Friday, July 22, 2011

యాదిరెడ్డీ, నీకు నా ఉద్యమాంజలి

ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కనీ వినీ ఎరగని విధంగా తెలంగాణా ఉద్యమంలో ఆత్మహత్యలు ఒక పోరాట రూపాన్ని సంతరించు కోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇతరుల ప్రాణాలు తీయడం కన్నా తనను తానూ ఆత్మాహుతి చేసుకోవడానికి ఎక్కువ తెగువ అవసరం. తన ప్రాణాన్ని తృణప్రాయంగా తలచిన వాడు ఏమైనా చేయగలడు. కాని తెలంగాణా పోరు బిడ్డలు తమ ప్రాణ త్యాగాల ద్వారా వారి ప్రఘాఢమైన ఆకాంక్షను ప్రపంచానికి తెలియబరుస్తున్నారు తప్ప చీమకు కూడా హాని తలపెట్టడం లేదు.

పరిస్థితులు ఇలా వుంటే సీమాంధ్ర మీడియా మాత్రం ప్రతీరోజూ తెలంగాణా వాదులు నరుకుతున్నట్టుగా, చంపుతున్నట్టుగా అసత్య ప్రచారాలు చేస్తుంది. ఎప్పుడో ఎవరో ఆవేశంలో ఏదో మీటింగులో ఏదో అనడం అంతటా జరిగేదే. సమైక్యాంధ్ర వాదం చేసే పయ్యావుల ఆత్మాహుతి దాడుల గురించి మాట్లాడినపుడు తెలంగాణా వారు ఎప్పుడో 'జాగో భాగో' అని అన్న దాన్ని మరిచి పోకుండా దాదాపు ప్రతి రోజూ, ప్రతి సీమాధ్ర మీడియాలోనూ చర్విత చర్వనంగా ప్రచారం చేస్తుంటారు.

ఈ పక్షపాత మీడియా మాయాజాలంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వ సీమాంద్ర పక్షపాతంతో, తెలంగాణా ప్రజా ప్రతినిధుల అలసత్వంలో, సీమాంధ్ర నాయకుల కుతంత్రాల మధ్యన, కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం నేపథ్యంలో మరో తెలంగాణా బిడ్డ నేల రాలాడు. తన గొంతు డిల్లీలో వినిపించడానికి డిల్లీ వెళ్లి మరీ ఉరిపోసుకుని చనిపోయాడు. 

ఎక్కడో న్యూయార్కులోనో, ఆస్ట్రేలియాలోనో ఎవడైనా తెలుగోడు చనిపోతే పుంఖాను పుంఖాలుగా ప్రసారాలు చేసే సీమంధ్ర మీడియా కనీసం యాదిరెడ్డి మరణ వాంగ్మూలాన్ని, దానిలోని వివరాలను ప్రసారం చేసిన పాపాన పోలేదు. తన ఉత్తరంలో తెలంగాణా ద్రోహులని తన పది పేజీల లేఖలో పేరు పేరునా ఉదాహరించిన యాదిరెడ్డిది, ఏదో సాదా సీదా ఆత్మహత్య అని ఎలా అనుకోగలం?

యాదిరెడ్డి మరణం, డిల్లీని ప్రభావితం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయని కుట్రలేదు. ఆంధ్ర ప్రదేశ్ భావంలో యాదిరెడ్డి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిద్దామనే తెలంగాణా వాదుల, ప్రజా ప్రతినిధుల ఆలోచనలకు విరుద్ధంగా చకచకా పావులు కదిపింది. ఏపీ భవన్లో ఉన్న చందర్రావు అనే సీమాంధ్ర తైనాతీతో గలీజు ఉత్తరం ఒకటి రాయించింది. పోస్టుమార్టం చేసిన ఆస్పత్రి నుంచి కనీసం అక్కడున్న ఎంపీలకు, మంత్రులకు కూడా తెలియకుండా ఎకాఎకీ స్మశానానికి తరలించమనే దాని సారాంశం.

దొంగల్లాగా భౌతిక కాయాన్ని స్వంత ఊరు పెద్దమంగళారం తలలించారు. ఆ సమయంలో శంషాబాద్ ప్రాంతం అంటా కరెంటు తీసేశారు. 

తెలంగాణా వాదాన్ని, తెలంగాణా వాదులను చూసి ఇంత అదురుకునే ఈ సమైక్యవాద ప్రభుత్వం ఇంకేన్నాల్లో నిలబడే అవకాశం గాని, అర్హత గాని ఇంకెంతమాత్రం లేదు.

యాదిరెడ్డీ, నీ త్యాగం ఊరికే పోదు. తెలంగాణా రాష్ట్రం వచ్చి తీరుతుంది.


10 comments:

  1. చాలా బాధాకరమైన వార్త. లాడాయి చేసి పోరాడి సాధించుకోవాల్సిన యువకుడు ఆత్మబలిదానం చేసుకునే పరిస్థితిని తీసుకువచ్చిన సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. నవనాగరికమనేది కట్టేబట్టకి ఉండేఇంటికేగానీ మనసు మాత్రం అనాగరికపు అచ్చాదనే కోరుకుంటుందని అర్ధమవుతుంది.

    #యాదిరేడ్డీ, నీ త్యాగం ఊరికే పోదు. తెలంగాణా రాష్ట్రం వచ్చి తీరుతుంది.

    తీరాలి..ఖచ్చితంగా..!

    ReplyDelete
  2. నిన్న ఎ.పి భవన్ లో జరిగినది కే.సి.ఆర్ కుటుంబ సభ్యుల నిజ జీవితానికి నిదర్శనం. తెలంగాణా ఉద్యమ ముసుగులో వీరు సాగిస్తున్న చందాల దండలకు నిన్నటి సంఘటన నిదర్శనం. వీళ్ళు తెలంగాణకోసం ఢిల్లీ వెళ్ళలేదు శవరాజకీయాలు చేయటానికి వెళ్లారు. వీళ్ళు తెలంగాణా కోసం పోరాడే వాళ్ళయితే, నిన్నటి ఉపఎన్నికలలో ఆత్మ హత్యలు చేసుకున్న కుటుంబాలకు టికెట్ ఇయ్యండి అంటే ఎ ఒక్కరు చేవినకుడా వేసుకోలేదు. వీళ్ళా తెలంగాణా కోసం పోరాడేది. వీళ్ళా తెలంగాణాను అభివృద్ధి చేసేది. రేపు విభజన జరిగితే ఇటువంటి వాళ్ళ పాలనే తెలంగాణాలో ఉంటుంది. కళ్ళు తెరవండి తెలంగాణా వాదులరా.

    ReplyDelete
  3. నిన్న ఎ.పి భవన్ లో జరిగినది కే.సి.ఆర్ కుటుంబ సభ్యుల నిజ జీవితానికి నిదర్శనం. తెలంగాణా ఉద్యమ ముసుగులో వీరు సాగిస్తున్న చందాల దండలకు నిన్నటి సంఘటన నిదర్శనం. వీళ్ళు తెలంగాణకోసం ఢిల్లీ వెళ్ళలేదు శవరాజకీయాలు చేయటానికి వెళ్లారు. వీళ్ళు తెలంగాణా కోసం పోరాడే వాళ్ళయితే, నిన్నటి ఉపఎన్నికలలో ఆత్మ హత్యలు చేసుకున్న కుటుంబాలకు టికెట్ ఇయ్యండి అంటే ఎ ఒక్కరు చేవినకుడా వేసుకోలేదు. వీళ్ళా తెలంగాణా కోసం పోరాడేది. వీళ్ళా తెలంగాణాను అభివృద్ధి చేసేది. రేపు విభజన జరిగితే ఇటువంటి వాళ్ళ పాలనే తెలంగాణాలో ఉంటుంది. కళ్ళు తెరవండి తెలంగాణా వాదులరా.

    ReplyDelete
  4. @kruti

    KCR మిగతా అందరిలానే ఒక రాజకీయ నాయకుడు. ఒక లగడపాటి, ఒక పయ్యావుల, ఒక చంద్రబాబు, ఒక రాజషేఖర్ రెడ్డి, ఒక చంద్రబాబు, ఒక పొన్నం ప్రభాకర్... వీళ్ళందరికి ప్రజల మీద ఎంత నిబధ్ధత వుందో కేసీయార్‌కి కూడా అంతే వుంది.

    ప్రజల్లో తెలంగాణా ఉద్యమం వుంది కాబట్టే KCR ఉద్యమంలో వున్నాడు. లేకపోతే ఆయన ఏ కాంగ్రేసులోనో, TDPలోనో చేరే వాడు.

    అయితే తెలంగాణా వుద్యమంలో KCR పాత్రని కూడా తీసి పారవేయలేం. ఒక కంపెనీలో పని చేసే ఉద్యోగి తన జీతం తీసుకుంటూనే కంపెనీ అభివృధ్ధికి ఎలా తోడ్పడతాడో, KCRకి ఉద్యమంతో వుండే సంబంధం కూడా అలాంటిదే.

    తెలంగాణా రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం KCR మాత్రమే పరిపాలిస్తాడనుకుంటే అది మీ అఙ్ఞానం మాత్రమే. అందరిలానే ఎన్నికల్లో పోటీ చేయాలి. అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా ఎన్నుకుంటారో ఇక్కడా అలాగే ఎన్నుకుంటారు.

    కాకపోతే విభజన జరగడం వల్ల వచ్చే ముఖ్యమంత్రి కేవలం తెలంగణా అభివృధ్ధి కోసమే నిర్ణయాలు తీసుకో గలుగుతాడు (అందులో తన కమీషన్లపై ఆశ ఉన్నా సరే). కాబట్టి మీరు కష్టపడి మా కళ్ళు తెరిపించడానికి ప్రయత్నించ నవసరం లేదు. మా కళ్ళు తెరిచే వున్నాయి. ఎవరు ఎలాంటి వాళ్ళో చూస్తూనే వుంటాయి.

    ReplyDelete
  5. Chary .. i think now Kriti eyes are open

    ReplyDelete
  6. దొరక్క.. దొరక్క .. దొరికింది ఓ శవం.. అదీ దేశ రాజధాని నడి బొడ్డున.. మధ్యలో ఈ లొల్లి.. మా శవరాజకీయాలకి అడ్డొస్తే అడ్డంగా నరుకుతాం...

    ReplyDelete
  7. @voleti

    శవరాజకీయాలు చేసేది, చేస్తున్నది ఎవరో మా నోటితో ఎందుకు జెప్పిస్తవ్? ఏదాడి నుండి చూస్తనే వున్నం గద.

    ReplyDelete
  8. @kruthi & @voleti:

    Your comments can be considered if you had expressed regret for the loss of an innocent life. No, your గలీజ్ తెగులు నల్లి & stupid statues are more important to you.

    How can you preach "unity" when you can not even hide your glee at an opportunity to bash Telangana at a tragic news?

    ReplyDelete