Thursday, July 7, 2011

కుడితిలో పడ్డ కాంగ్రెస్

కేకు చెయ్యాలంటే పిండి మిశ్రమాన్ని కలిపి కావలసినంత సమయం పాటు ఓవెన్ లో పెట్టాలి. ఆ కావలసిన సమయం గంట సేపు అనుకుందాం. మరి గంట కాకుండా పది గంటలు పెడితే? ఇరవై గంటలో, ముప్పై గంటలో పెడితే? అలా ఓ ముప్పై గంటలు పెట్టిన తర్వాత బొగ్గు కాకుండా కేకే కావాలని ఆశిస్తే ఎట్ల ఉంటది?

సరిగ్గా అట్లనే ఉంది మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అది తెలంగాణా సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఏమాత్రం లేకుండా, ఏళ్ళ తరబడి నానబెట్టి, ఇప్పుడు కూడా పరిష్కరించే ఉద్దేశం లేకుండా ఎలా లబ్ది పొందాలా అని ఆలోచించడమంటే, అది మాడి పోయిన కేకు బాగచేసే ప్రయత్నమే.   

2001 ల కేసీయార్ పార్టీ స్థాపించినప్పుడు, ఆ పార్టీ తెలంగాణా సాధిస్తదని ఎవ్వరూ పెద్దగా ఆశించ లేదు. కాకపొతే తెలంగాణా వాణి గట్టిగా వినిపించే వేదిక ఒకటి దొరికిందని సంబూర పడ్డరు. 

కాని 2004 ల కాంగ్రెస్ తో టీయారెస్ జతకట్టి, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజేతగా నిలవడంతో ప్రజలల్ల తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై ఆశలు చిగురించినై. తెలంగాణా ఏర్పాటు తధ్యమని నమ్మకం కలిగింది. కాని రాజశేఖర్ రెడ్డి ఒంటెద్దు పోకడలతోటి ఆ ఆశల మీద నీళ్ళు చల్లిండు. తద్వారా 2009 ఎన్నికల వరకూ పరిస్థితి లో ఏమాత్రం పురోగతి లేకుండ పొయ్యింది.

2009 ల ఇంకో అద్భుతం జరిగింది. సమైక్యవాదం నరనరానా జీర్ణించుకున్న నారా చంద్రబాబు సీట్లకు కక్కుర్తి పడి జై తెలంగాణా అన్నడు. ప్రణభ్ ముఖర్జీకి అట్లని ఉత్తరం పంపిచ్చిండు. అంతే కాదు, ఆ ఎన్నికల్ల కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాకు కట్టుబడి ఉన్నమనే చెప్పి పోటీ చేసింది. ఆ విధంగా రాష్ట్రంల ఒక్క సీపీయం తప్ప తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించే పార్టీ లేకుంట అయ్యింది. ఆ సీపీయం కూడా తాను తెలంగాణాకి అడ్డంకి కానని చెప్పి మహాకూటమి లో కలిసి ఎన్నికల్లో పాల్గొంది.

అన్ని పార్టీలు తెలంగాణా తెస్తమనే చెప్పడంతోటి తెలంగాణా ప్రజలు ఏ ఒక్క పార్టీనో గెలిపించలేక పోయిన్రు. జాతీయ పార్టీ అని నమ్మకంతో తెస్తే గిస్తే అదే తెస్తుందనే నమ్మకంతో కాంగ్రేసుని గెలిపిస్తే, తాను అన్నానంటే తప్పక చేస్తానని అన్న చంద్రబాబు మాటలని నమ్మి తెలుగుదేశానికి కూడా బాగానే సీట్లిచ్చిన్రు. మధ్యలో సమైక్యవాద పార్టీ అయిన తెలుగుదేశంతో పొత్తు పెట్టున్నందుకు కేసీయార్ బాగనే మూల్యం చెల్లించిండు. అయినా సరే వ్యూహాత్మకంగా చంద్రబాబుతో తెలంగాణా అనుకూల ప్రకటన చేయించడం ద్వారా ఆయన పెద్ద విజయమే సాధించిండు.

2009 లో తెలంగాణా ప్రాంతంలో ఎన్నికల తంతు పూర్తీ కాగానే తెలంగాణా వెన్నులో మొదటి బాకు దిగింది. అది దింపింది రాజశేఖర్ రెడ్డి. ఎన్నికలు పూర్తైన మరుక్షణం నంద్యాల మీటింగులో, రాహుల్ గాంధీ సమక్షంలో, తెలంగాణా విడి పొతే హైదరాబాదుకి వీసా తీసుకుని వెళ్ళవలసి ఉంటదని తొండి మాటలు చెప్పిండు రాజశేఖర్ రెడ్డి.

తెలంగాణా ఉసురే పోసుకున్నడో, తన మాటలకు మూల్యమే చెల్లించు కున్నడో తెలువదు గని,  కొద్ది రోజులకే ఆయన అత్యంత ఘోరమైన పరిస్తితులల్ల కాలధర్మం చేసిండు. ఆ విధంగా తెలంగాణాకు ఉన్న పెద్ద అడ్డంకి తొలిగినట్టయింది. అదును చూసి కేసీయార్ నిరాహార దీక్ష చేసిండు. ఆ సమయంలో ఉవ్వెత్తున లేచిన ప్రజా వెల్లువ చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రక్రియ మొదలయినట్టు ప్రకటించింది.

ప్రకటించి ఇరవై నాలుగ్గంటలు కాకముందే తెలంగాణ వెన్నులో రెండో బాకు దింపిండు చంద్రబాబు. తాను స్వయంగా రెండు రోజుల ముందే అసెంబ్లీలో చెప్పిన మాటలనే పూర్వపక్షం చేస్తూ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిండు. సీమాంధ్ర నాయకుల కుట్రలకు ఎన్టీయార్ ట్రస్టు భవన్ వేదికగా నాయకత్వం వహించిండు. ఇది తెలంగాణా ప్రజల హృదయాల్లో తీరని గాయం రేపింది.ఫలితం, తెలంగాణాలో బలంగా పాతుక పోయిన తెలుగు దేశం పార్టీకి ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం.

ఆ తర్వాత చంద్రబాబు కాని, ఇతర నాయకులు కాని తెలంగాణాల పర్యటించడానికి కూడా వీలు కాలేదు. చెరువులో నుండి బయట పడ్డ చేప పిల్లల మాదిరి తయారయింది తెలంగాణా టీడీపీ వారి పరిస్థితి. 

కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. తాము విధించుకున్న జూన్ 30 డెడ్ లైన్ కూడా ముగియడంతో కాంగ్రెస్ వారికి ప్రజల వద్ద ముఖం నిలపాలంటే రాజీనామాలు తప్ప వేరే గత్యంతరం లేక పోయింది. అలాగే వారు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసిన్రు. తెలుగుదేశం వారికి కూడా ప్రజల ముందుకు రావడానికి ఇదో గొప్ప సువర్ణావకాశం లాగ కనిపించింది. అనుదుకే కాంగ్రెస్ వాళ్ళకంటే గంట ముందుగానే తమ రాజీనామాలు సమర్పించిన్రు.

ఇప్పుడు ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానిది. ఇంత కాలం సమస్యను నాన బెట్టిన ఫలితంగా ఏం చేసినా కాంగ్రెస్ కి లాభించేలా లేదు. నష్టాన్ని తగ్గించు కోవడమే ఇప్పుడు చేయవలసిన పని.

ఇప్పుడు తమంత తాము రాజీనామాలు ఉపసంహరించు కుంటే ప్రజలు కాంగ్రెస్ నాయకులని ఎప్పటికీ క్షమించరు. వారు కనీసం తెలంగాణా ప్రాంతంల తిరగ్గలిగేది కూడా అనుమానమే. అలా అని తెలంగాణా రాకుండా వారు మళ్ళీ ఏం మొఖం పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయగలరు? తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు తెలంగాణా సాధించడం తప్ప వేరే మార్గం లేదు. వారు మళ్ళీ ఈ ప్రాంతంలో పోటీ చేయాలంటే తెలంగాణా అయిన తీసుకు రావాలి లేదా పార్టీ వీడి టీఆరెస్ టికెట్ మీద అయినా పోటీ చేయాలి.

చంద్రబాబుతో తెలంగాణాకు అనుకూలంగా మరో స్పష్టమైన ప్రకటన ఇప్పించకుండా తెలంగాణా తెలుగుదేశం వారు ఎన్నికల్లో గెలవడం కల్ల. అలాంటి ప్రకటన చేసినా గతంలో ఏరుదాటి తెప్ప తగలేసిన బాబుని జనం నమ్మడం కష్టమే. రాజీనామాలు చేసినంత మాత్రాన సమైక్య నాయకుని క్రింద ఉన్న తెలుగు తమ్ముళ్ళను తెలంగాణా వారు నమ్మరు. చంద్రబాబు ప్రకటన కాని, తెలుగుదేశం విభజన కాని అనివార్యంగా జరిగే పరిణామం.

ఇక టీఆరెస్ పరిస్థితికి మాత్రం ఏం ధోకా లేదు. తెలంగాణా రావడం లేటైన కొద్దీ అది మరింత బలపడుతుంది. 2014 ఎన్నకల్లో అది 90 % అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం ఖాయం. ఒక వేళ ముందే తెలంగాణా వచ్చినా ఆ క్రెడిట్ దానికే దక్కుతుంది.

8 comments:

  1. //అన్ని పార్టీలు తెలంగాణా తెస్తమనే చెప్పడంతోటి తెలంగాణా ప్రజలు ఏ ఒక్క పార్టీనో గెలిపించలేక పోయిన్రు. జాతీయ పార్టీ అని నమ్మకంతో తెస్తే గిస్తే అదే తెస్తుందనే నమ్మకంతో కాంగ్రేసుని గెలిపిస్తే, తాను అన్నానంటే తప్పక చేస్తానని అన్న చంద్రబాబు మాటలని నమ్మి తెలుగుదేశానికి కూడా బాగానే సీట్లిచ్చిన్రు. మధ్యలో సమైక్యవాద పార్టీ అయిన తెలుగుదేశంతో పొత్తు పెట్టున్నందుకు కేసీయార్ బాగనే మూల్యం చెల్లించిండు. అయినా సరే వ్యూహాత్మకంగా చంద్రబాబుతో తెలంగాణా అనుకూల ప్రకటన చేయించడం ద్వారా ఆయన పెద్ద విజయమే సాధించిండు.//

    ఇందులో అబద్దాల సంఖ్య ని చెప్పిన వారికి కారు దొరతో ఒక రోజు లంచ్ ఫ్రీ.

    //అన్ని పార్టీలు తెలంగాణా తెస్తమనే చెప్పడంతోటి తెలంగాణా ప్రజలు ఏ ఒక్క పార్టీనో గెలిపించలేక పోయిన్రు//
    నిజమాండీ!!!! చూ.. చూ.. సి పి ఎం ఏమి చెప్పింది సర్. ఒకటి

    //జాతీయ పార్టీ అని నమ్మకంతో తెస్తే గిస్తే అదే తెస్తుందనే నమ్మకంతో కాంగ్రేసుని గెలిపిస్తే//

    తెచ్చేది,ఇచ్చేది అయితే అసలు రాష్ట్రం కోసం పుట్టిన తెరాస తో ఎందుకు పొట్టు పెట్టుకోలేదు. మీరు మరీ తెలంగాణా ప్రజల విజ్ఞతని ప్రశ్నిస్తున్నారు. రెండు.

    //తాను అన్నానంటే తప్పక చేస్తానని అన్న చంద్రబాబు మాటలని నమ్మి తెలుగుదేశానికి కూడా బాగానే సీట్లిచ్చిన్రు.//

    చంద్ర బాబు అంటే తెలంగాణా ప్రజలకి ఎంత ప్రేమో?? రాల్లిచ్చుకుని కొట్టింది మర్చి పోయారేమో. మూడు.

    //మధ్యలో సమైక్యవాద పార్టీ అయిన తెలుగుదేశంతో పొత్తు పెట్టున్నందుకు కేసీయార్ బాగనే మూల్యం చెల్లించిండు//

    మరి ప్రణబ్ కమిటీ కి టి డి పి ఇచ్చిన లేఖ ఏమిటో? నాలుగు

    //అయినా సరే వ్యూహాత్మకంగా చంద్రబాబుతో తెలంగాణా అనుకూల ప్రకటన చేయించడం ద్వారా ఆయన పెద్ద విజయమే సాధించిండు//

    చంద్ర బాబు ప్రకటన తో తెలంగాణ వస్తదా? అర.
    అన్నీ కలిపి నాలుగున్నర. పేరా గ్రాఫ్ మొత్తం ఒకటి. మొత్తం అయిదున్నర. ఇక టపా మొత్తం లెక్క వెయ్యాలంటే రోజు సరిపోదు అనుకుంటా.

    ReplyDelete
  2. బకాసురున్ని దేవుడని, బకాసుర పుత్రున్ని మహానాయకుడని భజనలు చేసి తరించే తమరు వేరొకరి రాతల్లో అబద్ధాలు వెతకడానికి బయలు దేరిండ్రన్న మాట! బాగు బాగు.

    >>>సి పి ఎం ఏమి చెప్పింది సర్

    ఆ విధంగా రాష్ట్రంల ఒక్క సీపీయం తప్ప తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించే పార్టీ లేకుంట అయ్యింది. ఆ సీపీయం కూడా తాను తెలంగాణాకి అడ్డంకి కానని చెప్పిప్పి మహాకూటమి లో కలిసి ఎన్నికల్లో పాల్గొంది.

    నేను రాసిన పై వాక్యాలు జగన్ మత్తులో మూసుక పోయిన తమరి కళ్ళకు కనపడక పోవడంల ఆశ్చర్యమేముంది?

    >>>తెచ్చేది,ఇచ్చేది అయితే అసలు రాష్ట్రం కోసం పుట్టిన తెరాస తో ఎందుకు పొట్టు పెట్టుకోలేదు.

    2004ల పెట్టుకుని వెలగబెట్టిందిగా! అంటే తమరు ఏమంటున్నారు? 2009లో కాంగ్రేస్ సమైక్య నినాదంతో ఎలక్షన్‌కి వెళ్ళిందా? ఇంతకంటే పెద్ద అబద్ధం చెప్పడం రాజషేఖర్ రెడ్డికి కూడా సాధ్యం కాదేమో!

    >>>చంద్ర బాబు అంటే తెలంగాణా ప్రజలకి ఎంత ప్రేమో?? రాల్లిచ్చుకుని కొట్టింది మర్చి పోయారేమో.

    రాల్లుచ్చుకుని కొట్టింది డిసెంబరు 10 2009 తర్వాత. కాస్త చరిత్ర తిరగేయండి.

    >>>మరి ప్రణబ్ కమిటీ కి టి డి పి ఇచ్చిన లేఖ ఏమిటో?

    ప్రణభ్ కి లేఖ ఓట్లకోసమే ఇచ్చాడని తెలిసిందిగా! అది ప్రజలంతా ఎందుకు నమ్మాలి? ప్రత్యేక తెలంగాణా నినాదంతో వచ్చిన కాంగ్రేస్, TDPలకు ఓట్లేసిన ప్రజలు TRSకి వెయ్యలేదంటే వారు TRS నుంచి మరింత కమిట్మెంట్ ఆశించడం వల్ల మాత్రమే. చంద్రబాబు, CPM ఉన్న కూటమిలో TRS చేరడం జనానికి నచ్చలేదు. కాకపోతే ఈ కూటమి వల్ల వ్యూహాత్మకంగా బాబుని KCR ఇందులోకి లాగగలిగాడు. కాదంటారా?

    మరి ఇన్ని మాట్లాడిన తమరు రాజశేఖరులుంగారు నంద్యాలలో చేసిన వీరంగం గురించి మాట్లాడలేదెందుకో? అది మీ దృష్టిలో తప్పా, ఒప్పా? ఒప్పే అయుంటుంది, జగన్ కరెన్సీ మహిమ!

    ReplyDelete
  3. " తెలంగాణా ఉసురే పోసుకున్నడో, తన మాటలకు మూల్యమే చెల్లించు కున్నడో తెలువదు గని, కొద్ది రోజులకే ఆయన అత్యంత ఘోరమైన పరిస్తితులల్ల కాలధర్మం చేసిండు."
    రాజకీయాలని విశ్లేషించేటప్పుడు " ఉసురు " లాంటి పదాలు వాడటం అవసరమా ?

    ReplyDelete
  4. //2009లో కాంగ్రేస్ సమైక్య నినాదంతో ఎలక్షన్‌కి వెళ్ళిందా?//

    రాజశేఖర రెడ్డి సమైఖ్య వాది కాదు అనే మీ అమాయకత్వం చూసి నవ్వాల్సిందే. కాస్త అతికే మాటలు చెప్పండి.

    //రాల్లుచ్చుకుని కొట్టింది డిసెంబరు 10 2009 తర్వాత. కాస్త చరిత్ర తిరగేయండి.//

    కాదు 2004 తరువాత ,చంద్ర బాబు మొదటి పర్యటన మెదక్లో పెట్టినప్పుడు అని నిరూపిస్తే మీ బ్లాగు మూస్తారా?
    //ప్రణభ్ కి లేఖ ఓట్లకోసమే ఇచ్చాడని తెలిసిందిగా!//

    "తాను అన్నానంటే తప్పక చేస్తానని అన్న చంద్రబాబు మాటలని నమ్మి"

    ఈ రెండింటికీ పొసగదు అనుకుంటా?? కి కి. కొంచెం నిజాలు చెప్పండి సర్.

    //మరి ఇన్ని మాట్లాడిన తమరు రాజశేఖరులుంగారు నంద్యాలలో చేసిన వీరంగం గురించి మాట్లాడలేదెందుకో? అది మీ దృష్టిలో తప్పా, ఒప్పా?/

    మీలాంటి అబద్దాల కోరుల పరిపాలన వస్తే ఖచ్చితంగా తెలంగాణా రావాలంటే వీసా కావాల్సిందే. మీ కారు దొర ,మీలాంటి వాలని ఆ మాటలు అనడం లో తప్పేమీ లేదు.

    ReplyDelete
  5. //TDPలకు ఓట్లేసిన ప్రజలు TRSకి వెయ్యలేదంటే వారు TRS నుంచి మరింత కమిట్మెంట్ ఆశించడం వల్ల మాత్రమే. //

    అబ్బో, మీ ఊహాశక్తికి జోహారు. ఉద్యమం నిజాలతో చెయ్యాల్సిందే.

    ReplyDelete
  6. I am gonna sleep bro..you guys are fit for nothing..you don't publish my comments..get facts then fight,otherwise there is of no use with lies..all the best..

    ReplyDelete
  7. >>>రాజశేఖర రెడ్డి సమైఖ్య వాది కాదు అనే మీ అమాయకత్వం చూసి నవ్వాల్సిందే. కాస్త అతికే మాటలు చెప్పండి.

    ఆ విషయం దమ్మున్న మొగోడిలెక్క రాజశేఖర్ రెడ్డి అనబడే అవకాశవాది ఎప్పుడు చెప్పిండో తమరు చెప్పండి.

    >>>కాదు 2004 తరువాత ,చంద్ర బాబు మొదటి పర్యటన మెదక్లో పెట్టినప్పుడు అని నిరూపిస్తే మీ బ్లాగు మూస్తారా?

    అంటే ప్రణభ్‌కు లేఖ ఇవ్వక ముందేగా? మరి అప్పుడు కొట్టక ఏంచేస్తారు? తమరు అతి తెలివి తేటలు చూపడం మానితే బాగుంటది.

    >>>ఈ రెండింటికీ పొసగదు అనుకుంటా?? కి కి. కొంచెం నిజాలు చెప్పండి సర్.

    ప్రజలు కంఫ్యూజన్‌లో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు ఉంటాయి సార్. మీ బకాసురుడిని రెండోసారి కూడా రెండువైపులా గెలిపించినట్టు. అందరిదీ ఒకే ఆలోచన ఐతే ఒకే పార్టీ గెలవాలి కాని కాంగ్రెస్, మాహాకూటమికి తెలంగాణాలో దాదాపు సమానంగా సీట్లు వచ్చాయన్నది గమనించండి.

    >>>మీలాంటి అబద్దాల కోరుల పరిపాలన వస్తే ఖచ్చితంగా తెలంగాణా రావాలంటే వీసా కావాల్సిందే. మీ కారు దొర ,మీలాంటి వాలని ఆ మాటలు అనడం లో తప్పేమీ లేదు.

    ఇక మీతో చర్చ అనవసరం అనుకుంటా. మోసాలు చేస్తూ మోసపు మాటలు మాట్లాడుతూ, పైగా వాటినే నిర్లజ్జగా సమర్థించుకునే మీకు సమైక్యత అనే పదం ఎత్తుకునే అర్హత కూడా లేదు.

    ReplyDelete
  8. yaramana garu,

    Sorry, Not needed. It came in the flow.

    ReplyDelete