2004 | రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అది కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. మేం సమైక్యాంధ్ర రాష్ట్రాన్నే కోరుకుంటున్నాం. రాష్ట్రం విడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. |
2008 | మేం తెలంగాణా పై కమిటీ వేసి పూర్తిగా అధ్యయనం చేసాం. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరం మేం గుర్తించాం. మేం కాంగ్రెస్ లాగా కాదు. మాటంటే మాటే. మేం అధికారం లోకి వస్తే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తాం. తెలంగాణా ఏర్పాటు సమర్థిస్తూ మేం ప్రనభ్ కమిటీకి ఉత్తరం రాస్తున్నాం. |
2009 | తెలంగాణా ఏర్పాటు చేస్తామని మేం మానిఫెస్టోలో పొందు పరుస్తున్నాం. |
2010 డిసెంబరు 7 | (అసెంబ్లీలో) కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టండి. మేం సమర్థిస్తాం. |
2010 డిసెంబరు 9 | మేం రాష్ట్ర ఏర్పాటు ను సమర్థిస్తున్నాం. ఆ ప్రకారంగా మా అశోకగజపతిరాజు గారు అఖిల పక్ష సమావేశంలో ప్రకటించారు. కేసీయార్ నిరాహార దీక్ష విరమించాలి. |
2010 డిసెంబరు 10 | తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ మొదలైందని ఎవర్నడిగి ఆ చిదంబరం రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారు? |
2011 జనవరి 4 | నాది రెండు కళ్ళ సిద్ధాంతం. సీమాంధ్ర, తెలంగాణా నాకు రెండు కాళ్ళ వంటివి. (ఇటు సమైక్యవాద ఉద్యమాన్ని నేను సమర్తిస్తుంటాను. అటు మా తెలుగు తమ్ముళ్ళు జై తెలంగాణా అన్నా నేనేం కాదనను.) |
2011 మే 29 | తెలంగాణా ఏర్పాటుపై మా నిర్ణయం ఎప్పుడో చెప్పేశాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. మాకేం సంబంధం లేదు. |
2011 మే 30 | తెలంగాణా పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని బట్టి మా ప్రతి చర్య ఉంటుంది. (రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని నిర్ణయం తీసుకుంటే సమర్దిస్తాం. విడగొట్టాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం వ్యతిరేకిస్తాం) |
2011 జూన్ 2 | మనం తెలుగుజాతిని రక్షించు కోవలసిన అవసరం ఉంది. ఆంద్రప్రదేశ్ ను రక్షించు కోవలసిన అవసరం ఉంది. |
Friday, June 3, 2011
నక్కబావ ఊళల్లో రకరకాల మార్పులు
Subscribe to:
Post Comments (Atom)
2011
ReplyDeleteమే 30 తెలంగాణా పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని బట్టి మా ప్రతి చర్య ఉంటుంది. (రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని నిర్ణయం తీసుకుంటే సమర్దిస్తాం. విడగొట్టాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం వ్యతిరేకిస్తాం.
మాది చాలా స్పష్టమయిన వైఖరి, ఆవిధంగా మేం ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు మా మొహమ్మిద ఉమ్మేస్తే సిగ్గులేకుండా తుడుచుకుంటం.
... అని తెలియజేసు కుంటున్నాను.
ReplyDelete:)
Thanks Viswaroop!
చంద్రబాబు అవకాశవాద / గిట్టుబాటు రాజకీయాల్లో ప్రవీణుడైనా .. కొన్ని రోజులుగా తెలంగాణా అనే ఊబిలో పడి గిల గిల కొట్టుకుంటున్నాడు . ఆయన తెల్లగడ్డం చూసైనా జాలి పడి వదిలిపెట్టొచ్చు గదా !
ReplyDeleteరమణ గారు,
ReplyDeleteతెలంగాణా కు సంబంధించి 2014ల తెలుగుదేశం పార్టీ బతికి ఉండదు. బతికి ఉండాల్నంటె ఇప్పుడే ఆయన ఏదో ఒకటి చేసి తెలనగాణా మనసు గెల్వాలె. ఆది ఆయినతోని గాదు.