాలకుల తొత్తుల లెక్క మారింది మాత్రం నిజమే. దానికి కారణం అధికారబలం, సూట్ కేసుల బలంతో సిసలైన నాయకులను తొక్కేసి, మీ మోచేతి నీళ్ళు తాగే చెంచాలకు పదవులు ఇచ్చి కృత్రిమ నాయకత్వాన్ని పెంచి పోషించుడు. అప్పుడు KCR ని తోక్కిపట్టినా, ఇప్పుడు నాగం ని ఈడ్చి తన్నినా అదే కారణం. కాని ఇప్పుడు రోజులు మారినాయి అని గుర్తు పెట్టుకోండి. మీరు తొక్కిన నాయకులే రేపు చండ్రనిప్పు లైతరు.
అవతలి వాళ్ళ అభిప్రాయాలను వినిపించుకోవాలెనా? 'నాయింటికొస్తే నాకేమిస్తావ్, నీయింటికోస్తే నువ్వేమిస్తవ్' అనే అభిప్రాయాలా? మేం ఎందుకు విడిపొవాలను కుంటున్నాం, మా బాధలు ఏంటివి అని ఒక్క సారి గూడ వినిపిచుకోరు మీరు. పైనించి 'మీరు చాల బాగా ఉన్నరు మా పాలనల, మీకు ఇష్టం ఉన్నా లేక పోయినా మిమ్ముల మాత్రం వదలం' అని మాట్లాడుతరు. న్యాయమేందో ఒకసారి ఆలోచించండి. ఇక మీదపడి కొట్టుడు మాట మీకే తెల్వాలె. ఇది ఒకసారి చూసి ఎవరు ప్రశ్నిస్తే కొడుతరో తెలుసుకోండి.
అయ్యా తెలంగాణా ప్రజల మొబిలిటీ గురించి మీరు అస్సలు దిగులు పడే అవసరం లేదు. రెండు మూడు భాషలు మాట్లాడ గలిగినోల్లు తెలంగానోళ్ళు. పాలకుల పుణ్యమా అని గవర్నమెంటు ఉద్యోగాలు మాత్రం వాళ్లకు దొరుకవు గని ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంట లక్షలాది మంది వేరే రాష్ట్రాలల్ల బతుకుతున్రు. ఒక్క మహారాష్ట్రలనే యాభై లక్షల మంది తెలుగోళ్ళు ఉంటె వాళ్ళల్ల ఎక్కువ శాతం మంది తెలంగాణా వాళ్ళే. ఇంకా గుజరాత్ సంగతి సరేసరి. సాఫ్టువేరు పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంల వాళ్ళు తిరుగని జాగలేదు. ఒక్క సీమాంధ్ర తప్ప. ఎందుకో మరి తోటి తెలుగోళ్ళ దగ్గరికి పోవ్వాలే నంటే మావోల్లకు అంత అదురు, మీరే జెప్పాలె.
మీరు రాసిన మూడు నాలుగు వ్యాక్యాలల్ల తెలంగాణా మీద మీకున్న అభిప్రాయాన్ని దాపరికం లేకుండ చెప్పినందుకు చాలా సంతోషం సారూ. మీలాంటి వాళ్ళ మాటలు విని మాకు ఉద్యమావేశం మరింత ఎక్కువైతది. మా మీద ఇటువంటి అభిప్రాయాలు ఏర్పరచు కున్నోల్ల తోటి ఎందుకు కలిసుండాలే అని ప్రశ్న ఉదయిస్తది. రాష్ట్రం కోసం మా ఆరాటం పోరాటం లెక్క రూపు దిద్దుకుంటది.
Good job. I was just about to make a post on this. This bugger would never learn.
ReplyDeleteThanks Viswaroop.
ReplyDeleteమా కోస్తాంధ్రాలో తెలంగాణా వ్యతిరేకత మీడియాలో రాస్తున్నంతగా లేదు . చాలామంది కొత్త రాజధాని ఏర్పడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశల్లో కూడా ఉన్నారు . నాకు మాత్రం హైదరాబాదు ఒక నరక కూపంగా కనపడుతుంది . అక్కడున్న కాలుష్యం , దుమ్ము , చెత్తా , ట్రాఫిక్ అంటే నాకు భయం . మా గుంటూరు , బెజవాడలు కూడా భవిష్యత్తులో ఇంత విషతుల్యంగా మారిపోతాయేమోననే భయం ఉంది . అందుకే నా నినాదం .. షరతులతో కూడిన తెలంగాణా ఇవ్వాలి . ఆ షరతు .. కొత్త రాజధాని మా ఏరియాలో ఏర్పరచటానికి ఎంత మాత్రం వీలు లేదు .
ReplyDeleteనేను కూడా సమైక్య వాదినే... ఎందుకంటే...సీమంధ్ర వాళ్ళు హైదరాబాద్ కి వచ్చి తెలంగాణా ని దోచుకున్నారు... వాళ్ళని వేల్లగోడతాం...
ReplyDeleteరహదారులు బంద్ చేస్తాం.. అటు వాళ్ళు ఇటు రారు... పండగలకు వెళ్తే అక్కడే ఉండండి... లాంటి మాటలు వినే సమైక్య వాదిని అయ్యాను...
నేనే కాదు... నా లాంటి వాళ్ళు చాల మంది ఉన్నారు... కేవలం అలంటి మాటల వలెనే సమక్య వాదులు అయ్యారు...
నిజానికి ఇస్తే నాకు ఏమి ప్రాబ్లం లేదు.. కానీ అలంటి మాటలే నచ్చలేదు... నేను ఏమి చేయలేక పోయాను... చేయగలిగిన వాళ్ళు చేసారు... అందుకే ఇష్టము అని చెప్పి ఒక ఇయర్ అయ్యిన ఇంకా ఏమి జరగలేదు...
ఇప్పటికైనా ఎందుకు తెలంగాణా అనేది క్లియర్ గ చెప్పుకోండి... దోచేసారు.. తోలేస్తాము... అలా అంటే ఎప్పుడు సెపరేట్ తెలంగాణా అన్నా... సమైక్య ఉద్యమం వస్తూనే ఉంటుంది...
Mr RaZ,
ReplyDeleteSuch accuses are common in any agitation of this magnitude. Remember your idli sambhar go back movement.
We don't believe these are actual reasons. Actual reason are well known to the people who are supporting pseudo samaikyavadi movement and they are not interested to yield. But the day they yield to public pressure is not far away.
ramana,
ReplyDeleteWe know that most of seema-andhra people has nothing to do with samaikya-andhra slogan like you. There are few people who have interests in Hyderabad and the benefits reaped out of present state who are actually making it difficult.
Thanks for sharing your views.
Raz గారు ,
ReplyDeleteతెలంగాణా ఉద్యమకారులు ఆంధ్ర రాజకీయ వ్యాపారస్తులైన లగడపాటి , కావూరి ల మీద ఉన్న కోపం వల్ల సంయమనం కోల్పోయి అలా మాట్లాడి ఉండొచ్చు . ఈ తరహా కామెంట్స్ రాజకీయ ఎత్తుగడలలో లోపాల ( wrong political strategies ) వల్ల వస్తుంటాయి . అందుకే ఈ కామెంట్స్ వల్ల తెలంగాణా ఉద్యమానికి కొంత నష్టం జరిగింది .
I think you better remove "SAGATU" from this post title. His opinion is not everyone's.
ReplyDeleteAnd i really am disgusted with his generalization.
There no problem as such if Telangana is a separate state as long as equal opportunity for everyone is still maintained.
If you look at people, they started with fighting each other even though they dont know a reason why they oppose/support telangana.
As above some one said, it's because politicians are creating this vicious circle by announcing that they will not allow other Andhra people in Hyderabad etc and the opposition politicians are also releasing statements against Telangana people.
This is how history happens. Two groups (Hindu/Muslim for ex) start apprehending each other. All the persons in one group will hate the entire community of the other group because some one told them.
Very few will be exceptions, but you can see that even though the other guy did not do any harm, you simply hate him because he is from another group.
Hope peace and sense prevails.
తెలంగాణలో దశాబ్దాల తరబడి కమ్యూనిస్టు/ మావోయిస్టు పార్టీల ప్రాబల్యం వల్ల ఇక్కడి పనిసంస్కృతి బాగా దెబ్బదిన్న మాట వాస్తవమే. యజమానుల్ని ఎదిరించడం, వారిని ఏకవచనంతో సంబోధించడం, వేళకి పనిలోకి రాకపోవడం, మాటిమాటికీ సమ్మెకి దిగడం, పని ఎగ్గొట్టడం ( మొన్న ఫిబ్రవరిలో తెలంగాణ ఉద్యమం పేరుచెప్పి రిజిస్టర్లలో సంతకాలు చేసి రెండున్నర వారాల పాటు రోడ్లమీద బలాదూరు తిరిగి జీతాలు తీసుకున్నారు) - ఇదంతా ఉంది.
ReplyDeleteతెలంగాణలో ప్రజాస్వామ్యం లేదనేదీ వాస్తవమే. గుంపుగా మూకగా పోగై గోల చేస్తూ అవతలివారిని మాట్లాడనివ్వని జీవనవిధానం అమల్లో ఉంది. కొట్టడాన్నే అవతలివారికి గట్టి సమాధానం చెప్పడంగా తెలంగాణలో భావిస్తారు. మాటకి మాటతో సమాధానం చెప్పరు. ఆ రకంగా గతంలో లగడపాటిని కొట్టడం గమనించాం. జేపీగారిని మీదపడి కొట్టడం గమనించాం. మహబూబాబాద్ లో జగన్ ని కొట్టడం గమనించాం. ఇప్పుడు వేరే పార్టీవాళ్ళు ఎక్కడో ఏదో సభ చేసుకుంటుంటే అక్కడికి పోయి వాళ్ళ మీద దాడి చేసి సభలు జరుపుకోనివ్వని అసహన సంస్కృతిని కూడా గమనిస్తున్నాం, ఇదంతా అబద్ధం కాదు గదా !
మరి ఎందుకు అనవసరంగా తాడేపల్లిగారిని నిందిస్తున్నారో అర్థం కాలే. ఆయనతో ఏకీభవించేవారు చాలామంది ఉన్నమాటా నిజమే.
@ఓబుల్ రెడ్డిగారు,
ReplyDeleteమీకు తాడేపల్లి గారి Generalizations ఏమాత్రం అభ్యంతరకరంగ అనిపించలేదంటె ఇంక చర్చే అనవసరం.
పైగా మీరు కూడా అవే Generalizations చేస్తున్నరు.
మీరు చెప్పే వర్క్ కల్చర్ అంటే ఏందో అర్థం కాలేదు. బహు వచనంతో పలికితేనే గౌరవం ఉన్నట్టా? తెలంగానాల తల్లిదండ్రులను గూడ ఏక వచనంతోనే పిలుస్తరు. అసలు మన తెలుగు భాషలనే గారు అన్న పదం కృత్రిమమైంది, అది బ్రిటిష్ కల్చర్ల భాగం.
ఇంక పని ఎగ్గొట్టడం. మొన్న జరిగింది ఉద్యమం. రేపు మీరు చెయ్యొచ్చు బహుషా. బ్రిటిష్ కాలంల మీరు చేసిన్రు కూడ, సహాయ నిరాకరణం. మామూలు సమయంల తెలంగాణా, ఆధ్రా జనంల ఎవరు ఎక్కువ ఎగ్గొడతరో మీ దగ్గర statistics ఉంటె ఇవ్వున్రి.
కొట్టడం, తిట్టడం గురించి. పైన లగడపాటి వీడియో లింకు మీరు చూడలేదనుకుంట. మరోసారి జూడున్రి. అలాంటివి ప్రతిచోట జరుగుతయి. తెలంగాణాలో కొట్టుకుంటరు, తిట్టుకుంటరు అంటున్రు, మరి మీదగ్గర చంపుకుంటరు అంటె మీకెట్ల ఉంటది? కారంచేడు, చుండూరు మరిచిన్రా? వందల కొద్దీ ఫ్యాక్షన్ హత్యలను ఏవిధంగ విష్లేషిస్తరు? అవి ప్రాజాస్వామ్యంల భాగమా?
కత్తి పద్మారావు విజయవాడలో దళిత సభకు KCRని పిలుస్తమని చెప్పినప్పుడు ఎటువంటి బెదితిరింపులు వచ్చినయో తెలువదా? చివరికి ఆ సభ ఆగిపోలేదా?
మీది చాలా గొప్ప సంస్కృతి అని, ఇతరులది అసహన సంస్కృతి అనే మూర్ఖపు ఆలోచనలు ముందు మానండి. సమైక్య వాదం గురించి తర్వాత ఆలోచించొచ్చు. కడుపు మండితె మనిషెవడైనా తిరుగ బడ్తడు, అది ఆంధ్రా ఐనా, తెలంగాణా ఐనా! మొన్న సోంపేటలో చూసిన్రుగా!!
ఎవరిది కొట్టే జీవన విధానం? నంద్యాలలో ప్రధానమంత్రిపై రాళ్లు విసరటం ఎవరి జీవన విధానం? ముఖ్యమంత్రుల్ని దింపేయటం కోసం మతకల్లోలాలను సృష్టించటం ఎవరి జీవన విధానం? అనంతపురంలో ఓ తెలంగాణ మంత్రిని కొట్టి వెనక్కి పంపించటం ఎవరి జీవన విధానం? పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ తిరుపతికి వస్తే గోబ్యాక్ నినాదాలిచ్చి అడ్డుకుని వెనక్కి పంపించటం ఎవరి జీవన విధానం? తమ ప్రాంతంలో తెలంగాణా వాళ్లకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క వ్యాపారమైనా పెట్టుకోనివ్వని అసహనం ఎవరి జీవన విధానం? వాళ్లతో సహజీవనం చేయలేని తనం ఎవరి జీవన విధానం? బ్రిటిష్ వాళ్ల కాలంలో సంపన్నత సాధించి..స్వతంత్రంగా బతకలేక... వనరుల దోపిడీకి వలస వచ్చి తెలంగాణా ఔదార్యాన్ని దాండిగతనంతో సొమ్ము చేసుకుని.. ఈ ప్రాంతం లేకపోతే బతకలేని పరాధీన జీవన విధానం ఎవరిది?
ReplyDeleteఇన్నెందుకు...? ఎంతసేపూ.. నువ్వూ.. నేనూ.. అని విడదీసే మాట్లాడుతూనే.. సమైక్యం అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం .. ఆ ముసుగులో దాష్టీకం చేయటం ఎవరి జీవన విధానం?
ఓబుల్‌రెడ్డి గారు చానా విషయాలే గమనించారు.
ReplyDeleteతప్పు మీది కాదు, మీదృష్టికోణంలోది. పనోల్లను బానిసలుగా చూసే సీమాంధ్ర ఫ్యూడల్, ఫాక్షనిస్టు సంస్కృతిలో పనివారిని మనుషుల్లాగా కాక యంత్రాలలాగా, బానిసలలాగా చూసేవారికి ఇక్కడిపనివారి స్వతంత్రభావాలు తప్పుగా తోయవచ్చు. అది మీలోపం కాదు, మీరు పెరిగిన వాతావరణంలోని లోపం. మీరు దేన్నయితే తప్పంటున్నారో దాన్నే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో, మనదేశంలోని పేరున్న కంపనీల్లో వాడే స్వేఛ్చాయుత పనిసంస్కృతిగా మీరు గమనించాలి.
మీరింకా మీఫ్యూడల్ కాలంలో ఉండి అదే సరీయినదని అనుకుంటే మీతోమాకు కుదరని పని. పనిలోనే కాదు, రాజకీయాల్లో కూడా మీరు మీఫ్యూడల్ సంస్కృతిని బాగానే చూపిస్తారు, అందుకే ఎంత అవినీతిపరుడయినా మీముద్దుల జగన్నే గెలిపించుకున్నారు. అలాంటి ఫ్యూడల్ సంస్కృతిని గొప్పదిగా భావిస్తే అది మీభావదారిద్రంగా భావించవలసి వస్తుంది.
ఒక ఉద్యమం జరుగుతున్నపుడు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసేనాయకులపై దాడిచేయడం అత్యంత సహజం. మీదగ్గర ఉద్యమాలు జరిగినప్పుడు మీరూ అదే చేశారు. కానీ మీదగ్గర ఏఉద్యమం లేనప్పుడు కూడా దాడులు మామూలుగా జరుగుతుంటాయి. అసలు కొందరిమీద పోటీగా నామినేషన్ వెయ్యాలంటేనే ప్రాణాలతో చెలగటం. నామినేషన్ తరువాత ప్రచారం చెయ్యాలంటే మరో చెలగాటం. అదేనా మీప్రజాస్వామిక భావన? ఎందుకండీ ఇలా ఒకరిని దెప్పబోయి మీమచ్చలు బయట పెట్టుకోవడం?
అవును, తాడేపల్లి కుల్లురాతలను సమర్ధించేవారు చానామందే ఉండొచ్చు. కొందరు కుల్లును బయటికి వెల్లగక్కుతారు, మరికొందరు కడుపులో దాచుకుంటారు. రెండూ కుల్లే, ఏది ఎక్కువ అంటే చెప్పలేం.
"Pade"kattali ilanti chetha matalu matladevallaki.
ReplyDelete"Samaykyandhrulu Parannajeevulu"
Jai telangana!!!