Thursday, June 23, 2011

తెలుగోడి గోస

ఈ కేసీయారు ఉన్నతాన ఉండడు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కిరికిరి పెట్టుట్ల మొనగాడు. మొత్తానికి అప్పుడప్పుడు గాలికి పొయ్యే కంపను దోటికి తగిలిచ్చుక వస్తుంటడు.

గట్లనే ఒకసారి ఇఫ్తారు విందుకు పోయ్యిండట. అక్కడికి పొయ్యి 'ఆంధ్ర బిర్యాని పెండ పెండ ఉంటది' అని చెప్పిందట. తెలంగాణా మాండలికంల రుచి లేక పొతే పెండ పెండ ఉంది అనడం మామూలే. కాని గా విషయం ఆంధ్రోల్లకు తెలవదు గదా! మస్తు బాధ పడ్డరట! రుచి ఉండనంత మాత్రాన పెండ తో పోలుస్తరా అని ఒకటే ఇదైన్రు.

అక్కడికి తెలంగాణా మేధావులు చాలామంది కేసీయార్ మాటలను ఖండించడమో మరొకటో చేసిన్రు. అయినా గూడ ఊరుకోక 'మీరెక్కడ తిన్నారో గని మేం పార్సిల్లు పంపుతున్నం, గియ్యి తిని సూడున్రి' అను కుంట బిర్యాని పొట్లాలు పంపిన్రట. గా పొట్లాలు ఇక్కడికొచ్చినంక తెరువంగనే గబ్బు వాసన కొట్టి జనం ముక్కు మూసుకున్నరంట. వాసన భరించలేక తీస్కపొయ్యి టాయిలెట్ల కొట్టి ఫ్లష్ చేసిన్రట! ఎంత మంచి బిర్యాని అయినా పాశిపొయ్యినంక వాసన గొట్టకుంటే  పరిమళం వస్తదా? ఏందో ఈ ఆంధ్రోల్ల గోసే అర్థం గాదు!

ఏదో అయింది అయిపొయింది, అంత సద్దుమణిగింది అనే టప్పటికి ఒక తెలుగోన్నని చెప్పుకొనే ఆంధ్రాయిన ఆయిన బ్లాగుల అసలు విషయం బయట పెట్టిండట. గా పెండ అసుంటి బిర్యాని కేసీయార్ ఏ సందర్భంల తిని ఉంటాడో తన పద్ధతిల వివరించిండు. ఇంతకీ అసలు విషయం ఏందంటే ఆంధ్రకు పోయినప్పుడు కరెంటు పొయ్యి, చట్నీ అనుకోని పెండ కలుపుకొని ఉంటడు కేసీయార్ అని ఆయన కవి హృదయమట!

గాయిన కవిహృదయం సంగతి పక్కకు పెడితే, వంటింట్ల పెంట పెట్టుకుంటరన్న సంగతి కొత్తగ బయిటి కొచ్చింది. వంట -  పెంట ఒక్కతాన పెట్టుకుంటే పెంట లెక్క ఉండకుంటే ఇంకెట్ల ఉంటది మరి వంట? మరి గీ సంగతి గా తెలుగాయినకు ఎవరు జెప్పాలె? 

గా పెంట పోస్టుకు జెర శాన కామెంట్లే వచ్చినట్టున్నయి. అందుకే తెలంగాణా వాదమంటే ఒంటి కాలు మీద లేచే పెద్దన్న ఈ మధ్య ఇంకో పోస్టు పెట్టిండు. అది రోడ్లమీద సండాసు జేసే కార్య క్రమమట! గట్లాటి కార్యక్రమాలు ఆంద్ర సైడు రోజు జేస్తనే ఉంటరు. కొత్తేముంది? పోద్దటి పూట నేషనల్ హైవే మీద కోదాడ దాటి తూర్పు దిక్కు పొయ్యినమంటే సూడలేక  కండ్లు ముక్కు రెండు మూసుకోవాలే. ఆడ మొగ అని తేడా లేకుంట, లుంగీలు, చీరలు లేపి మరీ కూసుంటరు. అటుసైడు పొయిన ప్రతి ఒక్కనికి  ఎరుకున్న విషయమే ఇది! 

అయినా అట్లాంటివి మీ పేటెంటు కార్యక్రమాలు. అయ్యి మేరే జేసుకోన్రి. మేం ఏంజేయ్యాల్నో, తెలంగాణా ఎట్ల తెచ్చుకోవ్వాల్నో మాకు ఎరికే. ఉత్తగనే తెలంగానోళ్ళను ఏతిరించబోయ్యి మీరే గోతిల బడతరు.    

అయినా కేసీయారూ, నువ్వుగూడ మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త పడాలె. అసలే ఈ సమైక్యవాదులు మాట మాటకు ఈకలు తోకలు పీకేటోల్లు.

6 comments:

  1. ఆంధ్రా వాళ్ళ బిర్యానీ మీద, కామెంటు చేసి తెలంగాణ ఎలా సాధిధామనుకొంటున్నారో. రాజకీయ నాయకులే ఇలా సమస్యను ప్రక్కదారి పట్టిస్తూ వుంటె, సాధారణ ప్రజలు భాష మీద, భాష మాండలికం మీద, వారి వారి సహౄదయత మీద, కొట్లడుకోవటం మీద మొదలు పెట్టి, నువ్వు - నువ్వు అనుకొని అసలు సమస్యను వదిలి, మిగతా జనానికి "ఇక్కడ సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలు ఒకరినొకరు తిట్టుకుంటూ వుంటారు" అనుకునేలా ప్రవర్తిస్తారు. కెసీఆర్ యేదో ఒక పనికిమాలిన కామెంటు చెస్తే, దాని మీద న్యూస్ చానెల్స్ పది రోజుస్ చర్చా కార్యక్రమం పెట్టినట్లు, వాటి గురించి బ్లాగులు వ్రాయకుండా, వివేకమున్న - చదువుకున్న - కర్తవ్యం ఎరిగిన వారు - ఇటువంటి విషయాలను వదిలి వేస్తే మంచిది.

    మీ బ్లాగులన్నీ( అన్నీ కాకపోయినా కొన్ని) చూసాక, తెలంగాణ వస్తే, ఏవిధంగా, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఏఏ రంగాలలో ఎటువంటి అన్యాయం జరుగుతుంది అది ఏ విధంగా - వేర్పటువాదం లేదా తీవ్రవాదం అనిపుంచుకోదు - అన్న విషయాలను విశదీకరిస్తే, తెలంగాణ పై అందరికి ఒక సదుద్దేశం కలుగుతుంది.

    ReplyDelete
  2. మీరు మీ వ్యాఖ్యను పైన లింకు ఇవ్వబడిన బ్లాగులో కూడా పెడితే బాగుంటుంది. చర్య ఉన్నప్పుడు ప్రతి చర్య తప్పదుగా!

    ReplyDelete
  3. గోరంతలు కొండంతలు చేయ్యదమొక్కటే నేటి ప్రసార సాధనాలకి తెలిసిన విద్య. కెసిఆర్ వ్యాక్యాలు యధాతధంగా
    "आन्ध्र वल्लोंका बिरियानी कधी धेका? गोबर जैसे दिखता"
    ఈ మాటలని మీడియా అనువదిచటం లో పూర్తి స్వేఛ్చ తీసుకుని, పేడ అని పెంట అని ఇష్టం వచ్చినట్లు జోడించి రచ్చ రచ్చ చేసాయి. ఇక దొరికిందే సందు అని KCR ని ద్వేషించే వాళ్ళంతా "ఆయన అదే తింటాడ? ఆయనకీ దాని రుచి ఎలా తెలుసు? అని ఎకి పారేశారు. ఇంకా అక్కడి నుండి బ్లాగ్గెర్లు తమకి తోంచిన కధలు రాయటం మొదలు పెట్టేసారు.
    రాజకీయ నాయకుడు అన్నాక వేదికలు ఎక్కి ఏదేదో వాగుతారు. ఏమి వాగము అన్నది వాళ్లకి ముక్యం కాదు ఎంత ప్రచారం లబించింది అన్నదే వాళ్ళకి ముఖ్యం . విజ్ఞ్యత గలవారు ఎవరైనా అలాంటి వ్యాఖ్యలని వారి సంస్కారానికే వదిలెయ్యాలి గాని, కాలికి అంటినదానిని నాలుక దాకా తెచ్చుకోకూడదు .

    ReplyDelete
  4. శ్రీకాంతాచారి గారూ,
    నేను మీరు పైన ఇచ్చిన లింకు చూడ లేదు. ఇప్పుడు వెళ్ళి చూసినా ఈ బిర్యాని కథ ఎక్కడ వుందో వెతకాలి. కాని అసలు సమస్య యేమిటంటే, మన ప్రియతమ నాయకమన్యులు ఆంధ్రా వారి బిర్యానీ పై వ్యాఖ్య ఎందుకు చెయ్యవలసి వచ్చిందని. దాని బదులు ఆ రెండు నిమిషాలు తెలంగాణ కు మద్దతుగా రెండు సమంజసమైన ముక్కలు చెప్పి వుంటే ఎంత బావుంటుంది. ఈయన మన నాయకుడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక సారి అలోచించండి. మన నాయకుని కొటేషన్స్ అని ఒక పుస్తకం వ్రాయదలిస్తే సగం అవాకులూ చివాకులే వుంటాయి. అదే సరైన పద్దతి అంటారా...! ఇదే నా చివరి కామెంట్. ఎందుకంటే నేను చెప్పినది నేనైనా ఆచరించాలి కదా.

    ReplyDelete
  5. దానికి కౌంటర్ ఇక్కడ పడ్డది చూల్లేదా?
    http://raamusoamu.blogspot.com/2011/06/blog-post_21.html

    ReplyDelete