లీడర్ అన్నోడు తాను తీసుకొన్న నిర్ణయం మీద స్పష్టమైన క్లారిటీ కలిగి వుంటడు. తన నిర్ణయం వెనుక వున్న లాజిక్ ను కేడర్ కి చెప్పి ఒప్పించ గలుగుతడు. పూటకో మాట చెప్పుకుంట తిరిగే గాలివాటం గాడు లీడరు కాలేడు. లాభమైనా నష్టమైనా తన మాటకు కట్టుబడి ఉండేవాడే లీడరు. మన చంద్రబాబు దగ్గెర అది లేదని మరో సారి కనపడుతున్నది.
అదికారంల వున్నప్పుడు సమైక్యాంధ్ర అన్నడు. అది పోంగనే టీఆరెస్ తోటి జత కలిసి 'జై తెలంగాణ' అన్నడు. చివరకు ఆ మాటమీద కూడ నిలబడ లేదు. డిసెంబరు తొమ్మిది 2009 నాడు తెలంగాణ ప్రకటన రాంగనే తిరిగి సమైక్య రాగం అందుకున్నడు. గిసుమంటి సజ్జాలని మనిషి లీడరెట్ల ఐతడు?
తన శాతగాని నాయకత్వం తోని తెలంగాణల, ఆంధ్రల బొక్క బోర్ల పడ్డ చంద్రబాబు, మల్లొక సారి తెలంగాణ రాగం ఎత్తుకున్నడు. ఎవ్వరు అడుగక పోయినా తెలంగాణకు అనుకూలంగా ఇంకొక ఉత్తరం ఇస్తనన్నడు. గట్ల ఇచ్చేతందుకు ఒప్పుకొమ్మని సీమాంధ్ర నాయకులను ఒక్కతీరుగ బతిలాడ బట్టిండు. పేరు పేరున పార్టీ ఆఫీసుకు పిలిపించుకొని మీటింగులు పెట్టుడు శురూ జేసిండు. సమైక్యరాగం ఆలపిస్తందుకు చంద్రబాబు ఏనాడు తెలంగాణా తమ్ముళ్ళను అనుమతి అడుగుడు అట్ల పొతే, మాట ముచ్చట గూడ చెప్పడు. అది ఉద్యమాలు జేసుడుగాదు, ఉరికంబాలెక్కుడు గాదు, తెలంగాణకు అనుకూలంగ చిన్న లేఖ ఇస్తానికి మాత్రం జిల్లా, మండల కేంద్రమే కాదు, గల్లీ స్థాయి ఆంధ్ర లీడరునుంచి కూడ ఆయనకు అనుమతులు కావాలె! గా ఒక్క విషయం చాలదా అది ఆంధ్రోల్ల పార్టీ అని తెలుసుకోవడానికి?
మరి గా ఆంద్ర లీడర్ల తోటి ఏం మాట్లాడుకున్నదో ఏమో గని గిప్పుడు తెలంగాణా ముచ్చట చెప్పుడు బందు జేసిండు. తెలంగాణా తమ్ముళ్ళు కూడా ఎడమొకం పెడమొకం లెక్క డీలా పడి కనపడుతున్నరు. గిడంత చూస్తుంటే చంద్రబాబు లేఖ యవ్వారం బుట్ట దాఖలా చేసినట్టే కనపడుతుంది.
No comments:
Post a Comment