Saturday, July 2, 2011

ఆంధ్రాలో అంతా గ్రాంధికమే మాట్లాడుతున్నరా?

కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నెల ఏడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యోమదంబయో
హాటక గర్భురాణి నిను నాకటికిం గొనిపోయి యల్లా క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!

ఇది బమ్మెర పోతన రాసిన పద్యం. దీంట్లో కొనిపోయి అనే పదాన్ని చూడండి. అది తెలంగాణాల కొనబోయి అని వాడుతరు. ఇప్పుడు ఏదైనా పత్రికలో రిపోర్టర్ 'కొనబోయి' అని రాస్తే ఎడిటర్ అడ్డు పడతాడు. 'తీసుకెళ్ళి' అని రాయాలంటడు. మరి నన్నయ, తిక్కన 'తీసుకెళ్ళి' అని రాసినరేమో తెలవదు.

ఇదంతా చెప్పడం ఎందుకో క్రింది పేరా చూస్తె మీకు తెలుస్తది.

దురదృష్టవశాత్తు తెలుగుభాషలోని ఒక్క పదం కూడా తన ఒరిజినల్ రూపంలో అక్కడ వినపడదు. అంతా అపభ్రంశమే. పరాయి పాలకులు అలవాటు చేసిన ఈ అపభ్రంశ రూపాల్నే వారు తమవిగా భావిస్తున్నారు. మహాకవి బమ్మెఱ పోతన తమ ప్రాంతీయుడని వారు చెబుతారు. కానీ పోతన ఈ అపభ్రంశరూపాల్ని ఎక్కడా వాడలేదు. ఈ కాలపు లెక్క ప్రకారం ఆయన కోస్తా-సీమల గ్రాంథికాన్నే వాడారు.

ఇది సదరు బ్లాగులో ఒక పండితుడు చూపిన మధ్యకోస్తా భాషాహంకారం. ఒక ప్రాంతంమీద, అక్కడి ప్రజల మీద ఎంత చిన్న చూపో చూడండి సదరు పెద్దమనిషికి! ఒక్క పదం కూడా ఒరిజినల్ రూపంలో కనపడదట! మరి ఆంధ్రాలో కనపడుతుందా? ఇప్పుడు వారు మాట్లాడే తెలుగు నన్నయ తిక్కన రాసిన తెలుగు ఒకటేనా? అసలు వారు తీసుకెళ్ళి అని రాసినరా, కొనిబోయి అని రాసినరా? 

భాష కాలానుగుణంగా మార్పులు చెందుతుంది తప్ప జడంగా వుండదు. అది తెలంగాణలో నైనా ఆంధ్రా లో నైనా. అంతే కాదు ఆ మార్పు ప్రాంత ప్రాంతానికి ఒకోలాగా ఉంటుంది అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి, ఇతర భాషల ప్రభావాన్ని బట్టి. అందుకే అనంత పురం భాషకు చిత్తూరు భాషకు శ్రీకాకుళం భాషకు గల తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. వాస్తవాలు ఇలా ఉండగా కేవలం తెలంగాణా భాషే అపభ్రంశాల మాయం అని చెప్పజూసే మనిషికి ఏం చెప్పగలం? 

ఏ ప్రాంతంలో నైనా కొన్ని పాత కాలంనుంచి వచ్చిన పదాలు నిలిచి ఉంటయి. కొన్ని ప్రాంతాలలో మార్పులు చెందుతయి. మన ప్రాంతంలో ఉన్న పదాలు మాత్రం సరైనవి, ఇతర ప్రాంతాలలో వాడుకలో ఉన్న పదాలు మాత్రం అపభ్రంశాలు, పరభాషా పదాలు అనడం ఎలాంటి వాదన?   

తెలుగులో తమిళ, కన్నడ, ఒరియా సంస్కృత పదాలు కలిస్తే ఫరవాలేదు. కాని ఉర్దూ పదాలు కలిస్తే మాత్రం నేరం లాగ మాట్లాడుతారు. అసలు ఇక్కడి భాషను, సంస్కృతిని ఇంతగా చిన్న చూపు చూసే వారు ఎందుకు మమ్మల్ని పట్టుకొని వేలాడుతరో అర్థం గాదు!

4 comments:

  1. >>>>>
    తెలుగులో తమిళ, కన్నడ, ఒరియా సంస్కృత పదాలు కలిస్తే ఫరవాలేదు. కాని ఉర్దూ పదాలు కలిస్తే మాత్రం నేరం లాగ మాట్లాడుతారు.
    >>>>>
    నిజాం నవాబులు తెలంగాణా ప్రజలపై ఉర్దూని బలవంతంగా రుద్దితే అది తెలంగాణా ప్రజల తప్పు కాదు కదా.

    ReplyDelete
  2. మన ఆంధ్ర సోదరులకు క్రింద కనిపించే ఉర్దూ సంబంధ పదాలు(ఇవి ఆంధ్ర ప్రామాణిక భాష లో తరచూ వాడే పదాలు ) అచ్చ తెనుగు పదాల లాగ అనిపిస్తాయి, తెలంగాణా లో ఉండే ఉర్దూ పదాలు చూసి బాధ పడతారు, తెలుగు ని ‘ఖూనీ’ చేస్తున్నారు అంటారు. అసలు ‘ఖూని’ అన్న పదమే ఉర్దూ. ఇహ మిగతా పదాలు అంటారా అన్ని సంస్కృత సంబంధ పదాలే, పేరు కే ద్రావిడ భాష . ఈ ‘సూడో మాత్రు భాషాభిమాను’లకి ఒక నమస్కారం పెట్టాలి. వస్తూ వస్తూ తమిళుల గజ్జి వెంట తెచ్చారు . ఇహ ఇక్కడి తెలంగాణా ప్రజలు ఉర్దూ పదాలని ఉర్దూ లాగానే పలుకుతారు, తెలుగీకరణ చేయరు.

    బంద్
    జిందా బాద్
    జోరు గా (జోర్ )
    ఆఖరు
    ఖరారు
    ఫిర్యాదు (फरियाद )
    ‘బైఠా’యించారు
    జిల్లా (jile in urdu)
    తాసిల్దార్
    జమిందార్
    హుషారు
    ఖైది
    పరారి
    ‘అటకా’యించారు (atka)
    లడాయి
    జగడా
    బడాయి
    షోకిల్ల
    జారీ
    మంజూరు
    సరిహద్దు (सरहद )
    సవాల్
    జవాబు
    జవాను
    బేజారు
    బాజారు
    దాఖలు
    ‘సాఫీ ‘ గా
    సముదాయించారు
    సంజాయిషీ
    షరతు
    బస్తి
    అసలు (असल )
    వినా (binaa)

    ఇంకా ఎన్నో ఎన్నెన్నో !!

    ReplyDelete
  3. తెలుగువారు పలికే ఉర్దూ పదాలు: (source:CP brown dictionary)
    http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81_%E0%B0%AA%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B1%87_%E0%B0%89%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B1%82_%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

    ReplyDelete
  4. Srikanth, the same "పండితుడు" called Telangana people (including women) drunkards.

    Tadepalli actually is a పండిత పుత్రుడు (i.e. పరమ శుంట)

    ReplyDelete