సమైక్య వాదులు చేసే వాదనలు చాలా విచిత్రంగా వుంటాయి. ఏదో చిన్న పాయింటు దొరగ్గానే దాని పట్టుకుని వేళ్ళాడడం, అది చివరకంటా నిలబడక పోయే సరికి పలాయనం చిత్తగించడం లేదా, ఇంకో పాయింటు వెతకడం వారికి పరిపాటి. ఇలాంటి వారికి సమాధానాలు చెప్పడం కూడా సమయం వృధా చేసుకోవడం తప్ప మరో ప్రయోజనం లేదు. కాని ఈ వితండవాదులు కనపడ్డ ప్రతి చోటా ఇలాంటి వ్యాఖ్యలు కుమ్మరించడంతో అమాయకులైన జనాలు కూడా మోసపోయే అవకాశం వుంది. వారికోసమే ఈ వివరణ.
గత పది సంవత్సరాలుగా అడపా దడపాగా, గత రెండు సంవత్సరాలుగా మాత్రం వీరు విరివిగా చేసే వాదన ఇది. అదేమంటే కెసిఆర్ కి తెలంగాణా రావడం ఇష్టం లేదు. ఆయనదంతా రాజకీయంతో పబ్బం గడుపుకోవడానికి ఆడే నాటకం. అసలు కేంద్రం తెలంగాణా ఇస్తానన్నా కూడా కెసిఆర్ ఇవ్వనివ్వడు. ఎందుకంటే అది ఇస్తే ఇక ఆయనకు పని ఆదాయం లేకుండా పోతుంది. ఇలాంటివి.
కెసిఆర్ తెలంగాణా రానివ్వక పొతే వీళ్ళకు బాధెందుకు? వీల్లకేమైనా తెలంగాణా రావాలనే కోరిక ఏమైనా ఉందా? మరి తెలంగాణా రాక వీరికీ బాధలేదు, కెసిఆర్ కీ బాధలేదు. మరి వీరికేందుకు కెసిఆర్ మీద కోపం? ఈ ప్రశ్నలకు వీరిదగ్గర సమాధానం వుండదు.
సరే తెలంగాణా ప్రజలు మోసపోతున్నారు అని వీరి బాధ అనుకుందాం. యాభై ఏళ్ళ చరిత్ర చూసినవాడెవ్వడూ వీళ్ళకి అలాంటి బాధ ఉంటుందని అనుకోడు. సరే, మాటవరసకు వుందే అనుకుందాం. మరి తెలుగుదేశం, కాంగ్రెస్ తెలంగాణా సాధించేది మేమే అని మానిఫెస్టోలలో పెట్టి జనాన్ని ఊదరగొట్టి వోట్లు దండుకున్నప్పుడు వారికి ప్రజలను మోసం చేస్తున్నారన్న స్పృహ కలుగలేదేం? అంటే వారు మోసం చేయడం లేదు, నిజమే చెప్తున్నారని వీరి ఉద్దేశ్యమా? ఒకవేళ నిజమే చెప్తున్నారు అని వీరనుకొన్నారు అనుకుందాం. మరి అప్పుడు రాష్ట్రాన్ని విడగోడుతున్నందుకు వీరికీ ఏ బాధా కలుగలేదే? కలుగలేదనే దానికి ప్రబల సాక్ష్యం ఎన్నికల ఫలితాలే.
ప్రత్యేకరాష్ట్రం హామీ ఇచ్చిన పార్టీలన్నిటికీ అక్కడా సీట్లు వచ్చాయి. అంటే జనం వీరు చెప్పే విషయాలు నమ్మలేదని అయినా అనుకోవాలి. లేదా అక్కడి జనానికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం పట్ల అభ్యంతరం లేదనైనా అనుకోవాలి. కాబట్టి వారిది తెలంగాణా పై సానుభూతి కాదనో, లేక వారి ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం పట్ల వ్యతిరేకత లేదనో రెండింటిలో ఒకటి నిజమని ఒప్పుకోక తప్పదు.
వారిది సానుభూతి కాదని ఒప్పుకున్నట్టైతే మరి కెసిఆర్ తెలంగాణా వారిని ఏదో మోసం చేస్తున్నాడని కురిపించే జాలి క్రుత్రిమమైనదే నని కూడా ఒప్పుకోవలసి వస్తుంది. అంటే తెలంగాణా కోసం పోరాడే వారిని ఏదో ఒకటి చెప్పి బురద చల్లదమే వారి ధ్యేయమని కూడా ఒప్పుకోవలసి వస్తుంది.
ఇక కెసిఆర్ పై వీరి ఆరోపణల విషయానికి వస్తే, తెలంగాణా ప్రజలు మునుపటిలా అమాయకులు ఎంతమాత్రం కారు. ఒక వేళ కెసిఆర్ తెలంగాణావాదం విడిచి ఒక అంగుళం పక్కకు జరిగాడని తెలంగాణా ప్రజలకు ఏమాత్రం అనిపించినా ఆయన్ని చెత్తకుండీలో వేసి ముందుకు పోగల సామర్థ్యం వుంది. దానికి నాయకత్వం వహించడానికి ఇప్పటికే అనేక సంస్థలు ముందుకు నడుస్తున్నాయి. ఇప్పుడు కెసిఆర్ అయినా, గద్దరైనా, బీజేపీ అయినా ప్రజలు నిర్దేశించిన బాటలో వెళ్ళ వలసిందే తప్ప, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఎవరు విరుద్ధంగా చెప్పినా వినే పరిస్థితిలో వారు లేరు. ఆ విషయంలో మన గౌరవనీయ సమైక్యవాద మేధావులు బాధపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు.
Well said Srikanth
ReplyDeleteGood Srikanth,
ReplyDeleteKeep it up,
U will get support at every level.
Sridhar
correct said
ReplyDeleteకాంగ్రెస్‌వాళ్ళకి తెలంగాణా ఇవ్వడం ఇష్టం లేదనీ, వాళ్ళు ప్రజలని ఫూల్ చెయ్యడానికి అలా అంటున్నారనీ సమైక్యవాదులకి తెలుసు. కాంగ్రెస్‌వాళ్ళు తెలంగాణా ఇస్తామని విజయవాడలో ప్రచారం చేసినా సమైక్యవాదులలో ఎక్కువ మంది కాంగ్రెస్‌కే వోట్ వేస్తారు. కాంగ్రెస్ మోసగాళ్ళ పార్టీ అని సమైక్యవాదులకి బాగా తెలుసు.
ReplyDelete>>కెసిఆర్ తెలంగాణా రానివ్వక పొతే వీళ్ళకు బాధెందుకు? వీల్లకేమైనా తెలంగాణా రావాలనే కోరిక ఏమైనా ఉందా? మరి తెలంగాణా రాక వీరికీ బాధలేదు, కెసిఆర్ కీ బాధలేదు. మరి వీరికేందుకు కెసిఆర్ మీద కోపం? ఈ ప్రశ్నలకు వీరిదగ్గర సమాధానం వుండదు.
ReplyDeletekani ayana chese udamam vallane kada rastrm chala nastapoyindi meere annaru e udyamam lonaina konni kastalu tappavani at the same time so many think these are due to KCR only
If KCR fights politically no problem even for the samaikyandra people But KCR fights in different way .He Make bandhs He Scolds andhra people and MLAs He demands Resigns from MLA and MPs .He support Polavarm Tendar autherties at the same time he opposes Polavaram tenders(but this fellow 10 out of 46) evaridhi dollatanamo nenu gee gurinchi choosanu oka bloglo sama danam cheppaleni gundegosa ani meeru vaatini delete chesinappude telisindi evarido dolla ani
by the by i am not the telangana opposer
but the tangana demand is not passes in a right way (that means by scolding andhra people)
if KCR wins 80 seats who stops him..?
@krishna,
ReplyDeleteif you come out of bias and see impartially, you will note that the 10 years of telangana movement led by KCR is much more peaceful than any other movement of the same magnitude. See what happened in 15 day samaikyandhra movement and howmuch property damaged. Look at the violent Pratyekandhra movement led by Neelam Sanjeevareddy & Co at the following links.
http://kotiratanalu.blogspot.com/2011/10/blog-post.html
http://kotiratanalu.blogspot.com/2011/10/2.html
Even in non-violent independence struggle led by Gandhi, 23 policemen were killed at chouri choura.
http://en.wikipedia.org/wiki/Chauri_Chaura
The movement has sustained this far, only because of its non-violent nature. Otherwise it would have suppressed by deploying Indian army without mercy like it has been done in 1969 and 72.
Regarding MLAs:
Yes this time not 80 but KCR will win more than 100 if elections are conducted in AP. That is the main reason why Chandrababu Naidu, Kiran Kumar Reddy who are known to be opposite poles are colluded together and nurchuring the minority state government to run.
వీల్లకేమైనా తెలంగాణా రావాలనే కోరిక ఏమైనా ఉందా? మరి తెలంగాణా రాక వీరికీ బాధలేదు, కెసిఆర్ కీ బాధలేదు. మరి వీరికేందుకు కెసిఆర్ మీద కోపం? .....aa maatraam ardham kaalEdaa naayanaa ...raastraanni udyamam peruto naasanam chestunnadannade andari baadaa....
ReplyDelete>>That is the main reason why Chandrababu Naidu, Kiran Kumar Reddy who are known to be opposite poles are colluded together and nurchuring the minority state government to run.
ReplyDeleteYou cant say like that because do you know fully..? that to no need for babu KCR also can place no confidence with jagan
but why is KCR is shaking hands with Kiran
Meeru enni cheppina KCR chestundi Right kaadu (Talangana gurimchikadu atani poratam gurinchi) chinna example He demands resignation from MLAs and MPs. is it fine ok if it is fine why he participated in elections again
Example is Bansuwada pocharam resigns from TDP and Elected from TRS
If pocharam didnt make resign they ask for resign if politisians resigns they took them to their party and win the elections
that means KCR knows he cant win in elections if he come in a proper way so he
asks took powerfull people from other party if they dont accept he scolds them and asks them to resign and if they dont do he says they are telangana opposers
Is it a democracy or some else
apeyha neesollu KCR ee 10 years lo telangana movement tappa telanganaki em chesadu vache parisramalu poottadam tappa.
I am not opposing telangana but i strongly opposing KCR
he is not correct for telangana
but in your blog sollu ekkuva undi KCR gurimchi
>>Yes this time not 80 but KCR will win more than 100 if elections are conducted in AP
This will be the god try for that not like taking other leaders by a crusial way
anna pani jarigedi choodandanna ante kaani raastranni naasanam chesedi kaadu
ReplyDelete@krishna,
ReplyDeleteFirst you have to understand that I am a Telangana vadi, not a KCR vadi or follower of any other person. I don't say or never said that KCR is 100% allright. But so far the things are proved that KCR is only working towards achieving Telangana. He may have his own ambitions in doing that. But that does not deter me to support him as long as he works for T issue. I support whoever working for the cause of Telangana. Once Telangana is achieved, things will be different. Hope this clarifies the issue.
Telangana Enduku Kavali Telangana Prajalu abivruddi chendam gurimchi kaavali
ReplyDeleteTelangana vaallaki udyogala kosam kaavali
Telangana projects gurimchikaavali
Palamooru valasalu agipovadam gurimchikavali
Nalgonda Floride povadam gurimchikavali
Kaani KCR veetilo denigurimchi ayinaa poradada Rastram Raavachu raakapovachu kaani vachina raakunna ivi pariskaram kavali kani entasepu nenu paina cheppinavi tappa ivi cheyyaru adgaru
Once upon a time my Teacher asked a question Why lalu prasad failed as a CM even he elected many times but succeded as Railway minister?
Exactly idont know the answer at that time but my teacher clarified me
because in Bihar if people are developed and litarate the people will know who is right and who is wrong then he cant continue his dramas so he didnt develop Bihar But as a railway minister the situation is different he cant do he diffenetly out.
The same thing applies to KCR if telangana develop no option to KCR if not There is Option for KCR to fight and Ask like above my comment
Why dont you demanding Elections On this Issue in Telangana If 80%(due to we cant change latter if atleast 70% is must) peole Agree for that we have to fight for separation of Andhra and Telangana if not we have to unite.But Why Bundh and Diksha and Breaking Busses
ReplyDelete