Saturday, June 11, 2011

జైపాల్ రెడ్డీ, నువ్వు జాతీయవాదివి కావు, అవకాశవాదివి

ఎంత గొప్ప వాక్యం సెలవిచ్చినవ్ జైపాల్ రెడ్డీ! మీరు గొప్ప జాతీయ వాదులని తెలువక ఇన్ని రోజులు మీకు ఈ ప్రాంతం మీద, ఇక్కడి ప్రజలు పడే బాధల మీద ఎంతో కొంత ఆరాట పడుతున్రని అనుకున్నం. మూగనోము పట్టిన నీ నోరు కనీసం సమయం వచ్చినప్పుడైన మాటలు మాట్లాడుతదని, నీ ప్రాంతం, నీ జిల్లా ప్రజల బాధలు ఎలుగెత్తి చాటుతదని ఆశగ ఎదురు చూసినం.

కాని తప్పు మాదేలే! ముప్పై ఐదేళ్ళ నీ సుదీర్ఘ రాజకీయ జీవితంల ఎన్నడూ నీ స్వార్థం నువ్వు చూసుకునుడు తప్ప నీ ప్రాంతం ప్రజలకు కానీ, నీ జిల్లా ప్రజలకు గానీ నువ్వు ఒరగబెట్టిందేముందని? ఎందుకు నీమీద ఆశలు పెట్టుకోవాలె? ఆశలు పెట్టుకునుడు మేం జేసిన తప్పని చెంపమీద ఫెడేల్మని కొట్టినట్టు చెప్పినవ్! మొత్తానికి మా కండ్లు తెరిపించినవ్.

నీ ప్రాంతం నడిబొడ్డునుంచి రెండు జీవనదుల జీవనదులు పారుతున్నాకూడ, నీ ప్రజలు నీటికి అల్లల్లాడుతుంటే, అది నీ కండ్లకు ఎప్పుడూ కనబడలే. ఎప్పుడూ నీకు పదవులే కనపడ్డాయి, ప్రజలు కాదు. స్వార్థం కోసం నువ్వు జాతీయవాదం పలుకుతుంటే నీ ప్రజలు తిండిలేక అంతర్జాతీయవాదం పలుకుతున్రు. అవును, భూములు వదిలేసి ఉప్పర పని చెయ్యనీకి దుబాయ్, ఆఫ్గనిస్తాన్, సింగపూర్ లాంటి దేశాలకు వలస బోతున్రు. పోలేనోల్లు దేశంల ఉన్న అన్ని నగరాలకు పొయ్యి తట్టలెత్తుకుంటనో, బాసండ్లు తోముకున్తనో బతుకుతున్రు. అవునులే, నీ అసుంటి లీడర్లను ఎన్నుకున్నంక ఎవరు మాత్రం ఏంజేస్తరు? 

ప్రాంతాన్ని పణంగా పెట్టి సిగ్గులేకుంట పదవి కోసం పరదేశి మహిళ కాళ్ళ పంచన చేరే నువ్వు నీ ప్రాంతం ప్రజలు కూడ నీలాంటి బానిస బతుకు బతకాలె అని కోరుకుంటే మాత్రం ఆశ్చర్య మేముంది? కాని నువ్వు తెలుసుకోవలసిన నిజం ఒకటుంది. నీలాగ బానిస బతుకీడ్చేటందుకు మాత్రం ఇక్కడి ప్రజలు సిద్ధంగ లేరు. తెలంగాణా ఏర్పాటును బలపరుస్తూ ఓట్లడిగిన నువ్వు నిజంగా మనిషివైతే రాజీనామా చేసి, జాతీయవాదిని అని చెప్పుకుంట ఎన్నికల్ల నిలబడి చూడు. అప్పుడు తెలుస్తది నీ జాతీయవాదం పస ఏందో!

ప్రాంతం పక్కన నిలబడే సమయం వచ్చినప్పుడు జాతీయవాదినని చెప్పుకున్న నువ్వు, రేపు జాతి తరఫున నిలబడే సమయం వచ్చినప్పుడు అంతర్జాతీయవాదినని చెప్పుకున్నా చెప్పుకోగల సమర్దునివి. తన పుట్టినూరు మీద అభిమానం లేనోడు ప్రాంతీయాభిమానం ప్రకటించలేడు. ప్రాంతీయాభిమానం లేనోడు జాతియాభిమానం కూడా ప్రకటించ లేడు.  అందుకే జెప్తున్న విను, నువ్వు జాతీయవాదివి కాదు, పచ్చి అవకాశవాదివి.
  

7 comments:

  1. jaipal gadu yedava ani nirupinchukondu

    ReplyDelete
  2. ఇదే విషయం ఇన్నాళ్ళ బట్టి మేం చెప్తూ వుంటే.. సీమాంధ్ర అహంకారం అంటూ దుమ్మెత్తె పోసారు కదయ్యా..జైపాల్ రెడ్డి గారంత సీనియర్ పొలిటీషియన్ గాని, సిన్సియర్ కాంగ్రెస్ నేత గాని ఎవరూలేరు.. ఇప్పటి కైనా కళ్ళు తెరవండి..ముందా తిట్ల పురాణం ఆపండి..

    ReplyDelete
  3. జాతీయ వాదులకు జన్మ భూమి ఉండదా?
    పుట్టిన ఊరును ప్రేమించడం జాతీయతకు భంగం కలిగిస్తుందా?
    భారతమాతకు నమస్కరించేవాడు కన్న తల్లిని విస్మరించాలా?
    తమిళుడు తమిలున్నని, బెనగాలి వాడు బెంగాలి వాన్నని చెప్పుకోగా అడ్డం రాని
    జాతీయవాదం తెలంగాణా వాడు నేను తెలంగాణా వాణ్ని అని చెప్పుకోడానికి అడ్డుపడు తోందా?
    తెలంగాణాకు ఎంత అన్యాయం జరిగినా జాతీయవాదం అంటూ చోన్గాకార్చుకుంటూ కూచోవాలా?
    ఎం తెలివిరా నీది
    ఎంత దిక్కుమాలిన బతుకురా నీది
    థూ....!!
    Yadagiri

    ReplyDelete
  4. well said Jaipal reddy keep it up , this is an eye opener for all telangana supportor , Mr Srikanth chari u r consiprator/provactor for telangana movement ,u guys are playing with innocent students and people across the telegnan ,
    there is no ground relaties in u r analysis , telegana will become nasty plance once it divided as separate state under the control KCR and his family u should need to forecast those things first
    ekna nayina kallu teerichi developmen meda concentrate cheyye try to write article how devolpe the Telanga and improve the standard of people , separte state is never the solutio for developemnt it;s entirely political spoil game

    ReplyDelete
  5. Above Anonymous,

    There is no need of provoking or advocating people for separate telangaanaa. The message is already well informed at gross roots.

    The guys like Jaipal Reddy who prostrate before Sonia for their ministry berths are real conspirators against telangaanaa people and telangaanaa people already knew it.

    We know how to develop telangaanaa and also who are standing in between the development of telangaanaa. We are in the process of removing the abstacles. And very soon that will become a reality.

    ReplyDelete
  6. baga gaddipettavanna
    ji telangana

    ReplyDelete
  7. "పదవి కోసం పరదేశి మహిళ కాళ్ళ పంచన చేరే"

    well said. Hindu politicians in Congress are slaves without any brains.

    ReplyDelete