1 | లోక్ పాల్ బిల్లు 1969 ల మొదటిసారి పార్లమెంటుకు వచ్చింది. కాని రాజ్యసభలో పాస్ కానందువల్ల ఆగి పొయ్యింది. ఆ తర్వాత ఎన్నో సార్లు పార్లమెంటుకు రావడం, తిరిగి బుట్ట దాఖలా కావడం మామూలుగా జరుగుతున్న విషయం. | తెలంగాణా ఉద్యమం 1969 లో ఉధృతంగా మొదలయ్యింది. అప్పటినుండి ఆటు పోటులు ఉన్నా ఉద్యమం మాత్రం అలాగే నడుస్తుంది. |
2 | లోక్ పాల్ ఉద్యమానికి 2011 లో అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్షతో ఊపు వచ్చింది. | తెలంగాణా ఉద్యమానికి 2009 లో KCR ఆమరణ నిరాహార దీక్షతో ఊపు వచ్చింది. |
3 | లోక్ పాల్ బిల్లును నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని అవినీతి నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. | తెలంగాణా ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందినా అవనీతి సౌధాలమీద రాజకీయ వ్యాపారాలు చేస్తున్న రాజకీయ నాయకులు చెయ్యని ప్రయత్నం లేదు. |
4 | ఇష్టం లేకపోయినా ప్రజల వత్తిడి మేరకు కాంగ్రెస్ ప్రజాసంఘాల నేతలతో అన్నా డిమాండ్లకు ఒప్పుకున్నట్టు నటించి ఆయన్ను దీక్ష విరమింప జేసింది. | తెలంగాణా ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఉద్యమ ఉధృతి చూసి 2009 డిసెంబరులో తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన ఇచ్చి కేసీయార్ దీక్షను విరమింప జేసింది. |
5 | అన్నా హజారే దీక్ష విరమించినంక చర్చల సందర్భంలో మళ్ళీ పాత పాటే పాడడం మొదలు పెట్టింది. | శ్రీకృష్ణ కమిటీ అని నాటకం మొదలు పెట్టి, ఉద్యమం తగ్గు ముఖం పట్టుతుందని భావించగానే తెలంగాణా ఏర్పాటు కష్టం అనే పాట ఎత్తుకుంది. |
6 | లోక్ పాల్ బిల్లు వస్తే అవినీతి పరులైన రాజకీయ నాయకుల అక్రమ ఆస్తులు ప్రమాదంలో పడతయి. | తెలంగాణా వస్తే కబ్జాకోర్లైన కొందరు రాజకీయ నాయకుల అక్రమ ఆస్తులు ప్రమాదంలో పడతయి. |
7 | హాజారే దీక్ష తర్వాత జనంలో అవినీతికి బాగా ప్రచారం వచ్చింది. | KCR దీక్ష తర్వాత తెలంగాణా ప్రజలు అనతకు ముందుకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చైతన్యవంతు లైన్రు. |
8 | ఉద్యమాలు ఎక్కువగా సామాన్య ప్రజలు చేస్తుంటరు. రాజకీయ నాయకులు వారికి నాయకత్వం వహిస్తుంటరు. కాని లోక్ పాల్ ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించిన్రు. | తెలంగాణా ఉద్యమంల తామూ ఉన్నమని రాజకీయ నాయకులు చెప్తున్నా, మేధావులు విద్యార్థులు ఉద్యమాన్ని బలంగా ముందుకు నడిపిస్తున్నరు. వీరివల్ల రాజకీయ నాయకులు కూడా తెప్ప దాటేసే పరిస్థితి లేదు. |
9 | లోక్ పాల్ పై నిర్ణయం ఇప్పుడు సోనియా చేతిలో ఉంది. సోనియా అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు. | తెలంగాణా పై నిర్ణయం కూడా సోనియా చేతుల్లోనే ఉంది. సోనియా గనుక తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆపగలిగే శక్తి రాష్ట్ర రాజకీయ నాయకులకు లేదు. |
10 | లోక్ పాల్ ని మరోసారి తుంగలో తొక్కుతందుకు ప్రయత్నం చేస్తే జనం ఊరుకునేందుకు సిద్ధంగా లేరు. ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున మొదలయ్యే అవకాశం ఉన్నది. | తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ఆపివేస్తే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి తెలంగాణా మేధావులు, విద్యార్థులు ప్రజలు సంసిద్ధంగా ఉన్నరు. |
Friday, June 24, 2011
లోక్‌పాల్, తెలంగాణా ఉద్యమాలకు గల సారూప్యతలు
Subscribe to:
Post Comments (Atom)
good comparison...
ReplyDeleteWhat a comedy.Comparing Anna Hajare with KCR.God bless you !!!
ReplyDeleteDon't be foolish! Who said it is a comparison between Anna and KCR? It is only a comparison between T movement and LB movement.
ReplyDeleteBut don't be oversmart, KCR is far better than your Lagadapati, Rayapati, Kavoori, Jagan etc., who will be ready to eat cities as a whole if chance given.
First Anonymous,
ReplyDeleteThanks
Good comparison. The only difference is Lokpal movement got excellent national attention due to the media support. But as telangana movement is confined to one region and media it did not get enough attention outside Andhra.
ReplyDeleteThanks Vishwaroop.
ReplyDeleteveelaite bodigundu ki mokaliki kuda mudi veyyochu
ReplyDeleteAbove Anon, We are aware of you people being experts in that area.
ReplyDelete