Sunday, June 12, 2011

జాతీయవాది అసలురంగు

జాతీయవాదినని అసందర్భ ప్రేలాపన చేసి తన అసలురంగు బయటేసుకున్న జైపాల్ రెడ్డి, సర్వత్రా నిరసనలు వెల్లువెత్తే సరికి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకుండు. నేనసలు తెలంగాణా గురించి ఏమీ మాట్లాడ లేదు అని, ఒక కాంగ్రెస్ వాడి ఎట్లా ఉండాలేనో మాట్లాడిన అని సమర్థించుకుండు.

పైనించి ఆయిన ఇంకొన్ని ముచ్చట్లు గూడ చెప్పిండు. అధిష్టానం ఇప్పటిదాంక తెలంగాణా మీద నిర్ణయం తీసుకోలేదట. ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయం తీసుకుంటదట. అప్పటిదాంక ఈయన ఏమీ మాట్లాడాడట. అధిష్టానం నిర్ణయం తీసుకున్నంక ఈయన నిర్ణయం చెప్పుతడట. అధిష్టానం నిర్ణయం తీసుకున్నంక ఈయన నిర్ణయం ఎవనిగ్గావాలె?

ఇన్నాళ్ళూ ఏదో పెద్దమనిషి అని ఏమీ మాట్లాడకపోయినా గౌరవం పొందుతున్న పెద్దమనిషి నిన్నటితోటి తెలంగాణాల పరపతి మొత్తం పోగొట్టుకున్నడు. ఇంత దివాలాఖోరు మనిషా అని జనం ఛీకొడుతున్నరు ఈయన మాటలు జూసి.  

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకునిగా జైపాల్ రెడ్డికి తెలంగాణా కోసం పోరాడవలసిన బాధ్యత అందరికన్నా ఎక్కువగా వున్నది. సమైక్యరాష్ట్రం చేతగాని తనం వాళ్ళ రైతులు బికారులుగా మారిన జిల్లా మహబూబ్ నగరు. రాజోలిబండ ప్రాజెక్టు తూములు సీమాంధ్ర ఫాక్షనిష్టులు బద్దలుగొట్టి నేఎల్లు కొల్లగోట్టినప్పుడు దాని ఆయకట్టు కింద బతికిన వేలాది మంది రైతులు పొలాలు వదిలిపెట్టి కూలీలై దేశ దిమ్మర్లుగా తిరుగబట్టిన్రు. ఈ నాయకునికి ఆ విషయం ఎన్నటికీ పట్టదు. పట్టించుకున్న పాపాన పోడు.

కృష్ణానది మహబూబ్ నగర్ నడిబొడ్డు నుండి 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తున్గాబద్రానది 80 కిలోమీటర్లు ఈ జిల్లా నించి ప్రయాణిస్తుంది. అయినా కూడా అన్నపూర్ణగా ఉండవలసిన జిల్లా కరువు కాటకాలతోటి కునారిల్లు తున్నదంటే ఎంతటి అన్యాయం జరుగుతున్నదో ఊహించొచ్చు. పాతిక పైబడి ఏళ్ళు గడిచినా శ్రీశైలం కాలువ పూర్తి కాదు. ట్రిబ్యునళ్ళు నికరజలాలు ఇచ్చినా కొత్త ప్రాజెక్టులు రావు. ఉన్న రాజోలిబండ దౌర్జన్యంగా గండికోడితే అడిగే దిక్కుండదు. 

ఇంతటి అన్యాయాలు జిల్లాకు జరుగుతుంటే ముప్పై ఐదేల్లనుండి నాయకత్వం వెలగబెడుతున్న ఈ మనిషి సీమాంధ్ర నాయకులకు వంతపాడుడు తప్ప చేసిందేమీ లేదు. జాతీయవాదమంటే తను పుట్టి పెరిగిన, తనను గెలిపించి పార్లమెంటుకు పంపి, తన అభివృద్ధికి దోహద పడిన ప్రాంతాన్ని పట్టించు కోక పోవడమా? అది ఆయనకే తెలువాలె.

ప్రజలమీద పది దోపిడీ చేసే దొరల వారసత్వం పుణికి పుచ్చుకున్నఇలాంటి నాయకులు ప్రజలకు ఒరగబెట్టేది ఏమీ ఉండదని ఇప్పుడు ప్రజలు బాగానే గ్రహించిన్రు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాగానే బుద్ధి చెప్పుతరు. అటో ఇటో చేసి 2014 వరకు జరుపుదే ఇప్పుడు మీరు వీళ్ళు గలిగేది. ఆ తర్వాత తెలంగాణా ఇట్లాంటి ద్రోహులందరి అడ్రసులు లెక్కతోటి గాయబై పోతై. 

4 comments:

  1. తెలంగాణావాదులకి కనీసం ఇప్పుటికైనా జ్ణానోదయం అయినందుకు సంతోషం . వారు లగడపాటిని పక్కనబెట్టి .. ముందు జైపాలుడి సంగతేంటో తేల్చుకుంటే గానీ తెలంగాణా ఉద్యమానికి ఒక రూపు , స్పష్టత రాదు . జైపాల్ రెడ్డి లాంటి స్వార్ధపరుడు అగ్రనాయకుడిగా చెలామణి కావటం తెలంగాణావాదుల దురద్రుష్టం .

    ReplyDelete
  2. పదవుల కోసం ప్రాకులాడేవాడికి ప్రాంతీయాభిమానం ఏమిటి? జైపాల్‌కి సోనియా కాళ్ళు పట్టుకుంటేనే పదవి వస్తుంది కానీ తెలంగాణా కోసం ఉద్యమిస్తే పదవి రాదు. అందుకే జైపాల్ తెలంగాణాకి వ్యతిరేకంగా మాట్లాడాడు.

    ReplyDelete
  3. జైపాల్ రెడ్డి మొదట్నుంచీ కరుడుగట్టిన సమైక్యవాదే. ఆయన కేంద్రంలో మంత్రిగా ఉండగా తెలంగాణ రాదు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇలాంటి సమైక్యవాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఢిల్లీ వెళ్లేది, తెలంగాణ ఇమ్మని పైరవీ చేయడానికిక్కాదు. ఇవ్వొద్దని గట్టిగా చెప్పి రావడానికి ! కానీ మన పిచ్చి తెలంగాణవాదులు వాళ్ళు తమ కోసమే అక్కడికి వెళుతున్నారనుకుంటున్నారు.

    ReplyDelete
  4. తెలంగాణా కాంగ్రెస్ నాయకులందరూ సీమాంధ్ర నాయకుల కింద sub-ordinatesగా పని చేసేవాళ్ళే. వీళ్ళు తెలంగాణా కోసం నిజంగా పని చేస్తారంటే ఎలా నమ్మాలి? తెలంగాణాకి అన్ని పార్టీల కంటే ఎక్కువ ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే.

    ReplyDelete