Thursday, June 9, 2011

తెలుగు భాషల ఒక అచ్చు తక్కువైంది

నమ్మబుద్ధైత లేదా? కని ఇది నిజం. తెలంగాణా యాస రాయాలంటే మాత్రం ఒక అచ్చు కచ్చితంగ తక్వ బడుతది. ఆంద్ర, రాయలసీమ యాసల సంగతి నాకు తెలవదు. వాళ్ళే చెప్పాలె.

మనకు ఐ, ఔ లు ఉన్నాయి. కాని 'oi' శబ్దం వచ్చే అచ్చు మాత్రం లేదు. కాని ఈ అచ్చు వచ్చేటి పదాలు మాత్రం రోజూ మాట్లాడుతనే ఉంటం. 

పొయ్నవ్ (poinav)    
పోయింది (poindi) 
కోయ్లకుంట్ల (koilakuntla ఒక ఊరు పేరు)
కోయ్నా మిత్రా (koina mitra ఒక యాక్టరు)      
మొయినుద్దీన్ (moinuddin ఒక పేరు)
బోయిన్ పల్లి (boinpalli ఒక ప్రాంతం పేరు)  
కోయ్ కొయ్ (కోతలు)
ఇట్లా చాలనే ఉంటయి.

ఈ విధంగ వచ్చే పదాలన్ని 'య' కారం లేకుండా రాయలేం.  మరి మనకు ఒక అచ్చు తక్కువైందంటరా  లేదా?


14 comments:

  1. V.V.Satyanarayana SettyJune 9, 2011 at 7:36 PM

    You are right. One more Vowel is needed. We don't know how to write words like Bank,Rank..
    In Telugu we write BYAANKU, RYAANKU,...So for this sound one more vowel is needed. Let Telugu Professors think about it.
    ----------V.V.Satyanarayana Setty

    ReplyDelete
  2. పోయినావు అన్నది cut చేసి, పోయినవ్ అంటే, గట్లనే ఉంటది. యి ఉందికదా, "కోయినా మిత్ర.".. అక్కడ ఇకారం ఉన్న య ఉందిగా, మళ్ళి ఇంకో అచ్చు కావాలా??? సత్యనారాయణ గారు చెప్పిన, bank కు కూడా అవసరం లేదు. ఇంగ్లీష్ లో, a ను రెండు రకాలుగా పలుకుతారు. small a, big a. big a అంటే, apple ఏపుల్ లో లా. small a అంటే, car కార్ లో లా.

    మనదేశం లో మాత్రం ఏపుల్ అనకుండా, యాపిల్ అంటాం... అక్కడొస్తుంది తేడా. బేంక్, పేస్పోర్ట్ ఇలా ఉంటుంది అమెరికన్ల ఉచ్చారణ

    ReplyDelete
  3. శ్రీకాంత చారి గారూ మీరు రాసేటప్పుడు ఆ లోటు తెలియలేదు కదా. అంటే నా ఉద్దేశ్యం ఆ అచ్చు అవసరం లేకుండానే మనం మేనేజ్ చేస్తున్నాం కదా. ఇక పోతే పై అజ్ఞాత గారు చెప్పినట్టు కొన్ని మనం ఉచ్చరించే విధానం లో తేడాల వలన ఇబ్బందులు రావచ్చు. ఉదాహరణకి టాక్సీ అని రాస్తాము.ఇందులో "టా" అన్న అక్షరాన్ని విడిగా చదివితే ఉచ్చారణ వేరు, ఈ సందర్భంలో ఉచ్చారణ వేరు.

    ఆమాట కొస్తే తమిళ నాట మనకున్నంత సౌలభ్యం కూడా లేదు. ఉదా: కనిమొళి అని మనం చదివే పేరుని వారు రాసే తీరు చూడండి.

    ReplyDelete
  4. సత్యనారాయణ గారు,

    Bank లో వున్న అచ్చు మనకు లేకపొయినా దాన్ని తెలుగీకరించుకొని పలుకుతం కాబట్టి ఫరవాలేదని నేననుకొంటున్న.

    సత్య గారు,

    ei, ai లు పలకుతనందుకు మనకు ఐ అనే అచ్చు ఉంది. అది సరిపోతదనుకుంట.

    Anonimous

    యకారాన్నే వాడాలనుకుంటే మనకు చాలా అచ్చులు అనవసరం. ఉదాహరణకి కై అనే బదులు కయ్ అని రాయొచ్చు. ఔ అనే బదులు అవ్ అని పలుకొచ్చు. కాని మనం అచ్చులు వాడుతున్నం కాదా? అట్లనే ఇది కూడా కావాలంటున్న, తెలుగువాల్లలో ఈ పలుకుబడి ఉంది కాబట్టి.

    శంకర్ గారు,

    మేనేజ్ చేస్తున్నాం. పై Anonymous కి చెప్పినట్టు మేనేజ్ చేయడం వేరు, ఉండడం వేరు. నా భావం అర్థమైందనుకుంట.

    ReplyDelete
  5. sreekanth anna, telugu vyakaranam (grammer) chadivite nee prasnaki samaadhaanam nuvve telusukuntav!

    ReplyDelete
  6. అదేదో నువ్వే జెప్పరాదు తమ్మీ!

    ReplyDelete
  7. 26 అక్షరాలతో ఇంగ్లీషు వాళ్లు కాలం గడుపుకుంటుంటే, 56 అక్షరాతో (ఇవికాక ఎన్ని అక్షరాలు మనం వాడకుండా చంపేసాము) వ్రాయడం కుదరట్లేదా. చాల్చాలు ఊరుకోండి.

    ReplyDelete
  8. తెలుగు లో స్వర సామరస్యం (vowel harmony) ఉంటుంది. మన మాటల లో రెండో అక్షరానికి ఉండే అచ్చు మొదటి అచ్చు ఎలా పలకాలో నిర్దేశిస్తుంది, మీఱు చెప్పినట్టు అచ్చు కావాలి అనుకుంటే ఒకటి కన్నా ఎక్కువే కావాలి.
    ఇది కోస్తా యాస లో కూడ ఉంటుంది. రాయల సీమ యాస లో ఉంటుంది అని రానారె గారి బ్లాగు లో చూసాను.

    ReplyDelete
  9. @sankar.s
    ఆమాట కొస్తే తమిళ నాట మనకున్నంత సౌలభ్యం కూడా లేదు. ఉదా: కనిమొళి అని మనం చదివే పేరుని వారు రాసే తీరు చూడండి. : గుఱించి
    తమిళం లో మూడు ల కారాలు ఉన్నయి
    మనకి లేని మూడో ల కారానికి వారు zh వ్రాస్తారు ల/ళ ల తో పలకటం లో తేడా చూపించడానికి
    మనకి అక్షరం లేకుండ వాళ్ళ పై వ్రేలు ఎత్తడం ఎందుకు?

    ReplyDelete
  10. Anonymous గారు,

    తెలంగాణాలో "ఎక్కడికి పొయినావు" అనే వాక్యాన్ని "ఏడిkoiనవు" అని పలుకుతరు. ఆ "koi" కి బదులుగా అచ్చు లేకుండా ఏది రాసినా నాకు కృతకంగనే కనపడుతది.

    ReplyDelete
  11. koiనవ్ లొ oi తరువాత అ కారం వచ్చింది కదా(న).
    oi తరువాత ఇ కారం గానీ ఎ కారం గాని వచ్చే పదాలు ఎమైనా ఉన్నాయా?

    ReplyDelete
  12. Anonymous గారు,

    ఉన్నయండి.

    పొయ్యి మీదకి => poiమీదకి --> ఇ కారం

    "poiమీదకి లేకాపాయే poiకిందకి లేకాపాయె" అని ఒక ప్రముఖ జానపద గేయం కూడా వుంది.

    పోయిన సంవత్సరం => poiనేడు --> ఎ కారం

    ReplyDelete
  13. నాకు poi తరువాత మీద క్రింద పలికేటప్పుడు రెండు పదాలు గా తోస్తున్నయి
    మీఱు .wav లేద మఱి ఏదైనా format లో upload చెయ్యగలర, అవి ఒక పదం క్రిందే పలికే విధం గా

    ReplyDelete