Wednesday, September 19, 2012

నేను కూడా 'ఆంధ్రుడి'నే!


నా భూములు ఎండినప్పుడు
నా నీళ్ళను దర్జాగా బాంబులు విసిరి
దొంగల్లా దోచుకున్నప్పుడు
నేను నీకు కాని వాన్ని
ఎందుకూ పనికి రాని వాన్ని

నాకు రావాల్సిన కాలేజీ సీట్లు
నా వాటా ఉద్యోగాలు
ప్రాంతీయ పక్షపాతం చూపిస్తూ
కొల్లగొట్టినప్పుడు
నీ దృష్టిలో నేనొక బేవార్సు గాన్ని
తెలివి లేని శుంటని

నా కాలేజీల మీద ఖాకీల దాడి
అమానుషమైన లాఠీ చార్జీ
జరుగుతున్నక్షణాన
నీ మనస్సుకు నేనో
భయంకరమైన తీవ్రవాదిని

తెలంగాణాను ఇచ్చేస్తాం
హైదరాబాదును మాత్రం ఇవ్వం
అంటున్నప్పుడు
నీకు నేనో పరాయి వాడిని
పనికిరాని కరివేపాకుని
విసిరి పారేసే విస్తరాకుని

నా పోరాటం ఫలిస్తూ
నామాటలను ప్రపంచం ఆలకిస్తూ
నాకు జరిగిన అన్యాయాలను గుర్తిస్తూ
నా స్వరాష్ట్రం కల ఫలించబోయే సమయాన
నేను కూడా 'ఆంధ్రుడి'నే!
నీ తోడ బుట్టిన వాన్నే!

4 comments: