Wednesday, January 19, 2011

ఉద్యమ శంఖారావం

పగలే సూరిని కాల్చి భాను పారి పోతుంటే
పట్టలేని పోలీసులు బయలుదేరు తున్నరట

ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమాన్ని ఆపేందుకు
బందూకులు పట్టుకోని పరుగున వస్తున్నరట

అదనపు బలగాలిమ్మని అడుగుతున్రు కేంద్రాన్ని
రబ్బరు బుల్లెట్లె కాదు రైఫిల్లను తెస్తున్నరు!

వీల్లకు తెలిసిన విద్య జైల్లను నింపడమొకటే
అసహాయుల పట్టుకొని అడ్డంగా బాదడమే

పిల్లకాకి కేమి తెలుసు పెనుతుఫాను హోరెంతో
పాలకులకు ఏమితెలుసు ప్రజాశక్తి బలమెంతో

ఉవ్వెత్తున జనకెరటం ఉరకలేసి వస్తుంటే
బ్రతుకుజీవుడా అంటూ పరుగెత్తే రోజొస్తది

తంగెడు పుల్లల మంటే దావానల మైపోతది
ఉరికివచ్చి యువకెరటం ఉప్పెనగా మారుతుంది

ఉద్యమ శంఖారావం ఊరూరా పాకుతుంది
తెలంగాణా గొంతు విని దిగివస్తది ఢిల్లీయే!

4 comments:

  1. చాలా బాగా రాసారు.
    సాగినన్నాళ్ళు అబద్దాలతో ...
    సాగనప్పుడు ఆయుధాలతో ...
    ఈ దుర్మార్గపు సమైక్యతను సమైక్యతా పేరిట
    తెలంగాణాపై ఆదిపత్యాన్ని దోపిడీనీ కొనసాగించాలని చూస్తున్నారు ఆంధ్ర పాలకులు.
    ఈ దుర్మార్గం ఇంకా సాగదు గాక సాగదు.
    జై తెలంగాణా

    ReplyDelete
  2. Thanks సత్యాన్వేషి garu.

    ReplyDelete