గారడీలు మానండి కాంగ్రెస్ నాయకులారా
ప్రజలంతా వింటున్నరు పనికిరాని మీమాటలు
తెచ్చేదీ మేమంటరు ఇచ్చేదీ మేమంటరు
తెలంగాణా రాకపోతే తెలుసు మీరే సస్తరు
శవాలపై ఒట్టుపెట్టి శాన శాన వాగిన్రు
మంత్రి పదవి దొరుకంగనే మాట మర్చి పోయిన్రు
మందిలోకి వచ్చినపుడు మాటల వీరంగం
ఢిల్లీకి వెళ్ళంగనె పిల్లే మీకంటె నయం
ప్రణభును కలిసిన మంటరు బాతఖాని కొడుతుంటరు
కనబడితే చాలు వాని కాళ్ళమీద పడిపోతరు
రాజీలే మీబతుక్కు రాజీనామా లింకెక్కడ
సీమాంధ్రులు విసిరేసే చిల్లరకోసం గడబిడ
సాగవింక మీ ఆటలు చావు తెలివితేటలు
ఊల్లె అడుగు పెట్టలేరు ఉద్యమించ కుంటే
nice
ReplyDeleteThanks Sathya
ReplyDeleteపదవే ముఖ్యము నాకు,
ReplyDeleteప్రజలెట్ట బోతె నేమి?
రాజీనామా మాత్రం
నేనసలే జెయ్యనంట!!
ఊరికి రానివ్వకుంటే
పట్నంలో పడి ఉంటా!
ముఖం మీద ఉమ్మేస్తే
దస్తి పెట్టి తుడుచుకుంట!!
వచ్చే ఎన్నికలోగా
నా ఖజాన నింపుకుంట!
నా మనవడి కొడుకు కొరకు
నేనిపుడే కూడబెడుత!!
- తెలంగాణా కాంగ్రేస్ నేత
@సతాన్వేషి
ReplyDeleteమీరు నాకన్న ఎక్కువ సూటిగ రాసిన్రు. Thanks!