Friday, June 24, 2011

రెండున్నర జిల్లాల భాష


ఎడిటర్ ఎన్ని సార్లు చెప్పాలయ్యా? ఏంది ఈ చెత్త రాతలు? ఏదో మా ప్రాంతం వాడివి కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చాం. తెలియక పొతే నేర్చుకోవాలయ్యా. అంతే గాని ఇష్టమొచ్చినట్టు రాసెయ్యడమే!

జర్నలిస్టు సార్, సరిగ్గాన్నే రాసాను సార్.

ఎడిటర్  అంతే నేను పనిలేక తిడుతున్నా ననుకున్నావా?

ఏంటయ్యా ఇది? దీపావళికి ప్రజలు సంతోషంగా పటాకులు కాల్చుకున్నారా? పటాకులేంటయ్యా అర్థం పర్థం లేకుండా?

జర్నలిస్టు  పటాకులంటే దీపావళీ క్రాకర్సు సార్. ప్రజలంతా క్రాకర్సు బాగా కాల్చుకున్నారని రాసిన సార్.

ఎడిటర్  ఓరినీ! టపాకాయల కొచ్చిన బాధటోయ్! టపాకాయలని స్పష్టంగా రాయలేవూ? పటాకులేందయ్యా  పట్టాకత్తి లాగా? ఎక్కడా వినని కనని పదాలు రాస్తావు. ప్రజలందరికి అర్థమయ్యే పదాలు రాయాలి. మొన్నకూడా అలాగే ఏదో తింగర పదం 'మూజుబానీ' అని రాసావు.

జర్నలిస్టు  అదేంటి సార్! మన జాతీయభాషలో 'పటాకే' అంటారు. తెలంగాణా మొత్తం పటాకులనే అంటారు. కొన్ని ఆంద్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా అలాగే పలకడం చూసాను. అయినా కొత్త పదాలను వెలికి తీయాలని మీరే చెప్పారుగా సార్!

అన్నట్టు అసలు పదం మూజుబానీయే సార్, ఉర్దూను అపభ్రంశం చేసిన పదమే మూజువాణీ. మూ అంటే నోరు, జుబాన్ ఆంటే నాలుక.

ఎడిటర్  ఎక్కడో ఎవడో పలికితే నాకేంటయ్యా ! మా డెల్టాలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా సరిగ్గా మాట్లాడరు. వెలికి తీస్తే ఆ డెల్టాలో మరుగు పడిన పదాలు వెలికి తియ్యి.

జర్నలిస్టు  అదేంటి సార్ మన ఆంద్ర ప్రదేశ్ మొత్తం తెలుగుభాషే కదా? అన్ని ప్రాంతాల పదాలు వ్యాప్తిలోకి రానక్కర లేదా? మొన్న కోనసీమ జాలర్లు వాడే పదమొకటి రాసినా తిట్టారు. ఏం రాయాలో ఏం రాయొద్దో అంతా కన్ఫ్యూజింగ్ గా వుంది సార్.

ఎడిటర్ నీకు ఇంకా కుర్రతనం పోలేదయ్యా. మా ప్రాంతం అంటే మొత్తంగా కాదయ్యా. మా ప్రాంతంలో ఏ వర్గాలు ఉత్తమమైన తెలుగు మాట్లాడుతున్నారో నీకు ప్రత్యేకంగా విడమరచి చెప్పాలా? నువ్వుగూడా అదే భాష రాయాలి. తెలుగు పేరు జెప్పి భాష మొత్తం కలగా పులగం చేస్తానంటే ఒప్పుకునేది లేదు. నువ్వు ఇలాగే మారాం చేస్తుంటే ఉద్యోగం పీకేయాల్సి వస్తుంది జాగ్రత్త.

జర్నలిస్టు  ఆ తెలుసు సార్, మీ రెండున్నర జిల్లాల్లో ఉత్తమమైన తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరో.

ఏది సార్ ఉత్తమమైన తెలుగు ఆంటే? ఉర్దూ పదాలు వద్దంటారు, మరి మూజువాణీ, దస్తావేజు లాంటివి ఎందుకున్నాయి సార్?

అచ్చ తెలుగు పదాలు పెడితే అవీ వద్దంటారు? తెలుగుభాష ఆంటే ఓ రెండుమూడు జిల్లాల్లో చదువుకున్న వాళ్ళు మాట్లాడే సంస్కృతం కలిసిన భాషేనా, అది తప్ప వేరే తెలుగు లేదా సార్?

అన్ని భాషల వారు తమ భాషను పరిపుష్టి చేసుకోవడానికి వీలయినన్ని ఎక్కువ పదాలు కలుపుకుంటున్నారు సార్. మనమేంటి సార్, ఇలా మన ప్రాంతాల భాషలనే తోక్కేస్తూ, భాషను మరీ జిల్లాలకే పరిమితం చేస్తున్నాం?

ఏ భాషల నైనా ఎన్ని ఎక్కువ పదాలు ఉంటే భాష గొప్పదనం అంతగా పెరుగుతుంది సార్. ఇంగ్లీషునే చూడండి. తెలుగుతో సహా అన్ని భాషల పదాలు ఇమిడ్చేసు కున్నారు. మనమేంటి సార్, ఇలా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఫిల్టర్ చేసి భాష విలువను తగ్గిస్తున్నాం?

జీవ భాష సాధారణ ప్రజల్లోంచి వస్తది సార్. ఇలా కృత్రిమంగా భాషను కట్టడి చేసినంత మాత్రాన అది సమసి పోదు. మొత్తం రాష్ట్రంలో ఉన్న వెలుగు చూడని పదాలను వ్యాప్తిలోకి తేవడం మన జర్నలిస్టుల బాధ్యత సార్. కేవలం రెండున్నర జిల్లాల భాష వాడడం కాదు.

ఎడిటర్  ##$$!@(&$@*^()%#%#($#$%###

8 comments:

  1. ప్రవీణ్ గారు,

    మీ వీడియో చూశాను. విశ్లేషణ బాగుంది. వీడియోలో ఉన్నది మీరేనా?

    ప్రమాణిక భాష ఉండుడు తప్పుకాదు. కాని ప్రామాణిక భాషలో మా పదాలే ఉండాలి, ఇంకొకరి పదాలు అసలు పదాలే కావు, వాటిని వాడడం శిష్టత్వానికి భంగం అనుడే తప్పు.

    ReplyDelete
  2. http://visalandhra.blogspot.com/2011/06/blog-post_23.html

    కాస్త ఇది కూడా చూడండి

    ReplyDelete
  3. ఆ వీడియోలో ఉన్నది నేనే. ఉత్తరాంధ్రలోని విలేఖరులు ఉప్పుటేర్లని బీలబట్టీలు లేదా బీలగెడ్డలు అనే వ్రాస్తారు. కృష్ణా జిల్లాకి చెందిన విలేఖరి ఉప్పుటేర్లు అని వ్రాస్తే ఉత్తరాంధ్రవాళ్ళకి అర్థం కాదు.

    ReplyDelete
  4. Even if you switch the roles and regions in the above conversation, the consequence would be the same. ఎవడి యాసని వాడే ఉద్ధరించుకోవాలి......

    ReplyDelete
  5. దేశపతి శ్రీనివాస్ గారు ఏమన్నారో తెలుసా?
    >>>>>
    బ్రిటిష్ వాళ్ళు మీకు ఇంగ్లిష్ రాదు అంటే పోనీ ఇంగ్లిష్ వాళ్ళు కదా అనుకున్నాం, ముహమ్మదీయ పాలకుడు నిజాం మీకు ఉర్దూ రాదంటే పోతే పోయిందనుకున్నాం, కానీ తెలుగువాడు మాకు తెలుగు రాదంటాడు.
    >>>>>

    ReplyDelete