KCR మిగతా అందరిలానే ఒక రాజకీయ నాయకుడు. ఒక లగడపాటి, ఒక పయ్యావుల, ఒక చంద్రబాబు, ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక చంద్రబాబు, ఒక పొన్నం ప్రభాకర్, ఒక జగన్... వీళ్ళందరికి ప్రజల మీద ఎంత నిబధ్ధత వుందో కేసీయార్‌కి కూడా అంతే వుంది. వాళ్ళందరికీ నిబద్ధత వుంది అని విమర్శకులు భావిస్తే KCR కి కూడా వుందని చెప్ప వలసి వుంటుంది. వాళ్ళకు లేదంటే వారి లాంటి రాజకీయ నాయకుడే అయిన KCR ఒక్కడికే ఎందుకు వుండాలని అనుకోవాలి?
ప్రజల్లో తెలంగాణా ఉద్యమం వుంది కాబట్టే KCR ఉద్యమంలో వున్నాడు. లేకపోతే ఆయన ఏ కాంగ్రేసులోనో, TDPలోనో చేరే వాడు. KCR సర్వసంగ పరిత్యాగిలా మొత్తం జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణా సాధనకే అంకితం చేసాడని ఎవ్వరూ తెలంగాణలో అనుకోవడం లేదు.
అయితే తెలంగాణా వుద్యమంలో KCR పాత్రని కూడా తీసి పారవేయలేం. ఒక కంపెనీలో పని చేసే ఉద్యోగి తన జీతం తీసుకుంటూనే కంపెనీ అభివృధ్ధికి ఎలా తోడ్పడతాడో, KCRకి ఉద్యమంతో వుండే సంబంధం కూడా అలాంటిదే. కంపెనీలో పనిచేసి జీతం తీసుకున్నంత మాత్రాన, ఉద్యోగి కంపెనీ అభివృద్ధి కోసం చేసిన సేవలు గుర్తించకుండా ఉండలేం. అలాగే KCR కి కూడా సొంతలాభం కొంత ఉన్నంత మాత్రాన తెలంగాణా రాష్ట్రం కోసం అతని వంతు కృషిని గుర్తించ కుండా ఉండలేం. ఆయన కొన్ని పొరపాట్లు చేసే ఉండ వచ్చు గాక. కాని ఆయన చేసిన పొరపాట్ల కన్నా ఉద్యమ నిర్మాణంలో ఆయన పాత్ర ఎక్కువగా వున్నప్పుడు దాన్ని తప్పకుండా గుర్తించ వలసిందే. ఇక పోరాపాట్లంటారా, ఏదన్నా పని చేసేవాడే కదా పొరపాట్లు చేసేది?
ఇకపోతే KCR కి తెలంగాణా ఇస్తే మొత్తం కైంకర్యం చేస్తాడన్నట్టు కొంత మంది మాట్లాడు తుంటారు. అక్కడికి ఇప్పుడున్న నాయకులు అంటా పప్పు సుద్దలినట్టు, నోట్లో వేలు పెడితే కూడా కోరక లేనట్టు. మరి వాస్తవం చూస్తె మరోలా వుంటుంది. రాష్ట్రంలో ఇంకోవైపులో ఉన్న నాయకులు ఒక్కొక్కడు లక్షల కోట్లు దిగమింగి రాజకీయాన్ని, వ్యాపారాన్ని ఏకం కాహేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన వారు. మరి అలాంటి సజీవ మూర్తులను తమ నాయకులుగా కలిగి ఉన్నవారు, తెలంగాణా నాయకుల మీద, వారి పని తీరు మీద అనుమానాలు వ్యక్తం చేయడం అవిటివాడు గూని వాణ్ని ఉద్దేశించి నవ్వినట్టు ఉంటుంది.
ఏ నాయకున్నైనా కట్టడి చేయాలంటే ప్రజలు అప్రమత్తంగా వుండడం, లోక్ పాల్ వంటి బిల్లులు తేవడం మినహా మరో మార్గం లేదు. విభజన జరగడం వల్ల వచ్చే ముఖ్యమంత్రి కేవలం తెలంగణా అభివృధ్ధి కోసమే నిర్ణయాలు తీసుకో గలుగుతాడు (అందులో తన కమీషన్లపై ఆశ ఉన్నా సరే). అంటే గానీ తెలంగాణా నీటిని మళ్ళించడం, తెలంగాణా ఉద్యోగాలను మళ్ళించడం చేయలేడు కదా?
కాబట్టి ఇలాంటి విమర్శలు చేసేవారు గుర్తించ వలసిన మొదటి విషయం తెలంగాణా అంటే KCR మాత్రమే కాదు. తెలంగాణా ఉద్యమం లో KCR కూడా ఒక భాగం. తెలంగాణా ఉద్యమం KCR ఆపితే ఆగేది కాదు. డిసెంబర్ 2009 లో KCR దీక్ష విరమించినట్టు వార్తలు వచ్చిన వెంటనే ప్రజాగ్రహం పెల్లుబికి KCR దిష్టిబొమ్మలకు శవయాత్రాలు నిర్వహించిన వైనం KCR గాని, సదరు విమర్శకులు కాని మరిచి పోకూడదు.
సమాచార విప్లవం ఉచ్ఛదశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటి ప్రజా ఉద్యమం 1969 లాగా లక్ష్యాన్ని చేరకుండా ఆగుతుందని అనుకునే వారిది కేవలం భ్రమే అవుతుంది.
Srikanth, they know it but are clinging to the hope of tarnishing a movement by blaming one individual, party or caste.
ReplyDeleteThis is not 1969. Telangana will be formed even if "high command" and andhera plutocrats buy every T-politico and narahimsan & his police state kill hundreds of people.
No power in the world can stop an idea whose time has come. ఇది తెలంగాణ సందర్భం. తెలంగాణ ఒక మహోన్నత ఉద్యమమే కాదు, చారిత్రిక అవసరం కూడా. లక్ష బాబులు , కోటి సోనియాలు తెలంగాణను ఆపలేరు
యాదిరెడ్డికి postmortem ఎందుకు చెయ్యలేదు? ఇది చాల తీవ్రమైన విషయం. అమాయకులని బలి తీసుకోడానికి ఆడిన నాటకమా? నిలదీయండి.
ReplyDeleteమీలాంటి చదుకున్నవారైనా అలోచించి అమాయకులని కాపాడండి
telangana kaavali daaniki kcr correct leader kaadu ide majority people opinion...aayana trap lo padi udyamanni pakka dova pattinchoddu...seemandra leaders manchi vallani kaadu..andaru dongale...kaani kcr donga kaadu dagulbaaji,sannasi,telangana ki addupade sani....ee nijam telusukoni udyamam sarina naayakatvam lo saagithe andariki anandame...
ReplyDeleteBy and large reasonable post. Congrats!
ReplyDelete@Anonymous July 23, 2011 12:21 AM
ReplyDeleteఒక వైపునుండి పోస్టుమార్టం నుండి రహస్యంగా విమానాశ్రయానికి తరలించారని అన్ని చానళ్ళు కోడై కూస్తుంటే తమరెక్కడున్నారు తండ్రీ? పొస్టుమార్టం అయ్యిందా లేదా అనుమానంగా వుందా?
యాదిరెడ్డి పోస్టుమార్టం కావాలా? చేసుకోండి! Stop making wild insinuations & baseless allegations unless you have proven facts.
ReplyDeleteఅదే సమయంలో అంధేరా ప్రదేశ్ (తెగులునాడు) పోస్టుమార్టం కావాలి. This will reveal broken agreements, stolen water, injustice in jobs and much more. కంపు కొడుతున్న ఈ failed state శవాన్ని ఇప్పటికైనా బొంద పెట్టాలె. బూజు పట్టిన భాషా దురహంకారానికి, తెగులు దురభిమానానికి తద్దినం పెట్టాలె.
"అయితే తెలంగాణా వుద్యమంలో KCR పాత్రని కూడా తీసి పారవేయలేం. ఒక కంపెనీలో పని చేసే ఉద్యోగి తన జీతం తీసుకుంటూనే కంపెనీ అభివృధ్ధికి ఎలా తోడ్పడతాడో, KCRకి ఉద్యమంతో వుండే సంబంధం కూడా అలాంటిదే. కంపెనీలో పనిచేసి జీతం తీసుకున్నంత మాత్రాన, ఉద్యోగి కంపెనీ అభివృద్ధి కోసం చేసిన సేవలు గుర్తించకుండా ఉండలేం. అలాగే KCR కి కూడా సొంతలాభం కొంత ఉన్నంత మాత్రాన తెలంగాణా రాష్ట్రం కోసం అతని వంతు కృషిని గుర్తించ కుండా ఉండలేం. ఆయన కొన్ని పొరపాట్లు చేసే ఉండ వచ్చు గాక. కాని ఆయన చేసిన పొరపాట్ల కన్నా ఉద్యమ నిర్మాణంలో ఆయన పాత్ర ఎక్కువగా వున్నప్పుడు దాన్ని తప్పకుండా గుర్తించ వలసిందే. ఇక పోరాపాట్లంటారా, ఏదన్నా పని చేసేవాడే కదా పొరపాట్లు చేసేది?" .... true
ReplyDeleteమీరు రాసిన అర్టికల్ ను పూర్తిగా సమర్దిస్తాను.
ReplyDeleteకాని నీతిమాలిన రాజకీయనాయకులు ఏ ప్రాంతం వారైనా ఒక్కటే....
కె.సి.అర్. మాత్రమేనా..... సీమాంద్రలో కూడా అలాంటివారు లేరా అనడం బాగాలేదు...
సీమాంద్రలో కూడా అలాంటి వారు ఉన్నారని అక్కడి వాళ్ళను వెనకేసుకురావడం భావ్యం కాదు...
చదువుకున్నవారందరూ విజ్ణతతో అలోచించండి....
తెలంగాణా కొరకు నిర్విరామముగా పోరాడండి..... అంతేకాని మిగతా ప్రాంతాల వారి మీద ద్వేషం చిందించడమ్ ద్వారా కాదు.....
యాదిరెడ్డి గారి మరణం చాలా భాదకరం.... దానిని కూడా రాజకీయం కోసము వాడుకుందమన్న అలోచన ఉన్నటువంటి దౌర్బాగులు ఉన్న దేశం మనది....
Balanced Article...Gud One...
ReplyDeleteఅంధేరా ప్రదేశ్
ReplyDeleteగీ రాసేదేదో మన తెలంగానలో రాయన్న. తెలుగులో కాదు.
ReplyDelete