Monday, July 18, 2011
TG వెంకటేష్, జాగ్రత్త!
TG వెంకటేష్ సీమాంధ్ర సేన అని ఒక దళాన్ని తయారు చేస్తున్నాడట. అలాగే కోస్తా వారు కూడా దళాలు తయారు చేసుకొమ్మని అతని ఉవాచ. తనకు ఒక రోజు హోం మినిస్టర్ పదవి ఇస్తే తెలంగాణాను కట్టగట్టి అండమాన్ పంపిస్తాడట.
సమైక్యవాదమంటే పొరుగు ప్రాంతంలో ముష్కర మూకలను ఉసిగొల్పి భయభ్రాంతుల్ని చెయ్యడమన్న మాట! పదవుల్ని అడ్డం పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్న ప్రజల్ని జైల్లలో తోసి రాక్షసంగా అణచి వెయ్యడమన్న మాట. సమక్యవాద సిద్ధాంతమే వేరొక ప్రాంతంపై దోపిడీ, గుత్తాధిపత్యాన్ని లక్ష్యాలుగా చేసుకొని ఊపిరి పోసుకున్నప్పుడు వారి ఆలోచనలు ఇంతకన్నా గొప్పగా ఉంటాయనుకోవడం ముర్ఖత్వమే.
టీజీ, బతకడానికి నువ్విక్కడికొచ్చావు గానీ, మేం నీదగ్గరికి రాలేదని తెలుసుకో. అరవయ్యేళ్ళక్రితమే ఆబాల గోపాలం గుత్తపెత్తందార్లకు, వారి తొత్తు సైన్యాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసి మట్టి కరిపించిన జాతి మాది. నువ్వు బిర్యాని పొట్లాలు, సారా ప్యాకెట్లు ఇచ్చి తయారు చేసిన కిరాయి సైన్యాలను ఎంత మందిని పంపుతావో పంపు. నిన్ను, నీ సైన్యాలను మళ్ళీ మావైపు చూడలేని విధంగా బుధ్ధిచెప్పి గూడ్సు బండిలో ప్యాక్ చేసి కర్నూలుకు పంపుతాం జాగ్రత్త!
Subscribe to:
Post Comments (Atom)
Rayalaseema factionism & Bejawada rowdyism have no place in democracy. Hyderabad's reputation is being spoilt by jokers like Paritala Ravi, Suri, TGV, JCD etc. and scamsters like Asatyam Raju
ReplyDeleteఏంది శ్రీకాంతబ్బి కోపమొచ్చినాదా? మమ్మల్ని మీముక్కోడు కూడ అనిండ్లా ఇట్లనే తెలీదా మర్సిపోయినారా ఏంది సెప్పు. నీ బొందపెడ్తా సీమాంద్రోళ్ళు దొంగబాడ్కోవులు దోపిడిదారులు అన్నెప్పుడూ యాడ్కిపోయింది నీ ఆవేశం సెప్పబ్బా? టి.ఆర్.ఎస్ సాయుధ సైన్యం తయారు సేస్చాం అని కూడ సెప్పినాడే మర్సిపోయినారా? అప్పుడూ మాకు రాలేదే నీలాగ కోపం ఆవేశం ఏం మాకు సీము నెత్తురు లేవా ఏంది సెప్పు? మీలాగ మేము కూడ మనుషులమే అబ్బి మేము ఉప్పు కారెం తిన్యాం రోషం ఆత్మాభిమానం మాకు ఉండాయబ్బా కాని మీ ముక్కోడు అట్లా మాట్లాడినప్పుడు సూసి తిక్కలోడు అని ఊర్కున్యాం అంతే వాడ్కి బుద్దిల్యాకపోతే మాకు లేదా అని మాకు మేమే సర్దుకున్యాం అంతే గాని కొట్లాడడానికి దమ్ము ధైర్యం లేక కాదు మీది పోరాటాల గడ్డ అయితే మాది పౌరుషాల గడ్డ. ఈడ ఎవుర్కి ఎవ్రూ దేన్కి తీసుపోరు. మేము బుద్ది సెప్తాం ప్యాక్ సేసి గూడ్స్ బండిలో పంపుతాం అంటే ఎవ్రూ ఈడ గాజులు తొడ్కొని కూర్చోలా మేము కూడ బుద్ది సెప్తాం మీకు గుర్తుపెట్టుకో. టి.జె వెంకటేష్ కూడ మీ ముక్కోడులానే తిక్కలోడు వాడ్ని మేమే లీడర్‌గా లెఖ్క జమ సేయం అసలు పట్టించకోము నీవు పట్టించుకొని మాట్లాడితే ఎట్లా సన సెప్పు. ఈ కామెంట్ ఆక్సెప్ట్ సేస్తే సేయి ల్యాకపోతే ల్యా
ReplyDelete@Ramana
ReplyDeleteనేను జవాబిచ్చింది కూడా టీజీకే. నేను pack చేసి పంపుతామన్నది కూడా టీజీ మేంపుతున్న ఆకు రౌడీలనే. మధ్యలో మీకెందుకు కోపమొచ్చింది? నా టపా మరోసారి చదవండి.
కేసీఆర్ టి.ఆర్.ఎస్ సాయుధ సైన్యాన్ని తయారు చేస్తామన్నప్పుడు లేని తప్పు, టీజీ అటువంటి సైన్యాన్ని తయారు చేస్తానని అనటం లో తప్పు కనిపించటం లేదు. ఇద్దరూ ఒకటే. ఇద్దరూ బాధ్యత గల హోదాలో ఉండి అలా మాట్లాదకూడదు.
ReplyDeleteటి జి అంటేనే తెలంగాణా అయన పేరు లోనే ఉంది తెలంగాణా . ఆయనే ప్రత్యేక రాష్త్రాన్ని ఏర్పాటు చెయ్యమని దండం పెట్టి మరీ చెబుతాడు
ReplyDelete