నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రక్కసి ప్రజలను జీవచ్చవాలు చేస్తున్నది. రోజు రోజుకు మరింత అడుగంటి పోతున్న భూగర్భ జలాలు. వాటిలో మరింత ఎక్కువ ఫ్లోరీన్ విషం. జీవనదులున్నా తాగడానికి గుక్కెడు నీళ్ళు కరువు.
ఈ మనుషుల్ని చూస్తే పగ వాడికి కూడా అయ్యో అనిపిస్తది. మన దేశంల తాగేందుకు కనీసం విషం లేని గుక్కెడు నీళ్ళు ఇవ్వలేమా అన్న ప్రశ్న ఉదయిస్తది. కాని కొన్ని సమైక్యవాదం పేరు జెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పే కొన్ని భుజంగాలు మాత్రం కోరలిప్పి వెకిలి నవ్వులు నవ్వుతై. వాటికి అన్నింటా లాభం, నష్టం మాత్రమే కనిపిస్తయి, మనుషులు, మనుషుల బతుకులు కనిపించవు.
నీటిని పంపు చేసి పారించుడు పాపమట! నీరు పల్లమెరుగుతది కాబట్టి కాబట్టి పల్లానికే పంపాలె నట. మెట్ట ప్రాంతంల పొలాలు గాలిలో చెమ్మకే పండుతయట. వాళ్ళ బాబు పండించే పంటకు మాత్రం మూడోకారుకు నికర జలాలు తేవడానికి లక్షలాది మందిని, వేలాది గ్రామాలను, కోట్లాది పశు పక్ష్యాదులను, చెట్లను నీట ముంచ వలసిందే నట! ఇదే మన సమైక్యాంధ్ర నీతి.
అలాంటి అబద్దాలకోరుల రాతలు లైట్ తీసుకోవాలి. అంకెలు అబద్దాలు ఆడవు అని నమ్మబలుకుతూ అబద్దపు అంకెలు పెడతడు. పోలవరం ముంపు లక్ష ఇరవై ఎకరాలయితే నాలుగు వేల ఎకరాలు అని చెబుతడు, అడిగితే సమాధానం ఉండదు. నాలుగువేల ఎకరాలు కాలువలకే మునిగిపోతయని దేడ్¨దమాక్కేం తెలుసు?
ReplyDeleteఅయ్యో..హృదయవిదారకంగా ఉంది. ఇహ ఇప్పుడు దీనికి "మీ వైపేనా.. మా వైపు కూడా ఉన్నాయని ఒక టపా పెట్టి సామాన్యుడిని కాటేసి టపా కట్టే " వింతచేష్టలు చూడగలం ..ప్చ్జ్!
ReplyDelete"కాకి లెక్కల లాభనష్టాలు కడుపు నింపునా?" అని ఒక సామాజిక సూక్తికారుడు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. ఆ మాటల లోతున రెండు పార్శాలు ఉన్నాయి. ఒకటి కడుపు నిండిన వాడికి మాత్రమే ఆ కాకి లెక్కలు..అంటే నిండిన కడుపులో ఇంకేం నింపాలి? అన్నట్లుంటే రెండోది ఆకలితో అలమంటిచేవారికీ కాకిలెక్కలు కడుపు నింపునా? అన్న అర్ధాన్ని ఇస్తుంది.
శీర్షిక "ఆంధ్రుల.." అనకుండా స'మెక్కు(డు)వాదులకి మాత్రమే ఆపాదించిన తీరు మీ సదుద్దేశాన్ని తెలియజేస్తుంది.అభినందనీయం _/\_.
naaku ee post ki samaikyavaadaniki sambandam ardham kaaledu! mee vuddesyam lo ippati daka AP lo telangana nundi gelichina legislator yevaru lera! CM, Minister ga chesina vallu andaru samaikya vaadulu, seema/kosthalaku chendina vaaru anena deeni vuddesyam!
ReplyDeleteAjay
పంపు చేసి కాక పోతే వంపు చేసి పారిచుకోండి, మీ తెలంగాణ వచ్చిన తరువాత..
ReplyDeleteమా వైపూ ఉన్నాయి అంటారని , వ్యంగ్యం గా టపా రాయక ముందే దానిని కొట్టి పారేసే మీ పై మాకెందుకుండాలి మానవత్వం?
చూడు నాయనా, మా కృష్ణా జిల్లా లో కుడా ఫ్లోరైడ్ ఉన్నది. http://www.rajagopal.in/medialn/MANIFESTO.pdf
ReplyDeleteఎంత సేపు ప్రాబ్లంసు అని మాకు మాత్రమె ఉన్నాయి అని గొడవ మీది. అందరికి ఉన్నాయి కస్టాలు.
telangana leaders anta ee 60 yrs.lo em pikaru mari nalgonda valla kosam.
ReplyDeletethis only shows that the legislator from T are assholes..nothing more nothing less...
ReplyDeleteవాళ్ళ బాబు పండించే పంటకు మాత్రం
ReplyDeleteమూడోకారుకు నికర జలాలు తేవడానికి లక్షలాది మందిని,
వేలాది గ్రామాలను,
కోట్లాది పశు పక్ష్యాదులను,
చెట్లను నీట ముంచ వలసిందే నట!
ఇదే మన సమైక్యాంధ్ర నీతి.
Well said brother
@విశ్వరూప్
ReplyDeleteధన్యవాదాలు.
@రాజేష్
ఆంధ్రుల సహృదయత గురించి మాకు తెలుసండి. మా కష్టాలలో పాలు పంచుకొని, మాతో భుజం భుజం కలిపి పోరాటం చేసిన ఆంధ్ర సోదరులను మేమెప్పుడూ మరువం. ఐక్యత పేరు జెప్పి దోపిడీకి తెగబడే "సమెక్కుడు" వాదుల తోనే సమస్య.
@Ajay
ఒక వైపు సమైక్యవాదం పేరు చెప్పుకుంటనే, ఒక ప్రాంత ప్రజలు నీళ్ళకు అంగలారుస్తున్నా ప్రాణహిత నష్టం, పోలవరం మాత్రం కావాలి అనే వారి గురించే రాసింది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులంటరా, మన రాష్ట్రంలొ ముఖ్యమంత్రులది పెత్తనమైతే వాల్లేం చేయ్యగలరు?
@andhrudu
అందుకు కొన్ని షక్తులు అడ్డు పదుతున్నయి గదా! అందుకే ఈ పోరాటం.
@Anonymous June 27, 2011 10:35 AM
మీకు ప్రాబ్లంస్ ఉన్నాయని చెప్పి మేం చస్తూ కూర్చోలేం కాదా? ఇన్ని సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ప్రజలు నీటికి అంగలారుస్తున్నరంటే ఈ రాష్త్రం విఫలమైనట్టే కదా? మరి విడిపోయి మీరు, మేం బాగుపడితే మంచిదే కదా?
@Anonymous June 27, 2011 10:45 AM
డబ్బు, అధికారం, పెత్తనం మీదయినప్పుడు మా వాళ్ళని ఎక్కడ ఎదగనిచ్చిన్రు? ఒకప్పుడు KCRని, జనార్ధన్ రెడ్డిని, ఇప్పుడు నాగాన్ని ఎలా తొక్కుతున్నారో చూడడం లేదూ?
@Anonymous June 27, 2011 3:03 PM
Somebody mentioning that the same problem exists in Krishna, do you think same with your MLAs? If we divide, the span of control will be lesser and there is a chance that these inefficient bugs can work with more efficiency.
@Anonymous June 27, 2011 3:20 PM
Thanks brother!