Saturday, July 16, 2011

ఒక ఉద్యమం, ఒక కాపీ ఉద్యమం

సమైక్యవాదులు తెలంగాణా ఉద్యమాన్ని అవహేళన చేయడానికి ఒక్క రాయి కూడా విసరకుండా వదలరు. తెలంగాణా వారు ఏమి చేసినా వారికి తప్పులాగే కనబడుతుంది. అదే పని వారు చేస్తే మాత్రం అది తప్పు కాదు వారి దృష్టిలో.

తెలంగాణా JACకి కోదండరాం గారిని చైర్మన్ గా పెట్టుకుంటే, ప్రొఫెసర్లేమిటి, పాఠాలు చెప్పుకోకుండా ఉద్యమాలేమిటి అని అడుగుతారు. కాని పోటీగా వారు కూడా ఒక కాపీ JACని ఏర్పరచుకొని దానికి కూడా ప్రొఫెసర్నే చైర్మన్ గా పెట్టుకుంటారు. అయితే ఆ JAC పిలుపునిస్తే ప్రజలెవరైనా కదులుతున్నారా, లేదా అనేది వేరే సంగతనుకోండి.

తెలంగాణా వారు విజయవంతంగా వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తే అదేంటి? రొద్లమీద వండుకు తింటారు! అని ఆశ్చర్యం వెలిబుచ్చుతారు. కాని అదే కార్యక్రం జిరాక్స్ చేసినట్టుగా కాపీ చేసి తమ ప్రాంతంలో నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ఘోరమైన విషయం ఏమంటే, ఆ కార్యక్రమాలకు ప్రజాదరణ లభించకున్నా కూడా విజయవంతం అయ్యాయని చెప్తూ, తెలంగాణా వారు నిర్వహించిన కార్యక్రమాల ఫొటోలను మక్కీకి మక్కీ తమవిగా పబ్లిష్ చేసి ప్రజలను నమ్మింప చూస్తారు.

గతంలో రాజీమాలు చేయాలని రాజకీయ నాయకులను తెలంగాణా వారు ఘెరావ్ చేస్తే అభ్యంతర పెట్టారు. ఇప్పుడు అవే పనులు వారు చేస్తున్నారు, కాకపోతే వారి నాయకులే రాజీనామాలకు సిద్ధంగా లేరు.

ప్రజల మద్దతు లేకపోయినా దోపిడీలు చేసి సంపాదించిన డబ్బు బలం గలవారు ఇలాంటి ఉద్యమాలను ఎంత కాలం నడపగలరో చూడాలి. ఏ వ్యాపారి అయినా తన డబ్బుకు ఎప్పటికైనా లాభం వస్తుందనుకుంటేనే పెట్టుబడి పెడతాడు. నష్టం తప్ప లాభం లేదనుకున్నప్పుడు అంతే వేగంగా పెట్టుబడులు ఉపసంహరించుకుంటాడు.

No comments:

Post a Comment