Sunday, July 3, 2011

సమైక్య ‘రాగాలు’.. దోపిడీ ‘తాళాలు’



- రాజకీయం ముసుగులో కాంట్రాక్టులు
- తెలంగాణ వస్తే ఆటలు సాగవనే భయం
- పాత కుట్రలు బద్దలవుతాయని ఆందోళన
- ఇకపై యథేచ్ఛ దోపిడీ సాగదని మనాది
- చిత్తం సొమ్ముపైన.. భక్తి దోపిడీపైన
- సీమాంధ్ర నేతల తెలంగాణ వ్యతిరేకత వెనుక..


చెరుకు రైతుల నోళ్ళు కొడుతున్న తిక్కవరపుఆర్‌ఈసీలో సీమాంధ్ర కలుపు మొక్క కావూరితెలంగాణలో రోడ్ల కాంట్రాక్టర్ రాయపాటితెలంగాణ గుత్తేదారు మేకపాటిలాభాలు ఎత్తుకుపోతున్న టీజీరాష్ట్రం విడిపోతే లగడపాటి నోట్లో మన్నేకాలుష్య రాంకీతో మోదుగుల సయ్యాటభూములు మింగిన జగన్గురుకుల్ కబ్జాకోరు ధర్మాన మందు వ్యాపారి మాగుంట‘పొదుగు’ కోసిన బాబుముంచేటి పోలవరం గుత్తేదారు నామాతెలంగాణనుఅడ్డుకుంటున్నది వీరేసీమాంధ్ర జనం విభజనకు వ్యతిరేకం కాదు.

లగడపాటి సమైక్యతా ‘రాగం’ వెనుక ‘తాళం’ ఏమిటి? సాక్షాత్తూ శ్రీకృష్ణ కమిటీనే మేనేజ్ చేసి సమైక్య సిఫారసు చేయించడానికి తిక్కవరపు ఎందుకు ‘కష్ట’పడ్డారు? టీడీపీ సభ్యుల చేతిలోంచి సమైక్య ప్లకార్డు లాక్కుని మరీ జగన్ పార్లమెంటులో ఎందుకు గొంతెత్తారు? కావూరి హస్తినలో చేస్తున్న సమైక్య తంత్రాంగ మంత్రాంగాల వెనుక దోపిడీ యంత్రాంగం ఏమిటి? మేకపాటికి పోయేదేంటి? టీజీ వెంక కోల్పోయేదేంటి? కాలుష్య భూతం రాంకీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని మోదుగుల ఆందోళన చెందుతున్నారు? చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతి అవతారం ఎందుకు ఎత్తారు? ఇవి కొన్ని ప్రశ్నలు!

లక్షల మంది బహిరంగ సభల్లో జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. మరి.. ఏవీ సీమాంవూధలో వేల మందితోనైనా బహిరంగ సభలు? సమైక్య భావోద్వేగం ఏ స్థాయిలో ఉంది? ఎందుకని గుప్పెడు మందే సమైక్య నినాదంతో గొంతు చించుకుంటున్నారు? జగడాల మారిగా మారి లడాయి పెట్టుకుంటున్నారు? ప్రతి మనిషి మాట వెనుక అతని వర్గ స్వభావం దాగి ఉంటుంది! దశాబ్దాల క్రితమే లెనిన్ చెప్పిన మాట ఇది! ఆ మనుషులు సీమాంధ్ర ప్రజానీకం కాదు.. ఆ వర్గం ఆ ప్రాంత మేధావులో సంఘ సంస్కర్తలో, విద్యాధికులో కానే కాదు.. అది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం. తెలంగాణలో తమ అక్రమ పెట్టుబడుల గోడలు కూలకుండా.. అక్రమార్జనల గుట్టు రట్టవకుండా.. తాపవూతయపడుతున్న ఫక్తు దోపిడీ వర్గం. రాజకీయం ముసుగేసుకుని మురికి కాల్వ మొదలుకుని.. పంట కాల్వ దాకా.. రోడ్లు మొదలుకుని.. భారీ భవంతుల దాకా.. సత్తు రూపాయలు పెట్టుబడులు పెట్టి.. సొత్తు దోచుకుపోతున్న సీమాంధ్ర కుట్ర కుతంవూతాల గుత్తేదారుల వర్గం ఇది.

వ్యాపారమే సుబ్బిరామిడ్డి ప్రయోజనం
శ్రీకృష్ణ కమిటీని ‘ప్రభావితం’ చేయడానికి సాక్షాత్తూ ఆ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ హోం శాఖ కార్యదర్శి వీకే దుగ్గల్‌నే తన ఇంటికి విందుకు ఆహ్వానించిన ఎంపీ తిక్కవరపు సుబ్బిరామిడ్డి సాగర్ కాల్వల కాంట్రాక్టర్‌గా సిమెంట్ కుంభకోణంలో ముద్దాయిగా వార్తల్లోకెక్కి, ఒక అవినీతి పరునిగా ప్రజలకు పరిచయమైన వ్యక్తి. ఈనాడు గాయత్రి సంస్థల యజమానిగా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం రాజకీయ పదవి, సమైక్య రాష్ట్రం ఆయనకు అవసరం. రాజ్యసభకు మరోసారి ఎంపిక కావడానికి సోనియాగాంధీనే ‘ప్రభావితం’ చేసిన సీమాంధ్ర పెద్దమనిషి, గాయత్రీ షుగర్స్ (కామాడ్డి) ద్వారా తెలంగాణలో చెరుకు పండించే రైతుల నోళ్ళు కొడుతున్నది ఈ సుబ్బిరామిడ్డే. చెరుకు మద్దతుధరను పెంచకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను నియంత్రిస్తాడు. చెరుకు ఫ్యాక్టరీల యజమానులతో (సిండికేట్) మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకొని చెరుకు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈయన ఎజెండాలో భాగమే తెలంగాణ వైభవానికి ప్రతీకగా నిలిచే నిజాం షుగర్స్ విధ్వంసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈయనగారి పెత్తనం సాగదు. గాయత్రీ కన్‌ స్ట్రక్షన్స్ ద్వారా తెలంగాణలో రోడ్లు, కాలువల కాంట్రాక్టులలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. అందుకే మీడియాకు ఎక్కకుండానే తెలంగాణను అడ్డుకోవడానికి తనవంతు ప్రయత్నాలను లోలోపల చేస్తున్నాడు.

ఇదీ కావూరి బాగోతం
వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిగా, ఆ తరువాత కాజీపేటలో 70వ దశకంలో చిన్న గుత్తేదారుగా జీవితాన్ని ప్రారంభించిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఒక రాజకీయనాయకుని కూతురును పెళ్ళి చేసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని తెలంగాణలో విస్తరించాడు. ప్రోగ్రెసివ్ కన్‌వూస్టక్షన్స్ పేరుతో తెలంగాణలో ప్రాజెక్ట్‌లు, కాల్వలు, రోడ్డు నిర్మాణ పనుల్లో పలు అక్రమాలకు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పవూతితో పాటు తెలంగాణలో టోల్‌గేట్స్, పలు బినామీ ఆస్తులు ఆయనకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈయన అక్రమాలు వెల్లడవుతాయి. మంత్రులను, అధికారులను లోబర్చుకుని కాంట్రాక్టులు దక్కించుకోవడం కుదరదు. అందుకే తెలంగాణ మాట వింటేనే ఆవేశంతో ఊగిపోతుంటాడు. ప్రజల కోసం ప్రాణమిచ్చిన సూరపనేని జనార్ధన్, ఆజాద్, బాలగోపాల్ వంటి త్యాగధనులకు విద్యనందించిన వరంగల్ ఆర్‌ఈసీ నుండే కలుపుమొక్క వంటి కావూరి ఉత్పత్తికావడం విషాదమే.

తెలంగాణ ‘పొదుగు’ కోసిన బాబు
పై సీమాంధ్ర నేతకు ఏ కారణాలైతే ఉన్నవో తెలంగాణను వ్యతిరేకించడానికి చంద్రబాబుకూ అవే కారణాలున్నాయి. మరికొన్ని అదనంగా కూడా ఉన్నాయి. తన ‘హెరి విస్తరణ కోసం తెలంగాణ పాడి పరిక్షిశమను నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుది. తొమ్మిదేళ్ళ పాలనలో రెండెకరాల ఆసామి వేల కోట్లకు పెరగడానికి ఎన్ని కుంభకోణాలు అవసరమైనవో ఫైళ్ళలో భద్రంగానే ఉన్నది. కాంగ్రెస్-టీడీపీ మధ్య ‘కుంభకోణాల అవగాహన’ ఉన్నందునే చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా వైఎస్ గతంలో హైకోర్టులో దాఖలు చేసిన కేసులన్నీ బేషరతుగా వెనక్కి తీసుకున్నారు. రాజధాని చుట్టూ విస్తరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చంద్రబాబు ‘బినామీ’ వాటాలున్నాయి. నిజాం రాజు భారత సర్కారుకు తలవంచి రాజ్యాన్ని వదులుకున్నప్పుడు ‘స్ఫకాస్’ భూములు లక్షల ఎకరాలను ప్రభుత్వానికిచ్చాడు. దేశంలో ఏ రాజధాని నగరం చుట్టూ లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి లేదు.

ఇప్పటికే సెగ చవి చూసిన జగన్
పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీల చేతుల్లోని ప్లకార్డు తీసుకొని తెలంగాణకు వ్యతిరేకంగా గొంతెత్తిన వైఎస్ జగన్ ఇప్పటికే ఒకసారి తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని రుచి చూశారు. వైఎస్ హయాంలో తెలంగాణ భూములు వేల కోట్ల ముడుపులను వివిధ వ్యాపారాల ద్వారా తీసికొని జగన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సెజ్‌ల పేరుతో విలువైన తెలంగాణ భూముల్లో బినామీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. జగన్ గుట్టు సోనియా కెరుక. సోనియా గుట్టు జగన్ కెరుక.
అందుకే ఒకరిపై మరొకరు ఎంత కోపంగా ఉన్నా తమ లోగుట్టు మాత్రం బయట పెట్టుకోరు. తెలంగాణ వస్తే జగన్ గుట్టు బయటికి రాక తప్పదు. అందుకే తెలంగాణను జగన్ వ్యతిరేకిస్తున్నాడు.

కుట్రల బృందం నాయకుడు
వీళ్లందరికన్న ఒక్కడుగు ముందున్న తెలంగాణ వ్యతిరేకి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. రకరకాల వ్యాపారాల్లో ఈయన భాగస్వామి. తెలంగాణ వస్తే లగడపాటి నోట్లో మన్నే. ల్యాంకో హిల్స్ పేరుతో 700 కోట్లతో భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన భవనాలను నిర్మిస్తున్న లగడపాటి, వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన భూమిని అక్రమ పద్ధతిలో కాజేసిన సంగతి తెలిసిందే. వైఎస్ హయాంలో రెవెన్యూ అధికారులను లోబర్చుకొని రికార్డులను తారుమారు చేసి ‘బాజాప్తా’ కబ్జా చేసి కోట్లు సంపాదించాడు. తెలంగాణ వస్తే ఆ రికార్డులు బయటపడతాయి. బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టంకాక తప్పదు. లగడపాటికి చెందిన అనేక వ్యాపారాలకు, అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే లగడపాటి రగడం, జగడం.


పూర్తి పాఠం: నమస్తే తెలంగాణా

3 comments:

  1. Nenu telangaanaa ki vyathirekini kaadu kaani konni vishayaalu meeku theliya jeppaalani undi.Meeru ikkada gunde ghosha untunna vaaru mariyu KCR "maa baasa yeru gosa yeru" ani untunnaaru. adi meeru serious gaa antunaaraa. meeru choodunri inunri anevi kevalam slang maatrame kadaa. vere bhash yelaa avuthundi. ala slanglo maatladatam tappu kaakapoga chaalaa manchidi kooda. Aithe slang peruto boothulu matladam kooda telangana samskrithi lo oka bhaagamani meeru anukuntunnara. Okappudu KCR sonia gandhi ni bazzaru keedustaa nannadu. oka magadu oka adadaani bazzaru ku yela idustadu. cheyyi pattukunaa, kongu pattukunaa, nadum pattukunaa. A mata vinagane yevadikaina ade anumana msthundani meeku telusa. appude kaadu ippatiki KCR inka ikkada blagulo meeru kooda ade rakam boothulu matladuthunnaru.
    meeru matladae ee boothulu lekapothe telangana slang ante yevriki dvesham ledu.paiga androllu ani meeru vidadisi matladuthunna valladi kooda slang matramae. telugu bhasha lo unnavi moodu slangs- krishna delta slang, telangana slang, rayalseema slang. deni andam daanidae sarigga matladithe. KCR matlade chetta gaani meeru aveshamgaa choodunri ani alavatu chesukunnadi gaani nijamaina slang kaadu. Asalaina language sammanyula daggara undi. Adi kevalam nalugu mukalni athikinchkunte raadu.Alochinchae padhathiki matladae bhaashakoo chaala daggari sambandham undi. Manasuloni alochnalani batti maatlade bhaasha untundi.
    Nenu krishaa zilla vaadinainaa nenu telengaana yerpatuku vyathirekam kaadu. Andhra raashram yerpatu kaalam ninchee idi naluguthoone undi. aa charithra koodaa naaku konchem telusu. Kaabatti nenu personal gaa telengaana yerpatunu nu samardhisthunnanu. gattigaa vidi po dalchkunna vaallani balavantham gaa kalipi unchadam kashtam.kaani vidipovatam valla Yem manchi jaruguthundani meeraunukuntunnaroe adi jaragadu. Oke rtaastram gaa unna ippudu pai sthayilo jaruthunna natakam choosthunnarugaa. govt release chese contractlu, nidhulu anni peddalu vaatalu vesukuntunnaru. ee potilo telangaana lo unna peddalaki velu pettae sandu dorakatam ledu. telangaana vere rashtram gaa unte vaallu monopaly sadhinchavocchu. Ivvala veeravesham to telangaana kosam poraadutunna vaalantha repu adae avathaaram lo meeku kanbadathaaru.
    Ippudu ikkada ala chesthunna vaallu gaani, repu akkada al chesevaallu gani ippatikae kotla ki padaga letthina vaale. Telangana yerpadina yabahi yella tarvatha gooda ikkada gunde ghoahani velibucche vaallki gaani, amayakam ga ahuthi aina usmania students laanti vaallaki gaani vaallu korukunna manchi bathuku raavadam asambhavam.

    ReplyDelete
  2. @Okappudu KCR sonia gandhi ni bazzaru keedustaa nannadu.

    sonia gaandhi oka naayakatvam. aa chotulo magavaallunna ademaataa.

    @govt release chese contractlu, nidhulu anni peddalu vaatalu vesukuntunnaru. ee potilo telangaana lo unna peddalaki velu pettae sandu dorakatam ledu.

    ponle telanganaa vaataa telamganaa peddalni tinaniyyundri. samjaindaa

    ReplyDelete
  3. Ayyaa nenu oka vishayam gurinchi touch chesthae meeru primary thing vodilesi unneccessory things gurinchi naaku JHALAKS ichchae vidhamgaa respond ayyaaru.sonia gandhii meeda naaku Ye vidhamaina gaurava bhaavamooooo ledu.
    public meetings lonoo yekkada badithae akkada meeru maatladutunna bootula gurinchi raasanu. Alaa maatladdamae telangaanaa samskrithi ani mee response yokka indirect meening anukovaalaa memu.
    paigaa chivari maata "ponle telanganaa vaataa telamganaa peddalni tinaniyyundri. samjaindaa" maree idigaa undi. adi yevari sommu?tinaniyyundri ani udaaramgaa anadaniki. daani badulu, aa samgathi memu choosukogalam annaa bagundaedi.
    Ivvaalaa repoo Ee rajeenaama la drama to Yedo jaragabothundani meerantha anukuntunnaru gaani, oka vishayam alochinchandi.TRS modati saari kangress ki support ichchi adhikaaram loki raadaani ki help chesi nappati nunchee kangess ni yentha balopaetham chesinaa tananthata tanu billu dwaaraa telangaana Ivvadaaninki ye maatramoo oppukovadam ledu.
    Paigaa modati nunchee memu Manifestolo SRC gurinchi cheppaamu Adae maa viidhaanam ane maatanunchi Ye matramoo pakkaki jaragakundaa unnaa gaani TRS kangress ni nammuthoonae kangess to ne telangaana vosthundani Yelaa nammuthunnadi? Congess Ippudu Yentha safe position lo undo telusaa? Daaniki oka vela telangaana iste andhra region lo, "kalipi unchadaani ki mem yento kasta paddaamu kaani tappaka vidagottalisi vochchindi" ani cheppukovadaani kee telangaana koste "Choosaraa meru adigaru gabatti vallu yentha addupadinaa pattinchu kokundaa ichchesaam" ani dappaalu kottukovadaaniki veelu undadu billu dwaara telangaana iste! Adi meekoo TRS kee ardham aindo ledo naaku teliyadu.
    Billu pettakundaa raavalante andhra assembly lo Yekaabhi prayam dwaaraane jaragaali.Akkaada khachchitamgaa veegi pothundani meeku telise undochchu! Chandrabaabu meeru arichi ginjukunna telangaana kin anukoolam gaa votu cheyyadu. veyyaka poyinaa tana safety tanaki undi.Yendukante KCR mothati nunchiee tana supportu to laabha paduthunna kangresu tanaki poochika pulla viluva koodaa ivvaka poinaa kangesu ne nammukuni TDP ni badhdha virodhi gaa treat cheyyadam valana. tanani ye matramoo lakshya pettani manishi ki tanu favour cheyyalsina avasarm athadikiledu.
    Tamasha yentante Ivvala CDBMRM AZD iddaroo meeru innella nunchee udyamam chesthunna nirnayam aa rendu paarteelanu battae untundi ani deliberate gaa TDP yokka position gurinchi nokki chepthunnaru. Idi meemu ardham Ayyindaa?
    Telangaana raavadaaniki anta keelakamaina deciding position lo unna parteeni KCR, Inkaa migathaa telangaana poraata vedikaloo Yenduku Yekaakini chesi Veerangaalu vesaaro naaku ardham kaavadam ledu.
    telangaana kosam poraaduthunna meeru tappa anni parteelu vaalla vaalla safe side choosukuni
    nibbaram gaa unnaru.
    kangresu ladhikaarika prakatanni baati vhoosianna poraaduthunna meeru poorthi deciding position lo leru. QUITE UNSAFE POSITION?! Avunna kaadaa?
    Yinta gaa peetamudu unna chota Yenta strategic undaali chese prayatnam. KCR lo gaani Meelo gaani Adi undaa? bahusa KCR tanu TDP nunchi bayati koche time lo NCB to unna godavalu KCR meeda Yemainaa prbhaavitham chesaayaa?Chanakydu yeppudo cheppadu: Kaaryasidhdhi kosam parama pramaada kaari aina shatruvu to gooda maryada gaa snehanni natinchi ainaa vyvahaaram nadupukovadam tappu kaadani.Atla TDP to sambandham lekundaa pani jarupukovaali ane KCR kangrss meeda athi gaa adhaara padataaniki kaaranam kaadaa?Innellu gaa antagaa adhaara padi balopaetham chesinaa atuvaipu nunchi Ye maatramoo help raavadam ledu gadaa...!
    Yenni cheppiana Ee blogu space occupy cheyyadamae tappa Yemundi? Nenu Votu chese position lo - ante - MLA gaa undi SRC situation lo naa votu telangaana ki yes kaa no kaa unte nenu yes ke votu vesthanu.
    yenduko telusaa, Nenu saamarasyam gaa oka manchi slahaa iste naake jhalak lichche mee lanti vaalla to kalisundadam kastam kaabatti.

    ReplyDelete