ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత రెడ్డి వాళ్ళని వరుసబెట్టి వందల తిట్లు తిట్టినా పట్టించుకోరు.
కేశవరావు ఇంగ్లీషో, తెలుగో అర్థం కాకుండా తిట్టినా పట్టించుకోరు.
కాని KCR అనంగనే అగ్గిమీద గుగ్గిలమైతరు.
ఆయన చెన్నారెడ్డిలా సమైక్యవాదులకు అమ్ముడుపోయి తెలంగాణావాదాన్ని సోనియాకి తాకట్టు పెట్టలేదు.
దేవేందర్ గౌడ్ లా జావగారి పోయే రకంగాదు.
ఎర్రబెల్లిలా సమైక్యవాదుల కాళ్ళు మొక్కుతూ కుక్కలా పడుండే రకంగాదు.
ఎందుకంటే సమైక్యవాదుల హేళనలకు, దూషణలకు అంతకు రెండింతలు జవాబిస్తడు, మంచో చెడో.
ఎందుకంటే ఎప్పటికప్పుడు సమైక్యవాదుల ఎత్తులకు పై ఎత్తులేస్తుంటడు. అట్లనే కాంగ్రెస్ ను 2004 ల కమిట్ చేసిండు. చంద్రబాబును 2009 ల కమిట్ చేసిండు. ఇప్పుడు అందరు కలిసి రాజీనామాలు చేసేటట్టు కమిట్ చేసిండు. ఇది వారికి అస్సలు మింగుడుపడని విషయం.
ఎందుకంటే ఓడిపోతే కుంగిపోడు. కిందపడ్డ బంతిలెక్క అంతకు రెండింతలు పైకి లేస్తడు.
మాటలు తూటాల్లెక్క పేలుస్తడు. జనాన్ని అద్భుతంగ ఆకర్షిస్తడు. రెండు మూడు గంటలు అనర్ఘళంగ మాట్లాడగలడు. ఇప్పుడు రాష్ట్రంల ఆవిధంగా మాట్లాడే దమ్మున్న లీడరు ఒక్కడు గూడ లేడు. ఇది సీమాంధ్రులు కూడా ఒప్పుకునే విషయం.
ఇవ్వన్ని ఉన్నాయి కాబట్టి ఆయన తెలంగాణా ఎప్పటికైనా తెస్తడేమోననే బెంగ వారికి, అందుకే పడదు.
Update: కేసీయార్ తిడతాడని చెప్పే వారంతా తిట్లలో ఆయన్నే మించిపోవడం ఈమధ్య చూస్తున్న సంగతి!
hmm..You have more than a point :)
ReplyDeleteKCR was the creation of YSR and Sonia. As long as KCR acts like a extension of Congress, it is difficult to realize Telangana.
ReplyDeleteThe movement KCR served his ties with Congress, you get Telangana.
Closely follow all the moves of KCR, you come to know that he is acting on behalf of Sonia (YSR) and Congress.
All the best for Telangana.
కాయలు ఉన్న చింత చెట్టు మీదకే రాళ్ళు విసురుతారు కానీ కాయలు లేని చెట్టు మీదకి రాళ్ళు విసరరు కదా.
ReplyDeleteకచరా అంటే కోపం కంటే అసహ్యం, జుగుప్స
ReplyDelete@Weekend Politician
ReplyDeleteThanks for the comment.
@Anonymous July 26, 2011 6:17 AM
Then the so called samaikyavadis should love him, but see, they are not.
@Praveen Sarma
ఒక్క మాటలో చెప్పారు.
@Anonymous July 26, 2011 6:27 AM
Reasons already known...
bayya, no sane person will believe kcr words, you people please dont beleive kcr or kodanda ram.clearly it is visible that they are deceiving you, your telengana can't be achieved by these two.they are just like pak, who always looks at india,to divert the attention of their internal trouble.these politicians always blame innocent andhra people for their political gains.
ReplyDelete@Anonymous July 26, 2011 7:35 AM
ReplyDeleteDon't worry my dear anon. We are not blindly believing anyone. Our goal is Telangana state. Whoever works for that, we support.
Maaku KCR meeda chala lovvu..Indukee annai
ReplyDeletehttp://www.youtube.com/watch?v=AKHrjvUr9bs&feature=player_embedded#at=472
అంత గుడ్డిగా నమ్మేది ఈ ప్రాంతం వాళ్ళు కాదు. నాయకులూ లేదా సిని హీరోలు అవినీతి చేసినా, హత్యా యత్నం చేసినా అభిమానం మాత్రం తగ్గదు అక్కడ. అలాంటివారు ఇక్కడ చాల తక్కువ. వ్యక్తి పూజ అసలు లేదు.
ReplyDeleteఈ నాయకుడి తపన తెలుసుకోడానికి దాదాపు దశాబ్దం పట్టింది. ఇక తమ(on anonymous comment) జుగుప్స కు, వాంతి కి కారణం- పై వ్యాసం లోనే చక్కగా వివరించి ఉంది
dear sreekanthachari i have a question:
ReplyDeletewhy do you support mr.kcr(the number one fraud in a.p)though he's not been doing anything to telangana region?
Found interesting!
ReplyDeletehttp://tinyurl.com/3j9dxuf
@ramu,
ReplyDeleteHow did you conclude that I support him for everything. My support is issue based.
But if you are talking about fraudulence, You have to put the names of Rajashekhar Reddy, CBN, Botcha, Lagadapati, Kavuri, Jagan and a thousand more names before his.
కేసీయార్ తిడతాడని చెప్పే వారంతా తిట్లలో ఆయన్నే మించిపోవడం ఈమధ్య చూస్తున్న సంగతి!
ReplyDeleteYes It is quite correct.
They all are Hippocrates. Culture less , undemocratic bruits.
ఒకసారి,కట్టిన తెలంగాణావాది(ఎవరో మీకు తెలుసు.ఇక్కడ వ్యక్తిగత ప్రస్తావన ముఖ్యం కాదు) ఒక T.V.ఇంటర్వూ లో ఇలా అన్నాడు."1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు"అని.
ReplyDeleteనిజానికి 1956 నవంబర్ 1 కి ముందు తెలంగాణా రాష్ట్ర మనేది ఏదీ లేదు.నిజాం పాలన లో "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం" 1948 సెప్టెంబర్ 17 పోలీస్ చర్య తరువాత ఇండియన్ యూనియన్ లో విలీనమైంది.అప్పటి నుండి 1956 నవంబర్ 1 న భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవరకు హైదరాబాద్ ఒక రాష్ట్రంగా కొనసాగింది. అప్పటి "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం"లో "8 జిల్లాలు గల తెలంగాణా ప్రాంతం(తరువాత 1978 లో రంగారెడ్డి,హైదరాబాద్ 9,10 వ జిల్లాలుగా ఏర్పడ్డాయి)" ఒక భాగం మాత్రమే.విలీనం తరువాత 1950 వరకు జనరల్ J.N.Chowdary సైనిక పాలన కొనసాగింది.తరువాత హైదరాబాద్ రాష్ట్ర తాత్కాలిక Civil Administrator గా M.K.Vellodi 1950 జనవరి 26 న భారత ప్రభుత్వం చే నియమింపబడ్డారు.1952 లో తొలి సారత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు గల హైదరాబాద్ రాష్ట్రం లో 93 సీట్లు గెల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ,బూర్గుల రామకృష్ణా రావు CM గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.1955 లో 1st State Reorganisation Commission హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కన్నడం మాట్లాడే 3 జిల్లాలని కర్ణాటక లో,మరాఠా మాట్లాడే 5 జిల్లాలని మహరాష్ట్ర లో కలిపి మిగిలిన "8 జిల్లాలు గా గల తెలంగాణా ప్రాంతాన్ని" ప్రత్యేక రాష్ట్రంగా గాని లేక అప్పటికే ఒక రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో గాని కలపవచ్చు అని సిఫార్సు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోసం కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణం లో తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం పక్కనే తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రం చేయడంలో అర్థం లేదు.అలాగని అప్రజాస్వామికంగా కలుపలేరు కాబట్టి 1955 డిసెంబర్ లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పెట్టగా హాజరైన 147 మందిలో 103 మంది తెలంగాణాను ఆంధ్ర రాష్ట్రం లో కలుపమని, 29 మంది వద్దని వాదించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు.ఆ తరువాత కూడా తెలంగాణావాసుల అపోహలు తీరుస్తూ 1956 ఫిబ్రవరి 20 న పెద్దమనుషుల ఒప్పందం(Gentlemen's Agreement ) చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా కు ప్రత్యేక హక్కులు,రాయితీలు కల్పిస్తామని ఆంధ్రనాయకులు హామీ ఇచ్చారు.దాంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆ "8 జిల్లాల తెలంగాణా ",ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడానికి మార్గం సుగమమైంది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసారు.
ఔరంగాబాద్,బీడ్,నాందేడ్, పర్భాని ,ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలను మహరాష్ట్ర లో(అప్పటికి దాన్ని బోంబే రాష్ట్రం అనేవారు) కలిపారు.
బీదర్,గుల్బర్గా,రాయచూర్ అనే 3 జిల్లాలను కర్ణాటక లో కలిపారు.
"మిగిలిన 8 జిల్లాల తెలంగాణా"ను అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిపి 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు.పై మార్పులన్నీఒకేసారి చేసారు.కాబట్టి తెలంగాణాను హైదరాబాద్ రాష్ట్రం నుండి వేరు చేయడం, ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం రెండూ ఒకేసారి జరిగాయి.అంటే కనీసం ఒక్క రోజు కూడా తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గాని,కనీసం ప్రత్యేక పరిపాలనా విభాగం గా గాని చరిత్ర లో ఎప్పుడూ లేదు.మరి ఇప్పుడు తెలంగాణావాదులు అన్నట్టు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం"ఒక్క ఇంచ్ కూడా" కోల్పోకుండా కావాలంటే మహరాష్ట్ర ని, కర్ణాటక ని కూడా అడగాలి.అడిగితే బాగుండేది వాళ్ళని "ఒక్క ఇంచ్ కోల్పోకుండా కావాలని ".అప్పుడు ఒక్క పంచ్ కూడా వేస్ట్ అవకుండా కుమ్మేస్తారు వాళ్ళు.అసలే ఆ రాజ్ ధాకరే మంచోడు కాదు
truth teller
ReplyDeleteపేరు ఏది పెట్టుకున్నా మీరు చెప్పేది half-truth అని చెప్పక తప్పదు.
---"1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు"
ఎక్కడ ఎవరన్నారో, ఏ కాంటెక్స్ట్ లో అన్నారో ఎందుకు చెప్పరు? చెప్పినాయన ఉద్దేశం 1956 అక్టోబర్ 2 కి ముందు ఆంధ్రాలో కలిసిన తెలుగు భాగం (అదీ షరతులతో) విడిపోతామని చెప్తున్నాం. అయినా ఒక రాష్ట్రం ఏర్పాటు జరగాలంటే ఇంతకు ముందు ఆ రాష్ట్రం వుండి వుండాలా? మరి ఇంతకు ముందు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా వుందని మీరు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం మద్రాసుతో పోరాటం చేశారు?
---1955 లో 1st State Reorganisation Commission హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కన్నడం మాట్లాడే 3 జిల్లాలని కర్ణాటక లో,మరాఠా మాట్లాడే 5 జిల్లాలని మహరాష్ట్ర లో కలిపి మిగిలిన "8 జిల్లాలు గా గల తెలంగాణా ప్రాంతాన్ని" ప్రత్యేక రాష్ట్రంగా గాని లేక అప్పటికే ఒక రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో గాని కలపవచ్చు అని సిఫార్సు చేసింది.
సగమే నిజం. 1st SRC 1962 వరకు తెలంగాణా రాష్ట్రాన్ని కొనసాగించి, ఆ రాష్ట్ర అసెంబ్లీలొ 75% ఎమ్మెల్యేలు ఆంధ్రాతో కలవడానికి ఒప్పుకుంటే మాత్రమే రెందు రాష్ట్రాలను కలపాలని స్పష్టంగా చెప్పింది. కాని లాబీయింగులో ఆరితేరిన ఆంధ్రా వారు అప్పటి హైదరాబాదు రాష్ట్రపు ఎమ్మెల్యేలని ప్రభావితం చేశారు. నిజానికి తెలంగాణా భవితవ్యం తెల్చే హక్కు మరాఠా, కర్నాటక సభ్యులు కలిగిన హైదరాబాదు అసెంబ్లీకి ఎంతమాత్రం లేదు. తెలంగాణా ఆంధ్రాలో కలపాలా వద్దా నిర్ణయించే హక్కు 1962 లో ఏర్పడబోయే తెలంగాణా అసెంబ్లీకి మాత్రమే వుంది. 1962లో ఏర్పడబోయే అసెంబ్లీ ఈ దుష్ట కలయికకు ఎంతమాత్రం ఒప్పుకోదనే ఆలోచనతోనే అప్పటి రాజకీయ శక్తులు పెద్దమనుశుల ఒప్పందం నాటకం ఆడాయన్నది సుస్పష్టం.
---ఆ తరువాత కూడా తెలంగాణావాసుల అపోహలు తీరుస్తూ 1956 ఫిబ్రవరి 20 న పెద్దమనుషుల ఒప్పందం(Gentlemen's Agreement ) చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా కు ప్రత్యేక హక్కులు,రాయితీలు కల్పిస్తామని ఆంధ్రనాయకులు హామీ ఇచ్చారు.
అంతటి హామీలు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో, (తర్వాత తుంగలో తొక్కిన విషయం సరేసరి) అలా ఇవ్వడానికి వారికి ఎందుకు అంత తహతహో అన్న సంగతి పక్కన బెడితే, మన కలయికే ఒప్పందాలతోటి కూడుకున్నదని తెలియడం లేదూ? ఏ ఒప్పందమైనా breach ఎందువతుందో తెలియదా?
---మరి ఇప్పుడు తెలంగాణావాదులు అన్నట్టు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం"ఒక్క ఇంచ్ కూడా" కోల్పోకుండా కావాలంటే మహరాష్ట్ర ని, కర్ణాటక ని కూడా అడగాలి
ఇంకా అర్థం కాలేదా? మేం అడుగుతున్నాది 1962లో అసెంబ్లీ తీర్మానంతో కాకుండా 1956లో అక్రమంగా ఆంధ్రాతో కలిసిన తెలంగాణా ప్రాంతం. అది ఒక్క ఇంచు కూడా వదిలే సమస్యే లేదు.
---అప్పుడు ఒక్క పంచ్ కూడా వేస్ట్ అవకుండా కుమ్మేస్తారు వాళ్ళు.
కుమ్మేశారుగా మీ పచ్చాయన్ని? ఎవరు కుమ్మిచ్చుకునేవారో అర్థం కావడం లేదూ? మాకా అవసరం రాదులే.
అయినా 1952లోనే వెధవ్వేశాలేసి మద్రాసోళ్ళతో కుమ్మిచ్చుకున్న మీకు అదేం కొత్త కాదుగా! ఇలాగే తొండికేస్తే ముందు ముందు జరిగేది అదే.
@ గుండెఘోష
ReplyDelete//అయినా 1952లోనే వెధవ్వేశాలేసి మద్రాసోళ్ళతో కుమ్మిచ్చుకున్న మీకు అదేం కొత్త కాదుగా! ఇలాగే తొండికేస్తే ముందు ముందు జరిగేది అదే..//
పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టండి.. ! "సీమాంధ్ర"..అని మీరంటున్న ప్రాంతవాసులకి 1953 వరకూ హైదరాబాదు కన్నా మద్రాసుతోనే అనుబంధం ఎక్కువ, అప్పట్లో తమిళుల రాజకీయ ఎత్తుగడలు, తెలుగువారి అనైక్యత మూలంగా మద్రాసు కోల్పోయాం..! ఈ 50,60 సంవత్సరాలలో మద్రాసుని వదిలేసి హైదరాబాదుకి వచ్చారు తెలుగువాళ్ళు. హైదరాబాదు అభివృద్ధిలో తెలంగాణేతర ప్రాంతాల పాత్రలేదనడం మీ అవకాశవాదమే..!
మద్రాసు అచ్చతెలుగు పట్టణమని ప్రత్యేకం చెప్పలేదు.. (అర్థం చేసుకోవడం చేతకాకపోతే, ఎవరూ చెప్పలేరు). మీకు దమ్ములుంటే, మేం కోల్పోయిన మద్రాసుకోసం పోరాడుదాం అనండి...! అనడమే కాకుండా చేతల్లో కూడా చూపించండి, సమైక్యాంధ్ర ఉద్యమం రెండు నెలల్లో ఆరిపోతుంది. తెలంగాణని ఎవ్వడూ అడ్డుకోడు..!
అలా కాదు..! అది కోల్పోవడం మా చేతకానితనం అంటారా..? అవున్నిజమే, ఆ చేతకానితనం వల్లనే కేసియార్ నోటికొచ్చినట్టు పచ్చి బూతులు తిడుతున్నా, పదేళ్లు భరించాం..! (ఎవడికోసం భరించడం, విడిపోవచ్చుగా అని మాత్రం అనకండి..!) అతగాడి ఉద్దేశ్యం కూడా అదేగా..!
మీతోగాని మీ మద్రాసుతో గాని మాకు పనిలేదు. మీకు తెలంగాణా కశ్టాలపై గాని, బాధలపై కాని ఎలాంటి స్పందన వుండదని మాకు అర్థం కావడానికి యాభయ్యేళ్ళూ పట్టింది. దురదృష్ట వషాత్తూ మీరు షాసన సభలో మెజారిటీగా వున్నారు. కాబట్టి మేం మీ CMకి లోబడి వుండడం తప్ప ఏమీ చేయలేక పోతున్నాం. కాబట్టి మమ్మల్ని మేం అభివృద్ధి చేసుకోవడానికి మా రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. ఎలా వచ్చారో అలా దయచేస్తె సంతోషం. సమైక్య ఉద్యమాలు చేసుకుంటారా చేసుకోండి. అదీ చూద్దాం. మీ బ్లాక్‌మెయిల్ మాటలకు నమ్మే రోజులు పోయాయి.
ReplyDeleteమీ హైదరాబాదు అభివృద్ధి...
http://telangaanaa.blogspot.com/2011/10/blog-post_4969.html