తెలంగాణా వాది | నీటి పంపకాలల్ల మాకు అన్యాయం జరుగుతుంది. మేం విడిపోతేనే మా బతుకులు బాగైతయి. |
సమైక్య వాది | లేదు. మీకు అన్యాయం అస్సలే జరుగుత లేదు. సమైక్య రాష్ట్రం ఏర్పడ్డంక మీదగ్గర్నే ఎక్కువ ప్రాజెక్టులు కట్టిన్రు. |
తెలంగాణా వాది | ఎక్కడ కట్టిన్రో జెర చూపెట్టక పోతివి! కృష్ణా కుడికాలువ రాష్ట్రం దాటి పాయె, ఎడమ కాలువ అడ్రస్ లేకుండా వాయె. గోదావరి సూద్దామంటే పోచంపాడు అన్నేల్లయినా పూర్తి గాక పాయె. అనుమతులు లేకున్నా పోలవరం పరుగులెట్ట వట్టె. |
సమైక్య వాది | మీరు గడ్డ మీద ఉన్నారు కదన్నా. మేం గడ్డ కిందున్నమన్న మాట. అంటే నీళ్లన్నీ మాకే వస్తాయి. అది దేవుడిచ్చిన వరం. మీరు గాని, మేం గాని అది ఆపలేం. నీళ్ళు కిందికి వస్తున్నాయి కాబట్టి అక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. దానికి నువ్వు మాత్రం ఏం జేస్తవు చెప్పు? గడ్డమీద ఉన్నోనివి కాబట్టి నీళ్ళు నీకు రావు. గద్దమీదున్నోల్లు గడ్డ కింద ఉన్న మాకు నీళ్ళు వదలాలి. అది దైవ నిర్ణయం. |
తెలంగాణా వాది | అట్లనా? మరి తెల్వకడుగుత. గడ్డ కిందున్న మీరు, మీకన్నా కిందున్న బంగాళాఖాతంలకి నీళ్ళు వదలక ప్రాజెక్ట్లు ఎందుకు కట్టుకుంటున్నరు? అయినా గవన్ని మాకెందుకు? నీళ్ళు మాకాడ ఆగవంటున్నరు గద! మరి భయమెందుకు మీకు? మా రాష్ట్రం మాకిస్తే గా నీళ్ళ సంగతేదో మేం జూసుకుంటం గద! |
సమైక్య వాది | ##$$*&&*&&*$$## |
Thursday, June 23, 2011
మీరు గడ్డ మీద, మేం గడ్డ కిందున్నమన్న మాట
Subscribe to:
Post Comments (Atom)
అట్లనా? మరి తెల్వకడుగుత. గడ్డ కిందున్న మీరు, మీకన్నా కిందున్న బంగాళాఖాతంలకి నీళ్ళు వదలక ప్రాజెక్ట్లు ఎందుకు కట్టుకుంటున్నరు?
ReplyDelete:( ##$$*&&*&&*$$## :( ##$$*&&*&&*$$## :(
గడ్డమీద ఉంటే క్రిష్ణాకేమయిందట? శ్రీరాం సాగర్ ప్రాజెటు గడ్డపైనే అనువయిన ప్రాంతంలోనే ఉందికద, దానెందుకు అన్యాయం చేసిండ్రు అంటే సమాధానం జెప్పరు.
ReplyDeleteఅసలు మన మేతావులకు క్రిష్నాకూ, గోదావరికి తేడాకుడ తెల్వదు, శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టునుండి ఎత్తుకొచ్చి క్రిష్ణా ప్రపోజ్డ్ ప్రాజెక్టులు కుడ గోదావరి లెక్కలో వేస్తున్నరు, ఏం తెలివో ఏమో.
ఈ వీడియో చూడండి: http://videos.teluguwebmedia.in/58468343
ReplyDeletePraveen,
ReplyDeleteThanks for the info.