కొన్ని రోజుల నుంచి కెసిఆర్ సిగ్నల్సు వస్తున్నై అనుకుంట చెప్పబట్టిండు. గా సిగ్నల్స్ నిజంగానే వస్తున్నాయా వస్తలేవ అన్నది మాత్రం కెసిఆర్ కు తప్ప ఎవ్వరికి తెలుస్త లేదు.
మధుయాష్కి ఏమొ 'మా కాంగ్రెస్ ఎంపీలకే రాని సిగ్నల్సు కెసిఆర్ కెట్ల వస్తాయ'ని అడుగ బట్టిండు. అక్కడికి సోనియమ్మ తీసుకునే అన్ని నిర్ణయాలు మధుయాష్కిని అడిగి తీసుకుంటున్నట్టు! నోట్లె నాలుకలేని మన్ను తిన్న పాములకు చెప్పితే ఎంత, చెప్పకుంటే ఎంత అన్న సంగతి ఆమెకు తెల్వదా ఏంది?
ఇంక పోతే సీమాంధ్ర మీడియా మొత్తం ఒక్క తాటిపై నిలబడి సిగ్నల్సు గిగ్నల్సు అంతా మిధ్య అనుకుంట వేయి నోళ్ళ తోటి నొక్కి వక్కానిస్తుంది. హైదరాబాదుకు వచ్చి మాట్లాడిన షిండే మాటలు గంటకొక సారి చూపిస్తున్న మీడియాకు, డిల్లీకి పోయి కేంద్ర కాంగ్రెస్ నాయకులతోని మంతనాలు జరుపుతున్న కెసిఆర్ ముచ్చెట్లు చెప్పేటందుకు మాత్రం ముచ్చెమటలు పడుతున్నై. ఉద్యమం విషయాలు చర్చించేటందుకు ఉద్యమ నాయకుణ్ణి పిలువకుంట చెక్క భజంత్రీ గాళ్ళను పిలుసుడు ఎక్కడన్నా వున్నదా ఏంది? గా విషయం సీమాంధ్ర మీడియాకు అర్థం గాకనా? అబద్ధాల మాటలు జెప్పి ఎవరి పబ్బం గడపాలని?
కెసిఆర్ మాటలు ఇని ఇని సిగ్నల్సు విషయంల తెలంగాణా ప్రజలకే నమ్మకం పోతున్న సమయంల, కొన్ని వేరే సిగ్నల్సు చూసినప్పుడు కెసిఆర్ చెప్తున్న సిగ్నల్సు నిజమేనేమొ అనిపించ బట్టింది. గా సిగ్నల్సు ఏంటియో చూద్దాం.
మొదటిది తెలంగాణా మీద లేఖ ఇయ్యాల్ననే చంద్రబాబు తహ తహ. ఇన్నాళ్ళూ పార్టీ మునిగిపోతుంది మొర్రో అనుకుంట తెలంగాణ తమ్ముళ్ళు ఎంత మొత్తుకుంటున్నా ఇనని చంద్రబాబుకు ఇప్పుడు హటాత్తుగ తెలంగాణా సమస్య గుర్తుకొచ్చింది. హడావుడిగ ఆంధ్ర నాయకులను పిలిచి మాట్లాడ బట్టిండు. ఇంతవరకు తానే కన్విన్సు కాని విషయం మీద వీళ్ళని కన్విన్సు చెయ్యాల్నని చూడ బట్టిండు. ఎందుకు? పుసుక్కున కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేస్తే, తనకు అది లేవలేని దెబ్బ. ముందుగాల్నే లేఖ ఇస్తే, అది తన లేఖ వల్లనే అని చెప్పుకోవచ్చు! అంటే బాబుకు సిగ్నల్సు అందుతున్నట్టే కద?
ఇంక పోతే, ఎప్పుడు ఒక్కడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వసే BJP కూడా డిల్లీకి పోయి ధర్నాలు చేయబట్టింది. కేంద్ర నాయకులు అందరు ఆ ధర్నాకు రాబట్టిన్రు. గిది సిగ్నల్సు మహిమ కాదనుకుందమా?
గట్లనే తెలంగాణను సమర్తిస్తం తప్ప ఉద్యమాలు చెయ్యం అని చెప్పిన సిపిఐ నారాయణ కూడ పోరు యాత్రలు చేసుడు మొదలు పెట్టిండు. ఏ సిగ్నల్సు లేకుండనే ఆయన పోరాటం పదును పెంచిండా?
ఇట్ల అన్ని వైపులనుండి తెలంగాణా పోరాటాలు జరుగుడు తెలంగాణాకు మంచిదే. ఫలితం మీద ఆశ లేనప్పుడు కూడ పోరాటం చేసే మనుషులు కొందరే వుంటరు. ఫలితం లభించే సిగ్నల్సు కనపడ్డప్పుడు ప్రతి ఒక్కరు సుయ్యిమంటే నాకొక్క బూరె అన్నట్టుగా ఉద్యమంల ఉరుకుతుంటరు. ఆనాడు జాతీయోద్యమంల గూడ అట్నే జరిగింది. ఇప్పుడు జరిగేది కూడా అదే. మరి సిగ్నల్సు ఉన్నయని చెప్పే టందుకు ఇంతకంటే సాక్ష్యాలేమి గావాలె?
ఇవన్ని ఒక ఎత్తయితే సీమాంధ్ర సమైక్యవాద మేతలు (సారీ, నేతలు) ఎక్కే కడుప దిగే కడుప అనుకుంట మరి డిల్లీల హై కమాండు నాయకుల ఇంటింటికి తిరిగి ఎందుకు మొరపెట్టు కుంటున్నరో? సూడబోతే అందరికన్నా బలమైన సిగ్నల్సు వాళ్ళకే వచ్చినట్టున్నయి!
This comment has been removed by a blog administrator.
ReplyDeleteSrikanth, please delete the casteist comment of "Anonymous September 12, 2012 9:54 AM", thank you.
ReplyDeleteసమైక్యవాదుల సంస్కారమే అలాంటిది కదా.
ReplyDelete@Jai, not related to the content of the post. Is Brahmanical attitude is not a casteiest word? why the so called dalit empowerists repeatedly use it even in books? and how the word 'madiga basha' signifies a caste?
ReplyDeleteThis is called as skinhead and knees linkage. Was there any stage in history when madigas dominated over brahmins?
Delete@Anon: Brahminical attitude (or Madiga attitude for that matter) is not a casteist phrase (not word).
DeleteIn the present case, you were in obvious contempt of the blogger's language and chose to equate it with the language of a caste. You insulted both the Telangana language & the Madiga caste. The tone and tenor of your comment stinks of supremacism.
No one is forcing you to read any blog. You have no right to complain about the language, much less to use it as an opportunity to spew venom on matters unrelated to the blog. You can use your own blog to do so if you so wish.
Achamgaa sometimes writes in his area's dialect. I see it is beutiful but don't understand it well. I would never dream of demanding he write in a style that I understand or insult him.
Just to clarify 'Both the anons are different'.
DeleteI am not denying that the intentions of 1st anon to insult the dialect of author is mean-spirited. But my question is how the word points to a particular caste? Just like the dalit intellectuals invented the word 'Brahmanical attitude' just to mock a particular system or thinking, the commentor might have used a similar word to mock a dialect. If 1st has nothing to do with caste, so is the 2nd one. As simple as that.
Sorry I mistook you for the first Anon. I have already answered the other point.
DeleteWhat you answered is "how you see it".. Not what the original commentor meant by it
DeleteWhat you answered is "How you see it".. Not what the original commentor meant by it
Deleteఒకానొకరు ఒక పదప్రయోగం చేయటం జరిగింది. విశేషమేమిటంటే ఆ పెద్దమనిషి తన పేరును గోప్యంగా ఉంచుకోవటం. ఒక వేళ తానెవరైనదీ తెలిస్తే బ్లాగువీరులెవరైనా తనను వెంటాడి వేధిస్తారని అనుమానించారో యేమో తెలియదు.
ReplyDeleteగొట్టిముక్కలవారు రంగంలోకి దూకటనికి మంచి కారణమే ఉంది. కులనిందాపూర్వకమైన పదప్రయోగంతో కూడిన వ్యాఖ్యను తొలగించమని సూచించారు. ఆలోచించదగ్గ విషయమే. నిష్కారణంగా ఇతరులకు నొవ్వు కలిగించే అవకాశం ఉన్న వ్యాఖ్యలు తొలగించటనికి అభ్యంతరం ఉండనక్కరలేదు.
ఇక పోతే మందగివారి దుడుకు తనం గురించి. అజ్ఞాతగరు సమైక్య వాది కావచ్చును కాకపోవచ్చును. అవకాశం దొరకబుచ్చుకుని సమైక్యవాదుల సంస్కారాన్ని చిన్నబుచ్చటం కుసంస్కారం క్రిందికి వస్తుంది కదా. అది వారికి స్ఫురించక పోవటం శొచనీయం.
ఏది యేమైనా బ్లాగు కామెంటు అభిప్రాయాలు యిచ్చి పుచ్చు కోవటానికి పరిమితం చేసుకుంటే ఉభయతారకంగా ఉంటుంది. ఇలా వ్రాయటానికి నీకు సంబంధం యేమిటీ అనో ఇలా వ్రాయటం కేవలం నా అహంకారం అనో యెవరైనా అనుకుంటే వారికొక్ నమస్కారం.
అవకాశం దొరికిందని ప్రముఖ బ్లాగువీరకుమారుడు మందంగి ప్రవీణ్ తాను కూడా మాట తూలటం గమనార్హం. పేరు దాచుకున్న పెద్దమనిషి సమైక్యవాది అని వేంఠనే తీర్మానించేసుకుని, సమైక్యవాది కాబట్టె ఆయన భాష బాగుండలేదని నిర్థారించేసుకున్నారు. ఇలా సమైక్యవాదులు అసమంజసమైన భాష వాడటానికి కారణం వారి కుసంస్కారమే అని సిథ్థాంతం చేసి దాని నాలుగుముక్కల్లో వెళ్ళగక్కేసారు. శభాషో శబాషు.
అయితే గోప్యత పాటిస్తున్నవారు తిరిగి రంగప్రవేశం చేసారు. అయితే వీరు మొదటి గోప్యవ్యక్తి యేనా వేరొకరా అన్నది తెలియదు. వారొక ప్రశ్న లేవనెత్తారు. ఈ రోజుల్లో నిందాపూర్వకంగా 'బ్రాహ్మణ' పద ప్రయోగం ధారాళంగా జరుగుతున్నప్పుడు, అటువంటి కుల సంబోధనతో కూడిన పదాన్ని ఇతరులు వాడటాన్ని యెలా ఆక్షేపిస్తారన్నది ఆయన ప్రశ్న. సముచితంగానే ఉన్నది.
మహాభారతంలో ఒకానొక పద్యాన్ని అస్తంగత ఆంద్రపత్రిక వారి దినపత్రిక సంపాదకీయం పైన ప్రతిరోజూ ప్రకటిస్తూ ఉండే వారు.
ఇదిగో ఆ పద్యం:
కం. ఒరు లేయవి యొనరించిన
నరవర యప్రియంబు తన మనంబున కగు తా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మపథముల కెల్లన్
దీని భావం సుబోధకమే అయినా మరలా మనవి చేయటం అప్రస్తుతం కాదనుకుంటాను. ఇతరులు యే పనులు చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరులకు అలాంటి పనులు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోనూ ఉత్తమ ధర్మం.
ఒకరు తన కులప్రసక్తి తీసుకు వచ్చి అసందర్భంగా వ్యవహరించటం వలన నొవ్వు కలుగుతున్నప్పుడు, అటువంటి నొవ్వు కలిగే పనిని తాను చేయకుండా ఉంటె అజ్ఞాతవ్యక్తి గారి శోబ యినుమడించేది.
శ్యామలీయం గారు,
Deleteపై అఙ్ఞాత కేవలం కులాన్నే కాదు, ఒక కులపు భాషను, ఒక ప్రాంతపు భాషను ఏక కాలంలో కించ పరచే దురహంకారాన్ని ప్రదర్శించాడు. ఇలాంటి దురహంకారుల గురించే కదా, మా చరిత్రను, సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఇన్నాళ్ళనుండి మొత్తుకుంటున్నది?
నిజానికి తెలంగాణ భాషని, యాసని అభిమానించేవాళ్ళు, తెలంగాణా ప్రజలని తమతో సమాన స్థాయిలో చూడగలిగే వాళ్ళు, తెలంగాణా ప్రజల ఆలోచనలని కూడా అర్థం చేసుకుంటారు. వారి న్యాయ బద్ధమైన స్వరాష్ట్ర కాంక్షని కూడా అంటే సానుభూతితో పరిగణలోనికి తీసుకుంటారు.
అలా కాక తెలంగాణా ప్రజలని రెండవ తరగతి జాతికింద జమకట్టి, తామే ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణేతలమని విర్రవీగుతూ, తెలంగాణా ప్రజల సమ్మతితో సంబంధం లేకుండా సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించగలమనే జాత్యహంకార, సామ్రాజ్యవాద పోకడలకు పోయేవారే సమైక్యవాదులు. దానికి విరుద్ధంగా ఆంధ్రాలోని ఎంతో మంది సహృదయతతో తెలంగాణా ఉద్యమం యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకుంటూ, చేయూతనిస్తున్నారు.
మరి అలాంటప్పుడు అదేరకమైన అహంకారాన్ని ప్రదర్షించిన పై అఙ్ఞాతను ప్రవీణ్ సమైక్యవాదితో పోల్చడంలో తప్పేముంది? కుల వివక్ష, ప్రాంత వివక్ష రూపంలో వేరు వేరు కావచ్చు. కాని, వాటి అంతర్గత స్వభావం ఒక్కటే. అదే అణచివేత, దోపిడీ స్వభావం.
అజ్ఞాతగారు ఒక కులాన్ని ప్రస్తావించటం అసందర్భమైన విషయమే. కాని తెలంగాణా మాండలికం ఒక కులానికి చెందిన సొత్తు కాదే. కులప్రస్తావనలోని అనౌచిత్యాన్ని గమనించాం. కాని యిక్కడ మీరు చరిత్రను, సంస్కృతిని ప్రస్తావించటం అంతే అసంగతం కదా? అలాగే తెలంగాణాలో నివసించే వారేదో వేరే జాతివారైనట్లు 'స్వరాష్ట్ర కాంక్ష' అన్న మాట వాడటం అభ్యంతరకరం కావచ్చు అనేకులకు. ఒకే జాతి భరతజాతి. అందులో తెలుగువారు అంతా ఒకే ఉపజాతి. ఇంకా చీలికలు చేసుకుని అనైక్యత చాటుకోనవుసరం లేదని నా అభిప్రాయం. తెలుగువారు అంతా కలిసి ఉండాలనుకున్నంత మాత్రాన సమైక్యవాదులు అంతా జాత్యహంకారులూ సామ్రాజ్యవాదులూ అనుకోవటం కేవలం పొరబాటు. కోస్తాంధ్రలో తెలంగాణా ఉద్యమం పట్ల కొంచెం మందికి సానుభూతి ఉండవచ్చును గాక అత్యధికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్న విషయం మరచిపోకండి. ప్రవీణ్ వాడిన సామెత ఆతని ధోరణికే అతికినట్లు సరిపోతుంది - దానికి మీ సమర్థనా అలాగే ఉంది. అజ్ఞాత మాటల్లో సమైక్యవాదచాయ లేమీ లేవు. అనవసరంగా ఒక మాండలికానికి కులపు రంగు వేయబోయారంతే.
Deleteఒక కులాన్ని, కులంతో పాటు ఒక ప్రాంతపు మాండలికాన్ని ఒకే మాటలొ కించ పరుస్తున్న పద్ధతి మీకు కనపడలేదా? అనవసరంగా ఒక మాండలికానికి కులపు రంగు వేయబోయారని సమర్థిస్తూ అదేదో చిన్న విషయంగా చెప్ప జూస్తున్నారు.
Deleteఅవును మరి, మీలాంటోళ్ళకు అవన్నీ చిన్న విషయాలుగానే కనపడతాయి. ప్రవీణ్ అఙ్~ణాతను విమర్శించడం మాత్రం పెద్ద విషయంగా కనపడుతుంది. మొత్తంగా మీలాంటోళ్ళ ప్రవర్తన కొంతమంది తప్పు చేసేవారి కొమ్ము కాసేదిగా వుంటుంది. అది పై అఙ్ఞాత కానివ్వండి, మరో దోపిడీ దారుడో, తెలంగాణా వ్యతిరేక కుత్రదారో కానివ్వండి. అందుకే మీవంటి వారితో మాకు కుదరదని భావించి మాదారి మేం వెతుక్కుంటున్నాం.
ఒక వైపు మొదటి అఙ్ఞాత లాంటి వారిని సమర్థిస్తూ, మనది ఒకే జాతి, అని చెప్ప చూడడం మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం కంపరం వేస్తుంది. ఒక భారత జాతి, ఇక తెలుగు జాతి వుండ గలిగినప్పుడు, ఒక తెలంగాణా జాతి మాత్రం ఎందుకు వుండ గూడదు? ఆ జాతిని నాశనం చేయాలని మీకెండుకు అంత ఉబలాటం?
మేం ప్రత్యేక రాష్ట్రం కావాలన్నప్పుడు కనీసంగా 'వీరెందుకు అలా అడుగుతున్నారు?' అని ఆలోచించ లేనివారు సమైక్యత గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా లేదూ?
మా తెలంగాణా జాతి మాకు రాష్ట్రం కావాలని అడగడంలో మీకు వుండాల్సిన అభ్యంతరం ఏమిటి? అందుకే సామ్రాజ్య వాదులు అన్నది.
నేను యెవరి కొమ్మూ కాయటం లేదు.
Deleteనా వ్యాఖ్యలో యెక్కడా సమైక్యవాదాన్ని సమర్థించనూ లేదు, తప్పుబట్టనూ లేదు. అలాగే ప్రత్యేకతెలంగాణావాదాన్ని కూడా యెక్కడా సమైక్యవాదాన్ని సమర్థించనూ లేదు, తప్పుబట్టనూ లేదు. తెలంగాణా వ్యతిరేకులుగా మీకు కనబడినంత మాత్రాన వారంతా కుట్రదారులనటం కేవలం మీ అసహనం తప్ప వేరు కాదు.
భారతాజాతి అంతా ఒకటే అంటె మీకు కంపరం కలుగుతోంది అంటే చాలా విచారించవలసిన విషయం. తెలంగాణా జాతి మాత్రం ఎందుకు ఉండకూడాదు అన్నది మీ కుతర్కం అనవచ్చునా నేను? ఎందుకంటే మీ తర్కం ప్రకారం, కరీంనగర్ జాతి, వరంగల్ జాతి కూడా ఎందుకు ఉండకూడదు అన్న మాట వస్తుంది కదా?
సమైక్యత గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా లేదూ అన్నది కూడా మీ సంకుచిత స్వభావాన్నే చూపుతోంది. ఇంటిని ముక్కలు ముక్కలు చేసుకుని ఆనందించాలనుకోవటమే దయ్యాల స్వభావం అని నేను అంటే?
తెలంగాణా జాతి అన్న మాటకు నా అభ్యంతరం, దానికి కారణం ముందే మనవి చేసాను. మీ వాదనను కాదన్నవాళ్ళంతా సామ్రాజ్యవాదులా? అలాగైతే మీ వాదనను నేను దౌర్జన్యవాదం అంటే బాగుంటుందా?
విషయం ఉంటే మాట్లాడండి. వ్యక్తిగతదూషణలలోనికి పోవటం అనవసరమైన విషయం. ఏ వాదం చేసే వారయినా తమ వాదాన్ని తప్పుబట్టే వాళ్ళను వ్యక్తిగతదూషణతో యెదుర్కోవాలని చూడటం పలాయనవాదం.
ఈ వాదులాటకు యింక స్వస్తి చెబుదాం. ఎందుకంటే మీరు చేసే నిందాలాపాలకి జవాబులు చెప్పే అవసరం ఓపికా, తీరికా, ఆసక్తీ కూడా నాకు లేవు.
>>అటువంటి కుల సంబోధనతో కూడిన పదాన్ని ఇతరులు వాడటాన్ని యెలా ఆక్షేపిస్తారన్నది ఆయన ప్రశ్న. సముచితంగానే ఉన్నది.
Deleteఇది కొమ్ము కాయడం కాదా? ఆయన ప్రశ్న మీకు సముచింతంగానే అనిపించడం ఏమిటి? ఉదాహరణకు ఒకడు ఇతరులను 'నీచుడా' అని తిడతాడు అనుకుందాం. అలా తిట్టేవాడిని ఇంకొకడు "నీచుడా అని తిట్టే వాడు" అని సంబోధిస్తే, ఈ రెంటిలో ఏది తిట్టు? ఆ మాత్రం తమకు అర్థం కాదని నేనైతే భావించను. అతని కుల సంబోధనని పక్కకు పెడదాం. ఇతరుల భాషను అతను కించపరచడం కూడా మీకు తప్పుగా అనిపించలేదా? పైగా మీరైతే మేం ఇతరులమే కాదని, మీరూ మేం ఒకటేననీ చెపుతారుగా? కులం మాట ఎలాగూ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తెలంగాణలో ఇప్పుడు దళితులూ, అగ్రవర్ణాలు అని వ్యత్యాసం లేకుండా అన్ని వార్గాల వారు కేవలం ప్రత్యేక తెలంగాణానే కోరుకుంటున్నారు. దయచేసి తమ బోటివారు మధ్యలో దూరి రంగులు పులమాలని చూసినా అది కుదరని పని.
>>ఒక వేళ తానెవరైనదీ తెలిస్తే బ్లాగువీరులెవరైనా తనను వెంటాడి వేధిస్తారని...
మీ మాటలు మరొక్క సారి చదవండి, ఎంత పక్షపాత ధోరణిలో సాగాయో మీకే తెలుస్తుంది. సదరు వ్యాఖ్యాత గొప్ప సాత్వికుడు అయినట్టూ, బ్లాగు వీరులు వెంటాడుతారని భయపడ్డాట్టూ? ఎబ్బెట్టుగా అనిపించలేదూ?
>>అజ్ఞాత మాటల్లో సమైక్యవాదచాయ లేమీ లేవు. అనవసరంగా ఒక మాండలికానికి కులపు రంగు వేయబోయారంతే.
అది సమైక్యవాద ఛాయ అని ఎవరూ అనలేదు. ఒద్దు మొర్రో అంటూ మొత్తుకున్నా 'నీకిష్టం లేక పోయినా సరే, నాతో సమైక్యంగా వుండాలని చెప్పడం', 'నీవు తక్కువ వాడివి, నేను గొప్ప వాడిని అంటూ మాటల ద్వారా వ్యక్తీకరించడం' మధ్య గల పెత్తందారీ సామ్యాన్ని చూపారంతే.
>>నా వ్యాఖ్యలో యెక్కడా సమైక్యవాదాన్ని సమర్థించనూ లేదు, తప్పుబట్టనూ లేదు.
ప్రత్యేకంగా చెప్ప నవసరం లేదు. మీ వ్యాఖ్యల్లో అణువణువునా ఏం తొణికిసలాడు తుందో అందరికీ (సమైక్యవాదులతో సహా) విదితమే!
>>భారతాజాతి అంతా ఒకటే అంటె మీకు కంపరం కలుగుతోంది అంటే చాలా విచారించవలసిన విషయం.
నేనెక్కడన్నాను? మా తెలంగాణా కూడా ఒక జాతి అని గురించండి అని మాత్రమే అన్నాను. నాలుక్కోట్ల తెలంఘాణా ప్రజలు ఒక జాతిగా identify కావడాన్ని గుర్తించ లేని వాడు భరతజాతిని కూడా గుర్తించ లేడు. అందుకే అనుకుంటాను... ఒకానొక అతివాద సమైక్యవాది (బ్లాగరి కూడా), సమైక్య రాష్ట్రం లేక పోతే ప్రత్యేక దేశం అని పల్లవి ఎత్తుకోవడం!
బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డినే చూడండి, ఐతే సమైక్య రాష్ట్రం, లేక పోతే ప్రత్యేక రాయలసీమ? ఇలాంటి సిద్ధాంతాలు సమైక్య వాదులకు తప్ప ఇంకెవరు మాట్లాడ గలరు? వీళ్ళకి భరత జాతి సంగతి అటుంచితే ఏ జాతిపైనైనా వుండే ప్రేమ ఎంత?
>> కరీంనగర్ జాతి, వరంగల్ జాతి కూడా ఎందుకు ఉండకూడదు అన్న మాట వస్తుంది కదా?
ఆ భావన వస్తే ఎవ్వరూ ఆపలేరు. కాని మీలాంటి వాళ్ళ దురదృష్ట వశాత్తూ, అలాంటి భావనలు లేవు. కాకపోతే, సమైక్యవాదం మాట్లాడుతూనే, వేరొక పక్క ఉత్తరాంధ్ర, సీమ అని మాట్లాడే వారిని గురించి ఆలోచించ వలసిందే.
>>సమైక్యత గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా లేదూ అన్నది కూడా మీ సంకుచిత స్వభావాన్నే చూపుతోంది.
దయ్యాలు వేదాలు వల్లించడాన్ని భరించలేని వారు, నన్ను సంకుచిత స్వభావి అని ఎలా అనగలిగారు? మీ మాటల్లోని వైరుధ్యం మీకే తెలుస్తుంది కదూ?
>>ఇంటిని ముక్కలు ముక్కలు చేసుకుని ఆనందించాలనుకోవటమే దయ్యాల స్వభావం అని నేను అంటే?
మా ఇల్లు మాది అంటున్నాం. పైగా అది ఇంతకు ముండే వేరుగా వున్న ఇల్లు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, SRC సూచనలకు విరుద్ధంగా కొందరు నాయకులచేత బలవంతంగా కలపబడిన ఇల్లు.
>>వ్యక్తిగతదూషణతో యెదుర్కోవాలని చూడటం పలాయనవాదం.
ఎవరు చూస్తున్నారో తెలియడం లేదూ?
శేషం కోపేన పూరయేత్ అని ఒక నానుడి ఉన్నది. రర్కబధ్ధమైన విషయం లేదు కాబట్టి శ్రీకాంత్ చారిగారు కోపావేశంతో చిందులేస్తున్నారు. వారితో అనంతానంతవాదనాకాలక్షేపం చేసేది కేవలం నిష్ప్రయోజనం! స్వస్తి.
Deleteకరీంనగరు వారో కోనసీమ వారో అడగదలుచుంటే వారికే వదిలేయడం బాగుంటుంది. ప్రజలు అందరూ (majority) అడిగినప్పుడు ఒప్పుకోవడం హుందాతనంగా ఉంటుంది. Why should an individual dream up hypothetical demands that may be raised in future by someone else?
Deleteగొట్టిముక్కలవారు,
Deleteమనం మనం భవిష్యత్తులో హుందాగానే దేశాన్ని ముక్కలు చెక్కలు చేసుకుని పంచుకోవచ్చు.
భేషుగ్గా ఉంటుంది.
దానికేం భాగ్యం.
కాని భారతదేశనికి ప్రజల మధ్య అనైక్యత అనే గుణమే బానిసత్వానికి దారితీసిందన్నది చారిత్రక సత్యం.
చరిత్రపునరావృతం కానివ్వద్దు అని నా విన్నపం.
నాది కేవలం ఊహాగానం అనీ, పంచేసుకుని అంతా ఆనందంగా ఉండవచ్చును అని మీ భావన.
ఇది వాదోపవాదాలతోతేలేది కాదు.
కాలమే నిర్ణయించాలి యే దృక్పథం సరియైనదో!
శ్యామలీయం గారు,
Deleteమీకు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతోనే దేశం ముక్కలైనట్టు కనపడ్డం విచిత్రంగా లేదూ? తెలంగాణా ఒక రాష్ట్రంగా ఏర్పడ్డానికి అన్ని అర్హతలూ ఉన్న ప్రాంతం. తెలంగాణా కన్నా చిన్న రాష్ట్రాలు ఈ దేశంలో 17 ఉన్నాయి. దేశం మీద నిజంగా అంత ప్రేమ వున్న వారైతే వాటిని పునర్విలీనీకరించడానికి ముందు ప్రయత్నించండి. తమరు గాని, తమ తోటి సమైక్య వాదులు గానీ ఆయా రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు, ఎక్కడా దేశ రక్షణకు పూనుకున్నట్టు కనపడ లేదు.
కాసేపు మీవాదనే కరెక్టని అనుకుందాం. మరి మద్రాసు నుండి తమ ఆంధ్రా ప్రాంతం విడిపోవడానికి చేసిన పోరాటం కూడా దేశాన్ని ముక్కలు చేయడమే నని ఒప్పుకుంటారా? అలా ఒప్పుకునే వారే ఐతే, సమైక్య మిధ్యమానికి పొట్టి శ్రీరాములు లోగో ఎందుకు తగిలిస్తారు?
ప్రజల్లో ఐక్యత లేకుండా సరిహద్దులు కలిపి ఐకమత్యం సాధించ గలరా? కలిసి ఐకమత్యంగా వుండలేనపుడు విడిపోయి సామరస్యంతో మెలగడం తరతరాలుగా మనం నేర్చుకున్న నీతి సూత్రం కాదా?
తర్కించలేని బలహీనత వల్ల తమకు కోపాలు వస్తాయేమో, నాకలాంటి సమస్య లేదు. నేను మాత్రం తర్కం తోనే సమాధానాలు చెప్ప గలను. స్వస్తి స్వస్తి అనుకుంటూ వస్తూనే వున్నారుగా! సమాధానాలు చెప్పండి, తర్కిద్దాం.
This comment has been removed by the author.
Deleteకం. మీ తర్కం బెరు కైనది
Deleteమీతోవాదించి లాభ మేమిటి గానీ
మీ తప్పొప్పుల ఫలితము
మీతో నఖిలాంధ్రదేశమే మోయుగదా!
ఆ.వె. స్వస్తి స్వస్తి యనుచు చావక నా యాశ
నచ్చజెప్ప వచ్చినాడ మగుడ
విరసు లైన మీకు వేడుక మీరగా
బోధపరచ బోవ బాధ మిగిలె.
శా. ఈ దేశం బెటు పోవునో యనుచు లో నెంతేని చింతించి వి
ఛ్ఛేదాంకూర విషప్రభావమును కాసింతైన మీ బోంట్లకున్
నా దౌ తీరున నచ్చజెప్పుటకు నానా యాతనల్ బొందినన్
కాదే కార్యము బ్రహ్మ చెప్పినను మీ కర్ణంబులం జొచ్చునే!
ఉ. మంచిది యాంధ్రదేశమున మానక పుట్టుచు నున్న వాదముల్
మంచిని పెంచునో తుదకు మానక దేశపు పుట్టి ముంచునో
యెంచగ నెంత వాడ మరి యే మని కాలము తీర్పు జెప్పునో
పెంచునో ద్రుంచునో శుభము వెల్గులు చీకటు లేవి వచ్చునో.
చం. శుభమశుభంబు నిచ్చుటకు చూచుచు నుండదు దైవ మెప్పుడున్
శుభమశుభంబు గల్గుటకు చూడగ కారణ మన్నది యెల్లవేళలన్
శుభమశుభంబులైన తమ శుభ్రమశుభ్రములైన కర్మముల్
శుభమశుభంబు లీనునని జుల్కన పోవునె పొందకుండగన్
కం. ఈ దేశపు భవితవ్యము
మీదౌ చేతులను నిల్చె మీమీ చేతల్
వేదననే మిగిలించునొ
మీదట శుభమౌనొ నెరుగ విధియే తెలియున్
స్వస్తిర్భవతు.
శ్యామలీయం గారూ, రాష్ట్రాలు ఏర్పడడం వల్ల దేశం ముక్కలు చెక్కలు అవుతుందనుకుంటే దానికి నాంది 1953 లో ఆంద్ర రాష్ట్రావతరణ. అప్పుడు కూడా భాషా దురభిమానంతో దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారనీ ఎందరో వాపోయారు. ఆంద్ర రాష్ట్రం ఏర్పడగానే ఎన్నో డిమాండులు బయటికి వచ్చాయి. అయితే కొందరు ఊహాగానం చేసినట్టుగా కొంపలు ఏమీ మునగలేదు. రావి శాస్త్రి చెప్పినట్టు "ప్రపంచం నడుస్తూనే ఉంది".
Deleteప్రజల మధ్య అనైక్యత ఏర్పడడానికి రాష్ట్ర విభజన తోడ్పడుతుందనే వాదన తర్కాన్ని తారుమారు చేయడమే. At the best we can conjecture state division is a result of disunity, not the cause.
ఇకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల మధ్య వైరుద్ద్యాలు ఉండవా? కత్తి పద్మారావు గారు "ఉమ్మడి రాష్ట్రంలో మనం కలిసి ఉన్నామా? ఉంటె మా పాకలు ఊరు చివర ఎందుకు ఉన్నాయి" అని అడిగినప్పుడు ఒక్క సమైఖ్యవాది సమాధానం చెప్పలేక పోయాడు.
మరో విషయం: భారత దేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకోవడానికి ప్రజల మధ్య అనైక్యతే కారణం అన్నారు. అప్పటి రవాణా సౌకర్యాలను చూస్తె ప్రజల మధ్య సంపర్కమే కుదరదు గొడవలు ఎలా వస్తాయి. అయితే గియితే పాలకుల మధ్య అనైక్యత కొంతవరకు కారణం కావచ్చు. పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం వల్ల సమకూరిన సాంకేతిక పరిజ్యానం & యుద్ధపతిమ ముందు మన సంస్థానాలు కలిసి పోరాడినా నిలబడలేరన్నది సత్యం. అయినా పద్దెనిమిదో శతాబ్దం నాటి ఆక్రమణ పద్దతులు ఈనాడు పని చేయవు. It is far more easier to occupy a country through lobbying & contractor-babu-neta nexus (e.g. Walmart entry just cleared).
శ్యామలీయం గారు,
Deleteమీ వేదన అర్థమైంది. కాని మా ఆవేదన కూడా అర్థం చేసుకోండి.
తెలంగాణాను అడ్డుకుంకుంటున్న అనేక మందిలా మీవి స్వార్థపు టాలోచనలు కాక పోవచ్చు. ఆంధ్రులంతా ఒకటిగా వుండాలనే కోరిక కావచ్చు. తెలిగుజాతి విడిపోవలసి వస్తున్నందుకు కలుగుతున్న బాధ కావచ్చు.
ఊహలు బాగానే వుంటాయి. ఉటోపియన్ సమాజంలో నివసించాలని పిస్తూంది. కాని పొద్దున లేస్తే వాస్తవాలు వేపాకు మింగినంత చేదుగా కనిపిస్తుంటాయి.
మీ తండ్రిగారు మీ తోబుట్టువులంతా కలిసి వుండాలని ఆశించి వుంటారు. అలాగే మీరూ మీ పిల్లలంతా ఒకే నీడన గడపాలని కోరుకోవడంలో స్వార్థం ఏమీ వుండక పోవచ్చు. కాని అది సాధించ గలరా? రోజూ కొట్టుకు చస్తున్న కొడుకుల్ని, తండ్రే వేరు పరుస్తాడు, తన స్వంత కోరికలు ఎలా వున్నా.
అలాగే ఇదీ. మీకు ఆంధ్రులంతా సమైక్యంగా వుండాలనే భావన వుంది. అయితే మీది కేవలం భావన మాత్రమే. మీ భావనలతో తెలంగాణా ప్రజలకు జరిగిన, జరుగుతున్న, జరగబోయే అన్యాయాలను ఆపలేరు. అటువంటప్పుడు మీలాంటి కొందరి సాత్వికుల భావనలకోసం తెలంగాణా ప్రజలను తాము పడుతున్న బాధలను ఓర్చుకోమని చెప్పడం భావ్యమా?
కుమారుల మధ్యన గొడవలు నియంత్రించలేని తండ్రి ఏవిధంగా నైతే కుటుంబ విభజనకు సమ్మతిస్తారో, అలాగే తెలంగాణాకు కొంతమంది స్వార్థ శక్తుల వల్ల కలుగుతున్న అన్యాయాలను ఏవిధంగానూ అడ్డుకోలేని పరిస్థితిలో వున్న మీలాంటి వారు విభజనకు సమ్మతించడం శొభస్కరంగా వుంటుంది. ఇప్పటికే కోస్తా, సీమకు చెందిన ఎంతో మంది ఆలోచనా పరులు ఆ పని చేస్తున్నారు.
తెలంగాణా భాషను యాసను అవహేళన చేయడం అనాదిగా వస్తున్నదే. అలనాడు తౌరుక్యామ్ధ్రం అనే మరక నుంచి ఈనాటి సినిమాలలో వెకిలి మాటలు వరకు అన్నీ ఈ కోవకు చెందినవే. కరుణశ్రీ లాంటి "మహామహులే" ఈ వికృతచేష్టలను పెంచి పోషించారనేది చరిత్ర చెబుతున్న నిజం.
ReplyDeleteఇవేవీ మాకు కొత్త కాదు. తెలంగాణా ఏర్పడ్డాక కూడా ఈ చులకన భావం సమిసిపోతుందనే అపోహలూ లేవు. అయితే విచిత్రమేమిటంటే కలిసి ఉందామని నీతులు చెప్పేవారే (అందరూ కాదు కొందరు) ఇలా ప్రవర్తించడం.ఒకరినొకరు తిట్టుకోవడం లేదా ఎగతాళి చేసుకోవడం ఉన్నంతవరకు సహవాసం కుదరదనే సత్యాన్ని గుర్తించాలి. The logical conclusion of mutual abhorment can only be separation and never unity.
"నాకు భాష రాదన్నోడు, నా యాసను వెక్కిరించినోడు ఈరోజు సిగ్గు లేకుండా కలిసి ఉందామంటున్నాడు": ప్రజాకవి కాళోజీ నారాయణరావు
గొట్టిముక్కల, ఆంధ్రులు ఆంగ్ల బాష మీద మక్కువ చూపిస్తున్నందుకు, కాళోజి 'చావవెందుకురా ఆంధ్రుడా ' అని వ్యాఖ్యనించాడు. బహుసా ఇలాంటి ఆవేదనే ఇంకొక కవి తెలంగాణా లో తెలుగు ఇతర బాషా పదాలతో కలుషితం అయినదానిపట్ల వెలిబుచ్చాడు. పైగా అది నిజం కూడా. మరి అందులో తప్పు పట్టాల్సింది ఏముంది? కవులు, సాహితివేత్తల అభిప్రాయాలు కొంచెం కఠినంగానే ఉంటాయి. వాటిని మీరు politically correct తో తూకం వేస్తే పెడర్ధం తప్ప లోపలి భావం కనపడదు. తెలంగాణ లో తెలుగు బాషా వ్యాప్తి సరిగా జరుగలేదని, ఆంధ్ర ప్రాంతం వారి నించి వచ్చిన వాళ్ళ తెలుగు తో పోల్చితే, తమకు మాతృబాష మీద అంత పట్టులేకపోవటానికి బాధ పడాల్సిన విషయం గా సాయుధ పోరాట సమయం లో రావి నారాయణ రెడ్డి లాంటి వారే వ్యాఖ్యానించారు. ఏదైనా ఒక విమర్శ ని sportive గా తీసుకొని అందులో నిజానిజాలు ఎంచే తత్వం ఈ దేశ ప్రజల్లోనే తక్కువ. ఇంక primordial loyaties విషయాల్లో ఎప్పుడెప్పుడు మనోభావాలు దెబ్బతీసుకుందామా అన్నట్లు ఉంటారు. దీనికి వర్తమాన విషయాలే కాకుండా చరిత్ర లోని అంశాలను కూడా తవ్వి context తో సంభందం లేకుండా విమర్శించటం కొత్త పద్దతి.
Delete@Anonymous September 13, 2012 5:49 PM
Deleteరావి నారాయణ రెడ్డి మాటల్లో నిజాయితీ వుంది. ఐతే అది చూసుకుని కొంతమంది ప్రగల్భాలు పలకడం, ఇతరుల భాషని హేళన చేయబూనడంలో గర్వం, అహంకారం దాగి వుంది.
That is only ur interpretation. మీలా ఆలోచిస్తే కాళోజీ కవితలో కూడా తలపొగరు కనిపిస్తుంది. తనకే ముందు బాష పై పట్టు లేకపోయిన ఎదుటివాళ్ళని విమర్శించి పెద్దరికం చూపించుకుందామనే దుగ్ద కనపడినట్లు నేను కూడా అర్ధం తీయగలను.
DeleteKaloji & Ravi criticized as insiders. This is different from Karunasri's (and others) who abused Telangana language from an outsider perspective.
DeleteThis is exactly what I said, we cannot take the criticism sportively.
DeleteI think it might have taken in a right spirit when Karunasri used that word. But when you bring things out of context (time, place, situation) you wont arrive at right judgement.
and Who is outsider? Can Jai or Some X can decide after 60 yrs based on physical boundaries? r u here to dictate that no outsider should criticize us? It is only ur interpretation that they 'abused' where as Ravi felt they themselves are not upto the mark.
Anyways, what right did Kaloji got when he asked 'chavavendukura andhruda'? Is he not outsider that time? Actually he is not a telugu person in the 1st place So, it can also be assumed, Karunasri remark is of more concerned, than kaloji's headstrong comments.
Sure, neither Jai nor Anon. (don't know which of the many) can decide who's critism is on insider basis or not. It is the critic making the comment itself who decides.
DeleteKaloji considered himself a Telugu and was so treated by others (my tataji was close to him). Karunasri despised Telangana and did not identify with this region.
That is funny. If Kaloji identified as telugu, then he automatically gets identified for all regions. But if Karunasri identifies as telugu (infact, he dont need one like Kaloji), he need a separate identity for telangana region otherwise he is outsider.. lol. Which is larger? telangana or telugu?
DeleteKaloji does not require region level identification but Karunasri has to identify with telangana to take his remarks on a positive note? These stupid theories are what exactly people despising off..
DeleteAnon, sure let us despise each other, I have no issues if you insist. Remember we can't stay together if we despise each other.
DeleteBTW Kaloji's Andhruda is not addressed to "Andhras" but Telangana Telugus (who were called Andhras in those days). In any case, Kaloji does not require a certificate from anti-Telangana folks.
I know Kaloji's remarks are against andhras in general(irrespective of region). He did not mention in his poem whether the remarks are against telangana telugus or coastal and seema telugus. If you take the stanzas at face value (which u frequently quote) it is applicable to all andhras. Good that Kaloji himself believed telangana telugus are also part of andhras. and I am not here to certify a person of stature Kaloji for whom I have good respect. on a similar note, Karunasri does not require anyone's approval to quote what he felt and noone's certificate to prove he has concern over telugu language irrespective of region. esp. from the anti telugu folks who dont even spell 'andhra' properly.
DeleteKaloji's comments in Andhruda are against Telangana Telugus. During those days, they were called Andhras. Telangana people called "andhras" as toorpollu (Easterners) at that time.
DeleteKaloji's 1969 era poems are not against Andhras as a whole but only those who opposed Telangana state.
I don't care about Karunasri's vile abuse against Telangana (southern Pakistan in his myopic & supremacist thought). పూవుల గురించి రంది పడ్డ ఆయనకు సాటి మనుషుల మీద అంతలేసి కించభావం ఎందుకో వారికే తెలియాలి. I only cited it to show we are not new to this type of abuse.
lies after lies. It is a joke that andhras are called toorpollu in 1956 and telangana people are called andhrollu. I never read in any newspapers of those days, neither in history books referring coastal and seema people as toorpollu. atleast in mainstream poetry, news papers or references they were never quoted as 'toorpollu' Atleast your lie might be closer to truth if u said madrasis (Even the word used by mostly northerners but not by fellow telugus). stop self labeling the victimhood tag for every damn remark. Kaloji himself made similar remark "ఉర్దు మాటలాడి యుబ్బుబ్బి పడుటకు కారణంబేమిటో కాస్త చెప్పుమురా?"
Deleteపచ్చ కామెర్లు వాళ్ళకి లోకమంత పచ్చగానే కంపించినట్లు, మనసులో విషపు ఆలోచనలు ఉంటే, ఎవరేమి చెప్పిన చేదుగానే ఉంటుంది.
గొట్టిముక్కల, మీ లాజిక్ ప్రకారం, తెలాంగాణ లో నివసించే (తెలుగు)వాళ్ళని "ఆంధ్రులు" అని పిలిచేవారు.. కాని కోస్తా వాసుల్ని "తూర్పోళ్ళు" అని తెలంగాణ వాళ్ళు పిలిచేవారు. అలాంటిది మరి ఎప్పటినించి తెలంగాణ వాళ్ళు తమ పేరుతో 'తూర్పోళ్ళని ' పిలవటం మొదలుపెట్టారు? (అదే..ఆంధ్రోళ్ళు వెళ్ళాలి అనే బదులు తూర్పోళ్ళు వెళ్ళాలి అని కదా నినదించాలి) అప్పటికే తూర్పోళ్ళని వాడుక ఉంటే తమ పేరు వాళ్ళకిచ్చి వీళ్ళు కొత్త పేరు కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
Deleteఈ విపరీత సృష్టి అంతా కేవలం కాళోజి "చావవేటికిరా ఆంధ్రుడా" అని అన్నది తెలంగాణ ప్రాంతం వాళ్ళని, కోస్తాంధ్ర ప్రాంతం వాళ్ళని కాదు అని నిరూపించటానికి వచ్చిన తిప్పలు.
కానీ, కాళోజి అలా అన్నంత మాత్రాన వెంటనే మనోభావాలు దెబ్బతీసుకొని, భాదితులుగా ముద్రేసుకొని కుమిలిపోవాల్సిన అగత్యం, కాళోజి మీద ఆవేశపడాల్సిన అవసరం రెండూ ఈ (కోస్తాంధ్ర) ప్రాంతం లో లేవు. ఏదో నిరూపించటం కోసం ఇలా నవ్వులపాలయ్యే వింత బాష్యాలు సృష్టించుకుంటూ పోతే చివరకు ఉద్యమానికీ అదే(ధో)గతి పట్టచ్చు..
@Anonymous
Deleteకాళోజీ ఆంధ్రుడా అనే సంబోధనలో పక్క ప్రాంతాన్ని నిందించ లేదని మీరూ ఒప్పుకుంటున్నారు. అది తెలంగాణా ప్రజల నుద్దేశించి వాడినా, తెలంగాణా ప్రజల నుద్దేశించి వాడినా, పరాయి భాషల పైన మోజు తగదని చెప్పిన ప్రయత్నం.
మరి కృష్ణశాస్త్రిగారు వాడారని చెపుతున్న తౌరఖ్యాంధ్రం కాని, దక్షిణ పాకిస్థానము కాని ఎలాంటి సందేశాన్ని కలిగి వున్నట్టు కనపడదు, కావలసినంత హేళన తప్ప.
నేను ఎక్కడ ఒప్పుకున్నాను? నేను చెప్పింది, ఆయన చావవేటికిరా ఆంధ్రుడా అని వ్రాసిన దానిని ఎవరూ insulting గా తీసుకోలేదు అని మాత్రమే. కాళోజి కి ప్రాతీయ విద్వేషాలు ఆపాదించలేదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం.
Deleteగొట్టిముక్కలవారూ,
ReplyDeleteతౌరక్యాంధ్రం అన్న మాట కరుణశ్రీగారు అపోహతో వాడి ఉండవచ్చును. అంతమాత్రం చేత తెలంగాణాప్రాంతానికి చెందని ఆంద్రప్రదేశమహామహులందరూ అవహేళనాపూర్వకదృక్పధం కలిగి ఉన్నారని, అటువంటి దృక్పధాన్ని పెంచిపోషించారని తీర్మానించటం సమంజసం కాదు. ఆత్మన్యూనతాభావంతో వీరతెలంగాణావాదులు కాని, అతిశయభావంతో తదితరులు కాని దూషణలకు దిగటం మంచిది కాదు. నిందాలాపాలతో యేదీ సరిగా చర్చించబడదు. సహవాసం కుదరకపోవటానికి సగటు కోస్తాంద్రవాసినుండి తెలంగాణావాసికి వచ్చిన లేదా తద్విలోమంగా చూచినా కానవచ్చిన సమస్య యేమీ కనుచూపుమేరలో ముందు వెనుకల లేనేలేదు. సమస్య అల్లా అవకాశవాదనాయకులు వారి భజనపరులతోనే. ఈ సంగతి ముందు ఇరుప్రాంతాలలోనూ అవగాహనకు వస్తే చాలా చిక్కులు తీరుతాయి.
శ్యామలీయం గారూ, తౌరక్యాంధ్రం అనే పదం కరుణశ్రీ గారన్నట్టు నేను ఆరోపించలేదు. (ఆయన "తెలంగాణము దక్షిణ పాకిస్తానము" అన్నారని నాకు తెలుసును.) ఆయన సమకాలీకులు కొందరు ఈ నిందను ప్రయోగించారని మాత్రమె నేను అన్నాను.
Deleteనాకు కరుణశ్రీ గారి మీద కోపం లేదు (ఒకవేళ ఉన్నా నేను ఎవడిని?). అంతటి మహానుభావులే ఒక ప్రాంతం మొత్తాన్ని ముద్ర వేసారనే ఆవేదన ఉండడం తప్పు కాదేమో?
తెలంగాణా భాషను ఆంధ్రులు అవహేళన చేయడం కొత్త కాదన్నానే కానీ ఆంధ్రులు అందరూ అలా ప్రవర్తించారని నేను ఆక్షేపించలేదు. తెలంగాణా భాష పై వచ్చిన వెకిలి వ్యాఖ్యలను ఎంతమంది ఖండించారనేది వారి మనస్సాక్షికే వదిలేద్దాం.
నేను ఎవరినీ నిందించలేదని సవినయంగా మనవి చేసుకుంటాను. I only pointed out the glaring incompatibility between mutual abuse & "wishing" to stay together.
అవకాశవాదులు (లేదా నిరుద్యోగులు) కొందరు పని కట్టుకొని తమ పబ్బం గడుపుకోడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారని, వీరు లేకపోతె తెలంగాణవాదం వీగి పోతుందని మీరు అనుకుంటే అది కేవలం అపోహ. ఇరు వైపునా అవకాశవాదులు ఉన్నారు కానీ వాదం వారి నియంత్రణలో లేదు. ఇలాంటి వారి పాత్ర చాలా పరిమతం. The fundamental clash is between two conflicting ideas of identity (region vs. language). The fact that there are some (very few) vested interests on both sides does not detract from this.
తెలంగాణా ఏర్పాటు (కొందరు ఆడిపోసుకున్నట్టు వేర్పాటు కాదు) జరగనది చిక్కుముడి విడిపోదు. ఈ చారిత్రిక తరుణంలో ఆంధ్రులు ఎంత సహకరిస్తే అంత వారికే మంచిది.
పోస్ట్ బాగుంది. చర్చ చదివాను. చర్చంతా మొదటి అజ్ఞాత కామెంట్ మీదుగా సాగింది. నాకు అదేమిటో తెలీదు. చర్చ మొత్తం మొదటి రీలు మిస్సయిన సినిమా లాగా ఉంది.
ReplyDeleteమీరు మీ బ్లాగు ద్వారా తెలంగాణా వాదాన్ని చక్కగా వివరిస్తున్నారు. అభినందనీయం. మీ అభిప్రాయాలు నచ్చనివారు చాలామంది ఉండి ఉండొచ్చు (అనుకుంటున్నాను). ఇటువంటి వేదికలలో లోతైన అవగాహనతో విశ్లేషణ చేసేవారూ, కేవలం వ్యక్తిగతంగా తిట్టటమే పనిగా పెట్టుకుని పైశాచికానందం పొందేవారూ కూడా ఉంటారు. మనం రెంటికీ సిద్ధ పడి ఉండాలి.
మన తెలుగు బ్లాగుల చర్చల స్థాయి అందరికీ అర్ధం కావాలి. వ్యాఖ్యలు ఎంత రెచ్చగొట్టే విధంగా ఉన్నా తొలగించ రాదు. నచ్చని భావాల్ని (అజ్ఞాతలుగా) తీవ్రమైన పదజాలం వాడుతూ ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారనే వాస్తవం అందరికీ తెలియాలి. ఇది అవసరం కూడా. మన బ్లాగులో కామెంటు రాసిన అతిధిని, వేరొకరు కించపరిస్తే.. అలా రాసిన వారి కామెంట్ తొలగించే విషయం (బ్లాగు ఓనర్ గా) ఆలోచించుకోవచ్చు.
రమణ గారు,
Deleteమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. పై వ్యాఖ్య తొలగించడానికి గల కారణం నన్ను వ్యక్తిగతంగా తిట్టినందుకు కాదు. ఒక దళిత కులాన్ని, ఈ టపా భాషను పోలుస్తూ, సదరు కులాన్ని కించ పరుస్తూ రాసినందుకు.
చంద్రబాబు అయితే రెండేళ్ళ తరువాతి ఎన్నికలకు కష్టపడుతున్నాడు కాని సిగ్నల్స్ కాదు. అలా సిగ్నల్స్ అనుకుంటే, వీళ్ళందరి హడావుడి చూసి కాంగ్రెస్స్ తెలంగాణా ఇవ్వడం మానేస్తుంది. క్రెడిట్ వారికి వస్తుందేమో అని.
ReplyDeleteవీళ్ళంతా కలిసి కాంగ్రెస్స్ ని ఇవ్వనివ్వకుండా కుడా ఇలా హడావిడి చేసినా ఆశ్చర్యం లేదు . కే సి ఆర్ కు సిగ్నల్స్ రావొచ్చు, వచ్చినా వాటికి అతనే అడ్డు పడొచ్చు కుడా (వాళ్ళ మధ్య బేరం కుదరక పొతే )
ఉర్దు మాటలాడి యుబ్బుబ్బి పడుటకు
ReplyDeleteకారణంబేమిటో కాస్త చెప్పుమురా?
లాగు షేర్వాణీలు బాగుండుననుచు
మురిసిపోయెదవంత మురిపమేమిటిరా?
Kaloji's satire on the so called culture which T proponents are feeling proud of
What do you mean by that?
DeleteDo you think that there is no culture in Telangana apart from Shervanis?
Now a days you people are wearing more shervanis in functions and marriages than we do!
It is not written by me.. It is written by Kaloji.. May be he is not well informed about T culture..
DeleteLet me explain a bit more if you need.
DeleteKaloji very well knows about Telangana culture. Which is why he has questioned people abandon their culture.
What you should know is that Telangana has its own culture and heritage. Kaloji has equally condemned Shervani culture as well as the culture you people tried hard to export. Both are equally different.
So, even without the influence of andhras, telangana people abandoned their culture.
DeleteIf I SHOULD know, could you enlighten what is the T culture that is neither exported by andhras nor by ppl of other regions?
Hey, no wonder you guys talks so tricky!
DeleteIf one poets writes something and all culture is abandoned?
I can site thousands of such writings that try to protect culture by Andhra poets. That means entire Andhra culture is abandoned? Don't try to be fool by reverse testing the dialogue.
By his, or any ones writings we can see that the culture is becoming diluted from within. That always happens... in Telenagana or Andhra. Examples can be wearing pants instead of dhovatis, chudidars instead of parikinis.
At the same time try to understand the difference between culture protecting and humiliating other side of people depicting their's language to be Pakisthani.
Yes. Andhra poets did write and many andhra people share similar sentiments about the culture and language. But they didn't blame others for their inability in protecting the culture. Karunasri made a comment that resembles Kaloji's sentiments of urdu usage. He used utpreksha alankaaram for comparison in his poetic expression. can you give me the context where Karunasri made that remark?
Deleteanyways.. సింగిడి పేరుతో బూతు కవితలు వ్రాసేవాళ్ళకి దక్షిణ పాకిస్తానం వ్యాఖ్య కి మనోభావాలు దెబ్బతినటం వింతే మరి.
//Telangana has its own culture and heritage.//
DeleteAlso I just want to know what is the T culture and heritage that is neither influenced/shared by rest of telugus nor by others
Again you are going in the same loop.
DeleteOK. Let me explain it once again. If Kaloji, Karunasri or any other person criticizes the group in which he belongs to, for the benefit of the group, it is acceptable.
But if he uses offending words/poetry against a group which he does not belongs to... like Karunasri's remarks on Telanganaa, they are definitely questionable. Hope you got it.
If somebody write obscene poetry with that name, many of others write much more obscene comments with their real names against Telangaanaa. How can you compare these people with Karunasri?
Again, you came to the same question. Who are you to decide which group Karunasri belong to? The relations between these two regions are not as two groups in those days. In other words, There is no telangana VS Andhra that time.. It is only telangana AND andhra. Karunasri is a telugu person and belongs to a group that is bigger than telangana. T is only part of that group. TElangana does not have any special 'freedom of speech' laws and Karunasri is well entitled to express his opinion.
DeleteKaloji said "chaavavetikira andhruda".. And you guys are twisting that he said only to T ppl and inventing new theories that andhras are called as "toorpollu" but not andhras.
Try doing one thing..
ఒక కరుడుగట్టిన తెలంగాణవాది దగ్గరకి వెళ్ళి కాళోజి వ్రాసిన చావవేటికి రా కవితని గాని, ఉర్దు మాటలాడి ఉబ్బుబ్బి పడుటకు కవిత ని గాని కరుణశ్రీ వ్రాసినట్లుగా పరిచయం చెయ్యండి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఖచ్చితంగా పాజిటివ్ గా ఉండదు. వాళ్ళు దాన్ని తెలంగాణ సంస్కృతిని, బాష ని అవమానించినట్లే భావిస్తారు. కారణం, అప్పటికే విద్వేషం తో నిండిన మనసులు, వ్రాసిన వ్యక్తి (ప్రాంతం) ని బట్టి దాన్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తారు. దీనిక్కారణం "ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ని అవమానిస్తారు" అని బలంగా బ్రెయిన్ వాష్ చెయ్యబడ్డారు కాబట్టి. So it all depends on how you perceive it.. Not how they said it. If it is quoted by "OUR" person you take it positively, if the same is said by "THEIR" person, you starts thinking with prejudice. you are giving importance to the person rather to the quote.
who are the people that wrote obscenely with their real names? I have given something that is written by publicly known faces. are you comparing them with some anonymous ppl on internet? Then checkout the comments in namasthe telangana or simply telangana website and you will get a glimpse of what is obscene comments.
anyways.. you didn't answer to my other question on what is the Telangana culture that neither influenced by andhras or others.
Any doubts on Karunasri belongs to which group? He he makes comments on Telugu people, we T people would also be happy along with you people. I am sure being a Telugu himself he would not Try to compare Telugus with Pakisthanis. But it is certainly an offending comment if he comments on other people.
DeleteYou only said in one of earlier comments that Kaloji addressed all Telugus.
"I know Kaloji's remarks are against andhras in general(irrespective of region)." -Anonymous September 15, 2012 2:49 PM
This was the exact line used by you. If want to retreat with the help of your anonymity, then better you come up with your real name.
If you want the literary proof for 'toorpollu', you can refer Suddala Ashok Teja's first novel, 'Velugu Rekhalu'.
As far as I know, the word Andhra applies to Coastal Andhra and not the word Andhrudu which equally applies to Andhra, Telangana and Rayala seema people like the word Telugu vaadu. So there should not be any ambiguity in it. But I am not 100% sure since I have not read that poetry which you are repeatedly quoting.
Don't bluff at the obscene comments made by you samaikyavada poeple. Raktacharitra, Rallabandy Ravindranath and SNKR are few examples on what extremes they can go on obscenity. The strange thing here you can see is, they plead for unity while using obscene words to other side of people!
Culture is dynamic. It continuously influenced by other cultures, may it be English, Muslim, or even Andhra. But it can not be forced by capturing education system, Academies, media etc. Which is being done right now.
yes. I have doubts.. because there are no 'GROUPS' as like u are distinguishing now. I see all of them as telugu poets, whether it is Kaloji or Karunasri. And when u started seeing them as telangana poet and Andhra poet that is your fault but not theirs.
DeleteI assume Karunasri used that word for the excessive usage of urdu but not to demean any culture. It is just a language comparison with pakistan and nothing to do with attitude/manners/behavior of the people.
Where did I said Kaloji reference to andhrudu is ONLY to coastal andhra people? I said his usage applies to all where as according to Jai's theory it is only to telangana andhrulu but nothing to do with coastal andhrulu.(toorpollu). But my question is if kaloji criticizes his own group then will that give him a right to criticize other groups? and you are drawing such rules based on your convenience?
Karunasri's criticism is based on occasion.. he dont need to criticize his 'own' group on every occasion he criticize the other group or vice versa.
if u want to see how Karunasri can criticize their own group..
అరవల మూతినాకి, అహహాయని తోకలు త్రిప్పి, నేలపై
దొరలుచు, వీలుచూచుకొని దూరుచు చీకటి సందుగొందులన్
దిరిగెడు గ్రామసింహముల తీరున నాయకులుండ, తెల్గుసో
దరుల యదృష్టమందుగలదా అభివృద్ధియున్ రాష్ట్ర సిద్ధియున్!
r u comparing anonymous rakthacharitra to singidi kavulu? Then see savaalreddy and others comments in NT. I did not see Rallabandy or SNKR using boothulu in their comments. But you can find ample in singidi kaital. calling for unity does not mean total surrendering or loosing self respect. if u assume like that, then u will be disappointed. I see SNKRs or Rallabandy comments as a Tit for tat to T vaadam and nothing to do with T people.
do anyone forced you at gun point to adopt a culture? 1st of all you dont even know what culture that u r claiming but beating around the bush just to prove you have a point. you sound more emotional than logical.
if you want to know the full poem of Kaloji.. here is the link..
Deletehttp://dearnri.org/tenugu.com/te/telugu/kaloji.html
Also can you give me the link (if have any) where Karunasri made those remarks? or do u have any information when he made and where?
Ok.. I got the context where Karunasri made that remark..
Deletehttp://www.namasthetelangaana.com/Editorials/story.asp?category=1&subCategory=7&ContentId=93788
He did not compare the culture or language. Seems he wrote it during 1969 T movement and his intention appears to be like Telangana getting separated from united state is like pakistan getting separated from undivided India. Since he knows the Pains, sorrows and feelings of many Indians during partisan he compared to it in literary sense but not literal sense.
excerpts from same poem..
Deleteఅన్నపూర్ణ రొమ్ములపై - హాలాహలం పూయకండి
అటు ఎవ్వరు, ఇటు ఎవ్వరు అంతా నా సంతానమె
నా తెలుగు నా వెలుగులు- నా హృదయం నా ప్రాణం’
‘ఒకే రీతి ఒకే జ్యోతి- ఒక్కొటొకటి ఒకే జాతి’
Do Karunasri has to answer to a random X on which group he belongs to?
He belongs to Telugu group, no one has doubts about that. If he comments on telugus it your argument applies. But when he is commenting on Telangana, he should think twice, since he does not belong to that region.
DeleteAre you still having problems to understand the difference.
Ok, let me explain with an example.
Being an Indian you can comment or criticize fellow 'Indians'. But being a telugu if you abuse Bengalis, or Marathis, it is objectionable.
did Suddala ashok teja wrote any novel with name velugu rekhalu? Before providing it as 'Proof' What is the reference he made regarding toorpollu?
ReplyDeleteGo and check with Visaslandhra Publishers. Chances are that you would get a copy. I have mine.
DeleteThen can u quote the reference from ur book?
DeleteA typical samaikyandhra style argument! I said the name of the book and also the name of the author. But you don't believe my words, but you believe if I quote a line from that book?
DeleteIf I quote one line that will still not be sufficient to you. You demand for more! If you are really interested go, buy and read the book.
In that book, it is not once or twice, the entire book contains the same word repeated many times. Infact the main character of the book, who happens to be a coastal migrant, called with the same nick name throughout the book.
Please read as 'samaikya vadi' style of argument... in the above comment.
DeleteYeah... The movement ppl started asking questions then you guys face this embarrassing situation. The T vaadis are notorious for airing lies.. They even created a youtube video on nehru speech, and generated an unadressed, unsigned letter of boorgula and no need to talk of their fake statistics, inventing new theories like 'toorpollu'..
DeleteIn this post itself you people repeatedly lied by misquoting Karunasri blaming he said telangana dakshina pakistanam.. where as he actually said ít on 'PRETYEKA telangana - dakshina pakistanam'. Unless I searched for myself, our JAI can freely propagate this quote.
Saying name of the book is a proof? what a joke.. That too an unpopular book.. Then will accept the same proofs if someone asks you to go and read so and so book written by chakravarhy or so and so govt report of 1965 etc.. and drop all ur claims..
I am not interested to buy some unpopular books unless I see some reviews on it..
atlast, you guys came up with a novel character to prove your point but no history books, no mainstream literature or news papers or any other media..
DeleteWe at least reply. You people have failed to reply the basic question, what will happen if there are two telugu states? And you people come and ask questions us.
DeleteYou try to put all nasty questions and feel that you are embarrassing us!
Jai mentioned about using the word toorpollu. If you don't know about that, it is not our mistake. You wanted some kind of evidence. How can some one give evidence on the jargon used by people 50 years back? I myself have personally witnessed that word being referred by elders in rural Telangana many times. Still I have given enough evidence. You think novel is not literature?
Are you under impression that for substantiating our argument, Ashok Teja has created that character some 25 years back?
The question "Why not two telugu states" is irrelevant at this time.. It is raised in 1955 and addressed. The relevant question is "Why two telugu states" and you people failed to justify . All your discrimination cries sound hallow and unsubstantiated.
DeleteJai or Sreekanthachari can innovate many things that not only we are unaware of, but even many writers, poets, and news paper editors in telangana themselves are unknown of..
//How can some one give evidence on the jargon used by people 50 years back?//
haha.. you guys cannot give evidence of some POPULAR usage 50 years back but talk about events happen during mahabharata times.. funny.. isn't it?
If the usage is such popular, how come in less than 10 years after state formation, you called the other party as 'andhrollu'.. you know very well, you are holding a weak argument, Suddala's character (IF exists as u claim, may be one off) and does not reflect the mainstream usage and making large claims like 'toorpollu is a STANDARD to refer coastal andhra ppl' are only laughable.
If you turn a blind eye, things would not become irrelevant. You power mongers may not agree, but whole India, if not whole world agrees with our point, only it is matter of time. It can not be a failure if we can not make a bunch of hipocrites like you who support the partition of Madras state and at the same time picturise T state as separatism.
DeleteIt is the Telangana people who has to decide upon separate state, not you who are not at all connected to this part of land. You have no right to speak your opinions about the future of other part of land being outsiders. It is against any principle of natural justice. The fact is almost all Telangana people and considerable percentage of andhra people are supporting division of state. In fact, there is a Jai Andhra movement in the operation.
If you don't want to be called as 'toorpollu', that is a different thing. But unfortunately people in Telangana refer you people as andhrollu and toorpollu. And refer your place as Toorpaadi. We can't help on that and require no proofs for that.
I don't understand why you are feeling so much being called as toorpollu. It is natural since you are towards east to us. It is common in Telangana to refer Marathis as Northern AP people as 'uttaradollu' and the southern Rayalaseema people as 'daskhinaadollu'. It is not just you people we call as toorpollu alone.
Lot of people wonder about the use of word Andhra. Looks like we can learn from recent history.
ReplyDeleteBefore WWII, the holy land was called Palestine. For thousands of years before then, Jews scattered round the world dreamt of "returning to promised land (Palestine)".
After Palestine was partitioned into Jewish and Arab parts, the Jewish part was referred to as Israel. The term Israel was not popular before that time.
Andhra people saying "you are also Andhras" is like Palestinians telling the Jews "you are also Palestinians".
A few more examples:
The word "Semitic" means Arabic in Hebrew. These days anti-Semitic relates to anti-Israel sentiment of others, especially.
The word "Zion" is another name for Jerusalem. Today Zionism means Jewish supremacism.
Meanings change with time. High time Andhras stop pretending otherwise!
Jai, r u still hang on to ur crude explanation? Save your history and dictionary knowledge for some other day. The old testament had rarely used the word palestine,(unlike the word andhra in all history and mythological references) also the usage developed to represent political entities (inturn based on religions) unlike in the case of telugu people.
Deleteanyways, Why you need to bring palestine example instead of showing a simple proof for toorpollu? by the time kaloji wrote that poem, there is hardly any usage of toorpollu and I doubt it existed even decades before.. May be it is one more innovation of separatists like Nehru's sppech in nizamabad. :)
Yes.. Meanings change with time. It is more apt to separatists who tries to find fault with every word or phrase quoted by 'óther group'..
and take credit for misquoting Karunasri and keep such coming..
by the way, then who fought for kauravas that time?
Anon no: n, Kaloji's poem Andhruda was written much before 1956. The poem itself derides a culture that is clearly not Andhra (Urdu/sherwani etc.)
DeleteYou may not know but even Kaloji wrote a rejoinder to Karunasri's "Dakshina Pakistanam" slur.
Hi Commentors,
ReplyDeleteIf the topics flew multifold, it is difficult to handle the discussion.
Please keep your discussions only relevant to the content of this post. Otherwise your comments are either ignored or simply deleted if they are too offensive.